హెచ్‌సీయూపై వైమానిక దాడుల‌కు వీసీ విజ్ఞ‌ప్తి

| సాహిత్యం | వ్యాసాలు

హెచ్‌సీయూపై వైమానిక దాడుల‌కు వీసీ విజ్ఞ‌ప్తి

- శోవన్ చౌధురి | 15.05.2016 01:15:10pm

ʹపన్ను చెల్లింపుదారుల ప్రతినిధుల సంఘం ఇస్తున్న ప్రోత్సాహంతో త్వరలోనే, తమ విద్యార్థులపైకి వైమానిక దాడుల్ని ప్రారంభించబోతున్నట్లు" హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రకటించింది. "ప్రజలు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారని, నిజానికి ఈ దేశంలో విద్యార్థులకు వ్యతిరేకంగా యుద్ధం ఆరంభమైంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే అనేది వారు మరిచిపోతున్నారని" విశ్వవిద్యాలయ అధికార ప్రతినిధి పప్పూ రావు అన్నారు. "జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం వారు కేవలం ఇద్దరు ముగ్గురు విద్యార్థులను మాత్రమే అరెస్టు చేయగా, మేం 30 మంది దాకా విద్యార్థులను జైల్లో పెట్టేసాం. అదృష్టవశాత్తు మేం వైమానిక బలగాలను ఉచితంగా వినియోగించుకోగలం. ఏదో ఒక తెల్లవారు ఝామున అన్ని హాస్టల్ విభాగాల పైకి బాంబుల వర్షం కురిపిస్తాం. దాంతో పాటు వినోద స్థలాల్లో కొద్దిగా కాల్పులు జరిపిస్తాం. క్యాంటీన్ చుట్టూతా 144 వ సెక్షన్ విధించడానికి జిల్లా మెజిస్ట్రేట్ ఒప్పుకొన్నారు".

ఈ చర్యలన్నింటికి కృతజ్ఞతలు. వీటితో పరిపాలనలో ఒక గుర్తించదగిన మెరుగుదల కనిపించబోతోందని అధికారగణం ఆశాభావంతో ఉన్నారు. "ఇప్పుడిక, కేంపస్ లో ʹఅతనొక్కడేʹ, ఎఫ్.ఐ.ఆర్. నమోదైన వ్యక్తి కాదు. వీసీ మరింత ఎక్కువ సమాన హోదాలో విద్యార్థులతో మాట్లాడగలడు. నోరారోపణలలో విచారణ ఎదుర్కుంటున్న వీసీలను విద్యార్థులు ప్రశ్నించే ప్రమాదకర ధోరణులను అణిచివేసేందుకు ఇవి మాకు దోహదం చేస్తాయి" అన్నారు సదరు అధికార ప్రతినిధి.

విహంగ దాడులకు మరేవైనా ప్రత్యామ్నాయ ఆలోచనలు ఉన్నాయా? ʹఏ అవకాశాన్నీ వదిలి పెట్టేది లేదʹని రావుగారన్నారు. దురదృష్టవశాత్తు నావికా దళాన్ని ప్రవేశపెట్టలేము. ఎందుకంటే హైదరాబాద్ సముద్రం పక్కన లేదు కదా! కానీ, ఒక పటాలం వాసన పసిగట్టే కుక్కలను రంగంలోకి దించబోతున్నాం. ఈ కుక్కలు పరిశుద్ధమైన ఆవు పాలతో పాటు ʹధోక్లాలను(ఒక రకమైన గుజరాతీ వంటకం) తినిపించి పెంచినవి. దేశద్రోహులనుʹ పసిగట్టే ప్రత్యేక శిక్షణ పొందిననవి. అవి జాతీయ గీతాన్ని కూడా ʹమొరగʹగలవు. సంగీత జ్ఞానం లేకపోయినా, వాయిద్యాలకు అనుగుణ్యంగా పాదాలను నేలకు తాటగలవు. అంత మాత్రమే కాదు. 24 గంటలు పహరా కాచే డ్రోన్లు కూడా ఏర్పాటు చేసుకుంటాం. వాటికి లేజర్, బ్లూటూత్ స్పీకర్లు అమర్చి ఉంటాయి. అవి దేశభక్తి గీతాలాలపిస్తూ, జాతివ్యతిరేక దుష్టశక్తులను మట్టుపెట్టగలుగుతాయి. ఈ విధంగా శిక్షా, విద్య ఒకదాని వెంట మరోటి నడుస్తాయి. వీటితో పాటు ఇతర అత్యవసర విధానాలు కూడా జతచేయబడతాయి. పతంజలి నూడుల్స్, క్రమం తప్పకుండా ఆవు మూత్ర సేవనంలతో పాటు నిర్ణీత అవధులలో స్మృతి ఇరానీ పర్యవేక్షణ, మనోజ్ కుమార్ సినిమాల తప్పనిసరి వీక్షణ ఉంటాయి".

క్యాంపస్ లో ఎంత కాలం ఈ అమానవీయ పరిస్థితులు కొనసాగుతాయి? ʹచెప్పడం కష్టమే" అన్నారు రావు గారు. "మేమింకా నాగపూర్ నుంచి సూచనలు అందుకోలేదు. అక్కడ అందరూ కొత్త లాగుల విషయంగా తీరిక లేకుండా ఉన్నారు. విషయం సంక్లిష్టంగా ఉంది. సందిగ్ధం నెలకొని ఉంది. కొందరు ఏమంటున్నారంటే, కొత్త లాగులు తమ వెనుక భాగాలను మరీ పెద్దగా కనిపించేటట్లు చేస్తాయనీ, మరి కొందరేమో పట్టినట్లుండే దుస్తులు తమను మరీ సెక్సీగా చేస్తాయనీ, అందువల్ల ఆడవాళ్ళు తమను తాము అదుపులో ఉంచుకోలేరనీ, ఫలితంగా వంట పని చెడిపోతుందని అంటున్నారు. ఏమైనా, త్వరలోనే దీని మీద వాళ్లొక అంగీకారానికి వస్తారు. తర్వాత అత్యవసరమైన విద్యా రంగం మీదికి తమ దృష్టిని మళ్లిస్తారని" ఆయన అన్నారు.

- అనువాదం: బాసిత్
(ర‌చ‌యిత ముఖ్య సత్య శోధకుడు,ʹబెంగాల్ తరహా హంతకుడుʹ గ్రంధకర్త )

ʹది ఇన్వెస్టిగేటర్ʹ పత్రిక సౌజన్యంతో

No. of visitors : 807
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ప్ర‌జ‌ల‌ను ముంచి ప్రాజెక్టులా : బాసిత్

| 24.07.2016 09:12:28pm

మ‌ల్ల‌న్న సాగ‌ర్ బాధిత గ్రామాల్లో ప‌ర్య‌టించిన విర‌సం బృందం ప‌రిశీలించిన విష‌యాలు నివేదిక రూపంలో విర‌సం స‌భ్యుడు బాసిత్ వివ‌రించారు.......
...ఇంకా చదవండి

దోపిడి వర్గాల పునరుత్థానాన్ని ఏవగించుకొనే కథ, ʹతనవి కాని కన్నీళ్లుʹ

బాసిత్ | 19.10.2017 09:42:40pm

తను ఒళ్లమ్ముకున్నట్లుగా, కన్నీళ్లమ్ముకొనే స్థితికి దిగజారడానికి కారణం ధనిక భూస్వామ్యంతో పాటు వేళ్లూనుకున్న పితృస్వామిక కుల వ్యవస్థ అనేది శశికి జైవికంగానో, ...
...ఇంకా చదవండి

కార్పొరేట్ బింకాన్ని గెలిచిన ʹపల్లెకు పోదాంʹ కథ

బాసిత్ | 04.09.2017 09:10:50am

మొత్తం వ్యవస్థ మార్పు దిశలో కృషికి ఇంకొంచెం పెద్ద ప్రయాస అవసరం ఉంటుంది. అప్పుడు వ్యక్తులంతా సమిష్టి పోరాటంలో భాగం కావాల్సి ఉంటుంది....
...ఇంకా చదవండి

మే డే స్ఫూర్తి అజరామరం!

బాసిత్ | 02.05.2018 10:18:41am

8 గంటలు పని, 8 గంటలు మానసికోల్లాసం, 8 గంటలు విశ్రాంతి అనే ప్రామాణిక పని దినం కోసం చికాగో కార్మికులు చిందించిన రక్తం ఇప్పటికే శ్రామిక వర్గ పోరాటాలను ప్రే......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...

  ఈ మానవ హననాన్ని ఆపండి
  అరుణతార మే - 2018
  మైనింగ్ మాఫియా కోస‌మే బోరియా - కసనూర్ నరమేధం
  గెలుచుకోవాల్సిన ప్రపంచం దిశగా కారల్‌ మార్క్స్‌
  మార్క్స్ ప్రాసంగిక‌త ఎప్ప‌టికీ ఉంటుంది : అరుణాంక్‌
  Long live the 1st of May
  విరసం క‌థా వ‌ర్క్‌షాప్‌
  marx selected poetry
  మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం
  ఎట్టి మనుషుల మట్టి కథలు
  మొద్దుబారుతున్న సమాజం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •