జప్పున రా బిడ్డా!

| సాహిత్యం | క‌విత్వం

జప్పున రా బిడ్డా!

- గీతాంజలి | 05.12.2017 11:34:44pm

నీ అమెరికా మోహం నిన్ను
నా నించి దూరంగా
ఖండాంతరాలకు విసిరేసింది.
మన ఊరిలొ
ఇంటి ముందర నువ్వాడుకున్న
గచ్చు మీద కూర్చొని
బిడ్డా నీకొసం నిరీక్షించిన
నా దేహం శిలగా మారిపొయింది. ...!
ఒకరినొకరు చేరుకొడానికి
ఇరవైనాలుగు గంటల ప్రయాణంలో. ..
నువ్వు నా దాకా రాకుండానే. ..
నా కడాకరి చూపుకి. .
నువ్వు అందకుడానే. ..నీ కొసం గుమ్మంలో మందారంలా
ఎదురు రావలసిన అమ్మని. .
మార్చురీలొ మంచుగడ్డల్లొ మమ్మీనై. ...
ఊరకున్నా బిడ్డా!
బిడ్డా. .డాలర్ల మోజు
మన మధ్య సృష్టించిన
యొజనాల దూరాల
దారాల కొసల్ని పట్టుకొని. .
ఒకరి వైపుకి ఒకరం. .ఎంత
వేగంగా పరి గెత్తినా. .
దారం పుటుక్కున తెగిపొయింది.
బిడ్డా. ..నేను మరణంచాను!
నిన్ను చూడకుండానే. ..
నులివెచ్చని. ,మెత్తటి మా అమ్మ ఒడిలాంటి నిన్ను. ..
స్పర్శించకండానే. ...!
ఏమొ. ..నువ్వొస్తే
ఇక్కడే. .నా దగ్గరే. ..
మన ఊరిలొనే ఉండిపొతానని మాటిస్తే. ..ఏమొ బతుకుతానేమొ?
నేనే కాదు బిడ్డా. ..
తొంభై ఏండ్ల పెంటాయి. ..నువ్వూగిన ఝూలా. .
మన కొట్టంలొ దుడ్డె. .
నీ సొపతి గాల్లు. ..
నువ్వు ఈత కొట్టిన చెరువు. .అన్నీ. ...నీకోసం తొవ్వ చూస్తున్నాయి. ...జప్పున రా బిడ్డా!
డాలర్ల వేడి సెగల ఎడారి కంటే ...
అమ్మ మెత్తటి ఒడే..
వెన్నల మంచులా చల్లనై పొతుందేమొ?
ఒక్కసారి వచ్చెయ్యవూ. ..
నన్ను నిద్ర లేపి. ..చిన్నప్పటిలాగా ముద్దు
పెట్టుకొవూ. ...!
అమెరికా వద్దు బిడ్డా. ..
డాలర్లు అసలే వద్దు. ..
అమ్మ ఒడే ముద్దు. ..!
జప్పున రా బిడ్డా!





No. of visitors : 210
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆసిఫా ఖానుమ్.. వాడికి నీ భూమి కావాలి!

geetanjali | 02.05.2018 10:34:00am

నీ అమ్మీజాన్ కన్నీళ్ళతో చేసిన నీ చివరి స్నానం సాక్షిగా... నీ లేత దేహం మీది వంద గాయాల మచ్చల సాక్షిగా... వాళ్ళిప్పుడు తమ మర్మాంగాలతో మీ బాలికల గర్భసంచుల్ని...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    ఈ మానవ హననాన్ని ఆపండి
    అరుణతార మే - 2018
    మైనింగ్ మాఫియా కోస‌మే బోరియా - కసనూర్ నరమేధం
    గెలుచుకోవాల్సిన ప్రపంచం దిశగా కారల్‌ మార్క్స్‌
    మార్క్స్ ప్రాసంగిక‌త ఎప్ప‌టికీ ఉంటుంది : అరుణాంక్‌
    Long live the 1st of May
    విరసం క‌థా వ‌ర్క్‌షాప్‌
    marx selected poetry
    మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం
    ఎట్టి మనుషుల మట్టి కథలు
    మొద్దుబారుతున్న సమాజం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •