దునియా అంతా ʹదొరల రాజ్యముʹ షూటింగే గదనే?!

| సాహిత్యం | వ్యాసాలు

దునియా అంతా ʹదొరల రాజ్యముʹ షూటింగే గదనే?!

- బమ్మిడి జగదీశ్వరరావు | 06.12.2017 12:38:01am


దొరా.. పటేలా.. భరత్ రెడ్డీ!

అన్నా బాగున్నవానే..!? నీకూ నీ సినిమాకి మంచిగ పబ్లిసిటీ దెచ్చినవే! ఆ రామ్ గోపాలవర్మ తాన కూడా లేవే.. నీ దగ్గిరున్న అవిడియాలు! పిచ్చరు హిట్టే! సూపరు డూపరు హిట్టే! షూటింగు చేసి గిట్లా వీడియో క్లిప్పు వొదిలినవో లేదో యూట్యూబులల్ల వాట్సాపులల్ల ఖర్చు లేకుంట వైరల్ అయితాంది! టీవీలోళ్ళు న్యూసులల్ల యాడ్లు యేసినట్టు మాటిమాటికి యేస్తాన్రు! ఏసి తీస్తాన్రు! గప్పుడే పిచ్చరు రిలీజు అయినట్టు డిస్కసన్లు పెడుతాన్రు! షూటింగు షురూ చేసినవో లేదో గప్పుడే సినిమా రిలీజు గిట్లా అయిపోయినట్టు.. యెందరివో మనోభావాలు దెబ్బతిన్నట్టు పోలీసు స్టేషన్లలల్ల నీమీన కేసులు మీద కేసులు కడతాన్రు! కట్టనీ! పెట్టనీ! ఏమయితది? సోమారం పుట్టిన సొట్టెంట్రిక రాల్తదా?

నాకు తెలియక అడుగుతా.. నువ్వేనా- గీ దునియాల పాపం జేసి సినిమాలు తీసేటిదీ? షూటింగులు జేసేటిదీ?అందరు గవే జేస్తుండ్రు! నీ సినిమా స్క్రిప్టు నువ్వే రాసుకున్నవు! అయితేంది? కేసీఆరు దొరకు కంప్లయింటు చేస్తారా యేoది? ఏం ఆయన సినిమాలు ఆయన తియ్యట్లే? ఆయన కత ఆయన రాసుకోట్లే? తీరికలేక రాపిస్తమన్నాడా లేదానే? ʹనిజామ్ మై కింగ్. మై హిస్టరీ. మన రాజు. మన చరిత్ర. మన తెలంగాణ చరిత్రను వక్రీకరించి రకరకాల ప్రచారం చేసారు. కొంచెం చెడు వుండొచ్చు. మంచిని చెడును వొకే గాటన కట్టొద్దు. దీన్ని సరి చేయాల్సిన అవసరం వుంది. ఆబాధ్యత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా నాదే. తెలంగాణాకు నిజమైన చరిత్ర రాయిస్తాʹ అన్నాడా? లేదానే? ఎవడి చరిత్ర వాడే రాసుకోవల్ల! ఎవడి స్క్రిప్టు వాడే రాసుకోవల్ల! నీ స్క్రిప్టు నువ్వు రాసుకున్నవ్.. తప్పేంది?

స్క్రిప్టు అంటే యాదికచ్చింది.. మంచి కత సెలక్టు జేసుకున్నవ్.. అభంగపట్నంల కులానికి తక్కువైనా గుణానికి యెక్కువైన యిద్దరియువకుల కత.. ఊరి ఆస్తయిన వుమ్మడి ఆస్తయిన మట్టిని బండెనక బండిగట్టి పదహారు బళ్ళల్ల దొర దొబ్బుకు పోతావుంటే- గ్రామకమిటీ నోరిప్పకున్నా- కుర్రాళ్ళు అడగడం.. నువ్వు దొరగా ఆగ్రహించడం.. నిజంగా నువ్వు యింటర్నేషనల్ సినిమా సబ్జెక్టు యెత్తుకొన్నవే! యిరగ దీసినవే! ఇప్పుడు దేశ అటవీ సంపదా.. వనరులూ.. మైనింగూ.. అన్నీ బళ్ళలో వోడల్లో దేశమే అఫీషియల్ గా తరలించేస్తోంది గదనే.. ఆదివాసీలు అడ్డుకుంటే వాళ్ళని నక్సలైట్లని ముద్రేసి ఆపరేషన్ గ్రీన్ హంట్ అని.. హన్టింగు జేసేసి.. మిలటరీని దించేసి.. అత్యాచారాలూ యెన్కౌన్టర్లూ.. వూరు నేలమట్టం చేయడాలూ.. అన్నీ కలిపి వొక్క సీనుల కొండను అద్దంల జూపించినవ్! అన్నమంతా చూడల్నా? మెతుకు పడితే చాలాదా? క్లిప్పింగు చూస్తేచాలదా?సినిమా క్లిప్పింగుల ʹలంజాకొడకాʹ అని నువ్వు తిడతాంటే మస్తు వొరిజినాలిటీ వొచ్చింది!

ముందుగాల్నే బాగనే స్క్రిప్టు రాసుకున్నవ్.. వూర్లల్ల జరిగేటి తీరుగనే రాసుకున్నావ్.. నీకు నీవే డబ్బింగు చెప్పుకొనుడు కూడా బాగుంది! ఏమాటికామాట చెప్పుకోవాల్నంటే లక్ష్మణూ రాజేషూ మస్తు యాక్టింగు జేసిన్రు! కాపోతే రెమ్యూనరేషను విషయంల పరేషాను జేసిన్రు! ఇరవై వేలు యిస్తమన్నవని యిజ్జత్ తీసిన్రు! లోబడ్జెట్ సినిమా అని మనం లీక్ చేస్తే యెట్టనే?! ఏదేమయినా మన తెలంగాణ సంస్కృతి కళ్ళకు కట్టినట్టు చూపించినవే.. ముక్కు నేలకు రాసుడూ.. మురికి నీటి కుంటల దింపుడూ.. పశువుల్ని తోలినట్టు చేత రువ్వపట్టి వాళ్ళని నీళ్ళలోకి దింపుడూ.. మునకలు యేయించుడూ .. నువ్వు దాన్ని కెమెరాలో దీసుడూ.. యీ తతంగమంతా మల్లొక కెమెరాల యెనకమాల దీసుడూ.. అదరగొట్టినవే అన్నా.. సినిమా అంత బాగా అచ్చింది గనుకనే రియల్గా జరిగిందని సిన్మా అంటే నమ్మకుంటా పబ్లిక్ లొల్లి లొల్లి జేసి పరేషాన్ అవుతున్నరు.. సినిమాలల్ల గూడా యిక తెలంగాణ ముందుంటది అని డంకా బజాయించి చెప్పినవే! దళిత క్యారక్టర్లు యిరవై రోజులు కనిపించకుండా జేసి సినిమాకి మరింత అటెన్సను రాబట్టినవే! పోలీసులు గూడా యెనిమిది టీములు వూరూరా యెతకతా వున్నాయంటే ʹదొరల రాజ్యంʹ సినిమా పోస్టర్లు జీపుకు అతికించుకొని వూరూరా దిరిగినట్టు లేదూ?!

మన కాషాయం రంగు దీసినవని మన పార్టీల గిట్టనోల్లు అంటే మాత్రం.. నీకు నేమూ ఫేమూ అస్తున్నదని జెలసీతోటి అంటున్నరని యాది పెట్టుకో!అన్నా.. గీ దునియాల షూటింగ్ గానిది యేడుంది? అంతా సినిమానే గదనే! షూటింగే గదనే! గత చరిత్రలోకి పోవద్దు! పోనీ వర్తమానంల జూడు! ఇయ్యాల జూడు! మన పార్టీ పెద్ద.. దేశ ప్రధాని హైదరాబాదుకు అచ్చిండు! అస్తున్నడని చేసిన్దేంది? షూటింగు! ఔ మల్ల.. మియాపూరును ముస్తాబు చేసిన్రు! అమీరుపేటను అందంగా తీర్చిదిద్దిన్రు! చెప్పాల్నంటే అందమైన సెట్టు యేసిన్రు! బుల్లెట్ రైలుకన్నా వేగంగా రాత్రికి రాత్రి హైదరాబాదు నగరంలో గచ్చుల్లెక్క రోడ్లు యేసిన్రు!రోడ్ల మీద పూల చెట్లు మొలిపించిన్రు! పువ్వులు పూయించిన్రు! అవి మన సెవులల్ల పెట్టిన్రు! ట్రంపు బిడ్డ గూడా రాబట్టే! అందుకని రోడ్లే గాదు, ఫ్లయ్యోవర్లకు రంగులు.. రంగులేంది బొమ్మలు గూడా యేసిన్రు! అడుక్కున్నోల్లను వూరవతలకు నెట్టిన్రు! హోర్దింగులల్ల మంత్రులూ విఐపీలూ హీరోహీరోయిన్లలెక్క యికిలించిన్రు! మన కవులు కయిత్వం రాసిన్రు! ఇవాంక రావా యీవంక.. అని ఆలపించిన్రు! ఇవాంక సీర గడతదా.. పంచి గడతదా.. అని మీడియాలల్ల డిబేట్లు పెట్టిన్రు! ఏదన్నా షూటింగుని బట్టే పబ్లిసిటీ అస్తది! గదంతా నాల్రోజుల ముచ్చటని.. మల్ల మామూలేనని.. యధావిధని అనగలమా? ఎవరి స్క్రిప్టు ప్రకారం ఆల్లు షూటింగు జేస్తరు! జనం సినిమా జూస్తరు! గంతే! గంతకుమించి యేo లేదు!

లేదు.. లేదు.. గిది సినిమా కాదు.. మేం నటించలేదు.. అని లక్ష్మణూ రాజేషూ అంటే గది కూడా స్క్రిప్టే! వాళ్ళ స్క్రిప్టు వాళ్లకుంటది! మన స్క్రిప్టు మనకుంటది! మన సినిమాల మన స్క్రిప్టు మాత్రమే వుండాల.. వుంటది! గవర్నమెంటు మనదయినప్పుడు మన స్క్రిప్టు మాత్రమే నడుస్తది! ఎక్స్ ట్రా స్క్రిప్టు వొస్తే మల్ల మన చేతిలో అధికారం వుంది.. సెన్సారు వుంది.. కత్తెరెయ్యాలి! మనం చూపించిన సినిమానే జనం అలవాటుగా చూడాలి! చూస్తారు! లాజిక్కులూ మేజిక్కులూ వెతికిన వాళ్ళు సినిమాని చూడలేరు! వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు!

దునియాల అంతా యెవడి స్క్రిప్టు ఆడు రాసుకుంటడు.. ఎవడి షూటింగు వాడు చేసుకుంటడు.. మీ సినిమాలు మీరు తీస్తూనే వుండున్రి!

కొత్త సినిమా అచ్చేదంకనే పాత సినిమాని పట్టుకుంటరు! రోజుకొక సినిమా పూటకొక సినిమా రిలీజు అయి మీదకొస్తాంటే జనం మాత్రం చూసిన సినిమానే చూస్తరా యేoది?

జనమ్మీద అవిశ్వాస మైన విశ్వాసంతో మనముండాలి!

మీరు మరిన్ని సినిమాలు తీసి జనాన్ని అలరించాలని కోరుకుంటూ-

మీ
జెండా మోసే కార్యకర్త
ఆర్ యస్ యస్ మూర్తి






No. of visitors : 337
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నీతి కథ! - రాజకీయ వ్యంగ్య కథ

బమ్మిడి జగదీశ్వరరావు | 03.07.2016 10:39:36pm

మన గౌరవ ముఖమంత్రి పగలూ రాత్రీ నిద్రపోకుండా నిద్రపోనివ్వకుండా శ్రమిస్తున్నారు.. ప్రపంచస్థాయి రాజధానిలాగే ప్రపంచస్థాయి నీతిని సాధిస్తాం.. సాధించి తీరుతాం........
...ఇంకా చదవండి

ʹనోట్ʹలో మట్టి!

బమ్మిడి జగదీశ్వరరావు | 20.12.2016 11:23:30pm

పుండొక చోట వుంటే వైద్యం వొక చోట..ʹ అన్నాడు మా బావమర్ది. వాతలు పెట్టిన నేతల దిబ్బల మీద దీపం పెట్టాలని.. మా ఆవిడ శక్తివంచన లేకుండా శాపం పెడుతోంది. తిడుతోంద...
...ఇంకా చదవండి

100% డిజబులిటి నీడెడ్!

-బమ్మిడి జగదీశ్వరరావు | 06.11.2017 09:04:16am

అన్నిదారులూ మూసేస్తే? తలుపులన్నీ మూసేస్తే? పిల్లి తిరగబడుతుంది.. మనుషులు తిరగబడరా? బడతారు! అవే మిలిటెంటు ఉద్యమాలు అవుతాయి! సాయుధ పోరాటాలు అవుతాయి! చెయ్యవలసి...
...ఇంకా చదవండి

నీ అడుగులోన అడుగు వేసి నడవనీ.. నన్ను నడవనీ!

బమ్మిడి జగదీశ్వరరావు | 05.10.2017 11:27:55pm

సెంట్రల్ సర్కారే నడుపుతున్న రైల్వే డిపార్టమెంట్ యేమి చేసింది? రిజర్వేషన్లు అయిపోయాయని చెపుతూ ʹతత్కాల్ʹ పేరుతో యెక్కువ రేట్లకీ- అదనపు రెట్లకీ- డబ్బుండీ ......
...ఇంకా చదవండి

ఫ్యాన్స్ బాబూ.. ఫ్యాన్స్!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.10.2017 09:46:33pm

ప్రతొక్కడూ ఫ్యాన్సు మీద బురదచల్లి మాట్లాడడం ఫ్యాన్సుగా మనం సహించవొద్దు! ఫ్యాన్సుగా మనం వొక్కటిగా లేకపోతే యేకం కాకపోతే ఐక్యంగా వుండకపోతే డేమేజ్ అయిపోయి చాలా ...
...ఇంకా చదవండి

లౌకిక రామరాజ్యం వర్ధిల్లాలి!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.09.2017 11:32:20pm

దేవుడయినా దేశమయినా మనదే పేటెంట్! భక్తీ మనదే! దేశభక్తీ మనదే! సత్యము చెప్పుటకు సంశయించ తగదు.. మన దాయాదులు యీ విషయమందు ముందంజన వున్నారు! మొన్నటికి మొన్న పాకిస్...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    తెగులు సోకిన రచయితలారా రండీ
    ఎవరి ప్రాభవం తండ్రీ..
    వెలివేయబడ్డ అక్షరం
    గుండె గుర్తులు వెతుక్కుంటూ
    ఏ స‌మాజం కోసం?
    సాయిబాబా బదిలీ అతని సహచర ఖైదీల బెయిలు ప్రయత్నాలు - అప్‌డేట్‌
    అసలు మనం ప్రజల్లో భాగమా? పాలకుల్లో భాగమా?
    ప్రతివాది
    కవి ఎక్కడ?
    ధిక్కార స్వరాలకు ఆహ్వానం
    సౌందర్యాత్మక కవిత
    అమ్మకొ లేఖ!

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •