తెర ముందు, వెనుకా ఫాసిజమే

| సాహిత్యం | వ్యాసాలు

తెర ముందు, వెనుకా ఫాసిజమే

- పాణి | 06.12.2017 11:54:29pm


మన చుటూ అంతులేని అసంబద్ధత. దాని మధ్యే జీవిస్తున్నాం. అందువల్ల దానితోనూ సంభాషించక తప్పదు. దానినే విశ్లేషించక తప్పదు, చిత్రించక తప్పదు. నిజానికి ఇది ఒక రకమైన జుగుప్సాకరం. ఇలాంటి స్థితిలో జీవిస్తున్నామా? అనే ఆందోళన కలగక మానదు. ప్రొ. సాయిబాబను విడుదల చేయాలనే ఆందోళనలపై సంఘపరివార్ నుంచి , పోలీసుల నుంచి, ఇంకా అనేక వైపుల నుంచి జరుగుతున్న దాడులు, విపరీత ప్రచారం ఈ స్థితికి నిదర్శనం.

ప్రపంచ వ్యాప్తంగా ఉరిశిక్ష రద్దు కావాలని ఎప్పటి నుంచో ఆందోళనలు జరుగుతున్నాయి. కానీ అత్యంత అనాగరిక, అమానీయ భావజాల మూలాలు ఉన్న సంఘపరివార్ ప్రొ. సాయిబాబను ఉరితీయాలని ప్రచారం చేస్తోంది. ఉరి శిక్ష నాగరికతా వ్యతిరేకమనే ప్రజాస్వామిక వాదన వాళ్ల వొంటికి పడదు. అందుకే నాగపూర్లో సాయిబాబను ఉరితీయాలని కరపత్రాలు పంచిపెట్టారు.

ఆంధ్రప్రదేశ్లో పోలీసులు కూడా సాయిబాబకు వ్యతిరేకంగా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. తాజాగా నవంబర్ 2 7న సాయిబాబ విడుదల కోరుతూ ప్రజాసంఘాలు చలో అమలాపురం ప్రోగ్రాం తీసుకున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వేశారు. అమలాపురం సాయిబాబ సొంత ఊరు. ఆయన పుట్టి పెరిగి ఊరు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా సాయిబాబ విడుదల కోసం జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఊళ్ళో కూడా చేయాలని ప్రజాసంఘాలు ఈ కార్యక్రమం తీసుకున్నాయి.

చట్టబద్ధంగా చేపట్టిన కార్యక్రమానికి వెళ్లిన ప్రజాసంఘాల వాళ్లను అమలాపురం చేరగానే అరెస్టు చేశారు. నిజానికి ఇవేవీ ఆశ్చర్యకరం కాదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు చేస్తున్న కుటిల ప్రచారం అమలాపురంలో కూడా చేశారు. ప్రజాసంఘాలు ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా పోలీసులు కరపత్రాలతో రడీగా ఉంటున్నారు. రంగు రంగుల పోస్టర్లు అతికిస్తున్నారు. బ్యానర్లు కట్టేస్తున్నారు. ప్రజాసంఘాల కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ పోటీ కార్యక్రమం చేస్తున్నారు. మావోయిస్టులతో సంబంధం అంటగట్టి దుష్ర్పచారం చేస్తున్నారు. పనిలో పనిగా మావోయిస్టు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ప్రజాసంఘాలపై దమనకాండకు బోనస్ గా ఈ పనీ చేస్తున్నారు.

ఉద్యోగ నియమాల ప్రకారం పోలీసులు ఇలాంటి పనులు చేయవచ్చునా అనేది పూర్తిగా వేరే చర్చ, నిజానికి పోలీసులు ఏ పని చేయాలి, ఏది చేయకూడదనే విమర్శ దృష్టి సమాజంలో అడుగంటిపోయేంతగా ఆ శాఖ బరితెగించింది. సమాజాన్ని భయపెట్టి బతకడమే పోలీసుల అనధికార విధిగా మారిపోయింది. పోలీసు విధి అంటే అది వ్యవస్థ రాజకీయ మనుగడకు పునాది. నకిలీ పోరాటాలు చేయడం, పోటీ నినాదాలు ముందుకు తేవడం, మావోయిస్టు బాధితుల పేరుతో కిరాయి మనుషుల్ని కదిలించడం ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు నిత్యకృత్యమైంది.

చలో అమలాపురం సందర్భంగా పోలీసులు ఊరు పేర లేని వాల్ పోస్టర్లు వేశారు. ఊరంతా రంగురంగుల బ్యానర్లు కట్టేశారు. వాటి శీర్షిక తెర ముందు ప్రొఫెసర్ తెర వెనుక మావోయిస్టు అని. పైగా ఆయన వికలాంగుడనే సానుభూతి కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని మరో ఆరోపణ. సాయిబాబ సవ్యంగా తన రాజకీయాలేమిటో చాలాసార్లు ప్రకటించుకున్నారు. ఈ వ్యవస్థను పరిరక్షించే దోపిడీ పార్లమెంటరీ రాజకీయాల్లో తనకు నమ్మకం లేదని, వ్యవస్థను మార్చే విప్లవ రాజకీయాల్లో తనకు నమ్మకం ఉందని చెప్పకున్నారు. ఇంకోలా చెప్పాలంటే ఇవాళ ఉనికితో ఉన్న ప్రజాస్వామ్యం సారాంశంలో ప్రజాస్వామ్యం కాదని, అది ఫాసిజం అని, విప్లవ ప్రజాస్వామ్యం వల్లే సమాజం బాగు పడుతుందని ఆయన నమ్మకం. అందుకే ఆయన విప్లవ ప్రజాస్వామిక వేదికలో పని చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం ఎలాంటి రాజకీయ విశ్వాసాలైనా ఉండవచ్చు. ఇది పౌరుల హక్కు, తెర వెనుక ప్రొఫెసర్, తెర వెనుక మావోయిస్టు అనే పోలీసులు కుటిల వాదన చేస్తున్నారు గాని ప్రొఫెసర్గా, పౌరుడిగా కూడా సాయిబాబకు మావోయిస్టు రాజకీయాల్లో విశ్వాసం ఉంది. ఇది రహస్యం కాదు. ఎందుకంటే తరగతి గదిలో అయినా, సమాజంలో అయినా ఆయన తన రాజకీయ విశ్వాసాలతో దాపరికం లేకుండా జీవిస్తున్నారు. రాజకీయాల్లో ఏ రహస్యమూ ఉండదు. అంతే కా దు రాజకీయ విశ్వాసాల వల్లే ఏ నేరమూ జరగదు. ఈ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పోలీసులే నేరానికి పాల్పడుతున్నారని సాయిబాబు మిత్రులంతా ఇప్పుడు ప్రభుత్వంపై ఆరోపిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన రాజ్యం అ పని చేయడానికి నైతిక బలం లేక పేరులేని కరపత్రాలు, వాల్ పోస్టర్లతో తప్పుడు ప్రచారానికి పాల్పడుతోంది.

సాయిబాబ వికలాంగుడు కాబట్టి .... అనే వైపు నుంచి కేసు ఎత్తేయమని సమాజం అడుగడం లేదు. బ్రిటీష్ కాలం నుంచి రాజకీయ ఖైదీలు పోరాడి సాధించుకున్న హక్కులు సాయిబాబకు కూడా ఉంటాయని, వాటిని అమలు చేయాలని కోరుతున్నారు. రాజకీయ ఉద్దేశాలతోనే కక్షకట్టి ఖైదీలందరికీ వర్తించే హక్కులు, సౌకర్యాలు ఆయనకు వర్తింపజేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక కేసు విషయానికి వస్తే. పోలీసులు ఆరోపించిన నేరాలు చేయడం వికలాంగుడి గా సాయిబాబకు అసాధ్యం.... అని చెప్తున్నారు. మహారాష్టలోని గడ్చిరోలి ప్రాంతంలో జరిగిన దొంగతనం సొత్తు ఆయన దగ్గర ఉన్నదని పూర్తి అబద్ధం. సొంత ఆస్తికే చోరగుణం ఉంటుంది. ఇలాంటి సొంత ఆస్తి వ్యవస్థను కాపాడే రాజ్యం, అందులో భాగమైన పోలీసులు సాయిబాబ సందర్భంలో దొంగతనం ప్రస్తావనతో ఆరోపణ చేయడం వ్యవస్థకు తగినదే. దీన్ని వ్యతిరేకించే విప్లవ రాజకీయాల్లో సాయిబాబకు విశ్వాసం ఉంది. ఈ ఒక్క కారణంతోనే ఆయన పై ఇలాంటి కేసు పెట్టారు. ఇది పూర్తిగా భావజాల సంబంధమైనది. అయితే శిక్షాస్మృతి ప్రకారం చర్య జరిగితేనే నేరం. పోలీసులు ఆరోపించే నేరం చేయడానికి కూడా 90శాతం వికలాగుడైన సాయిబాబకు అసాధ్యం. ఈ రెండు సందర్భాల్లోనే ఆయన వికలాంగుడని సమాజం అంటోంది. ఆయన వికలాంగుడవునా కాదా అనేదానితో సంబంధం లేకుండానే ఆయనపై పోలీసులు చేసిన నేరారోపణలన్నీ అబద్ధం. కనీస ఆధారాలు కూడా లేని ఆరోపణల మీద ఆధారపడి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అందువల్లే ఆయన రాజకీయాలతో నిమిత్తం లేకుండా సమాజంలోని ప్రజాస్వామికవాదులందరూ ఆయన విడుదల కోసం ఉద్యమిస్తున్నారు. ఎందుకంటే ఆయనకు విప్లవ రాజకీయ విశ్వాసం ఉండటం నేరం కాదు, ఆయనపై చేసిన ఆరోపణలకు ఏ ఆధారం లేదు.

నిజానికి బైటికి ప్రజాస్వామ్యంగా ఉంటూ లోపల ఫాసిజం అమలు చేయడం, చివరికి లోనా బైటా బరితెంగించి ఫాసిజాన్నే చాటుకోవడం రాజ్య లక్షణం. బూర్జువా రాజ్యమంటే ఫాసిజమే. ఆలోచనల్లో ఆచరణలో అరలు ఉండేదే బూర్జువా ప్రజాస్వామ్యం. రకరకాల మేలిముసుగులు బూర్జువా ప్రజాస్వామ్యానికే అవసరం. సాయిబాబ నమ్మే విప్లవ ప్రజాస్వామ్యం సొంత ఆస్తిని వ్యతిరేకించేది కాబట్టి దానికి లోపలా, బయటా అనే అరలు ఉండవు. ఆయన ప్రొఫెసర్గా, బుద్ధిజీవిగా, పౌరుడిగా, మానవుడిగా కూడా ఒకటే. ఆయన విప్లవ మేధావి. అంతే.

అయితే పోలీసు వ్యవస్థకు, ఈ హంతక వ్యవస్థకు ఏది అలవాటో దాన్ని సాయిబాబకు అంటగట్టి దుప్రచారం చేస్తున్నాయి. రాజ్య స్వభావం తెలియనివాళ్లు, పోలీసులతో గొంతు కలపదల్చుకున్నవాళ్లు మాత్రమే ఈ వాదనలు నమ్మవచ్చు. తీవ్ర ఆనారోగ్యంతో మృత్యువు సరిహద్దుల్లో జైలు గోడల మధ్య ఒక మనిషి ఉంటే క్షుద్రమైన ఆలోచనలున్న వాళ్లు మాత్రమే ఈ సమస్యను వాడుకొని తమ విప్లవ వ్యతిరేకత చాటుకోవచ్చు. పోలీసులు, సంఘపరివార్, మరెవరైనా సరే సాయిబాబకు మద్దతు ప్రకటిస్తున్న వారితో పోల్చుకుంటే అత్యల్పం. ఆయనపై ఆయన సహచరులు మరో ఇద్దరిపై, మరో ఇద్దరు ఆదివాసులపై పోలీసులు ఈ తప్పుడు కేసు పెట్టినప్పటి నుంచే దేశవ్యాప్తంగా నిరసన మొదలైంది. మధ్యలో సాయిబాబకు బెయిలు రావడానికి కూడా ఈ రాజకీయ ఆందోళన ఉపకరించింది. ఇప్పుడు ఆయనతో సహా ఆ కేసులో ఉన్న వారందరి విడుదలకు, సాయిబాబ జీవిత ఖైదు రద్దుకు ఇలాంటి రాజకీయ పోరాటమే అవసరం. దాన్ని దెబ్బతీయడానికి, ఆయనకు సంఘిభావం రాకుండా అడ్డుకోడానికి పోలీసులు ఎన్ని నీచ ప్రయత్నా లు, దుప్రచారాలు చేసినా అయ్యేదేమీ లేదు. పనిలో పనిగా విప్లవ వ్యతిరేక ప్రచారం ఎవరెంత చేసినా అది నిలబడేదీ కాదు. సాయిబాబ ఇంటి మీద మొదటిసారి దాడి చేసిన రోజు నుంచి ఏ ప్రజాస్వామిక, విప్లవ శక్తులు ఆయనకు అండగా ఉన్నాయో... ఆ రాజకీయ ఆందోళనే సాయిబాబ తదితరులకు స్వేచ్చనందిస్తాయి. మౌలికంగా ఈ సమాజ గాన్ని స్వేచ్చామయం చేస్తాయి.

తాజా కలం: విద్యార్థి సంఘూల ఆధ్వర్యంలో సాయిబాబ విడుదల కోరుతూ కడపలో 29న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. అమలాపురంలో వేసిన వాల్ పోస్టర్లను పోలీసులు కడపలో కూడా వేశారు.

No. of visitors : 485
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  బ్యాన్డ్‌ థాట్‌ వెబ్‌సైట్‌పై నిషేధం ఫాసిస్టు చర్య
  పంచాది నిర్మల
  గన్నూ పెన్నూ ఒకటిగా వాడిన కవి కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి
  అరుణతార డిసెంబర్ - 2018
  ఎవరి గురించి మాట్లాడుకుందాం?
  వదిలి వెళ్లకు...!
  వెల్తుర్ధ్వని
  దిశంబర్ 6
  ఆ...ఏడురోజులు
  కాపాడుకుందాం
  నేను నగర మావోయిస్ట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •