ʹతరగతి గదుల నుంచి నిష్క్రమిస్తున్న ʹచరిత్రʹ పార్లమెంటు కెక్కడం మంచిదే అయినా ఆ చర్చ భగత్‌సింగ్ వ్యక్తిత్వం, ఆదర్శాలు, ఆయన కలలుగన్న సమాజం తదితరాల పై సాగాలని..ʹ ఆశించినప్పుడు ఆయన అవగాహనపై, విప్లవ ఆచరణపై మరింతగా దృష్టి పెట్టాలి. భగత్‌సింగ్‌ను బ్రిటిష్ వసవాదులు ఉరితీయాలని సంకల్పించుకోవడానికి ప్రధానమైన కారణం ʹఆయన రూపొందుతున్న లెనిన్ʹ అని గుర్తించి భయపడడమేనని అన్నాడు బిపిన్ చంద్ర.
అయితే భగత్‌సింగ్‌ను విప్లవకారుడుగా గుర్తించడానికి పాలకులయిన వలసవాదులకు సరే దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకన్నిటికీ ఏదో ఒక అభ్యంతరముండింది. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో, కార్మిక కర్షక రాజ్యస్థాపన కోసం ఆయన పంజాబ్ మొదలు ఉత్తరప్రదేశ్ వరకు ఏర్పాటు చేసిన కిర్తి కిసాన్ పార్టీ, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్, నవజవాన్ భారత్ సభ ఎంచుకున్న ఆశయాలు, మార్గం చూసినా ఆనాటి రాజకీయ పార్టీలకు దేనికీ ఆమోదయోగ్యమైనవి కాదు. 1936 కరాచీ కాంగ్రెస్ అధ్యక్షుడుగా నెహ్రూ ఆయన అనుయాయులు భగత్‌సింగ్ ఆదర్శాన్ని, త్యాగాన్ని కొనియాడినట్లు కనిపించినా నెహ్రూపై, కాంగ్రెస్ పార్టీపై గాంధీకున్న పట్టువల్ల వాళ్ల సమర్థనకు పరిమితులేర్పడినాయి. పైగా గాంధీ ఎంచుకున్న అహింసామార్గం, సామరస్య ధోరణి, కాంగ్రెస్ పార్టీ పథ నిర్దేశాలయ్యాయి.
భగత్‌సింగ్, సహచర విప్లవకారుల పోరాటాల నాటికే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడినా - అది కార్మికవర్గ పార్టీగా వర్గ పోరాటాన్ని నిర్వహించవలసిందే అయినా ఆయన మార్గాన్ని వాళ్లు అనుసరించనూ లేదు. ఆయనను తమలోకి ఆహ్వానించనూ లేదు. లాహోర్, కాకోరీ కుట్ర కేసుల్లో ముద్దాయిగా ఉన్న వాళ్లలో విజయకుమార్ సిన్హా, శివకుమార్ మిశ్రా ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరినా - ఈ రెండు పంథాలు విడివిడిగానే మునుసాగాయి. ఐక్య కమ్యూనిస్టు పార్టీ 1946లో మొదటిసారి సాయుధ పోరాట పంథాను ప్రకటించింది. 1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటాన్ని ప్రారంభించినా 1948 సెప్టెంబర్ 13-17 నాటికే ఆ పంథా పట్ల అందులోని మితవాద వర్గానికి విశ్వాసం సన్నగిల్లింది. బిపిన్ చంద్ర ఈ కమ్యూనిస్టు సంప్రదాయానికి, అవగాహనకు చెందినవాడు. కనుక వలస పాలకులకు, గాంధీకే కాదు 1951 నాటికి కమ్యూనిస్టు పార్టీకి కూడా భగత్‌సింగ్‌ను ఆయన విప్లవ లక్ష్యంతో పంథాతో స్వీకరించి సమర్థించడానికి పరిమితులేర్పడినాయి. వలసవాద చరిత్రకు బదులుగా ʹజాతీయోద్యమ చరిత్రʹగా భారతదేశ చరిత్ర రచన అప్పగించబడిన బిపిన్ చంద్ర వంటి వాళ్లకు కూడా అందుకే భగత్‌సింగ్ విప్లవ టెరరిస్టుగా కనిపించాడు. ఆ తర్వాత కాలంలో ఆయనను ʹసామ్యవాద విప్లవకారుడుʹగా పేర్కొన్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీకయినా, బిపిన్ చంద్రకయినా సామ్యవాద విప్లవానికి వర్గపోరాటం అనివార్యమన్న అవగాహన పట్ల విశ్వాసం పోయింది. పార్లమెంటరీ రాజకీయాల ఊబిలో కూరుకుపోయారు. తాము 1946-51లో ఉజ్వల రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించాము - అని గత ఘన చరిత్రగా చెప్పుకోవడానికి తప్ప కమ్యూనిస్టు పార్టీ ఆ పంథా నుంచి వైదొలగింది. నెహ్రూ అనుకూల పార్టీగానే కాదు ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని బపరిచే దాకా ఆ కుటుంబాల ఫెలో ట్రావలర్ గా మారింది. (సాధారణంగా నెహ్రూ, కృష్ణమీనన్ వంటి వాళ్లను ఫెలో ట్రావెలర్స్ అంటారు గానీ వాళ్లు పాలకులుగా చిరకాలం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్లను బపరచిన కమ్యూనిస్టును ఫెలో ట్రావెలర్స్ అనడమే సబబుగా ఉంటుంది.)
బిపిన్ చంద్ర మొదలైన మార్క్సిస్టు చరిత్రకారుల కృషి పట్ల పూర్తి గౌరవంతోనే వాళ్ల చరిత్ర రచనకున్న ఈ పరిమితిని కూడా అర్థం చేసుకోవాలి. భగత్‌సింగ్‌పై ప్రత్యేకించి కృషి చేసిన వారిలో బిపిన్ చంద్ర, ప్రొఫెసర్ చమన్లాల్ను మించిన వాళ్లు ఎవరూ ఉండకపోవచ్చు. ఒక కోణంలో మహమ్మదలీ జిన్నా, ఎజినూరానీు ఉండవచ్చు. కాని భగత్‌సింగ్‌ను విప్లవకారుడుగా ʹరూపొందుతున్న లెనిన్ʹగా చరిత్రలో నమోదు చేయడానికి ఆయన విప్లవ హృదయాన్ని వర్తమానంలో ఆవిష్కరించే ప్రాపంచిక దృక్పథం చరిత్రకారులకుండాలి. భగత్‌సింగ్‌పై అధ్యయనం, పరిశోధన చేసేవారికుండాలి. చరిత్ర అంటే ʹవర్తమానంలో గతం భవిష్యత్తుతో చేసే సంభాషణʹ అనే ఇ.ఎచ్.కార్ నిర్వచనానికి అర్థం అదే.
ʹప్రజ కర్ణాటక చరిత్రʹను పునర్ నిర్మించే క్రమంలో స్వయంగా విప్లవకారుడు అమరుడు సాకేత రాజన్ అటువంటి చరిత్ర రచనకు ప్రయత్నం చేశాడు. రెండు బృహత్ సంపుటాలు వెలువడి ప్రామాణిక కృషిగా గుర్తింపబడింది. సాకేత రాజన్ వంటి వేలాది విప్లవకారుటను బూటకపు ఎన్కౌంటర్లలో చంపుతున్న ఆయా ప్రభుత్వాలలోని పాలకుకు, విప్లవకారులను టెరరిస్టులుగా, దేశద్రోహులుగా, యాంటీ నేషనల్స్‌గా పేర్కొంటున్న బిజెపికి భగత్‌సింగ్ మీద ఇంత ప్రేమ కలగడం చారిత్రక అవకాశవాదం కాకమరేమిటి?
భగత్‌సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్ బాంబ్ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ్ని ఎలా అయ్యానుʹ అనే పరిణామంగానీ, ఆయన ఎంచుకున్న విప్లవ మార్గం గానీ బిజెపికి జీర్ణమయ్యే విషయాలేనా? పుట్టుక వల్లనే హిందువు కాని భగత్‌సింగ్ చైతన్యం వల్ల విప్లవకారుడయ్యాడు. హిందూ జాతీయవాదాన్ని భారత జాతివాదంగా భిన్న విశ్వాసాల ప్రజలపై రుద్దుతున్న బిజెపి భగత్‌సింగ్ భుజం మీద తుపాకి పెట్టి బిపిన్ చంద్ర వంటి లౌకిక ప్రజాస్వామిక, ప్రగతివాద చరిత్రకారులను, నెహ్రూ అనుయాయులను, కమ్యూనిస్టులను మాత్రమే కాదు విప్లవకారులను కూడా కాల్చదలుచుకున్నది. రోహిత్ వేముల, అంబేడ్కర్ అసోసియేషన్ మొదలు కన్హయ్య కుమార్ వంటి ఎఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడు, ఉమర్ ఖలీద్, అనిర్బన్ వంటి విప్లవ విద్యార్థులు దేశద్రోహులుగా, యాంటీ నేషనల్స్‌గా, టెరరిస్టులుగా కనిపిస్తున్న సంఘ్‌పరివార్‌కు భగత్‌సింగ్‌ను విప్లవ టెరరిస్టు అనడం అభ్యంతరకరం కావడం అవకాశవాదం తప్ప మరేమీ కాదు. ముస్లింగా పుట్టడమే టెరరిజంగా, మావోయిజం అంటే దేశద్రోహంగా చిత్రిస్తున్న హిందుత్వ శక్తులకు మావోయిస్టులకు వేగుచుక్క అయిన భగత్‌సింగ్ మీద ప్రేమ కలగడానికి మించిన ద్వంద్వనీతి మరేముంటుంది?
(13.5.2016న సాక్షిలో ప్రచురితమైన వ్యాసానికి పూర్తి పాఠం)
Type in English and Press Space to Convert in Telugu |
సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ జిల్లా రిజర్వ్ గార్డ్లు చేసిన లైంగిక అత్యాచారం, హ........ |
నిజమైన వీరులు నేల నుంచి వస్తారు1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్ జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది....... |
ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణంఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్ను స్మరించుకున్న దేశద్రోహి,... |
దండకారణ్య ఆదివాసీల స్వప్నాన్ని కాపాడుకుందాం : వరవరరావు18 జూలై 2016, అమరుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ సభ సందర్భంగా వరవరరావు ఉపన్యాసం...... |
నోటీసుకు జవాబుగా చాటింపునిన్నటి దాకా ఊరు ఉంది వాడ ఉంది/
వాడ అంటే వెలివాడనే/
అంటరాని వాళ్లు ఉండేవాడ/
అంటరాని తనం పాటించే బ్రాహ్మణ్యం ఉండేది/
ఇప్పుడది ఇంతింతై ... |
రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?అరుంధతీ రాయ్ మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల...... |
రచయితలేం చేయగలరు?1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్ 370 మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ....... |
వాగ్ధాటి కాశీపతి1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండపల్లి....
... |
Save the life of the Indian writer and activist Varavara Rao!His condition reveals the absolute neglect of his health by the prison authorities. We join our voices with academics from all over the world, intellectuals... |
రాజకీయ ఖైదీలు - చావు బతుకుల్లో కె. మురళీధరన్ (అజిత్)అజిత్‌గా విప్లవ శిబిరంలో ప్రసిద్ధుడైన కె. మురళీధరన్ 61వ ఏట అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 2015, మే 9న మహారాష్ట్రలోని పూనెకు దగ్గరగా ఉన్న తాలేగాకువ్ ధబాడే..... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |