పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాం

| క‌ర‌ప‌త్రం

పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాం

- విర‌సం | 07.12.2017 12:39:17am

రచయితలు ప్రభుత్వానికి, వ్యవస్థకు నిరంతర ప్రతిపక్షంగా ఉండాలి

తెలుగు ప్రజలారా, కవులారా, కళాకారులారా,

తెలుగు నేల మీద ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నలభై రెండేళ్లలో మూడోసారి జరగబోతున్నాయి. ఈసారి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. అగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. తమ మీద వ్యక్తమవుతున్న ప్రజా నిరసనను దారి మళ్లిండానికే పాలకులు ప్రపంచ తెలుగు మహాసభలను జరుపుతున్నారు. కనుక గత రెండు సందర్భాల్లో వలె ఈసారీ విప్లవ రచయితల సంఘం డిసెంబర్‌ 15 నుంచి 19 దాకా జరగనున్న ఈ సభలను బహిష్కరిస్తున్నది. రచయితలు, కళాకారులు, ప్రజలు ఇందులో భాగం కావాలని పిలుపు ఇస్తోంది.

మార్చి 1975లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హైదరాబాద్‌లో మొదటిసారి తెలుగు మహాసభలను నిర్వహించాడు. తెలంగాణ రక్షణ కోసం 1968లో రవీంద్రనాథ్‌ అనే విద్యార్థిని ఖమ్మంలో నిరాహారదీక్షకు కూర్చోబెట్టిన వెంగళరావు తెలంగాణ ఉద్యమ ప్రభావంతో హోం శాఖా మంత్రి అయి, అదే తెలంగాణ ఉద్యమాన్ని రక్తపుటేరుల్లో ముంచాడు. శ్రీకాకుళ పోరాటంపై తీవ్ర నిర్బంధం ప్రయోగించాడు. 300 మంది విప్లవకారుల్ని, ప్రజల్ని ఎన్‌కౌంటర్‌ చేశాడు. రెండు ప్రజా పోరాటాలను అణచివేసి విశాలాంధ్ర పాలకుడిగా ప్రపంచ తెలుగు మహాసభల పేరు మీద ʹసమైక్యతా ఉత్సవాలుʹ నిర్వహించాడు. విప్లవ కవి సుబ్బారావు ప్రాణిగ్రాహి, చినబాబు, పంచాది నిర్మల, స్నేహలత, వెంపటాపు సత్యం మాస్టారును చంపిన వెంగళరావు ప్రభుత్వం ప్రజల వ్యతిరేకత నుంచి తప్పుకోవడానికే ఆ సభలు జరిపాడు. ప్రజల జీవన్మరణ పోరాటాన్ని గానం చేస్తున్న విరసం ʹభూస్వామ్య, బూర్జూవా సంస్కృతికి కైవారాలు ఈ సభలుʹ అన్న శ్రీశ్రీ నాయకత్వంలో ఈ సభల్ని బహిష్కరించింది.

2012 డిసెంబర్‌ 27 - 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రెండోసారి తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాడు. తెలుగు రాష్ట్రంలో పాలక వర్గాలను ప్రత్యేక తెలంగాణ ఉద్యమం భయానికి గురి చేసిన సందర్భమది. యావత్‌ తెలంగాణ సమాజం ఏక నినాదం పలుకుతున్న కాలం. విద్యార్థి యువజనులు నిరసన రూపంగా ఆత్మ బలిదానాలు చేసుకుంటూ పోరాడుతున్న సమయం. పోరాట సంస్కృతిని ప్రజలు తెర మీదికి తెచ్చారు. ఇంకే మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేని స్థితిలో పాలకులు తెలుగు భాష పేరు మీద ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ పోరాట ప్రజల ఆలోచనలను మళ్లించే ప్రయత్నం చేశారు. మొత్తంగానే ప్రజా వ్యతిరేక రాజకీయార్థిక విధానాలు, దోపిడీ పీడనలు కొనసాగిస్తూ తెలుగు భాషా సాహిత్యాలను కాపాడుతామని ఆ సభలు చేపట్టారు. వాటిని బహిష్కరిస్తూ ఆనాడు విరసం నాయకత్వం తిరుపతిలో అరెస్టయ్యింది.

ఇప్పుడు హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహిస్తున్నాడు. తెలుగు ప్రజల మాతృభాషను ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అమలు చేస్తామని, తెలంగాణ భాషా, సంస్కృతి, చారిత్రిక ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తూ విస్మరణకు గురైన తెలంగాణ సాహితీ ప్రముఖులను బయటికి తీస్తామనే నినాదంతో ఈ సభలు జరుగుతున్నాడు. చూసే వాళ్లకు, వినే వాళ్లకు మంచిదే కదా! తెలుగు మహాసభలు జరగటమని అనిపించవచ్చు. కానీ ఇదొక నెపం మాత్రమే.

నిజానికి మాతృభాషగా తెలుగును అమలు చేయాలనుకుంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రారంభించవచ్చు. అది జరగలేదు. ప్రభుత్వ పాలన తెలుగులోనే ఉండాలని ఇప్పటికే అనేక జీవోలున్నాయి. కనీసం దీన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ చరిత్రను, సాహిత్యాన్ని బయటికి తీయాలంటే ప్రభుత్వమే దానికోసం కొన్ని సెంటర్లను ప్రారంభించవచ్చు. తెలంగాణలోని ఆరు విశ్వవిద్యాలయాల్లోని చరిత్ర, తెలుగు శాఖలను బలోపేతం చేయడానికి ఖాళీ పోస్టులను నింపి, నిధులు కేటాయించి, పరిశోధనలు ప్రారంభించి ఉండవచ్చు. కానీ విశ్వవిద్యాలయాల్లోని తెలుగు, చరిత్ర శాఖలు ప్రొఫెసర్లు లేక, పరిశోధనలకు నిధులు లేక నిస్సారంగా తయారయ్యాయి. ఏ ఒక్క నిర్మాణాత్మక కృషి చేయకుండా ఎన్నికల ముందు ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయడానికి కేవలం ఆడంబరాల కోసమే ప్రభుత్వం ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతోంది. కనీసం ప్రభుత్వంలో భాగంగా పని చేసే సాహిత్య అకాడమీని ఏర్పాటు చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వానికి మూడేళ్ల కాలం పట్టింది. తీరా దానికి తగిన నిధులు ఇవ్వలేదు. భాషా - సాహిత్యాల పట్ల కేసీఆర్‌ నిజాయితీకి ఇంతకంటే ఏం కావాలి?

మావోయిస్టు ఎజెండానే నా ఎజెండా అంటూ ఎన్నికలలోకి పోయిన కేసీఆర్‌ అధికారంలోకి రాగేనే శృతి, సాగర్‌లను బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎన్‌కౌంటర్లే ఉండవని చెప్పిన ఆయన వెంగళరావు వలెనే నెత్తురుటేరులు పారించాడు. అంతకు మునుపు రచయితలు, మేధావులు కలిసి జరపాలనుకున్న ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభను అడ్డుకొని పౌర ప్రజాస్వామిక హక్కులను ప్రభుత్వం కాలరాచింది. మలిదశ తెలంగాణ ఉద్యమం (1996 నుంచి)లో విద్యార్థిగా, అధ్యాపకుడిగా, వక్తగా, కవిగా, రచయితగా బహుముఖ పాత్ర వహించిన విరసం సభ్యుడు కాశీంపై రాజద్రోహం కేసును బనాయించింది. అరుణోదయ నాయకురాలు విమల మీద కేసును పెట్టి, వాళ్ల సంఘం కార్యాలయాన్ని సీజ్‌ చేసింది. మల్లన్న సాగర్‌ రైతులను ప్రభుత్వం నీట ముంచింది. నేరెళ్ల దళితులను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టింది. మానేరు ఇసుక మాఫియాకు దన్నుగా నిలిచింది. ధర్నాచౌక్‌ను ఎత్తేసి హైదరాబాద్‌ నగరంలో సభలు పెట్టుకునే అవకాశం లేకుండా చేసింది. ఇలా ఈ మూడున్నరేళ్ల కాలంలో పౌర, ప్రజాస్వామిక హక్కులను అన్ని రకాలుగా అణచివేసింది. విద్యార్థి ఉద్యమ నాయకుల అరెస్టులు, కేసులు మామూలైపోయాయి. చివరికి నలుగురు కలిసి హాలు మీటింగులు కూడా నిర్వహించుకోలేని నిర్బంధ వాతావరణం అమలవుతోంది. తెలంగాణ వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని అనుకున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు, ప్రజలకు నిరాశే మిగిలింది. పైగా వాళ్ల నిరసన మీద తీవ్ర నిర్బంధం అమలవుతోంది. తన ప్రజా వ్యతిరేక పాలనను కవులు, కళాకారులు, రచయితలు ప్రశ్నించకుండా ఉండేందుకు, వాళ్లను భ్రమల్లో ముంచేందుకు, వీలైనంత మంది రచయితలను తన ప్రభుత్వానికి విధేయులుగా మార్చుకునేందుకే కేసీఆర్‌ ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతున్నాడు.

తెలంగాణ ప్రభుత్వం యజ్ఞాలకు, గుడులకు, పండుగలకు ఇచ్చిన ప్రాధాన్యత విద్యా, వైద్యం, ఉపాధికి ఇవ్వడం లేదు. ఒక లక్ష్యంతోనే సమాజంలో బ్రాహ్మణీయ హిందూ సంస్కృతిని, భావజాలాన్ని బలోపేతం చేస్తోంది. ఒక పక్క హిందుత్వ పెరిగిపోవడం, ఇంకోపక్క తెలంగాణ పల్లెల్లో దళితులపై, ముస్లింలపై దాడులు పెరగడం పాలక వర్గ రాజకీయ సంస్కృతిలో భాగమే. అగ్రకుల బ్రాహ్మణీయ సంస్కృతిని వ్యాపింపజేస్తూ దళిత, ఉత్పత్తికులాల ప్రజా సంస్కృతిని కనుమరుగు చేసే కుట్ర కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తున్నది.

ఇట్లాంటి సమయంలో ప్రాణమైనా పోనీ ప్రజలను మరువద్దనే త్యాగ పూరిత విలువలకు ప్రాణం పోసిన తెలంగాణ నేలలో రచయితలు, కవులు, కళాకారులు ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలి. ప్రజలను అణిచివేయడం పాలకవర్గ రాజకీయార్థిక విధానమే కాదు, సాంస్కృతిక విధానం కూడా. అందుకే చరిత్ర పొడవునా కవి, రచయిత, కళాకారుడు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను ఎదిరించి ప్రజల పక్షం వహించడమే సాహిత్య సంప్రదాయం. తెలంగాణకు, మొత్తంగా తెలుగు సమాజాలకు ఈ ఉజ్వల సంప్రదాయం ఎంతో ఉన్నది. పాలకవర్గం తనదైన భాష, సంస్కృతులతో నిత్యం పీడిత ప్రజా సమూహాలన్నిటినీ అవమానపరుస్తుంటుంది. దాని భాషలో పితృస్వామ్యం, బ్రాహ్మణీయ ఆధిపత్యం, పేదలపట్ల చిన్న చూపు ఉంటాయి. ఉత్పత్తిదాయకమైన ప్రజలను పాలకవర్గం దోచుకోవడమేగాక వాళ్ల జీవ భాషను అణగదొక్కుతూ ఉంటుంది. వాళ్ల సంస్కృతిని అవమానపరుస్తూ ఉంటుంది. రచయితలు, కళాకారులు సాంస్కృతిక మానవులు. రాజకీయం వాళ్ల సృజనసారం. అందువల్లే చరిత్రలో కవులు, రచయితలు పాలకవర్గాలకు, తమకు మధ్య ఒక గీత గీచుకొని ప్రజా పక్షం వహించారు. ప్రభుత్వాలను ధిక్కరిస్తూ వచ్చారు. రచయితలు ప్రభుత్వాలకు, వ్యవస్థకు నిరంతర ప్రతిపక్షమంటే అర్థం ఇదే.

ఈ ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి ప్రతి ప్రభుత్వం తనదైన ఎత్తుగడలతో నడుస్తుంది. కవులను, రచయితలను తన పక్షంలోకి లాక్కోడానికి భ్రమలు పెంచుతుంది. కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఇందు కోసమే ఈ సభలు జరుపుతోంది. తెలంగాణలో ఇంత కాలం మరుగున పడిపోయిన ప్రాంతీయ సాహిత్య కళా ధారను వెలికి తీయవలసిందే. దాన్ని సగౌరవంగా నిలబెట్టాల్సిందే. నిజానికి తెలంగాణ సమాజం చరిత్ర పొడవునా అనేక పోరాటాల్లో భాగంగా ఇలాంటి ఆవిష్కరణలు ఎన్నో చేసింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ పని చేస్తానంటూ ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహిస్తోంది. ఇలాంటి ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలపట్ల తెలంగాణలో, తెలుగు సమాజాల్లో మొదటి నుంచీ విమర్శనాత్మక వైఖరి ఉన్నది. దాన్ని మరింత ముందుకు తీసుకపోతూ విరసం ఈ సభలను బహిష్కరించమని పిలుపు ఇస్తోంది.

రచనకు, కళారూపానికి పాలకులు ఇచ్చే గుర్తింపును తెలంగాణ ..జనశీలురు ఏనాడో అధిగమించారు. ఈ స్ఫూర్తితో మా పిలుపును ఆహ్వానిస్తారనే నమ్మకం ఉంది. శ్రమజీవుల ఆరాట పోరాటాలే మన రచనలకు వస్తువు. ప్రజలు మన రచనను గుండెల్లో దాచుకొని ప్రేమతో గౌరవించుకోవటంలోనే మనకు గుర్తింపు ఉంటుంది. అందుకే... పెట్టుబడిదారుల డబ్బుతో, పాలకుల ఆదేశాలతో, బ్రాహ్మణీయ భూస్వామ్య విలువలతో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరుకావద్దని ప్రజాపక్షం వహించే రచయితలను కోరుతున్నాం. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాషా సాహిత్యాలను మనమే తవ్వితీసి వాటికి సమున్నత గౌరవం ఇద్దాం.

విప్లవ రచయితల సంఘం


No. of visitors : 752
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార స్వరాలకు ఆహ్వానం

virasam | 09.12.2017 10:13:47am

ప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ...
...ఇంకా చదవండి

గుండె గుర్తులు వెతుక్కుంటూ

అశోక్ కుంబము | 13.12.2017 11:37:22am

సాలు సాలులో సాగు వీరులు వరిగి పోతుంటె నీ కలంలోకి ప్రవహించిన రైతన్నల వెచ్చటి నెత్తురు అప్పుడే గడ్డకట్టిందా?! ఆపదలో అభయాన్నిచ్చే అక్షర సాహస విత్తనాలు భూమిన...
...ఇంకా చదవండి

వెలివేయబడ్డ అక్షరం

వెంకట్ కొండేటి | 13.12.2017 11:59:44am

అంటరానితనంతో వెలివేసిన నా అక్షరాల్ని ధిక్కార స్వరాలు చేసి నీ ʹజాత‌రʹలో నిన‌దించాల‌ని ఉంది...
...ఇంకా చదవండి

తెలంగాణ, తెలుగు మహా సభలు

పాణి | 05.12.2017 11:14:23pm

భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇం...
...ఇంకా చదవండి

కవి ఎక్కడ?

పాణి | 09.12.2017 11:50:36pm

కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా?...
...ఇంకా చదవండి

బుద్ధిజీవుల క‌ర్త‌వ్యం

వరవరరావు | 16.12.2017 06:17:47pm

పోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైనన...
...ఇంకా చదవండి

తెగులు సోకిన రచయితలారా రండీ

అభిన‌వ్ బూరం | 13.12.2017 12:49:48pm

విలువలు వదిలిపెట్టి.. వడివడిగా ఉరికి రండి.. కత్తిరించుకున్న కులం తోక.. అతికించుకోని రండి.. తెలంగాణ యాస కాదు బాషాన్నోళ్లు.. తెలుగే వెలుగంటు మూసుకుని రండీ.. మ...
...ఇంకా చదవండి

క‌ళావేత్త‌లారా! మీరేవైపు?

మాగ్జిం గోర్కి | 16.12.2017 09:39:01pm

1932లో అమెరికా జ‌ర్న‌లిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ( సృజ‌న ప‌త్రిక నుంచి )...
...ఇంకా చదవండి

సుఖ విరోచనం!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.12.2017 11:58:32pm

ʹకవిత్వం యెలా వస్తుందో గవర్నరుగారు చెప్పారు..ʹ ʹఎలా వస్తుంది?ʹ ʹసుష్టైన భోజనం.. తాంబూలం.. వుంటే వస్తుందని..ʹ ʹఏమొస్తుంది.. నిద్రా?ʹ ʹకాదు, కవిత్వం..!ʹ.....
...ఇంకా చదవండి

తెలుగు మ‌హాస‌భ‌లు - కొన్నిబుల్పికలు

బమ్మిడి జగదీశ్వరరావు | 16.12.2017 09:02:30pm

వాళ్ళ చేతుల్లో గడ్డిపూచలున్నాయని అరెస్టు చేస్తరా?ʹ ʹఎందుకు చెయ్యరు?, ఆయుధాలుంటే అరెస్టు చెయ్యరా? ఉప రాష్ట్రపతి చెప్పిన్రు గదేనే?ʹ ʹఏమని?ʹ ʹతెలంగాణల గడ్డిపూ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!
  అయోధ్యకి మళ్ళీ రెక్కలొచ్చినయ్
  రాయలసీమ బతుకు పోరాటం
  మట్టివాసనెపుడూ జీవనోత్సవమే.
  పాలమూరి దుఃఖం
  బతుకు వెతుకులాట లో పాఠకుడికి యెదురయ్యే నిఖార్సైన మానవుడు
  తొలితరం విప్లవ కథకుడు
  స్వేచ్చా స్వప్నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •