ధిక్కారమే రచన 1
కవి సాంస్కృతిక జీవి. సంస్కృతే ఒక గీటురాయి. జీవితంలోని సంస్కృతినంతా అక్షరయమం చేసేది రచయితలే. ప్రతి అక్షరాన్ని సంస్కృతీమయం చేసేది రచయితలే. జీవితం మారుమూలల నుంచి సంస్కృతిని ఒక జాజ్వల్యమాన కాగాడాగా ఎత్తిపట్టేది కవులే. తరతరాల జీవిత సారాన్నంతా గుర్తించే శక్తి కవికి గాక మరెవరికి ఉంటుంది. రచనను ఒక సాంస్కృతిక ఆచరణగా భావించేది రచయితలే. అందుకే మరెవరికీ కనిపించని జీవితపు అగాధాలు, ఔన్నత్యాలు దర్శిస్తారు. కవి లేని సమాజానిది నేలబారుతనం. ప్రతి కాలమూ, ప్రతి సమాజమూ, ప్రతి భూ ఖండమూ కవిని నిర్మించుకుంటుంది. తన సాంస్కృతిక కంఠస్వరంగా చరిత్ర భాసించేది కవి వల్లనే. కవిని చరిత్ర తన సౌందర్య వ్యక్తీకరణగా భావిస్తుంది. అంతేకాదు, చరిత్ర తనలోని కన్నీళ్లను, ఆరాటాలను, పోరాటాలను, విజయోల్లాసాలను, భోరుమనే దు:ఖాలను కవిలోంచి ఆలకిస్తూ ఉంటుంది. అందుకే చరిత్రకారులు సహితం కవి గుండెలపై చెవియొగ్గి తాము రచించే చరిత్రలోకి ఒదగని జీవన సర్వాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఎందుకంటే మరెవ్వరికీ తెలియనిది ఏదో కవికే ఎరుక అవుతూ ఉంటుంది. జీవితపు ధిక్కారం, విశ్వాసం, అసమ్మతి, అంతులేని జీవితేచ్ఛ కవి భాషకే లంగుతుంది కాబట్టి. కవిలోంచే తిరుగులేని ప్రకటన వ్యక్తమవుతుంటుంది కాబట్టి. కవి కాలానికి ప్రతినిధి. బతుకుకే ప్రతినిధి. లోకంలో ఏది ఎందుకు జరుగుతున్నదో, ఎలా జరుగుతున్నదో కనుగొనే ఆర్తిలోంచే కవిభాష నిర్మాణమవుతుంది. కవి ఊహాలోంచి కఠోర వాస్తవ జగత్తు పునర్నిర్మితమవుతుంది. అది వాస్తవానికంటే మరింత వాస్తవికంగా ఉంటుంది. అందంగానేగాక ఒళ్లుగగుర్పొడిచే భీభత్సంగా ఉంటుంది. నిజ జీవితంలోని సాహసమంతా సాంద్రభూతమైన అక్షరమవుతుంది. పడిపోతున్న మనిషికి అక్షరం ఆసరా అవుతుంది.
కవి కించిత్ అహంభావి. లోకపు తీరుపట్ల అసమ్మతిదారు. కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా? ఇలాంటి వాళ్లంతా పసిడి కలుగువాని బానిస కొడుకులని అనలేదా? అసలు విషయం బైటపెట్టలేదా? నాజూకు మాటలతో సరిపెట్టుకున్నాడా? ఎవరికీ అందని అయోమయ భాష మాటున తప్పించుకున్నాడా? ఉంటే కవి అయ్యేవాడేనా? ఈ సత్య ప్రకటనలో ఎంత గొప్ప కవితా శిల్పం ఉంది? ఈ మాటలో ఎంత సౌందర్యం ఉట్టిపడుతోంది? తరతరాలకు వన్నె తగ్గని ఈ ధిక్కారం వల్ల కదా కవి అంటే ఏమిటో చాటి చెప్పింది. ఆ అహంకారమెంత ముచ్చటగొలిపేది? ఎంత విద్యుత్తేజమది? ఎంత శాశ్వత వాక్యమది? ఎల్లకాలాలకు ఒక కవి, కవయిత్రి చాలరుగాని, అన్ని కాలాలకు కావాల్సిన ధిక్కారపు చాలు బోసిన కవి మాట కదా అది.
మరి ఇప్పుడు కవనమెక్కడ? దాని వస్తు శిల్ప సౌందర్యమెక్కడ? అసలు కవి ఎక్కడ?
Type in English and Press Space to Convert in Telugu |
ధిక్కార స్వరాలకు ఆహ్వానంప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ... |
నీవునీవేనా?నీ దుఃఖం, ఆగ్రహం ఉబికిన
సందర్భం కింద
నెత్తురింకిన నేల ఉంది కదా?
అవునా? కనిపిస్తోందా?
దాన్నొకసారి తాకి చూడు
నెత్తురు పారించినోడు కనిపిస్తాడు... |
వెలివేయబడ్డ అక్షరంఅంటరానితనంతో వెలివేసిన
నా అక్షరాల్ని
ధిక్కార స్వరాలు చేసి
నీ ʹజాతరʹలో నినదించాలని ఉంది... |
గుండె గుర్తులు వెతుక్కుంటూసాలు సాలులో సాగు వీరులు
వరిగి పోతుంటె
నీ కలంలోకి ప్రవహించిన
రైతన్నల వెచ్చటి నెత్తురు
అప్పుడే గడ్డకట్టిందా?!
ఆపదలో అభయాన్నిచ్చే
అక్షర సాహస విత్తనాలు
భూమిన... |
పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాంఅగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ప్రజా నిరసనను దారి మళ్లిండానికే... |
తెలంగాణ, తెలుగు మహా సభలు భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇం... |
సుఖ విరోచనం!ʹకవిత్వం యెలా వస్తుందో గవర్నరుగారు చెప్పారు..ʹ
ʹఎలా వస్తుంది?ʹ
ʹసుష్టైన భోజనం.. తాంబూలం.. వుంటే వస్తుందని..ʹ
ʹఏమొస్తుంది.. నిద్రా?ʹ
ʹకాదు, కవిత్వం..!ʹ..... |
తెగులు సోకిన రచయితలారా రండీవిలువలు వదిలిపెట్టి.. వడివడిగా ఉరికి రండి..
కత్తిరించుకున్న కులం తోక.. అతికించుకోని రండి..
తెలంగాణ యాస కాదు బాషాన్నోళ్లు.. తెలుగే వెలుగంటు మూసుకుని రండీ..
మ... |
బుద్ధిజీవుల కర్తవ్యంపోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైనన... |
కళావేత్తలారా! మీరేవైపు?
1932లో అమెరికా జర్నలిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంటర్వ్యూ( సృజన పత్రిక నుంచి )... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |