ప్రతివాది

| సంభాషణ

ప్రతివాది

- పాణి | 11.12.2017 12:04:02pm

ధిక్కారమే రచన - 2

కవయ: నిరంకుశా: అని ప్రాచీనులు అన్నారు. ఆలంకారికులు ఈ మాట ఒప్పుకున్నారో లేదో. ఎందుకంటే కవి అంటే ఏమిటో చెప్పడానికి వాళ్లు బోలెడు కసరత్తు చేశారు. దాన్నంతా తుంగల్లో తొక్కే మాట ఇది. నిజమే. ఎవరో అలంకార శాస్త్రం రాసి, కళ అంటే ఏమిటో చెప్పి, అందులో రస నిష్పత్తి ఎలా ఉండాలో తేల్చితే కవి కవిత్వం రాస్తాడా? పోనీ అలా రాస్తే అది ఎక్కాల పట్టీ అవుతుందేగాని కవిత్వమవుతుందా? అలంకార శాస్త్రాల ప్రకారం రాసిన వాళ్ళు సహితం తమ సొంత దారి కోసం ఆ నియమాలను ధిక్కరించారు. ఆమాట చెప్పడానికి పైన చెప్పిన కొత్త సూత్రం చెలామణిలోకి తేవలసి వచ్చింది.

ఎవరో గీచిన గళ్లలో కవిత్వం రాయని కవులు లోకపు గళ్లలో మాత్రం ఎందుకు ఉంటారు? లోకపు విధి విధానాలను, రీతి రివాజులను తిరస్కరిస్తారు. ఈ లోకపు మంచి మన్ననలను తోసిపుచ్చుతారు. అధికారాలను, పెత్తందారీతనాలను .. అవి ఎలా సంక్రమించినవైనా సరే.. కాలదంతారు. సింహాసనాల దగ్గర ఊడిగం చేసి, రాజులు పెట్టిన పెరుగన్నానికి కక్కుర్తిపడ్డ కవులూ ఉండవచ్చుగాని అధికార పీఠాలను కొనగోట కూల్చివేసిన కవులు మాత్రం ఎందరు లేరు. ఏదో వాళ్ల గొడవ... మనకు ఎంత తెలుసో గట్టిగా చెప్పలేం. భక్తి అనో, బాధ్యత అనో, వ్యక్తిత్వమనో, విప్లవమనో.. మొత్తానికి ఆత్మగౌరవం కాపాడుకున్నారు.

కవికి ఇదో పెద్ద చిక్కు. బహుశా మరెవ్వరికీ ఈ యాతన ఉండదేమో. కవి, రచయిత తమ ఆత్మగౌరవం కాపాడుకోవడమంటే తమ జాతి ఆత్మగౌరవం సహితం కాపాడటమే. ఎందుకు ఇలా అవుతుందోగాని అవుతుంది. అయింది. చరిత్ర పొడవునా అయింది. అందుకే కవి ప్రతివాది.

కవికి తనదే అయిన వాదన ఉంటుంది. అది కాస్తంత పెడసరంగా ఉండొచ్చు. అందుకే సృజనకు ఆ బ్యూటీ. మరే శాస్త్రంలో చూస్తాం ఈ తత్వాన్ని? ఒకరు చెప్పినట్లు వినకపోవడం, ఒకరి వాదనతో ఏకీభవించకపోవడం కవిత్వ లక్షణం. ముఖ్యంగా రాజ్యం చెప్పినట్లు వినకపోవడంలోంచే కవిత్వం పుడుతుంది కావచ్చు. ఎందుకంటే అంతకంటే మూర్తీభవించిన అధికారం ఉండదు. అంతకంటే పోతపోసిన దుర్మార్గం మరి ఉండదు. అంతకంటే హింస మరెక్కడా ఉండదు. అంతకంటే అందమైన ప్రలోభం ఎందెందునా ఉండదు. అసమ సమాజంలో రాజ్యం సకల అమానుషాల జన్మ స్థానం. లేదా వాటన్నిటి జంక్షన్‌. అన్ని సామాజిక, సాంస్కృతిక హింసలను తన కౌవారంగా మార్చుకుంటుంది. అంతే అయితే రాజ్యం చాలా దుర్బలం. రాజ్యానికి ఒక వాదన ఉంటుంది. తన హింసకు, కాఠిన్యానికి సమర్థనా వాదన ఉంటుంది. దానికి కవి ప్రతివాది. కవి వాదన గెలిచేనా? ఏమో.. గెలిచి శిఖర సదృశ పతాకమైన రెపరెపలాడిన సందర్భాలూ ఉన్నాయి. నెత్తురు కక్కుకుంటూ నేల రాలిపోయిన అనుభవాలూ ఉన్నాయి. కానీ కవికి ఒక పోటీ వాదన ఉంటుంది. దాని మీదే కవి నిర్మాణమయ్యేది.

అనంత సంపద, అంతులేని సైనికం, అస్త్రశస్త్రాల పాండిత్యం, అన్నిటికీ మించి హింసోన్మాదపు బరితెగింపు రాజ్యానికి ఉంటుంది. ఇన్ని ఉన్నా దానికి కవి కూడా కావాలి. ఎందుకో. కవులు ఏం చేస్తారని? మహా అయితే నిత్యం మారుమోగే నినాద సదృశమైన పద్యం ఒకదాన్ని తమ జాతి ప్రజల చేతిలో పెడతారు. అంతే. కానీ అందులో ఒక ప్రతివాదన ఉంటుంది. దాన్ని కొల్లగొట్టడానికి రాజ్యం కవికి మాటుగాస్తుంది. ప్రతివాదన అంటే ఏ అధిపత్య వ్యవస్థకైనా చిరాకే. అంతులేని అసహనమే. అందుకే దాన్ని లేకుండా చేయాలి. ఓడించాలి. అది తనకు బైట ఉంటే ఎప్పుడూ, ఏదో ఒక రూపంలో నిలేస్తూనే ఉంటుంది. అందుకే లోబరుచుకోవాలి. కవిని లోబరుచుకోవడం ఒక విద్య. అధికారం, సంపద ఉన్నవారికి ఈ విద్య సులభంగా పట్టుపడేదే.

చివరికి ప్రతివాది ప్రభుత్వవాదిగా మారిపోతాడు.





No. of visitors : 529
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార స్వరాలకు ఆహ్వానం

virasam | 09.12.2017 10:13:47am

ప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ...
...ఇంకా చదవండి

గుండె గుర్తులు వెతుక్కుంటూ

అశోక్ కుంబము | 13.12.2017 11:37:22am

సాలు సాలులో సాగు వీరులు వరిగి పోతుంటె నీ కలంలోకి ప్రవహించిన రైతన్నల వెచ్చటి నెత్తురు అప్పుడే గడ్డకట్టిందా?! ఆపదలో అభయాన్నిచ్చే అక్షర సాహస విత్తనాలు భూమిన...
...ఇంకా చదవండి

వెలివేయబడ్డ అక్షరం

వెంకట్ కొండేటి | 13.12.2017 11:59:44am

అంటరానితనంతో వెలివేసిన నా అక్షరాల్ని ధిక్కార స్వరాలు చేసి నీ ʹజాత‌రʹలో నిన‌దించాల‌ని ఉంది...
...ఇంకా చదవండి

తెలంగాణ, తెలుగు మహా సభలు

పాణి | 05.12.2017 11:14:23pm

భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇం...
...ఇంకా చదవండి

కవి ఎక్కడ?

పాణి | 09.12.2017 11:50:36pm

కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా?...
...ఇంకా చదవండి

బుద్ధిజీవుల క‌ర్త‌వ్యం

వరవరరావు | 16.12.2017 06:17:47pm

పోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైనన...
...ఇంకా చదవండి

క‌ళావేత్త‌లారా! మీరేవైపు?

మాగ్జిం గోర్కి | 16.12.2017 09:39:01pm

1932లో అమెరికా జ‌ర్న‌లిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ( సృజ‌న ప‌త్రిక నుంచి )...
...ఇంకా చదవండి

తెలుగు మ‌హాస‌భ‌లు - కొన్నిబుల్పికలు

బమ్మిడి జగదీశ్వరరావు | 16.12.2017 09:02:30pm

వాళ్ళ చేతుల్లో గడ్డిపూచలున్నాయని అరెస్టు చేస్తరా?ʹ ʹఎందుకు చెయ్యరు?, ఆయుధాలుంటే అరెస్టు చెయ్యరా? ఉప రాష్ట్రపతి చెప్పిన్రు గదేనే?ʹ ʹఏమని?ʹ ʹతెలంగాణల గడ్డిపూ...
...ఇంకా చదవండి

పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాం

విర‌సం | 07.12.2017 12:39:17am

అగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ప్రజా నిరసనను దారి మళ్లిండానికే...
...ఇంకా చదవండి

దీపాలు ఆర్పేసి ప్రతెమ!

బమ్మిడి జగదీశ్వరరావు | 16.12.2017 08:12:48pm

ʹపంతొమ్మిది వందల డబ్బైయ్యయిదులో అంతే కదా? జలగం వెంగళరావు వారసత్వం..!ʹ ʹదీపాలు యెక్కడ యల్బీ స్టేడియంలోనేనా పెట్టింది..?ʹ ʹకాదు, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జులై - 2018
    కత్తి మహేష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం
    కోలుకొండ దళితుల భూ పోరాటానికి విరసం సంఘీభావం
    రాజ్య హింసలో కేంద్ర, రాష్ట్ర బిజెపి ప్రభుత్వాలతో తెలుగు ప్రభుత్వాలు కూడా సరిసమానమే
    వీళ్లు చేసిన నేరం ఏంటి?
    జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ
    కార్పోరేట్ కంపెనీల ఏజెంట్‌గా మోదీ స‌ర్కారు
    నెలవంక సందేశం
    The tree of the world
    వాళ్లు భూమి కలను నిజం చేసుకుంటారా?
    వీవీపై అక్రమ కేసు విరమించుకోవాలి
    రాజ్యం బరితెగింపు వెనక

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •