అసలు మనం ప్రజల్లో భాగమా? పాలకుల్లో భాగమా?

| సాహిత్యం | వ్యాసాలు

అసలు మనం ప్రజల్లో భాగమా? పాలకుల్లో భాగమా?

- శివలక్ష్మి | 12.12.2017 10:46:03am

నాకు శ్రీకాంతాచారి సాహసం ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది. దాని వెనువెంటనే నేను చదివిన గోర్కీ కథ ఒకటి జ్ఞాపకాల్లోంచి తన్నుకొస్తుంది!

ఆ కథలో దుర్భరమైన నరక యాతనలకు తట్టుకోలేక ఊళ్ళోని శ్రమజీవులందరూ కుటుంబాలకు కుటుంబాలు పిల్లలూ, వృద్ధులతో సహా ప్రాణానికి కాస్తంత సుఖం, శాంతి ఎక్కడ దొరుకుతాయా అని వెతుక్కుంటూ బయల్దేరతారు. మన శ్రీకాంతాచారి లాంటి తెగింపు కలిగినʹడాంకోʹఅనే ఒక యువకుడు అందరికంటే ముందు నడుస్తుంటాడు. వెనక జనం. అడవిలోకొస్తారు. హఠాత్తుగా చీకటి. చిమ్మ చీకటి! సుఖానికి దారేది? ఎలా వెళ్ళడం? అని జనాలు ఆలోచిస్తుండగానే డాంకో చేతిని తన కడుపులో గుచ్చుతాడు. సర్రున చాతీలొకి పోనిస్తాడు. టప టపా గుండెని దొరక పుచ్చుకుని పెరికి బయటికి తీస్తాడు. దాన్ని నెత్తి మీద పెట్టుకుంటాడు. డాంకో గుండె వేయి విద్యుద్దీపాల కాంతితో వెలుగులు చిమ్ముతూ ప్రజలకు కనిపిస్తుంది! ఆ వెలుగు దారిలో ప్రజలంతా నడుస్తారు. నెత్తుటి మడుగులో డాంకో ఒరిగిపోతాడు.

సాహిత్య కారులు,కళాకారులు ప్రపంచానికి చెందుతారు. ఎక్కడ ఏమూలన అసంబద్ధతలున్నా గోర్కీ లాగే ప్రజల పక్షం వహిస్తారు. ఈ కథలోని డాంకోని గోర్కీ తన కాలంలో నిజంగా చూశారో, యువకులంటే అలా ఉండాలని ఉన్నతీకరించి రాశారో తెలియదు గానీ మనం అలాంటి అద్భుతమైన డాంకోలను ఇప్పుడిక్కడ తెలంగాణాలో కళ్ళారా చూశాం! ఒకరు కాదు, ఇద్దరు కాదు. వెయ్యి మంది డాంకోలు తెలంగాణా విముక్తి కోసం అలుపెరగని పోరాటాలు చేసి అమరులయ్యారు! మూడున్నర కోట్ల ప్రజల తరఫున, ప్రజల కోసం ముక్కు పచ్చలారని పిల్లలు పోరాడిన చరిత్ర దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదు! స్వరాష్ట్రం వస్తే ఆకలి బాధలు, అసమానతలు తొలగిపోతాయని, ప్రజలందరికీ మేలు జరగాలనే గొప్ప ఆశయంతో, నిస్వార్ధంగా, దృఢదీక్షతో ఉద్యమించారు. పసిబిడ్డల ప్రాణత్యాగాల పునాదిగా ఏర్పడింది తెలంగాణా! ఆపిల్లల తల్లులూ, కుటుంబాలూ నికృష్టమైన బాధలు పడే అట్టడుగు ప్రజలే! తెలంగాణా, మన తెలంగాణా అని గుండెలు బాదుకున్న వాళ్ళకు వివేక్, శృతి, సాగర్లు తెలంగాణా బిడ్డలని మర్చిపోయారా? పాలక పక్షానికి మానవ ముఖమనేది ఉంటే అంత నీచంగా, అంత కౄరంగా సొంత బిడ్డల్ని బలి చేస్తారా?
ఆ బిడ్డలు వాళ్ళకు శత్రువులుగా కనిపిస్తే మనకుమాత్రం డాంకో వారసులే!

చేతి వృత్తులు,పనీ పాట్లు చేసుకుని పూట గడుపుకుంటూ పొట్టపోషించుకునే వారివల్లనే భాషా సంస్కృతులు ఇంకా నిలిచి ఉన్నాయనీ, సాంస్కృతిక చైతన్యం వెల్లి విరుస్తుందనీ, పల్లె బతుకులో కల్లాకపటాలుండవనీ కవులూ, రచయితలూ ఘనంగా కీర్తిస్తూ రచనలు చేసి అవార్డులూ,రివార్డులూ సంపాదిస్తారు కదా?

అసలు మనందరం కవులూ,రచయితలతో సహా ప్రజల్లో భాగమా? లేకపోతే ప్రభుత్వంలో ఏదైనా ప్రత్యేకమైన ఒక క్లాస్ కి సబంధించినవారమా? అని ఆలోచించాలి. పాలకులు అవసరమైనప్పుడు ʹమీరు మాకెంతో స్పెషల్ మాతో కలిసి మాబాకాలూదండిʹ అని కలుపుకుంటారు. మళ్ళీ టాక్సులూ, రకరకాల బిల్లులూ వడ్డించేటప్పుడు మాత్రం మీరు ప్రజల్లో భాగమేనని, చెల్లించి తీరవలసిందేనని స్పష్టంగా నడ్డి విరుస్తుంది. ఇప్పుడు మనం ఎవరి పక్షం ఉండాలో అని తేల్చుకోవాలి.

ప్రజలు సృష్టిస్తున్న సకల సంపదలను, వనరులను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న పాలకులు, ప్రజల్ని మాత్రం అంచులకు నెడుతున్నాయి. భాష, సంస్కృతి, కళలు, సాహిత్యం, రాజకీయాలు వేటికవి వేరు వేరు కాదు. అంతా రాజకీయమే! ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తూ అట్టహాసంగా ప్రపంచ మహాసభలు జరిపేది ప్రశ్నల్ని అణచివెయ్యడానికి,ఆబ్లిగేషన్ లో పెట్టడానికే!

మనకు కాస్త సౌకర్యవంతమైన జీవితాలుండి, మార్కెట్ కి పనికొస్తున్నాం కాబట్టి ప్రభుత్వాలు అప్పుడప్పుడూ మనపట్ల ప్రత్యేక గౌరవం వెలగబెడతాయి. మార్కెట్ కి వినియోగదారులుగా పనికిరాని పేద ప్రజలను ఏకంగా మట్టుబెట్టాలని చూస్తున్నాయి!

మహాశ్వేతా దేవి అట్టడుగు ప్రజలు, ఆదివాసీల గురించి మాట్లాడుతూ ʹసాధారణ ప్రజలు మనకంటే చాలా తెలివైనవాళ్ళు. ఈ దుర్మార్గపు వ్యవస్థలో ఎలా బతకాలో వాళ్ళకి బాగా తెలుసు. మీరందరూ హాయిగా, సుఖ, శాంతులతో మీబతుకులు మీరు బతకండి. ఎవరూ ఏమీ చెయ్యకపోయినా ఫరవాలేదు. కానీ వారు ప్రాణాలకు తెగించి చేస్తున్న ఉద్యమాలకు, పోరాటాలకు వెనకుండి మద్దతు నివ్వండిʹʹ అని మనలాంటివారికోసం చెప్పారు. మనం ఉధృతమైన పోరాటాలు ఎలాగూ చెయ్యలేం కనీసం మన వంతుగా ఉద్యమిస్తున్న ప్రజల పక్షం వహించినా చాలు!





No. of visitors : 425
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార స్వరాలకు ఆహ్వానం

virasam | 09.12.2017 10:13:47am

ప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ...
...ఇంకా చదవండి

గుండె గుర్తులు వెతుక్కుంటూ

అశోక్ కుంబము | 13.12.2017 11:37:22am

సాలు సాలులో సాగు వీరులు వరిగి పోతుంటె నీ కలంలోకి ప్రవహించిన రైతన్నల వెచ్చటి నెత్తురు అప్పుడే గడ్డకట్టిందా?! ఆపదలో అభయాన్నిచ్చే అక్షర సాహస విత్తనాలు భూమిన...
...ఇంకా చదవండి

వెలివేయబడ్డ అక్షరం

వెంకట్ కొండేటి | 13.12.2017 11:59:44am

అంటరానితనంతో వెలివేసిన నా అక్షరాల్ని ధిక్కార స్వరాలు చేసి నీ ʹజాత‌రʹలో నిన‌దించాల‌ని ఉంది...
...ఇంకా చదవండి

కవి ఎక్కడ?

పాణి | 09.12.2017 11:50:36pm

కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా?...
...ఇంకా చదవండి

తెలంగాణ, తెలుగు మహా సభలు

పాణి | 05.12.2017 11:14:23pm

భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇం...
...ఇంకా చదవండి

బుద్ధిజీవుల క‌ర్త‌వ్యం

వరవరరావు | 16.12.2017 06:17:47pm

పోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైనన...
...ఇంకా చదవండి

క‌ళావేత్త‌లారా! మీరేవైపు?

మాగ్జిం గోర్కి | 16.12.2017 09:39:01pm

1932లో అమెరికా జ‌ర్న‌లిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ( సృజ‌న ప‌త్రిక నుంచి )...
...ఇంకా చదవండి

తెలుగు మ‌హాస‌భ‌లు - కొన్నిబుల్పికలు

బమ్మిడి జగదీశ్వరరావు | 16.12.2017 09:02:30pm

వాళ్ళ చేతుల్లో గడ్డిపూచలున్నాయని అరెస్టు చేస్తరా?ʹ ʹఎందుకు చెయ్యరు?, ఆయుధాలుంటే అరెస్టు చెయ్యరా? ఉప రాష్ట్రపతి చెప్పిన్రు గదేనే?ʹ ʹఏమని?ʹ ʹతెలంగాణల గడ్డిపూ...
...ఇంకా చదవండి

దీపాలు ఆర్పేసి ప్రతెమ!

బమ్మిడి జగదీశ్వరరావు | 16.12.2017 08:12:48pm

ʹపంతొమ్మిది వందల డబ్బైయ్యయిదులో అంతే కదా? జలగం వెంగళరావు వారసత్వం..!ʹ ʹదీపాలు యెక్కడ యల్బీ స్టేడియంలోనేనా పెట్టింది..?ʹ ʹకాదు, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం.....
...ఇంకా చదవండి

పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాం

విర‌సం | 07.12.2017 12:39:17am

అగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ప్రజా నిరసనను దారి మళ్లిండానికే...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    21వ శతాబ్దంలో మార్క్స్‌
    అరుణతార ఏప్రిల్ - 2018
    యురేనియం కర్మాగారం చేస్తున్న కాలుష్యాన్ని ప్రశించిన ప్రజాసంఘాల నాయకుల అరెస్టులను ఖండిస్తున్నాం
    గోడ ఒక ఆయుధం
    చెప్పులు కొందాం రండి
    ఎలా వెళ్ల‌ను?
    ʹహెచ్‌సీయూ వీసీ హ‌త్య‌కు ప‌థ‌కంʹ బూట‌కం
    భవిష్యత్తును కాల్చేశారు
    రజనీతిలక్ లేని లోటు భర్తీ చేయలేనిది
    కలకత్తా సాహిత్య ఉత్సవాల్లో పాల్గొన్న ముగ్గురు కవయిత్రులు
    కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ప్రైవేటు వర్సిటీలు
    ప్రజా ప్రత్యామ్నాయ సాహిత్య వేదిక

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •