సాయిబాబా బదిలీ అతని సహచర ఖైదీల బెయిలు ప్రయత్నాలు - అప్‌డేట్‌

| సాహిత్యం | వ్యాసాలు

సాయిబాబా బదిలీ అతని సహచర ఖైదీల బెయిలు ప్రయత్నాలు - అప్‌డేట్‌

- రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 13.12.2017 01:35:13am

డిసెంబర్‌ 6వ తేదీన నాగపూర్‌ హైకోర్టు బెంచి ముందుకు గడ్చిరోలీ యుఎపిఏ కేసులో యావజ్జీవ శిక్ష పడిన ప్రశాంత్‌ రాహి (జర్నలిస్టు) ఆదివాసీ విజయ్‌ టిర్కీ (పది సంవత్సరాల శిక్ష) బెయిల్‌ పిటిషన్స్‌ విచారణకు వచ్చాయి. ప్రశాంత్‌ రాహి సీనియర్‌ కౌన్సెల్ నిత్యారామకృష్ణన్‌ (సుప్రీంకోర్టు న్యాయవాది) ఢిల్లీ నుంచి వచ్చారు. విజయటెర్కి తరపున సురేంద్ర గడ్లింగ్‌ కూడా వాదనలు వినాల్సిందిగా కోరారు. ప్రాసిక్యూషన్‌ తరపున వాదించడానికి అడ్వకేటు జనరల్‌ రావలసి ఉండి రాలేదు గనుక వీళ్లిద్దరూ ఎంత ప్రయత్నించినా బెంచి తిరిగి డిసెంబర్‌ 18కి వాయిదా వేసింది. అంటే సాయిబాబా బెయిలు పిటిషన్‌ వేయడానికి అనుకూల పరిస్థితి కోసం కూడ ఆయన సుప్రీంకోర్టు కౌన్సెల్ సూచనల ప్రకారం ఇంకొక పది రోజులు కనీసం నిరీక్షించక తప్పదు. ఈలోగా నవంబర్‌ 14, 16 తేదీలలో సాయిబాబాను మొదలు ఆయన తల్లి, తమ కూతురు, తోటి కోడలుతో పాటు, తర్వాత తాను కలిసి ఢిల్లీకి వెళ్ళగానే మరింత క్షీణించిన సాయిబాబా ఆరోగ్యం గురించి వసంత సీనియర్‌ కౌన్సెల్ కు మెయిలు పెట్టింది. ఆమె రమ్మంటే మర్నాడే వెళ్లి కలిసింది. ఆమె సాయిబాబా ఆరోగ్యం గురించి కన్సర్న్ తో వినడమే కాకుండా, ఆయన బెయిలు పిటిషన్‌పై హైకోర్టులో వాదించడానికి కూడా వస్తానని, అయితే ముందుగా తాను కొంత బలహీనంగా ఉన్న ఈ ఇద్దరి బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టు వైఖరి చూడదలుచుకున్నాని చెప్పింది. ఈలోగా ఆరోగ్య కారణాల వలన ముఖ్యంగా జైలు బదిలీ గురించి ప్రయత్నించుకొమ్మని చెప్పింది.

నవంబర్‌ మూడవ వారంలో హైదరాబాదు వచ్చిన మహారాష్ట్ర గవర్నర్‌ను డిఫెన్స్‌ కమిటీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ కలిసి జైలు పరిస్థితి, మందులు సక్రమంగా ఇవ్వకపోవడం, బ్లాంకెటు ఇవ్వకపోవడం మొదలైన విషయాలు ఆయన దృష్టికి తెచ్చి అవన్నీ తక్షణం చక్కబెట్టడానికి ఆదేశాలివ్వాలని స్వస్థలమైన హైదరాబాదు జైలు చెర్లపల్లికి బదిలీ చేయాలని ఆ మేరకు సాయిబాబా, తల్లి, సహచరి గవర్నర్‌కు విజ్ఞప్తి లేఖలు పంపారని చెప్పారు.

మందులు, బ్లాంకెట్‌ గురించి ఫిర్యాదులు మీడియాలో చూసానని, ముఖ్యంగా ʹసాక్షిʹలో మల్లెపల్లి లక్ష్మయ్య ఉత్తరం చదివి తానే స్పందించి ఇంగ్లీషులోకి అనువాదం చేయించి నాగపూర్‌ సెంట్రల్‌ జైలుకు పంపించానని గవర్నర్‌ హరగోపాల్‌ గారికి చెప్పారు. హరగోపాల్‌ ముందరే రాష్ట్ర హోంకార్యదర్శికి ఫోన్‌ చేసి బదిలీ కోసం చేసుకున్న విజ్ఞప్తిని, తాను ముంబై చేరే వరకు తన ముందు ఉంచాలని ఆదేశిస్తూ అనుకూలమైన నోట్‌ రాయాలని, మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఖైదీ తగ్గితే మంచిదే కదా అని గవర్నర్ అన్నారట. తాను ఆ తర్వాత వారం గడిచాక నాగపూర్‌ జైలు సందర్శిస్తానని కూడా అన్నారట.

బదిలీ కోసం పెట్టుకున్న దరఖాస్తు కాపీలు అందుకున్న వారిలో ప్రిజన్ రిఫార్మ్స్ కోసం ఏర్పడిన జస్టిస్‌ రాధాకృష్ణన్‌ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్‌ విజయ రాఘవన్‌ (టాటా ఇనిస్టుట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌) వసంతకు బదిలీ విషయమై హైకోర్టులో పిటిషన్‌ వేసుకొమ్మని సూచించాడు. ఎందుకంటే సాయిబాబా తన యావజ్జీవ శిక్షపై హైకోర్టుకు అప్పీలు చేసుకున్నాడని, బెయిల్‌ కోసం కూడా పిటిషన్‌ వేసాడని కనుక ఈ అధికారం హైకోర్టుకే ఉంటుందని కమిటీ ముందు అడిషనల్‌ డిజిపి చెప్పాడు.

డిఫెన్స్‌ కమిటీ న్యాయవాదుల్లో (జడ్జ్‌మెంటుపై క్రిటిక్‌ రాసిన వాళ్లల్లో) ఒకరు దీనిపై మళ్లీ అధ్యయనం చేసి 1950 కేంద్ర చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పుల ప్రకారం శిక్షపడిన వారిని బదిలీ చేసే, తీసుకునే అధికారం పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేస్తూ ఆ యాక్ట్ ప్రతి, తీర్పులు ఒక నోట్‌ తయారు చేసి వసంతకు పంపారు. అవి జత చేస్తూ వసంత ప్రొ. విజయరాఘవన్‌కు ఈ విషయం అడిషనల్‌ డిజిపికి తెలియజేసి బదిలీ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయవలసిందిగా నవంబర్‌ 29న రాసింది. దానికి డిసెంబర్‌ 5న ప్రొ. విజయ్‌రాఘవన్‌ మళ్లీ హైకోర్టులో వేసుకోవాల్సిందని సూచిస్తూ ఈ విషయం మీ న్యాయవాదికి చెప్పండి లేదా మేమే మీకు న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని రాసాడు.

దీనిపై వసంత తిరిగి పొ .విజయరాఘవన్ కు 1950 కేంద్ర చట్టం, సుప్రీం కోర్టు తీర్పులు డిఫెన్స్ లాయర్ నోట్ పంపుతూ ఈ విషయం జైలు అధికారులను జస్టిస్ రాధాకృష్ణ ద్వారా స్పష్టం చేయండి అని రాసింది. అట్లాగే డిసెంబర్ 11 న డిఫెన్స్ కమిటీ చైర్మన్ పొ .హరగోపాల్ సూచనపై శిక్ష పడిన ఖైదీల బదిలీ గురుంచి కేంద్ర ప్రబుత్వ చట్టాన్ని, సుప్రీం కోర్టు తీర్పును డిఫెన్స్ కమిటీ న్యాయవాదికి నోట్ ను పంపిస్తూ తన సహచరుడు పొ సాయిబాబును క్షిణిస్తున్న అతని ఆరోగ్యం దృష్ట్యా వెంటనే నాగాపూర్ జైలు నుంచి చెర్లపల్లి జైలుకు బదిలీ చేయడానికి చర్యలు తీసుకొమ్మని కోరింది.

ఈ విధంగా బదిలీ విషయం సాగదీయడం, కాలయాపన గవర్నర్‌ దృష్టికి తీసుకువచ్చి తక్షణ చర్యల కోసం కోరుతానని ప్రొఫెసర్‌ హరగోపాల్‌గారు అన్నారు .

డిసెంబర్ 10 వ తేదీన చట్టం న్యాయం విషయంలో ప్రజా ఫిర్యాదులను స్వీకరించి, చర్చించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సూచనలు చేసే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం ఉన్నదని తెలిసి వసంత తాను గతంలో నవంబర్ 29 న ఆ కమిటీకి ఇచ్చిన లేఖను సాయిబాబా బదిలీని కోరుతూ మళ్లి ఇచ్చింది. పార్లమెంట్ కమిటీ వసంత లేఖను, వసంతకు సాయిబాబా జైలు నుంచి రాసిన లేఖలోని అంశాలతో ఏకీభవించింది. సాయిబాబాను జైల్లో సరిగ్గా చూడటంలేదని, ఆయనను ఒక పద్ధతిగా అధికారులు నిర్లక్ష్యానికి గురిచేస్తూ ఆయన జీవితాన్ని కాపాడే అత్యవసర మందులను అందించకుండా ఇబ్బంది పెడుతున్నారని, అయన హృద్రోగి అని, హెపర్టెన్షన్ కూడా ఉందని, క్రమం తప్పకుండా మందులు తీసుకోవలసి ఉంటుందని, పది రోజుల పాటు కూడా ఆ మందులు ఆయనకు ఇవ్వకుండా ఉన్న సందర్బాలు ఉన్నాయనీ ఆమె చేసిన ఆరోపణలన్నిటికి పార్లమెంటరి స్టాండింగ్ కమిటీ అంగీకరించింది. గతంలో ఒక సందర్భంలో కూడా ఇటువంటి నిర్లక్ష్యానికే జైలు అధికారులు గురిచేశారని, ఆయనను నేరపూరిత నిర్లక్ష్యానికి అధికారులు గురిచేస్తున్నారని, ఆ విషయాన్ని పార్లమెంటరి కమిటీ దృష్టికి ఆమె గత నవంబర్లో కూడా తీసుకువచ్చిందనే విషయాన్ని ఆ కమిటీ ముందు వసంత లేఖను ఉంచినటువంటి పార్లమెంట్ సభ్యుడు, సి.పి.ఐ నాయకుడు డి.రాజా పేర్కొన్నారు. సాయిబాబా 90% అంగవైకల్యం కలవాడనే విషయం ప్రపంచానికి అంతటికి తెలుసు కనుక మళ్ళి పార్లమెంట్ కమిటీ దృష్టికి తేవాల్సిన అవసరం లేదని అయన అన్నారు. జైలు డాక్టర్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి చూడటానికి కూడా నిరాకరిస్తున్నాడని, ఆయనకు చలి కాలంలో వెచ్చని దుస్తులు కూడా ఉద్దేశపూర్వకంగానే ఇవ్వడం లేదనే ఆరోపణను కూడాపార్లమెంటరి కమిటీ చాల తీవ్రంగా భావించింది. ఈ సంధర్బములో రాజా ఈ కమిటీ దృష్టికి ఒక శిక్ష పడిన వ్యక్తికి దేశంలో ఎక్కడికైనా తిరిగే హక్కు తప్ప మిగిలిన అన్ని ప్రాధమిక హక్కులు ఉంటాయని ముఖ్యంగా జీవించే హక్కు ఈ పరిస్థితిలోను ఎవరు కోల్పోరని విషయాన్ని , అటువంటి వారికి మౌలికమైనటువంటి ఆరోగ్య సౌఖర్యాలు, వసతి సౌఖర్యాలు కల్పించడమనేది ప్రభుత్వం బాధ్యత అనే విషయాన్ని పార్లమెంటరి కమిటీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువచ్చింది. ఈ కమిటీలో డి.రాజా మాత్రమే కాకుండా టి.ఆర్.ఎస్స్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు కూడా ఉన్నారు. ఈ వార్తను ప్రముఖంగా డిసెంబర్ 11వ తేదీ నాడు హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలూ ప్రచురించాయి. సాయిబాబా విడుదల గురుంచి, తక్షణమే బదిలీ గురుంచి ఈ విధమైన ఒక అనుకూలమైన వాతావరణం ప్రచార రూపంలో కలుగుతుండగా, ఈ ప్రచారం ద్వారా పార్లమెంటరి కమిటీ కూడా ఈ విషయం గురుంచి తీవ్రంగా అలోచించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దృష్టికి తెస్తుండగా మరొక వైపు సంఘ్ పరివార్ శక్తులు, మీడియా, ముఖ్యంగా రాజ్యం, ప్రభుత్వాలు అయన మావోయిస్టుల సభలలో పాల్గొన్నాడని, అల్ట్రాస్ టెర్రరిస్టుల మీటింగ్లలో పాల్గొన్నాడు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నది. టైమ్స్ ఆఫ్ ఇండియా అటువంటి ఒక కథనాన్ని ప్రచురించిందికూడా.

ఇంత స్పష్టంగా కేంద్ర చట్టం, సుప్రీంకోర్టులు ఈ బదిలీ చేసే తీసుకునే అధికారమంతా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే అని చెప్పినప్పటికీ ఇట్లా రాయడం కాలయాపన తప్ప మరొకటి కాదు. ప్రభుత్వానికి సదుద్దేశం లేదని, ఇందులో మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల, నిఘా వర్గాల, ఇంటిలిజెన్స్ ప్రచ్ఛన్న హస్తముందని అనుమానించవలసి వస్తున్నది.

ఉస్మానియా యూనివర్సిటీ రౌండ్‌ టేబిల్‌తో పాటు పంజాబ్లో పలుచోట్ల, అలహాబాద్, బెంగాల్లో ఆయన సహచరుల విడుదల కోసం ప్రదర్శనలు, సభలు, సమావేశాలు జరిగాయి.

డిఫెన్స్‌ కమిటీ చొరవతో లండన్‌లో ఉద్దేశించిన సెమినార్‌ (సాయిబాబా, చంద్రశేఖర్‌ ఆజాద్‌ విడుదల కోసం వికలాంగుల అంతర్జాతీయ దినం రోజు సాయిబాబా గురించి జరిగి ఉండవలసింది) డిసెంబర్‌ 8 మధ్యాహ్నం 1 గం. 3 గం. మధ్యన జరుగనున్నది. ప్రొ. ఆనంద్‌ తేల్‌టుంబ్డే. ప్రొ. కల్పనా కన్నాబిరామన్‌ స్వయంగా పాల్గొంటున్నారు. ప్రొ. హరగోపాల్‌ తన ప్రసంగాన్ని (12 నిముషాలు) రికార్డు చేసి పంపుతారు. బహుశా వసంత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా, ప్రత్యక్షంగా కొందరు పాల్గొనే అవకాశం ఉంది. దీని వివరాలు సోషల్‌ మీడియాలో చూడవచ్చు. నవంబర్‌ 29 సాయంత్రం లామకాన్‌లో జరిగింది. సభలో ప్రొ. హరగోపాల్‌ ప్రసంగాన్ని ʹసాయిబాబా స్వేచ్ఛతోనే మన అందరి స్వేచ్ఛ ఇమిడి ఉన్నదిʹ అనే శీర్షికతో నవంబర్‌ 30 న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ప్రముఖ రిపోర్ట్‌ (ఇంగ్లిషు) చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో సిఎల్‌పి నాయకత్వంలో విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ తర్వాత నవంబర్‌ 27న చలో అమలాపురం వెళ్లిన ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను వెళ్లిన వాళ్లకు వెళ్లినట్లుగా అరెస్టులు చేసారు. అయినా ఎంతో రాజకీయ ప్రభావితం కలిగించేదిగా ఈ నిరసన జరిగింది. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంటిలిజెన్స్‌ వాళ్లు పేరు పెట్టుకోకుండా ప్రొ. జిఎన్‌ సాయిబాబా గురించి ఆయన ఫోటో కూడా వేస్తూ విషం కక్క పోస్టర్‌ వేసారు. (సోషల్‌ మీడియాలో చూసే ఉంటారు).

ఆంధ్రప్రదేశ్‌లో తల పెట్టిన విశాఖ, రాయలసీమతో ఒకచోట, ఆ పిమ్మట గుంటూరుతో పెద్ద సభ ఇంక జరగాల్సే ఉన్నవి. తెలంగాణకు సంబంధించి భవిష్యత్‌ కార్యక్రమం రూపొందించుకోవాల్సి ఉంది.

నవంబర్‌ 28న పంజాబ్‌లోని మోగలో ప్రొఫెసర్‌ సాయిబాబా ఆయన సహచరుల విడుదల కోసం ఆర్‌డిఎఫ్‌ చొరవతో ప్రజా సంఘాల సభ విజయవంతంగా జరిగింది. ఆర్‌డిఎఫ్‌ తరఫున డిసెంబర్‌ 3న (అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం) సందర్భంగా చండీఘర్‌లో తలపెట్టిన సభ గురించి సమాచారం ఇంకా అందాల్సి ఉన్నది.

గడ్చిరోలీ కేసులో ముద్దాయి అయిన అంగ వైకల్యం గల హేమే మిశ్రా, హేమల్కట్‌ (గడ్చిరోలీ జిల్లా) ప్రకాశ్‌ ఆమ్టే వైద్యశాలకు వెళ్తుండగా బలార్షాలో 2013 ఆగస్టు 20న అరెస్టు కేంద్ర, మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసారు. రెండు రోజులు అక్రమ నిర్బంధం, చిత్రహింసల తర్వాత 22 ఆగస్టున కోర్టులో హాజరు పరచి మళ్లీ సెప్టెంబ్‌ర్‌ 21వరకు పోలీసు కస్టడీకి తీసుకొన్నారు. ఈలోగా సెప్టెంబర్‌ 1న రాయపూర్‌లో అరెస్టు చేసిన ప్రశాంత్‌ రాహిని (జర్నలిస్టుతో) కూడా హేమ్‌మిశ్రాతో కలిపి కోర్టులో హాజరుపరచారు. ప్రశాంత్ రాహి జర్నలిస్టు. అప్పటికే ప్రశాంత్‌ రాహీ దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్‌ రాజకీయ విడుదల కోసం జైళ్లకు, కోర్టులకు తిరుగుతున్నాడు. ఆ క్రమంలో సీనియర్‌ రాచకీయ ఖైదీ నారాయణ సన్యాల్‌ను కలవడానికి రాయపూర్‌కు వెళ్లాడు. కాని ఆయనను కూడా హేమ్‌ మిశ్రాతో పాటు విజయ్‌ టిర్కీ ఇతర ఆదివాసీల సహాయంతో గడ్చిరోలీ అడవుల్లో నర్మదక్కను కలవడానికి పోతుండగా అరెస్టు బలార్షాలో అరెస్టు చేసినట్లు హేమ్‌మిశ్రా దగ్గర మావోయిస్టు పార్టీ కార్యదర్శికి ప్రొ. సాయిబాబా పంపుతున్న చిప్‌ దొరికిందన్న ఆరోపణచేశారు.

హేమ్‌ మిశ్రాను నెలరోజులు, ప్రశాంత్‌రాహీని పదిరోజులు పోలీసు కస్టడీలో మానసికంగా చాలా వేధించారు. హేమ్‌మిశ్రాను శారీరకంగా కూడా వేధించారు.

2014 జనవరి 8న ప్రొ. సాయిబాబా ఉండే గ్వైర్‌హాల్‌ సెర్చ్‌ కోసం వారంటు తీసుకున్నారు. ప్రొఫసర్‌ అంతకుముందే 23 ఆగస్టున ఉత్తరాఖాండ్‌లో జరిగిన ఒక సభలో గాయపడినాడు.

విజయ్‌ టిర్కీ (పది సంవత్సరాల శిక్ష)ని కొరియర్‌గా చూపి శిక్ష వేసారు. పాండు మహేశ్‌లకు, ఆదివాసులకు సాయిబాబా, ప్రశాంత్‌ రాహీ, హేమ్‌మిశ్రాలతో పాటు యావజ్జీవ శిక్ష వేసారు. సాయిబాబా, మహేశ్‌, సాంగులను నాగపూర్‌ జైలులో ఉంచి మిగతా ముగ్గురిని అమరావతి (మహారాష్ట్ర) జైలుకు తరలించారు. అక్కడి నుంచి హేమ్‌మిశ్రాను ఒక్కణ్నే నాసిక్‌ జైలుకు తరలించారు. అక్కడ ఆయనను మావోయిస్టులు జైలు నుంచి విడిపించే ప్రమాదం ఉందని కొల్లాపూర్‌ జైలుకు బదిలీ చేసారు. ఈ విధంగా హేమ్‌మిశ్రాను మూడు సార్లు జైళ్లు తరలించారు.

హేమ్‌మిశ్రాది ఉత్తరాఖాండ్‌లో అల్మోడా పట్టణం.అక్కడ ఆయన తండ్రి చిన్న ఉద్యోగస్తుడు. హేమ్‌మిశ్రాను చూడటం కొరకే వారి తల్లితండ్రులు ఢిల్లీకి మారారు. వారికీ ఇంత దూరం రావడం చాల కష్టాంగా ఉన్నది. . మిశ్రా బెయిలు ఉన్న రోజుల్లో ప్రతి ఆదివారం ఢిల్లీ జెఎన్‌యు నుంచి అక్కడికి వెళ్లి పోలీసు స్టేషన్‌లో సంతకం పెట్టాల్సి వచ్చింది.అదే సమయంలో కోర్టు వాయిదాలకు గడ్చిరోలికి రావల్సి వచ్చేది. ఎప్పుడు కూడా ఆయనకి ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదు.

No. of visitors : 628
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


Release the injured RK and 9 adivasis, the prisoners of war, and respect the international law - Varavara Rao

Revolutionary Democratic Front | 02.11.2016 08:17:41am

This Encounter was called ʹOperation RKʹ, it is in fact operation mining of rich minerals in AOB area. This hunt of adivasis and Maosists is infact the thir...
...ఇంకా చదవండి

Boycott (World) Social Forum, a Safety Valve for Imperialism

Revolutionary Democratic Front (RDF) | 30.07.2016 03:00:30pm

RDF calls upon the people to boycott the (world) Social Forum, being held in Canada and all the related forums and preparatory meetings etc. including Hyd...
...ఇంకా చదవండి

Let us build a broad united democratic movement to demand for the release of Prof. G.N. Saibaba and Others : Varavara Rao

Revolutionary Democratic Front | 10.03.2017 02:31:45pm

RDF appeals to the people, democratic organizations, individuals, mass organizations and political parties to build a broad united democratic movement to de...
...ఇంకా చదవండి

Freedom and Justice for GN Saibaba!

Popular Resistance | 16.03.2017 06:56:07pm

The Popular Resistance – Left Anti-imperialist Cooperation condemns this decision of the Indian court. We send our unequivocal support to GN Saibaba, his co...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఈవ్ టీజింగ్ సాకు తీసుకొని మొత్తం దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం అమానుషం
  సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రొమిలా థాపర్‌ తదితర పిటిషన్‌దారుల పత్రికా ప్రకటన
  Self mortality
  దు:ఖం చేత దు:ఖం కొరకు దు:ఖం వలన
  నుల్క‌తోంగ్ నిజాలు
  అప్పుడు
  ఎలా కలవాలి ?
  నిన్న- నేడు - రేపు
  జాషువా సాహిత్యంలో , కులం - మతం సామాజిక దృష్టి
  ముందు బాక్సైట్‌ సంగతి చూడండి
  మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...
  దేశద్రోహ నేరం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •