ఎవరి ప్రాభవం తండ్రీ..

| సంభాషణ

ఎవరి ప్రాభవం తండ్రీ..

- పాణి | 13.12.2017 12:07:49pm

ధిక్కారమే రచన - 7

ఒకటా.. రెండా.. ఏకంగా 50 కోట్ల రూపాయల సంబరాలు. లైటింగ్‌కే రెండు కోట్లు వెచ్చిస్తున్నారట. ఆ దేదీప్యమాన కాంతుల్లో కళామతల్లి పులకించిపోవాల్సిందే. లేదా కళ్లు చెమర్చి బైర్లు కమ్మాల్సిందే. తెలంగాణ వంటకాల పేరుతో మానవజాతి ఇంత వరకు తిన్న అన్ని రుచులూ వడ్డిస్తారట. ఇక దుప్పట్లకు, పూల దండలకు ఎన్ని కోట్లో మరి. లెక్క తేలలేదు. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. పేరున్న కవి పుంగవులందరు ఘనమైన సర్కార్‌వారి ముందు మెడలు వంచాల్సిందే. రెండు భుజాలు ఒద్దికగా ఒక కడ చేర్చి వినయంగా దుప్పట్లు కప్పించుకోవాల్సిందే. ఈ సభల తర్వాత ఎప్పటికైనా మిగిలి ఉండేది, ఉపయోగపు విలువ ఉన్నదీ శాలువాలకే. తక్షణ ప్రయోజనం కూడా ఉంటుంది. అసలే చలి కాలం.. అందునా హైదరాబాదు. దేశ దేశాల నుంచి వచ్చే తెలుగు కవివరేణ్యులందరికీ చివరాఖరికి దక్కేది ఈ దుప్పట్లే. పళపళలాడే శాలువాలు చుట్టుకొని మన కవితా వధూటి ఎంత మురిసిపోనున్నదో. చరిత్రలో ఎందరు కవి రాజులు ! ఎందరు రాజపోషకులు లేరు! ప్రజలను, కవులను, కవిత్వాన్ని ఏలిక మహారాజులు మరెందరు లేరు! కవిత్వానికి ఆ రోజుల్లోనైనా ఇంత వైభోగం పట్టిందా? లేదే.. ఈ ప్రాభవం సరిగ్గా ఈనాటిదే.

తెలుగు కవులు.. అందునా తెలంగాణ కవులు ఇంత కాలం మట్టిని నమ్ముకొని బతికారు. మట్టి మీద రాశారు. మట్టి మనుషులతో కలిసి నడిచారు. వాళ్ల మొరటు ధిక్కారాలకు కవితా రూపాన్నిచ్చారు. అందులో ఏం ప్రాభవం ఏడ్చింది? నెత్తురూ కన్నీరింకిన మకిలి వాసన తప్ప. ఇప్పుడు చూడండి.. అందమైన వేదికలపై కవిగానం. పసందైన బృందగీతం. లట్టలు కొడుతూ కళాస్వాదనం. మరి దక్కేనా ఎన్నటికైనా. ఎంత కోల్పోయాం.. జుర్రుకుందాం.. ఒకేసారి నాలుగు చేతులతో. ఏమో అనుకున్నాంగాని ఎంత వైభవం? సాహిత్యమూ, సర్కారూ కలవడమే గొప్ప ప్రాభవం. ఇది మరెక్కడైనా వస్తుందా? వాడు మల్లన్న సాగర్‌లో మనుషుల్ని ముంచెయ్యనీ, ఈ తరపు అద్భుత మహిళ శృతిని ఘోరంగా చంపేయనీ, నిస్సిగ్గుగా ట్రంపుగారి కూతురికి పాదాభివందనం చేయనీ, ఆమె నడిచినంత మేర పేదలు, బిచ్చగాళ్లు కనిపించకుండా ఊరవతలికి తోసేస్తే తోసేయనీ, కల్తీలేని వలసాంధ్ర పాలనే కొనసాగించినా మన రాష్ట్రం మనకొచ్చింది కాబట్టి ధర్నా చౌక్‌ ఎత్తేస్తే ఎత్తేయనీ.. వాడేం చేస్తే మనకేం.

కోట్లు కోట్లు గుమ్మరించి యాగాలు చేస్తే మాత్రం మన కవి సభకూ అంతకంటే ఎక్కువ ఇవ్వడం లేదా? రైతుల కష్టానికి ఎరగనీ రాకపోతే రాకపోనీగాక అందంగా మన కవివరేణ్యుల పుస్తకాలు అచ్చవుతున్నాయి కదా? మానవజాతి తలకెత్తుకొనే ఆళ్వారుస్వామి, కాళోజీ, భాగ్యరెడ్డీవర్మ, సురవరం ప్రతాపరెడ్డి ఫెక్సీల్లో దొరవారి బమ్మే పెద్దగా ఉంటే మాత్రం మనమెందుకు కించపడాలి. వాటినలా వేలాడదీయడమే కళావిష్కరణ అనుకుందాం. కవి రచయితలకు ఎన్నడు ఇంత వైభోగం పట్టిందని చంకలెగరేద్దాం. ఈ నాలుగు రోజులూ కవి రాజ్యమేనని ఆనందిద్దాం. మన ఆనందమే లోకపు ఆనందం. మన వైభోగమే జాతి వైభోగం. రచయితలం కదా? ఏమైనా చెప్పగలం. ఎంతయినా వర్ణించగలం. గొంతులు తెగకోసే కత్తులకు చందన పరిమళం అద్దగలం. నిన్నటి కవిత్వానికే కొత్త చరణాలను జోడించగలం. లేదా నిన్నటి రచనకే కొత్త టీకాటిప్పణి రాసేయగలం. దాన్నీ దీన్నీ కలిపి సర్కారువారితో యుగళగీతం పాడేయగలం. ఆహా ఏం ప్రాభవం, ఏం తలపోత వైభవం.. అంటూ చిందులేయగలం. తెలిసినదాన్ని తెలియనట్టుగా నటించగలం. కొత్త పాండిత్యం సునాయాసంగా అలవర్చుకోగలం. దానా దీనా అవసరానికి తగినట్టు వ్యాఖ్యానించగలం. మన అవసరమే లోకం అవసరమనే మిథ్యా ప్రపంచాన్ని వాస్తవ జగత్తుగా నిర్మించగలం. కించింత్‌ స్వీయ పరిశీలన లేకుండా ఎదుటివాళ్ల మీదికి ఎదురు దాడి చేయగలం. దాని కోసం మన భాషా నైపుణ్యాన్నంతా వెచ్చించగలం. మనలోని అగాథాలను, బిలాలను మర్చిపోయి గుండు సూదితో ఎదుటివాళ్లను గాయపరిచే దుస్సాహసానికి ఒడిగట్టగలం. ఇంతా చేసి అవతలివాళ్లను ఎదుర్కొనేది ..భాషా సాహిత్యాలు సమాజానివి.. వీటిలో రాజ్యం జోక్యం తగదనే చిన్న విషయం స్వచ్ఛందంగా మర్చిపోవడానికే. ఈ వేలంవెర్రినంతా, అసంబద్ధ జాతరనంతా,అనుత్పాదక క్రీడనంతా తెలంగాణ భాషా సాహిత్య ప్రాభవమని నిస్సిగ్గుగా ప్రచారం చేయడానికే.





No. of visitors : 362
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార స్వరాలకు ఆహ్వానం

virasam | 09.12.2017 10:13:47am

ప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ...
...ఇంకా చదవండి

గుండె గుర్తులు వెతుక్కుంటూ

అశోక్ కుంబము | 13.12.2017 11:37:22am

సాలు సాలులో సాగు వీరులు వరిగి పోతుంటె నీ కలంలోకి ప్రవహించిన రైతన్నల వెచ్చటి నెత్తురు అప్పుడే గడ్డకట్టిందా?! ఆపదలో అభయాన్నిచ్చే అక్షర సాహస విత్తనాలు భూమిన...
...ఇంకా చదవండి

వెలివేయబడ్డ అక్షరం

వెంకట్ కొండేటి | 13.12.2017 11:59:44am

అంటరానితనంతో వెలివేసిన నా అక్షరాల్ని ధిక్కార స్వరాలు చేసి నీ ʹజాత‌రʹలో నిన‌దించాల‌ని ఉంది...
...ఇంకా చదవండి

తెలంగాణ, తెలుగు మహా సభలు

పాణి | 05.12.2017 11:14:23pm

భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇం...
...ఇంకా చదవండి

కవి ఎక్కడ?

పాణి | 09.12.2017 11:50:36pm

కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా?...
...ఇంకా చదవండి

బుద్ధిజీవుల క‌ర్త‌వ్యం

వరవరరావు | 16.12.2017 06:17:47pm

పోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైనన...
...ఇంకా చదవండి

క‌ళావేత్త‌లారా! మీరేవైపు?

మాగ్జిం గోర్కి | 16.12.2017 09:39:01pm

1932లో అమెరికా జ‌ర్న‌లిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ( సృజ‌న ప‌త్రిక నుంచి )...
...ఇంకా చదవండి

తెలుగు మ‌హాస‌భ‌లు - కొన్నిబుల్పికలు

బమ్మిడి జగదీశ్వరరావు | 16.12.2017 09:02:30pm

వాళ్ళ చేతుల్లో గడ్డిపూచలున్నాయని అరెస్టు చేస్తరా?ʹ ʹఎందుకు చెయ్యరు?, ఆయుధాలుంటే అరెస్టు చెయ్యరా? ఉప రాష్ట్రపతి చెప్పిన్రు గదేనే?ʹ ʹఏమని?ʹ ʹతెలంగాణల గడ్డిపూ...
...ఇంకా చదవండి

పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాం

విర‌సం | 07.12.2017 12:39:17am

అగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ప్రజా నిరసనను దారి మళ్లిండానికే...
...ఇంకా చదవండి

దీపాలు ఆర్పేసి ప్రతెమ!

బమ్మిడి జగదీశ్వరరావు | 16.12.2017 08:12:48pm

ʹపంతొమ్మిది వందల డబ్బైయ్యయిదులో అంతే కదా? జలగం వెంగళరావు వారసత్వం..!ʹ ʹదీపాలు యెక్కడ యల్బీ స్టేడియంలోనేనా పెట్టింది..?ʹ ʹకాదు, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    కోలుకొండ దళితుల భూ పోరాటానికి విరసం సంఘీభావం
    అరుణ‌తార - జూన్ 2018 సంచిక‌
    కందికట్కూరు దళితుల దారుణహత్యను నిరసిద్దాం
    కామ్రేడ్ వరవరరావుపై కుట్ర ఆరోపణలను ఖండిస్తున్నాం
    న్యాయంకోసం పోరే వాళ్లకు సంకెళ్లు
    ఈ తీర్పు సారాంశమేమిటి?
    ఆధిప‌త్యంపై అలుపెర‌గ‌ని పోరాటం
    సీమేన్ - వ్యక్తి , ప్రకృతుల నిజదర్శనం
    ఈ దేశం మాకు యుద్ధాన్ని బాకీపడింది
    ఔను... వాళ్లు చామన ఛాయే!
    మునిపటికన్నా విప్లవాత్మకంగా కార్ల్ మార్క్స్
    గాలి కోసం, నీరు కోసం, ఈ భూమ్మీద బతుకు కోసం...

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •