రండి.. రండి..రండీ..!! దయచేయండీ !!!
మీ రాక మాకెంతో.. స్వలాభం సుమండీ !!!
రండి..రండి.. రండీ !!!!
సిగ్గు ఎగ్గు వదిలి.. భేషజాలు వదిలీ !
సిద్దాంతం వదిలి.. వేదాంతం వల్లిస్తూ.. రండి..రండీ..
భావాలు వదులుకోని.. బంధాలు తెంచుకోని..
ముసుగులు తొలగించి.. మురుసూకుంటు రండీ..
రండీ.. రండీ..రండీ !!
అటుఇటూ చూడవద్దు.. వెనుకడుగేయవద్దు..
జెండాలు విసిరేసి.. చంకలు గుద్దుకుంటూ..
రండి..రండి.. రండీ..
పదవూలు కట్టబెడతాం.. పన్నీరు కూడ జల్లుతామ్..
ద్రోహాన్ని బట్టి మీకు.. ధరగట్టి ముట్టజెబుతాం..
రండి.. రండి.. రండీ ..
విలువలు వదిలిపెట్టి.. వడివడిగా ఉరికి రండి..
కత్తిరించుకున్న కులం తోక.. అతికించుకోని రండి..
తెలంగాణ యాస కాదు బాషాన్నోళ్లు.. తెలుగే వెలుగంటు మూసుకుని రండీ..
మూతులు తుడుచుకున్నంత సులువుగా..నీతులు మరచిపోండి
రండీ...రండీ.. రండీ..
అమరత్వాన్ని ఎత్తిపడుతూ ఆర్ద్రత నటించిన... మే.. ధావులారా రండీ.
ఎగిరే ప్రతి జెండా నీడన నక్కిన కళా కారుల్లారా...రండీ
దొరసానీ భజనజేద్దురుగాని..
బొజ్జలు నిండా మెక్కండి..కక్కండీ ..
దొర కాళ్ళు మాత్రం మొక్కండి రండీ..
రండి.. రండి..
రండీ..రండీ..రండీ..
రండీ..రండీ..రండీ..రండీ...
Type in English and Press Space to Convert in Telugu |
ధిక్కార స్వరాలకు ఆహ్వానంప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ... |
నీవునీవేనా?నీ దుఃఖం, ఆగ్రహం ఉబికిన
సందర్భం కింద
నెత్తురింకిన నేల ఉంది కదా?
అవునా? కనిపిస్తోందా?
దాన్నొకసారి తాకి చూడు
నెత్తురు పారించినోడు కనిపిస్తాడు... |
కవి ఎక్కడ? కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా?... |
వెలివేయబడ్డ అక్షరంఅంటరానితనంతో వెలివేసిన
నా అక్షరాల్ని
ధిక్కార స్వరాలు చేసి
నీ ʹజాతరʹలో నినదించాలని ఉంది... |
గుండె గుర్తులు వెతుక్కుంటూసాలు సాలులో సాగు వీరులు
వరిగి పోతుంటె
నీ కలంలోకి ప్రవహించిన
రైతన్నల వెచ్చటి నెత్తురు
అప్పుడే గడ్డకట్టిందా?!
ఆపదలో అభయాన్నిచ్చే
అక్షర సాహస విత్తనాలు
భూమిన... |
పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాంఅగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ప్రజా నిరసనను దారి మళ్లిండానికే... |
తెలంగాణ, తెలుగు మహా సభలు భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇం... |
సుఖ విరోచనం!ʹకవిత్వం యెలా వస్తుందో గవర్నరుగారు చెప్పారు..ʹ
ʹఎలా వస్తుంది?ʹ
ʹసుష్టైన భోజనం.. తాంబూలం.. వుంటే వస్తుందని..ʹ
ʹఏమొస్తుంది.. నిద్రా?ʹ
ʹకాదు, కవిత్వం..!ʹ..... |
బుద్ధిజీవుల కర్తవ్యంపోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైనన... |
కళావేత్తలారా! మీరేవైపు?
1932లో అమెరికా జర్నలిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంటర్వ్యూ( సృజన పత్రిక నుంచి )... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |