ప్రజలను వంచించడానికే ప్రపంచ తెలుగు మహాసభలు!

| సాహిత్యం | వ్యాసాలు

ప్రజలను వంచించడానికే ప్రపంచ తెలుగు మహాసభలు!

- బాసిత్ | 16.12.2017 07:33:38pm

తెగింపుతో, సాహసాలతో, స్వీయ బలిదానాలతో ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారన్న విషయం ఉద్యమ క్రమాన్ని గమనించిన ఎవరికైనా తెలిసిందే. ఎన్నికల సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి , తెలంగాణాకు దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానన్న వాగ్దానాన్ని తుంగలో తొక్కి, తానే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.

ప్రభుత్వం లోకి వచ్చాక ఇతర ఎన్నికల వాగ్దానాలనైనా అమలు చేస్తాడని ఆశపడ్డ యువకులు, రైతులు, నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. రాష్ట్రంలో గంగా-జమునా తెహజీబ్ తెస్తానని వికార్ అహ్మద్ తదితర అండర్ ట్రయల్ ఖైదీలను ఎన్కైంటర్ కథ అల్లి చంపేశారు. మావోయిస్టు ఎజెండానే తమ ఎజెండా అని ఎన్నికల ముందు మాట్లాడి మొద్దుగుట్ట ఎన్కైంటర్ పేరిట భయానకంగా శ్రుతి, సాగర్ లను చంపి తన వర్గ స్వభావాన్ని చాటుకున్నారు. మల్లన్నసాగర్ కోసం దో ఫసల్ పండే భూముల్ని గుంజుకొని రైతులను నిర్వాసితులను చేశారు. ఆదివాసులను ఫారెస్టు సిబ్బంది, పోలీసులతో నానా విధాలుగా వేధిస్తూ ఐదో షెడ్యూల్ ద్వారా వారికి సంక్రమించిన హక్కులను తూట్లు పొడుస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో దళితులపై దాడులకు లెక్కేలేదు. తెలంగాణాలో మంథని, నేరేళ్ల, అభంగపట్నం తాజా ఉదాహరణలు కాగా ఆంధ్ర ప్రదేశ్ లో గరగపర్రు సంఘటన తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో, మొత్తం దేశవ్యాప్తంగానే బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం వెర్రి తలలు వేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణా ముఖ్యమంత్రి యాగాలు, యాదాద్రిలతో రెండాకులు ఎక్కువే చదివానని మోడీని ప్రసన్నం చేసుకోవడం, హిందూ ఓటు కొల్లగొడం వంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నాడు. మరోవైపు ముస్లింలను మభ్యపెట్టే స్కీములు ప్రవేశపెడుతున్నాడు. ఇంకోవైపు పూర్ణ దేవాలయాల పునరుద్ధరణ పేరిట లౌకిక విలువలను ఉల్లంఘిస్తున్నాడు. ప్రజల ప్రజాస్వామిక హక్కులైనటువంటి వాక్, సభా స్వాతంత్ర్యాలను కాలరాస్తున్నారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ ను ఎత్తివేశారు.

అట్లా, ప్రజల పౌర , ప్రజాస్వామిక, లౌకిక, జీవించే హక్కులను కాలరాయడం మాత్రమే కాక ఇప్పుడు వాళ్లు జే.ఏ.సీ.లుగా ఏర్పడి పోరాడి సాధించుకున్న తెలంగాణ కేవలం తమ కర్తృత్వం వల్లనే ఏర్పడింది అనే భ్రమలోకి ప్రజలను నెట్టేప్రయత్నం తాజాగా పాలకులు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజలు

అంతేకాదు, పాటను ఆయుధంగా చేసుకొని, వలస పాలకులపై పోరాడే క్రమంలో సృజించిన పోరాట సాహిత్యాన్నంతా పెద్ద ఎత్తున కొల్లగొట్టి స్వంతం చేసుకోవడానికి ప్రపంచ మహా సభలను వేదికగా చేసుకుంటున్నారని చెప్పాలి.

అంతమాత్రమే కాదు, వేల ఏండ్ల తెలంగాణ ప్రజల జీవితాల్లోంచి వచ్చిన మౌఖిక, లిఖిత సాహిత్యాన్నంతా ఈ సందర్భంగా పాలక ముద్ర వేసుకొని ప్రజల చరిత్రను తమ చరిత్రగా కో-ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. అయితే ఆ ఆటలు సాగవని చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల చరిత్ర ఎట్లాగు పాలకులది కాదు. అట్లాగే ʹరాజుల చరిత్ర ప్రజలది అంటే, చెల్లదు.. చెల్లదుʹ అని విప్లవ కవి చెరబండరాజు చెప్పింది, పాలకులకు గుర్తు చేయవలసిన అవసరం ఉంది.

ఇంకో వైపు, ఉద్యమ సందర్భంలో ప్రజల వైపు నిలబడినామని చెప్పుకున్నావారు పాలక పంచన చేరడమేమిటి? చదివిన చదువుకు ఉద్యోగం లభిస్తుందన్న హామీ ఇవ్వడం మానేసి కే.జీ. టు పీజీ ఇంగ్లీషు మీడియం అంటున్న పాలకుల వల్ల తెలుగు బతుకుతుందని నమ్మి , వారి దరి చేరారా? ప్రజల రక్త మాంసాలు పీల్చి, ప్రపంచ బేహారులకు నంజుకునే ఏర్పాటు చేస్తున్న పాలకుల వల్ల ఒరిగేదేమిటని భావిస్తున్నారు? మొన్ననే అమెరికా అధ్యక్షుడి కూతురు వెంట వచ్చిన ఎంటర్ ప్రిన్యూయర్లతో భేటి ఎందుకయ్యారో తెలియనిదెవ్వరికి? ప్రజల మౌలిక అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు ʹజీ హుజూర్ʹ అంటున్న పాలకుల సభల్లో భాగం పంచుకొనేవారిని ఏమనాలి? కనుక సహజంగానే ʹరచయితలు ప్రజల పక్షమా పాలకుల పక్షమాʹ అనే ప్రశ్న ఉదయిస్తుంది.

మరో వైపు రక్తపు చుక్క కారని తెలంగాణాను వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి తాజాగా టేకులపల్లి ʹఎన్కౌంటర్ʹ తన పాలక వర్గ నైజాన్ని ప్రపంచ తెలుగు మహాసభల ముంగిట చాటుకున్నారు. ఇంతకన్నా ఇంకేం నిర్ధారణలు కావాలి, పాలకుల చిత్తశుద్ధిని అర్థం చేసుకోవడానికి?

కనుక ప్రజల్ని వంచించడానికే ప్రపంచ తెలుగు మహాసభల పటాటోపాలని చెప్పక తప్పదు.

అందువల్ల, ఫ్యూడల్ విలువలను ఎత్తి పడుతూ,పెట్టుబడి సంచయిత పొగరుతో కవులూ, రచయితలను తమ వైపు తిప్పుకోవాలనుకుంటున్న బ్రాహ్మణీయ ఫాసిస్టు పాలక సభలను బహిష్కరించాల్సిందే.





No. of visitors : 371
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార స్వరాలకు ఆహ్వానం

virasam | 09.12.2017 10:13:47am

ప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ...
...ఇంకా చదవండి

గుండె గుర్తులు వెతుక్కుంటూ

అశోక్ కుంబము | 13.12.2017 11:37:22am

సాలు సాలులో సాగు వీరులు వరిగి పోతుంటె నీ కలంలోకి ప్రవహించిన రైతన్నల వెచ్చటి నెత్తురు అప్పుడే గడ్డకట్టిందా?! ఆపదలో అభయాన్నిచ్చే అక్షర సాహస విత్తనాలు భూమిన...
...ఇంకా చదవండి

వెలివేయబడ్డ అక్షరం

వెంకట్ కొండేటి | 13.12.2017 11:59:44am

అంటరానితనంతో వెలివేసిన నా అక్షరాల్ని ధిక్కార స్వరాలు చేసి నీ ʹజాత‌రʹలో నిన‌దించాల‌ని ఉంది...
...ఇంకా చదవండి

తెలంగాణ, తెలుగు మహా సభలు

పాణి | 05.12.2017 11:14:23pm

భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇం...
...ఇంకా చదవండి

కవి ఎక్కడ?

పాణి | 09.12.2017 11:50:36pm

కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా?...
...ఇంకా చదవండి

బుద్ధిజీవుల క‌ర్త‌వ్యం

వరవరరావు | 16.12.2017 06:17:47pm

పోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైనన...
...ఇంకా చదవండి

క‌ళావేత్త‌లారా! మీరేవైపు?

మాగ్జిం గోర్కి | 16.12.2017 09:39:01pm

1932లో అమెరికా జ‌ర్న‌లిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ( సృజ‌న ప‌త్రిక నుంచి )...
...ఇంకా చదవండి

పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాం

విర‌సం | 07.12.2017 12:39:17am

అగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ప్రజా నిరసనను దారి మళ్లిండానికే...
...ఇంకా చదవండి

తెగులు సోకిన రచయితలారా రండీ

అభిన‌వ్ బూరం | 13.12.2017 12:49:48pm

విలువలు వదిలిపెట్టి.. వడివడిగా ఉరికి రండి.. కత్తిరించుకున్న కులం తోక.. అతికించుకోని రండి.. తెలంగాణ యాస కాదు బాషాన్నోళ్లు.. తెలుగే వెలుగంటు మూసుకుని రండీ.. మ...
...ఇంకా చదవండి

తెలుగు మ‌హాస‌భ‌లు - కొన్నిబుల్పికలు

బమ్మిడి జగదీశ్వరరావు | 16.12.2017 09:02:30pm

వాళ్ళ చేతుల్లో గడ్డిపూచలున్నాయని అరెస్టు చేస్తరా?ʹ ʹఎందుకు చెయ్యరు?, ఆయుధాలుంటే అరెస్టు చెయ్యరా? ఉప రాష్ట్రపతి చెప్పిన్రు గదేనే?ʹ ʹఏమని?ʹ ʹతెలంగాణల గడ్డిపూ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
    అరుణతార సెప్టెంబర్ - 2018
    యాంటి నేషనల్
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ప్రజాస్వామికవాదుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రకటనలు
    ʹపట్టణ నక్సలైట్లుʹ అంటే ఇలా వుంటారు
    అక్రమ అరెస్టులు, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
    కుట్ర
    ఇప్పటికైనా అర్ధమయిందా....?
    యుద్ధానంతర యుద్ధగీతం
    పోలీసుల నీడలో రాపూరు
    అర్హత

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •