హీనమూ బలహీనమూ!

| సంభాషణ

హీనమూ బలహీనమూ!

- బమ్మిడి జగదీశ్వరరావు | 16.12.2017 08:33:35pm

గల్పిక

ʹప్రపంచ తెలుగు మహాసభలకు యెనిమిది వేలమంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఆహ్వానితులతో కలిసి పదివేలమంది. ఇంకా నలభై రెండు దేశాల నుండి నాలుగువందల యాబై మంది ప్రతినిధులు. ప్రధాన వేదిక యల్బీ స్టేడియంలో ముప్పైయ్యయిదు వేలమంది పడతారు. విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులు వాలంటీర్లు. వీరు గాక పర్యాటక సంస్థ శిక్షణార్హులు ఆరువందలమంది సహాయకులు వుంటారు..ʹ సాహిత్య అకాడమీ చైర్మన్ చెప్పుకుపోతున్నాడు..

ʹఅంతేనా? ముఖ్యమంత్రి యెప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అడిగి తెలుసుకుంటున్నారు. హోంమంత్రి మొదలు అందరు మంత్రులూ ఏమ్పీలూ ఎమ్మెల్యేలూ ఎమ్మెల్సీలూ అధికారులూ.. పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం.. వేలమంది పోలీసులూ.. ఇంకా ఇంటలిజెన్స్ మొత్తం.. ప్రపంచ తెలుగు మహాసభల మీద దృష్టిని కేంద్రీకరించారు..ʹ మరో అధికారి చెప్పుకుపోతున్నాడు..

ʹదేశ ఉప పౌరుడు తొలిరోజు.. ప్రధమ పౌరుడు ఆఖరు రోజు హాజరవుతున్నారు. ఇంకా మన గవర్నరూ మహారాష్ట్ర గవర్నరూ.. వివిధ రాష్ట్రాల నుండి..ʹ యింకో నాయకుడు చెప్పుకుపోతున్నాడు..
అప్పుడే వో యువకుడు నల్లని యింకు ముఖానికి పులుముకున్నాడు. కలం తీసి నేలకు గుచ్చాడు. మట్టిలోకి దిగిన పాళీ చీలింది. చీలుతూ వేళ్ళూనుకుంది. కలం చూస్తుండగానే ఆకుపచ్చగా మారి మొలకెత్తిన మొక్కైంది. చేతులు చాస్తూ చెట్టైంది. దాని ఆకుల నిండా అక్షరాలే. కథలే. కవిత్వమే.
సభలకొచ్చిన సాహిత్యకారులు వొక్కో ఆకుని తెంపి అక్షరాల్ని చదువుకున్నారు. అన్నిటిమీదా వొక్కటే రాత.

ʹమేం పిడికెడు మందిమి. మీతో మాకుభిన్నాభిప్రాయం వుంది. మేం ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిస్తున్నాం. ఆ మాట అన్నందుకే అరెస్టులు చేస్తున్నారు. మా నిరసన మేం చెప్పినందుకే అరెస్టులు చేస్తున్నారు. మేమెంత? పిడికెడు! పట్టుమని పదిమందిమి! భిన్నాభిప్రాయం లేనిది ప్రజాస్వామ్యమా? భిన్నాభిప్రాయం లేనిది ప్రజాస్వామిక సాహిత్యమా? మీరు సాహిత్యకారులా? సర్కారుదాసులా?ʹ
అంతే.. పోలీసులు వొక్క ఆకూ వోదలకుండా ఆకులన్నీ తెంపేసారు. ఆ సాహిత్య వృక్షాన్ని తవ్వి తెసేసారు. సభలు నిర్వహించారు!

ఎక్కడో పచ్చని మొక్క మళ్ళీ మొలకలేసింది!*





No. of visitors : 217
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార స్వరాలకు ఆహ్వానం

virasam | 09.12.2017 10:13:47am

ప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ...
...ఇంకా చదవండి

గుండె గుర్తులు వెతుక్కుంటూ

అశోక్ కుంబము | 13.12.2017 11:37:22am

సాలు సాలులో సాగు వీరులు వరిగి పోతుంటె నీ కలంలోకి ప్రవహించిన రైతన్నల వెచ్చటి నెత్తురు అప్పుడే గడ్డకట్టిందా?! ఆపదలో అభయాన్నిచ్చే అక్షర సాహస విత్తనాలు భూమిన...
...ఇంకా చదవండి

కవి ఎక్కడ?

పాణి | 09.12.2017 11:50:36pm

కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా?...
...ఇంకా చదవండి

వెలివేయబడ్డ అక్షరం

వెంకట్ కొండేటి | 13.12.2017 11:59:44am

అంటరానితనంతో వెలివేసిన నా అక్షరాల్ని ధిక్కార స్వరాలు చేసి నీ ʹజాత‌రʹలో నిన‌దించాల‌ని ఉంది...
...ఇంకా చదవండి

తెలుగు మ‌హాస‌భ‌లు - కొన్నిబుల్పికలు

బమ్మిడి జగదీశ్వరరావు | 16.12.2017 09:02:30pm

వాళ్ళ చేతుల్లో గడ్డిపూచలున్నాయని అరెస్టు చేస్తరా?ʹ ʹఎందుకు చెయ్యరు?, ఆయుధాలుంటే అరెస్టు చెయ్యరా? ఉప రాష్ట్రపతి చెప్పిన్రు గదేనే?ʹ ʹఏమని?ʹ ʹతెలంగాణల గడ్డిపూ...
...ఇంకా చదవండి

తెలంగాణ, తెలుగు మహా సభలు

పాణి | 05.12.2017 11:14:23pm

భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇం...
...ఇంకా చదవండి

క‌ళావేత్త‌లారా! మీరేవైపు?

మాగ్జిం గోర్కి | 16.12.2017 09:39:01pm

1932లో అమెరికా జ‌ర్న‌లిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ( సృజ‌న ప‌త్రిక నుంచి )...
...ఇంకా చదవండి

బుద్ధిజీవుల క‌ర్త‌వ్యం

వరవరరావు | 16.12.2017 06:17:47pm

పోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైనన...
...ఇంకా చదవండి

ప్రతివాది

పాణి | 11.12.2017 12:04:02pm

ఎవరో గీచిన గళ్లలో కవిత్వం రాయని కవులు లోకపు గళ్లలో మాత్రం ఎందుకు ఉంటారు? లోకపు విధి విధానాలను, రీతి రివాజులను తిరస్కరిస్తారు. ఈ లోకపు మంచి మన్ననలను తోసిపుచ్...
...ఇంకా చదవండి

పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాం

విర‌సం | 07.12.2017 12:39:17am

అగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ప్రజా నిరసనను దారి మళ్లిండానికే...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    విరసం 26వ మహాసభల్ని విజయవంతం చేసిన పాలమూరు ప్రజలకు, ఆహ్వానసంఘానికి, సాహితీ మిత్రులకు, ప్రజాసంఘాలకు కృతజ్ఞతలు
    అరుణతార జనవరి - 2018
    బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని ఓడిద్దాం
    విప్లవ రచయితల సంఘం 26వ మహా సభలను విజయవంతం చేద్దాం
    సుఖ విరోచనం!
    కాడిని వొదిలేశాక
    కవిగానం
    సభా దీక్ష
    న్యాయమూ ప్రత్యామ్నాయమూ!
    UNDEMOCRATIC METHODS OF APSIB
    పసిపాపలా౦టి భాష...
    క‌ళావేత్త‌లారా! మీరేవైపు?

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •