తెలుగు మ‌హాస‌భ‌లు - కొన్నిబుల్పికలు

| సాహిత్యం | స‌మీక్ష‌లు

తెలుగు మ‌హాస‌భ‌లు - కొన్నిబుల్పికలు

- బమ్మిడి జగదీశ్వరరావు | 16.12.2017 09:02:30pm

బమ్మెర, c/oకంచెన్ బాగ్

ʹధిక్కార స్వరానికి ప్రతీకగా నిలిచిన బమ్మెర..ʹ కొనియాడారు ముఖ్యమంత్రి!
ʹప్రశ్నించే సాహిత్యం.. ప్రతిఘటించే సాహిత్యం.. తెలంగాణలో యెక్కువ..ʹ కొనియాడారు ఉప రాష్ట్రపతి!
నిరూపిస్తూ బమ్మెరని తీసుకువెళ్ళి కంచెన్ బాగ్ పోలీస్టేషన్లో పెట్టారు పోలీసులు! *

సత్య నిరూపణ!


ʹసందర్భం వస్తే కవులు దీటైన విమర్శ చేస్తారు. ఎవరికీ బెదరరు. భగవంతుడికి కూడా విడిచిపెట్టరుʹ అని- ʹపాల సంద్రంలోన పవ్వలించెడివాడు- పరుల యిండ్ల పాలు కోరనేల?ʹ అని- ʹసన్మానాలకూ సత్కారాలకూ లొంగరుʹ అని- పద్యాన్నిసభాముఖంగా వివరించారు కేసీఆరు!
ʹప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిస్తున్నాం..ʹ అంటూ బెదరకుండా ప్రభుత్వాన్ని విమర్శించారు కవులు!
కవుల్ని భయపెట్టాలని అరెస్టు చేసి తాను భగవంతుడికన్నా యెక్కువ కాదని అనుభవ ముఖంగా తెలుసుకున్నారు కేసీఆరు!*

ఇప్పటికీ వాళ్ళేనా?


ʹబ్రిటీషువాళ్ళు యేలే కాలంలో వుద్యోగాలకూ యింగ్లీషుకూ ముడిపెట్టారు. అందుకే యింగ్లీషు అంటే అంత మోహం.. దాహం..ʹ చెరిగేసినట్టు చెప్పుకుపోతున్నారు వుప రాష్ట్రపతి.
ʹఇప్పటికీ బ్రిటీషువాళ్ళే మనల్ని పాలిస్తున్నారా డాడీ..?ʹ మా అబ్బాయి అడిగాడు.

ఎన్కౌంటర్లు!


ʹపాము తన పిల్లల్ని తానే తినేస్తోంది!ʹ
ʹఏమొస్తది?ʹ
ʹబంగారు తెలంగాణ!ʹ

అరెస్టులు!


ʹతన గొయ్యి తానే తవ్వుకుంటున్నడు!ʹ
ʹఎలా?ʹ
ʹరచయితల్ని అరెస్టుజేసి ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతున్నడు!ʹ

పురా నీతి!


ʹతెలుగు భాష తల్లివంటిది!ʹ
ʹఆంగ్లభాష తండ్రివంటిది!ʹ
ʹఇంటి పెద్దగా తండ్రి మాట తల్లి వినడమే మన సాంప్రదాయం!ʹ

కార్యకారణం!


ʹవాళ్ళ చేతుల్లో గడ్డిపూచలున్నాయని అరెస్టు చేస్తరా?ʹ
ʹఎందుకు చెయ్యరు?, ఆయుధాలుంటే అరెస్టు చెయ్యరా? ఉప రాష్ట్రపతి చెప్పిన్రు గదేనే?ʹ
ʹఏమని?ʹ
ʹతెలంగాణల గడ్డిపూచకూడా కృపాణమేనని!ʹ

కందʹమూలాలుʹ!


ʹబాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ʹ పద్యం పాడి స్వేచ్ఛానువాదం చేసిండు కేసీఆర్. ʹకవులు ప్రభువులకు అమ్ముడుపోవుడు కంటే కందమూలాలు తినుడు బెటర్ అన్నడు మన పోతన..ʹ అని భావం కూడా విప్పి చెప్పిండు. అదేమాట చెప్పి ప్రభువునూ ప్రపంచ తెలుగు మహాసభలనూ కాదని- అమ్ముడుపోమని- కవులు కొందరు కందమూలాలు వెతుకుతూ అడవికిపోయారు. పుట్టతేనేలతో జీవించబోయారు. అయితే అక్కడ ఎన్కౌంటర్ జరిగింది!!*

ఎవరువాళ్ళు?


ʹకొత్త రాష్ట్రంల తొలిసారి ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతున్నం. ఇంత వరకూ వివక్షకు గురైంది చాలు. ఇకనైనా కవులకూ రచయితలకూ భాషా సాహితీవేత్తలకూ అందరికీ సముచిత స్థానం కల్పించాలె!ʹ
ʹసభల్ని ఆదిశగానే నడుపుతున్నంʹ
ʹరాష్ట్రం యేర్పడేదానికి కారణమై బలవన్మరణాలకు పాల్పడిన పదిహేనువందలమందిల వొక్కర్ని కూడా తలవనే లేదు, కొలవనే లేదు?ʹ
ʹఏం మాట్లాడుతున్నవ్.. వాళ్ళంతా తెలుగు సాహిత్యకారులా?ʹ

కార్పొʹరేట్స్ʹ!


ʹతరగతి గది.. తరగని నిధిʹ
ʹయస్.. ఏసీనా? నానేసీనా?ʹ
ʹవ్వాట్?ʹ
ʹతరగతి ఏసీ అయితే వన్నెండాఫ్ లేక్.. నానేసీ వన్ ట్వంటీ పడుతుంది!ʹ*

రచʹఈతలుʹ!


ʹప్రపంచ తెలుగు మహా సభలకు నాకు ఆహ్వానం వచ్చింది.. సభలు విజయవంతమవ్వాలి. తెలుగును పునర్జీవింపజెయ్యాలిʹ
ʹప్రపంచ తెలుగు మహా సభలకు నాకు ఆహ్వానం రాలేదు.. తెలంగాణ వచ్చినా వివక్ష కొనసాగుతుంది. అందుకే మేం సభల్లో పాల్గొనడం లేదుʹ
ʹమేము ఆనాడూ యీనాడూ యేనాడూ ప్రపంచ తెలుగు మహా సభలను బహిష్కరిస్తూనే వున్నం. ఇక్కడ జరిగినా. ఎక్కడ జరిగినా. రాజ్యం రంగు మారనంతవరకుʹ
ʹమేం సభల్లో పాల్గొంటాం. ఎన్కౌంటర్లని ఖండిస్తాం. అరెస్టులని ఖండిస్తాం. ప్రభుత్వంతో కలిసి ప్రజాస్వామికంగా తెలుగు భాషకోసం ముందడుగు వేస్తాంʹ*

తెలుగు వెలుగులు!


ʹప్రపపంచ తెలుగు మహాసభలవల్ల చాలా బెనిఫిట్స్ వున్నాయి..ʹ
ʹఏం వున్నాయ్? నాలుగు కాకపోతే ఐదు రోజుల్లో యాబై కోట్లు బొక్క..ʹ
ʹదట్స్ స్మాల్ అమౌంట్ ఫర్ టెలుగు లాంగ్వేజ్ ఫర్ గవర్నమంట్.. లాటాఫ్ పర్పజ్ యీజ్ దేర్..ʹ
ʹవేర్..?ʹ
ʹకాంట్రాక్టర్లకూ.. క్లాత్ షోరూమ్లకూ.. ఈవెంట్ మేనేజర్లకూ.. హోటళ్ళకూ.. టీవీ పేపర్ మీడియా వాళ్ళకూ.. బెస్ట్ రెవెన్యూ. బై ద బై గర్నమెంటుకు గుడ్ పబ్లిసిటీ..ʹ*

భాష చాలదు!


ʹఅ ఆ ఇ ఈ ఉ ఊ ఋ రూ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అహా.. క ఖ ఫ ఘ ఇజ్న చ ఛ జ ఝ ఇజ్న ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష బండీరాʹ
ʹమనాడికి తెలుగు యెంత బాగా వచ్చేస్తోందో..?ʹ మురిసిపోయింది తల్లి.
ʹక. క కు దీర్ఘమిస్తే కా... క కు సున్నా పెడితే కం. క కు రెండు సున్నాలు పెడితే కహాʹ
ʹమాతృభాషను నేర్చుకుంటుంటే నా మాతృహృదయం వుప్పొంగుతోందండీʹ పొంగిపోయింది తల్లి.
ʹఎంత తెలుగు వొచ్చినా కొత్తగా ఏం చదువుతాడు? ఈనాడూ సాక్షీ ఆంధ్రజ్యోతి యివేగదా చదవాలి? వాళ్ళేం రాస్తే అదేగదా చదవాలి!ʹ

వహ్.. తెలుగు.. వా!


ʹకుక్క వచ్చింది!ʹ
ʹఅమ్మ వచ్చింది!ʹ
ʹనాన్న వచ్చాడు!ʹ
ʹదేవుడు వరమిచ్చాడు!ʹ

మాన్యశ్రీ


ʹమాన్యం అంటే?ʹ
ʹపన్ను కట్టక అనుభవించినట్లు సన్మానించి యియ్యబడిన భూమి- అని అర్థంʹ
ʹశ్రీ అంటే గౌరవసూచికం కదా?ʹ
ʹలక్ష్మి, సరస్వతి, సంపద, ఐశ్వర్యము, కీర్తి, బుద్ది, అలంకారము, గౌరవ సూచికమే కాక విషం అని కూడా..ʹ
ʹసరే, రచయితలు మాన్యులు కాదుగాని, రాజకీయనాయకులందర్నీ మాన్యులే అంటున్నారు..ʹ
ʹఏమో .. నాకవన్నీ తెలీదు, మాన్యాలు దొబ్బినవారిని మాన్యశ్రీలాంటారని నాకర్థమయ్యిందిʹ

దాశరధీ పయోనిధీ!


ʹదొరా.. మీరు మెచ్చే నిజాము ప్రభువును యెంతగానో తూలనాడుతున్నాడు..ʹ
ʹఎవడు వాడు?ʹ
ʹఎవరో కవి దాశరధి అట..!ʹ
ʹఎవరక్కడ? నిజామును వ్యతిరేకించడమంటే మమ్ములనూ వ్యతిరేకించడమే.. అరెస్ట్ హిమ్!ʹ

మనవి


మనకు ʹగల్పికʹ అని ప్రక్రియ వుంది. గల్పిక కన్నా అల్పముగా వుండేదాన్ని ʹఅల్పికʹ పేరుతో కొడవటిగంటి కుటుంబరావుగారు ప్రయోగాలు చేసారు. అల్పిక కన్నా స్వల్పముగా వున్నదాన్ని ʹబుల్పికʹగా చేసిన ప్రక్రియా ప్రయోగమిది. ʹబుల్లిʹ అంటే చిన్నది లేదా స్వల్పమైనది. ʹపికʹ అంటే కోకిలము. కలిపి ʹబుల్పికʹలివి. చిన్ని కోయిల కూతలివి!

No. of visitors : 709
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార స్వరాలకు ఆహ్వానం

virasam | 09.12.2017 10:13:47am

ప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ...
...ఇంకా చదవండి

గుండె గుర్తులు వెతుక్కుంటూ

అశోక్ కుంబము | 13.12.2017 11:37:22am

సాలు సాలులో సాగు వీరులు వరిగి పోతుంటె నీ కలంలోకి ప్రవహించిన రైతన్నల వెచ్చటి నెత్తురు అప్పుడే గడ్డకట్టిందా?! ఆపదలో అభయాన్నిచ్చే అక్షర సాహస విత్తనాలు భూమిన...
...ఇంకా చదవండి

వెలివేయబడ్డ అక్షరం

వెంకట్ కొండేటి | 13.12.2017 11:59:44am

అంటరానితనంతో వెలివేసిన నా అక్షరాల్ని ధిక్కార స్వరాలు చేసి నీ ʹజాత‌రʹలో నిన‌దించాల‌ని ఉంది...
...ఇంకా చదవండి

తెలంగాణ, తెలుగు మహా సభలు

పాణి | 05.12.2017 11:14:23pm

భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇం...
...ఇంకా చదవండి

కవి ఎక్కడ?

పాణి | 09.12.2017 11:50:36pm

కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా?...
...ఇంకా చదవండి

పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాం

విర‌సం | 07.12.2017 12:39:17am

అగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ప్రజా నిరసనను దారి మళ్లిండానికే...
...ఇంకా చదవండి

బుద్ధిజీవుల క‌ర్త‌వ్యం

వరవరరావు | 16.12.2017 06:17:47pm

పోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైనన...
...ఇంకా చదవండి

తెగులు సోకిన రచయితలారా రండీ

అభిన‌వ్ బూరం | 13.12.2017 12:49:48pm

విలువలు వదిలిపెట్టి.. వడివడిగా ఉరికి రండి.. కత్తిరించుకున్న కులం తోక.. అతికించుకోని రండి.. తెలంగాణ యాస కాదు బాషాన్నోళ్లు.. తెలుగే వెలుగంటు మూసుకుని రండీ.. మ...
...ఇంకా చదవండి

క‌ళావేత్త‌లారా! మీరేవైపు?

మాగ్జిం గోర్కి | 16.12.2017 09:39:01pm

1932లో అమెరికా జ‌ర్న‌లిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ( సృజ‌న ప‌త్రిక నుంచి )...
...ఇంకా చదవండి

సుఖ విరోచనం!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.12.2017 11:58:32pm

ʹకవిత్వం యెలా వస్తుందో గవర్నరుగారు చెప్పారు..ʹ ʹఎలా వస్తుంది?ʹ ʹసుష్టైన భోజనం.. తాంబూలం.. వుంటే వస్తుందని..ʹ ʹఏమొస్తుంది.. నిద్రా?ʹ ʹకాదు, కవిత్వం..!ʹ.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!
  అయోధ్యకి మళ్ళీ రెక్కలొచ్చినయ్
  రాయలసీమ బతుకు పోరాటం
  మట్టివాసనెపుడూ జీవనోత్సవమే.
  పాలమూరి దుఃఖం
  బతుకు వెతుకులాట లో పాఠకుడికి యెదురయ్యే నిఖార్సైన మానవుడు
  తొలితరం విప్లవ కథకుడు
  స్వేచ్చా స్వప్నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •