మౌలిక ప్రశ్నలు

| సాహిత్యం | వ్యాసాలు

మౌలిక ప్రశ్నలు

- కాకరాల | 16.12.2017 09:21:54pm

ప్రపంచ తెలుగు మహాసభలు ఇది వరకూ జరిగాయి. ʹ ఏ దేశమేగినా ఎందుకాలిడినా నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ ʹ అని పలవరించాయి పరవశించాయి. పరవశించి పలవరించాయి. పులకించి పురా వైభవాన్ని కీర్తించాయి. ఇది పాలకుల దృక్పథం. ʹదేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా, దేశాభిమానము నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్ పూని యేదైనాను, వొక మేల్ కూర్చి జనులకు చూపవోయ్ ʹ అన్నారు మరొకరు. అక్కడితో ఆగక ఆయనే ʹ దేశమంటే మట్టికాదోయ్ , దేశమంటే మనుషులోయ్ ʹ అని హెచ్చరించారు. ఇది ప్రజల దృక్పథం.

ఇక్కడితోనూ ఆగకుండా ʹ లోకమందని మంచి చెడ్డలుʹ లోకులెరుగుదురా? అన్న మౌలిక ప్రశ్నని లోకం ముందు వుంచారు. అంతేకాదు పాలకుల దృక్పథంతో బాషా బేషజాలు, పండిత బాషాపరులది పై చేయైనప్పుడు వారితో విభేదించి "డీసెంట్ నోట్ " రాసిపెట్టి వారి నిర్ణయాన్ని వ్యతిరేకించి బయటకి వచ్చేశారు. మరో మాటలో బహిష్కరించి భావితరాలకు మరుగనిర్దేశం చేశారు. ఆ మార్గానందుకున్న మరో మహాకవి ʹఆశయాలు సంఘర్షించే వేళ ఆయుధం అలీనం కాదుʹ అన్నారు. అని ఆగలేదు కలిసొచ్చిన కవులతో, రచయితలతో, కళాకారులతో తొలి ʹప్రపంచ తెలుగు మహాసభల్నిʹ బహిష్కరించి అరెస్ట్ అయ్యారు. ఇది అచ్చమైన అసలు శిసలు ప్రజాస్వామిక విలువల దృక్పథం. కవులకు, రచయితలకు, కళాకారులకు బాషా ఆయుధం. సాహిత్య కళాప్రక్రియలన్నీ ఆయుధాలే. వీటన్నింటికీ మించి వాటిని ఉపయోగించే వారి ప్రాపంచిక దృక్పథం అతి పెద్ద ఆయుధం. అందుకనే ఆయుధాలాకే ఆయుధమైన, వాహికయినా ʹభాషాʹ విషయంలో మీది ʹ బడిపలుకుల భాషా? పలుకుబడులు భాషా? ముందు తేల్చుకోండి అన్నారు. ముందు చూపుగల మన పెద్దాయన.

ఈ ముందు చూపు గల కళాకారులైతే వాళ్ళు కవులైన, రచయితలైన, గాయకులైన, నటులైన, చిత్రకారుడైన మరెవరైనా లోకమందలి మంచిచెడులెరిగి లోకులకు, ప్రజలకు తెలియజెప్పి కనువిప్పు కల్గించగలరని ఆ పెద్దయాన ప్రగాడ విశ్వాసం. నీతికి, నిజాయితీకి, ధర్మానికి కట్టుబడిన కళాకారుల విద్యుక్తధర్మమది.

అయితే పాలకులు ఇలాంటి సభల సందర్భాలు వచ్చినప్పుడు అతి తెలివిగా ప్రాణస్థానంలో ఉన్న ʹప్రాపంచిక దృక్పథాన్నిʹ కనుమరుగు చేసేసి అలాయి బలాయి వాతావరణంలో అందరినీ ఆకర్షించడంలో సఫలమవుతారు. తొలి ప్రపంచ తెలుగు మహాసభల కాలం నుంచి ఇప్పటి దాకా జరుగుతూవస్తున్నదదే. అందుకు ప్రబలమైన దృష్టాంతం అందరు సందర్బాన్ని ఆసరా చేసుకొని ఏలికని ఎవరెస్టు శిఖరాగ్రాన కూచోబెడుతూవుండటం. ఇది రాజాశ్రయ లక్షణం. ఇంతవరకు జరిగిన అన్ని మహాసభల్లోనూ కనిపించే సారూప్యతిది.

చిత్రంగా ఇది జరగబోతున్న ఈ మహాసభల్లోనూ వినిపిస్తూ కనిపించేలా ఉన్నది. ఈ స్థితి చూసే తొలి తెలుగు ప్రపంచ మహా సభల కాలంలోనే కొ.కు ʹకసాయి వాడు జీవకారుణ్య సభలు పెడితే కారుణ్యం ఉన్నవాళ్ళంతా పరిగెట్టడమేనా?ʹ అన్న మౌలిక ప్రశ్న వేశారు. ప్రాణస్థానములో ఉన్న ప్రాపంచిక దృక్పథ ప్రాధాన్యతను గుర్తు చేశారు.

అప్పుడు మైమరిచి పరుగులు తీసే వారిలో కొందరినైనా కొ.కు ʹమౌలిక ప్రశ్నʹ ఆలోచనలో పడేసి వుంటుంది. ఆలా ఆలోచనలో పడ్డవారిలో కొందరికైనా మాక్సిమ్ గోర్కీ ʹకళాకారులారా ! మీరెటువైపు అన్న మౌలిక ప్రశ్న గుర్తొచ్చి ʹప్రజలవైపా? పాలకుల వైపా? అన్న మీమాంస నుంచి విముక్తులైతే ప్రజల పక్షాన నిల్చి ఉంటారు. ఇది కేవలం వ్యక్తి నిబద్ధతకి సంబంధించింది.

అదే ʹమేక్ హే లైక్ ద సన్ షైన్స్ʹ అనుకున్న వారెందరో మహాసభల్లో మమేకమైవుంటారు. ఇది కేవలం వారి ʹవిజ్ఞతʹ కు సంబందించిన విషయం. ఇప్పుడూ అంతే. ఏమైనా ʹశతాందాః కూపం ప్రవిశంతిʹ అన్నట్టు కాకూడదు.

ʹప్రజలు ప్రజల నుంచి ప్రజలు కొరకు అన్నది అసలైన ప్రజాస్వామ్యానికి గీటురాయి. "ప్రజలు ప్రజలు నుంచి ప్రభువుల కొరకు " గీటురాయి కాకూడదు. ఈ అవగాహనతోనే నేని మహాసభల్ని బహిష్కరిస్తున్నాను.





No. of visitors : 335
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార స్వరాలకు ఆహ్వానం

virasam | 09.12.2017 10:13:47am

ప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ...
...ఇంకా చదవండి

గుండె గుర్తులు వెతుక్కుంటూ

అశోక్ కుంబము | 13.12.2017 11:37:22am

సాలు సాలులో సాగు వీరులు వరిగి పోతుంటె నీ కలంలోకి ప్రవహించిన రైతన్నల వెచ్చటి నెత్తురు అప్పుడే గడ్డకట్టిందా?! ఆపదలో అభయాన్నిచ్చే అక్షర సాహస విత్తనాలు భూమిన...
...ఇంకా చదవండి

వెలివేయబడ్డ అక్షరం

వెంకట్ కొండేటి | 13.12.2017 11:59:44am

అంటరానితనంతో వెలివేసిన నా అక్షరాల్ని ధిక్కార స్వరాలు చేసి నీ ʹజాత‌రʹలో నిన‌దించాల‌ని ఉంది...
...ఇంకా చదవండి

తెలంగాణ, తెలుగు మహా సభలు

పాణి | 05.12.2017 11:14:23pm

భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇం...
...ఇంకా చదవండి

కవి ఎక్కడ?

పాణి | 09.12.2017 11:50:36pm

కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా?...
...ఇంకా చదవండి

బుద్ధిజీవుల క‌ర్త‌వ్యం

వరవరరావు | 16.12.2017 06:17:47pm

పోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైనన...
...ఇంకా చదవండి

పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాం

విర‌సం | 07.12.2017 12:39:17am

అగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ప్రజా నిరసనను దారి మళ్లిండానికే...
...ఇంకా చదవండి

క‌ళావేత్త‌లారా! మీరేవైపు?

మాగ్జిం గోర్కి | 16.12.2017 09:39:01pm

1932లో అమెరికా జ‌ర్న‌లిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ( సృజ‌న ప‌త్రిక నుంచి )...
...ఇంకా చదవండి

తెగులు సోకిన రచయితలారా రండీ

అభిన‌వ్ బూరం | 13.12.2017 12:49:48pm

విలువలు వదిలిపెట్టి.. వడివడిగా ఉరికి రండి.. కత్తిరించుకున్న కులం తోక.. అతికించుకోని రండి.. తెలంగాణ యాస కాదు బాషాన్నోళ్లు.. తెలుగే వెలుగంటు మూసుకుని రండీ.. మ...
...ఇంకా చదవండి

సుఖ విరోచనం!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.12.2017 11:58:32pm

ʹకవిత్వం యెలా వస్తుందో గవర్నరుగారు చెప్పారు..ʹ ʹఎలా వస్తుంది?ʹ ʹసుష్టైన భోజనం.. తాంబూలం.. వుంటే వస్తుందని..ʹ ʹఏమొస్తుంది.. నిద్రా?ʹ ʹకాదు, కవిత్వం..!ʹ.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
    అరుణతార నవంబర్ - 2018
    International Seminar on Nationality Question
    రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
    ప్రభుత్వమే అసలైన కుట్రదారు
    సూర్యాక్షరం
    శ్వాసిస్తున్న స్వ‌ప్నం
    చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
    వెలిసిన రంగులు
    అతనేం చేసిండు?
    సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
    ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •