న్యాయమూ ప్రత్యామ్నాయమూ!

| సాహిత్యం | క‌థ‌లు

న్యాయమూ ప్రత్యామ్నాయమూ!

- బమ్మిడి జగదీశ్వరరావు | 17.12.2017 10:02:51am

మలేరియా వొచ్చినట్టు.. టైఫాయిడ్ వొచ్చినట్టు.. డెంగ్యూ వొచ్చినట్టు.. చికెన్ గున్యా వొచ్చినట్టు.. స్వైన్ ఫ్లూ వొచ్చినట్టు.. మెదడు వాపు వొచ్చినట్టు.. ఫైలేరియా వొచ్చినట్టు.. వడదెబ్బ వొచ్చినట్టు.. నీళ్ళ విరోచనాలు వొచ్చినట్టు.. వాంతులు వొచ్చినట్టు..గొంతునొప్పి వొచ్చినట్టు.. పచ్చ కామెర్లు వొచ్చినట్టు.. జలుబూ జ్వరమూ దగ్గూ వొచ్చినట్టు.. ఏ సీజన్ల ఆ రోగాలు వొచ్చినట్టు.. ప్రపంచ తెలుగు మహాసభల ఫీవర్ మా వూళ్ళోకి వొచ్చింది! మా యిల్లలోకి వొచ్చింది! కొనాకి మాబల్లోకీ వొచ్చింది!

ఏ సీజన్ల ఆపండే దొరుకుతది! ఏ సీజన్ల ఆ కాయే కాస్తది! ఏ సీజన్ల ఆజెండాయే యెగురుతది! ఏ పండక్కి ఆదేవునే మొక్కేటిది! ఆ పాటే పాడేటిది!

ʹమా తెలుగు తల్లికి మల్లెపూదండ
మాకన్నతల్లికి మంగళారతులు..ʹ అని హారతులు పట్టి తెలుగు తల్లిని నెత్తినబెట్టుకొని వూరంతా వూరేగించినం! ర్యాలీలు దీసినం! జాతీయ జెండాలు యెగరేసినం! సమానంగా గులాబీ జెండాలూ యెగరేసినం! మా నాయకులతో కలిసి ఆడినం! పాడినం! మొక్కినం! మీటింగులు బెట్టినం! ఉపాధ్యాయులను పెద్దలను సన్మానించినం! శాలువలు గప్పినం! పూలదండలు యేసినం! పొటోలు దిగినం! వాట్సాపులల్ల ఫేసుబుక్కులల్ల పెట్టినం! షేర్ జేసినం! లైకులు కొట్టినం! కొట్టించినం!

రోజొక తీరుగ పండుగ! దినమొక తీరుగ జాతర! బతుకమ్మ తీరుగ ప్రపంచ తెలుగు మహాసభల పండుగ!
అందరం గలిసి ʹకంపలసరిʹ తెలుగు మాట్లాడి తీరాలని తీర్మానించినం!

మా బళ్ళో వ్యాస రచన,వకృత్వ పోటీలు బెట్టినం! ʹడిబేట్లుʹ బెట్టినం! ఒక్క ఆంగ్ల పదం లేకుంట.. మాట్లాడాలే! పొరపాటున మాటలల్ల వొక్క ఆంగ్ల పదం వొచ్చిందా.. యిగ అంతే.. యింటికెళ్ళిపోవుడే! ʹటాపిక్ యినుర్రిʹ ప్రధాన అధ్యాపకుడు ప్రకటించిండు!

ʹనేనే ముఖ్యమంత్రి అయితే?ʹ అదన్న మాట ʹటాపిక్కుʹ! ఒకటికి నాలుగు సార్లు ʹమైకుʹల చెప్పిన్రు!
ʹనేనవ్వʹ అన్నడు స్థానిక ఎమ్మెల్యే! అందరూ సారు జోకేసిండని నవ్విన్రు! మీడియా మిత్రులు ఫోటోలు క్లిక్కుమనిపించిన్రు! ఆగమని, మళ్ళీ ఎమ్మెల్యే అందుకున్నడు! ʹఎందుకంటే కేసీఆరు కన్నా నేను మొగోన్ని గాను.. యిరగదీసేటిది యేo లేదు.. ఆయనే యెప్పటికీ ముఖ్యమంత్రి..ʹ అని భక్తితో విశ్వాసంతోటి ప్రకటించిండు! అంతే కార్యకర్తలు జయజయద్వానాలు చేసిన్రు!

ʹనేనే ముఖ్యమంత్రి అయితే?ʹ అని మొదలు పెట్టడమే- ʹనేనే చీఫ్ మినిస్టరు అయితే?..ʹ అని,ʹగుడీవినింగ్ ఎవ్విర్ బడీ..ʹ అని, ʹగుడ్ మాణింగ్..ʹ అని, ʹఈ టాపిక్..ʹ అని ప్రారంభంలోనే కొందరు ʹడక్కౌట్ʹ అయిపోయిన్రు! మరికొందరు ʹసీరియస్సుగా పనిచేస్తా..ʹ అనో, ʹస్కూల్స్ లో తెలుగు అమలయ్యేలా..ʹ అనో, ʹపేరెంట్స్ కూడా..ʹ అనో, ʹలాంగ్వేజ్ ..ʹ అనో, ʹమా మమ్మీడాడీ..ʹ అనో, ʹప్రామిస్..ʹ అనో, ʹజీవోలు తెలుగులో తెస్తా..ʹ అనో, ʹఇంగ్లీషే కాదు తెలుగు కూడా..ʹ అనో, ʹమదర్ టంగ్..ʹ అనో, చివరకు ʹథాంక్యూ..ʹ అనో- అలవాటులో పొరపాటుగా అనో- ఆటలో వోడిపోయిన్రు!

నీలికళ్ళ నల్లపిల్ల మాత్రం గుడ్లప్పగించి చూస్తానే వుండింది! ఎవరో ʹహే.. పోయి కూర్సోʹ అని అన్నరు! గోల గోల చేసిన్రు! ఆపిల్ల నేల చూపులు చూస్తున్నదని అనుకున్నరు! లే!?

కనుగుడ్లనిండా నీళ్ళు వూట బావిలెక్క వూరినయి! జల జలా రాలినయి! దండతో మోచేత్తో తుడిచేసింది! దగ్గింది! మొదలు పెట్టింది!

ʹనేనే ముఖ్యమంత్రి అయితే?ʹ అని చుట్టూ చూసింది! ʹమన ముఖ్యమంత్రి జేసినట్టు జెయ్య..ʹ అంది. అంతా గ మాటతో పిండ్రాపు సైలెన్సు అయ్యిన్రు! కొందరు కొర కొర జూసిన్రు! ʹముఖ్యమంత్రి చేసిందే నువ్వూ జేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటిది దేనికి?ʹ యెవలో అన్నరు! ʹప్రతిపక్షమోల్లు నేర్పిపంపిన్రా యేమి..?ʹ అని కొందరు యెంటనే అనుమానించిన్రు!

ఆ నీలికళ్ళ నల్లపిల్ల యెవ్వని మాటలు ఖాతరు జెయ్యలే! ʹమన ముఖ్యమంత్రి జేసినట్టు జెయ్య.. యాభై కోట్లు పెట్టి ప్రపంచ తెలుగు మహాసభలు అస్సలు జరపʹ మాటలకు అంతా ముకాముకాలు జూసుకున్నరు! ʹఏయ్.. మరేమి జేస్తవో జెప్పరాదే..?ʹ యెవలో సహనం పట్టలేకున్నరు! కసురు కున్నరు! కస్సుబుస్సు మన్నరు!
ʹఆ యాభై కోట్లు నిధులు వుంటే చానా పనులు చెయ్యొచ్చు! నేను విద్యార్థిని గనుక నా సమస్య నుండే మొదలెడతా!రాష్ట్రంల నాలుగు వేల బడులు మూసేసిన్రు! గవన్ని తెరిపిస్తా! ప్రభుత్వ బడుల్లోనే గదా తెలుగు బతికి బట్ట కట్టేటిది? ప్రభుత్వేతర బడుల్లో తెలుగంటే అగ్గువ! సంస్కృతమూ హిందీ యివే మక్కువ! అన్నిచోట్లా ఆంగ్ల భాషా మాధ్యమమే వుండేటిది! పొరపాట్న ʹఅమ్మా నాయనాʹ అన్నమా.. యిక గంతే.. అపరాధ రుసుము చెల్లించాల్సిందే! అది అట్ట వున్నీ! తెలుగు బతకాల్నంటే ముందుగాల ప్రభుత్వ బడులు బతకాలే!ʹ అన్నది. జనం తెలియకుంటనే సప్పుడు సెయ్యకుంట వూకున్నరు! మరికొందరు ఈలలేసిన్రు!

నీలికళ్ళ నల్లపిల్ల కళ్ళని చక్రాల్లా తిప్పింది!

ʹరెండు కోట్లు ఖర్చుపెట్టి అస్సలు విద్యుద్దీపాలు పెట్ట! ఆ రెండు కోట్లతోని రాష్ట్రంలోని అన్ని బడుల్లో విద్యుద్దీపాలేపిస్తా! సాంఘిక సంక్షేమ వసతి గ్రుహాలల్ల వెలుగులు దెస్త.. విద్యుద్దీపాలేపిస్తా! చీకట్లో పాము గరిసి చనిపోయినోళ్ళు గురించి మీరు దినపత్రికలల్ల చదివే వుంటరు! పురుగూ పుట్రా కుట్టి పిల్లలు చనిపోకుంటా కాపాడుకుంటా! అమ్మానాయిన కడుపుకోత యెరగాలే! అమ్మానాయిన లెక్క ముఖ్యమంత్రిగా నేనుండాలే!ʹ
అందరూ నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నరు!

ʹసభల పేరు జెప్పి దొరల పెళ్లి తీరుగ అయిదు దినాలు పదహారు పచ్చళ్ళు పెట్ట! అరవైయ్యారు యిగురు కూరలు పెట్ట! వేపుళ్ళు దూపుళ్ళు పెట్ట! విజిటేరియనయినా బిర్యానీలు పెట్ట! మహాసభలకు అచ్చినవాళ్ళు ఆళ్ళ తిండి ఆళ్ళు కొనుక్కు తినగలరు! మర్యాద కన్నా మధ్యాన్నభోజన పథకం మిన్న! వసతి గృహాలల్ల వున్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తా! తిండికలిగితే కండ గలదన్న మాటను నిజం జేసి నిరూపిస్తా! తెలంగాణ వంటకాలన్నీ తెలంగాణల పుట్టి కూడా యిప్పటిదంక తినని పిల్లలకు ముందుగాల రుచి చూపిస్తా!ʹ

నీలికళ్ళ నల్లపిల్ల యినుమయితే అందరూ అయస్కాంతమయిన్రు!

ʹవంటినిండా బట్టలున్న వాళ్లకి శాలువలు గప్పుడు కాదు, వంటిమీన బట్టలు లేకుంటా సలికి.. శీతాకాలం సలికి వణుకుతున్న వాళ్ళకి గవేవో కప్పాలే! ఈ కాలంల కూడా సలికి సచ్చేటోళ్ళు సానా మందే వున్నరు! కోట్లూ బూట్లూ వేసుకున్నోళ్ళకి శాలువలు గప్పుడేందో సమజయితలేదు! మన కాలంల వొంటిమీన బట్టలు లేకుంటా సచ్చినరంటే ప్రపంచల మన పరువు పదింతలు పెరుగుతదా..?ʹ

గులాబీదండు గడగడలాడింది!

ʹనాకు దెలియక అడుగుతా, అయిదు రోజులకి యింత ధాం ధూం అవసరమా? పెద్ద పెద్ద భారీ ప్రచారాలూ బొమ్మలూ పక్కన నా చిత్రము వేయించుకుంటే యేమొస్తది?రచయితల చిత్రాలు వురితీసినట్టు యెక్కడికక్కడ వేలాడదీయాలని యే రచయితా కోరుకోడు! తన రచన ప్రజల చేతుల్లోకి వెళ్ళాలని మాత్రమే అనుకుంటడు!ఆశపడుతడు! గందుకే అన్ని బడులల్ల గ్రంధాలయాలు పెట్టిస్తా! ఆ గ్రంధాలయాల్లో అందరు రచియితలు కొలువుదీరేలా చేస్తా! సముచిత గౌరవమంటే గదే..!ʹ

చప్పట్లు మోగాయి! ఆ చప్పట్ల మధ్య ʹసాలు నువ్వు కూసోʹ అని కొందరు కూకలేసిన్రు!

ʹగ్రంధాలయాలు అవసరమే! గంతకన్నా ముందు..ʹ అని ఆగి అటూ యిటూ చూసి ʹగ్రంధాలయాల కన్నా శౌచాలయాలు అవుసరం! వుచ్చకొస్తుంటే సదివితే మాత్రం నెత్తికెక్కుతదా..?ʹ నవ్వుతూ అడిగింది.
ʹచానా యెక్కువ మాట్లాడినవ్.. యెవర్రాసిచ్చిన్రు?ʹ ఎమ్మెల్యే కుతకుత లాడిండు!

నీలికళ్ళ నల్లపిల్ల బెదర్లే!
ʹచానా బడుల్లో శౌచాలయాల్లేవ్! గ మాటకొస్తే సచివాలయాల కన్నా శౌచాలయాలు ముఖ్యం! సచివాలయాలు కూల్సి కట్టుడు కాదు, శౌచాలయాలు ముఖ్యమంత్రిగా నే గట్టిస్తాʹ చెప్తానే వుండింది! ఆపిల్లమీన రాళ్ళు యిసిరిన్రు! బూతులు తిట్టిన్రు! దిగిపోమన్నరు! మాట్లాడనీ అని కొందరు మద్దతు పలికిన్రు! ʹఆంగ్ల పదం చెపితే ఆపేద్దాం.. అంత వరకు అవకాశం యిద్దాంʹ కొందరు కుర్రాళ్ళు పట్టుపట్టిన్రు!

ఆ కుర్రాళ్ళ వంక నీలికళ్ళ నల్లపిల్ల మెచ్చుకోలుగా చూసింది. చూసి ʹనా అన్నలు ఉస్మానియాల చదువుతానే తెలంగాణ పోరాటంల పాల్గొన్నరు. ఆల్ల మీద కేసులు గమ్మున తీయిస్తా. గదే బంగరు తెలంగాణ..ʹ మాటలు వినపడలేదు. ఎన్నో గొంతులు చేరి ʹమూడున్నరేళ్ళు అయినా విద్యార్థుల మీద పెట్టిన కేసులు..ʹ అనంగనే ʹఎత్తి వేయాలి! యెత్తి వేయాలి!ʹ వొక్క గొంతు అయిన్రు!

ʹనువ్వు జల్దీ కంప్లీటు జెయ్యి..ʹ ప్రధాన ఉపాధ్యాయుడు కళ్ళతో హెచ్చరించిండు!

ʹమన తెలంగాణల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు! ఏ రైతు యెప్పుడు ఆత్మహత్య చేసుకుంటడో తెల్వది! ముందుగాల రైతుల ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు దీసుకుంటా..ʹ చెప్పబోయింది!

ʹప్రపంచ తెలుగు మహాసభల వరకు మాట్లాడు.. మిగాతాయన్నీ కాదు..ʹ అధికారి వొకడు కళ్ళెర్ర జేసిండు!
నీలికళ్ళ నల్లపిల్ల ఖేర్ జెయ్యలే!

ʹపంతొమ్మిది వందల డబ్బై అయిదుల.. మల్ల రెండువేల పన్నెండుల ప్రపంచ తెలుగు మహాసభలు జరిపినం. మల్ల గిప్పుడు..ʹ నీలికళ్ళ నల్లపిల్ల చెప్పడం పూర్తి కాలేదు!

ʹనువ్వు ముఖ్యమంత్రివి అయితే యేమి జేస్తవో గది మాట్లాడు..ʹ అసహనంతో అరిచి చెప్పిండొకడు!

నీలికళ్ళ నల్లపిల్ల నవ్వింది. నవ్వుతూ ʹమల్ల గిప్పుడు గవే సభలంటే నావల్లకాది! మహాసభల పేరుతో డబ్బు కర్సే తప్ప, పూర్వ అనుభవాన్ని బట్టి చూస్తే చేసేటిది వృధా! తెలుగు భాషకు అచ్చింది లేదు, పొయ్యింది లేదు! గందుకే ఈ ప్రపంచ తెలుగు మహాసభలను తక్షణం రద్దు చేస్తున్నా..ʹ అచ్చం ముఖ్యమంత్రిలెక్క ఫోజు పెట్టింది!
ʹఆ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ యివ్వుండ్రి..ʹ ఎమ్మెల్యే లేచి నిలబడిపోయాడు. అతని వెంట వందిమాగధులూ అధికారులూ కూడా లేచి నిలబడ్డారు!*

No. of visitors : 599
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార స్వరాలకు ఆహ్వానం

virasam | 09.12.2017 10:13:47am

ప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ...
...ఇంకా చదవండి

వెలివేయబడ్డ అక్షరం

వెంకట్ కొండేటి | 13.12.2017 11:59:44am

అంటరానితనంతో వెలివేసిన నా అక్షరాల్ని ధిక్కార స్వరాలు చేసి నీ ʹజాత‌రʹలో నిన‌దించాల‌ని ఉంది...
...ఇంకా చదవండి

గుండె గుర్తులు వెతుక్కుంటూ

అశోక్ కుంబము | 13.12.2017 11:37:22am

సాలు సాలులో సాగు వీరులు వరిగి పోతుంటె నీ కలంలోకి ప్రవహించిన రైతన్నల వెచ్చటి నెత్తురు అప్పుడే గడ్డకట్టిందా?! ఆపదలో అభయాన్నిచ్చే అక్షర సాహస విత్తనాలు భూమిన...
...ఇంకా చదవండి

తెలంగాణ, తెలుగు మహా సభలు

పాణి | 05.12.2017 11:14:23pm

భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇం...
...ఇంకా చదవండి

కవి ఎక్కడ?

పాణి | 09.12.2017 11:50:36pm

కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా?...
...ఇంకా చదవండి

తెగులు సోకిన రచయితలారా రండీ

అభిన‌వ్ బూరం | 13.12.2017 12:49:48pm

విలువలు వదిలిపెట్టి.. వడివడిగా ఉరికి రండి.. కత్తిరించుకున్న కులం తోక.. అతికించుకోని రండి.. తెలంగాణ యాస కాదు బాషాన్నోళ్లు.. తెలుగే వెలుగంటు మూసుకుని రండీ.. మ...
...ఇంకా చదవండి

సుఖ విరోచనం!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.12.2017 11:58:32pm

ʹకవిత్వం యెలా వస్తుందో గవర్నరుగారు చెప్పారు..ʹ ʹఎలా వస్తుంది?ʹ ʹసుష్టైన భోజనం.. తాంబూలం.. వుంటే వస్తుందని..ʹ ʹఏమొస్తుంది.. నిద్రా?ʹ ʹకాదు, కవిత్వం..!ʹ.....
...ఇంకా చదవండి

పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాం

విర‌సం | 07.12.2017 12:39:17am

అగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ప్రజా నిరసనను దారి మళ్లిండానికే...
...ఇంకా చదవండి

బుద్ధిజీవుల క‌ర్త‌వ్యం

వరవరరావు | 16.12.2017 06:17:47pm

పోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైనన...
...ఇంకా చదవండి

క‌ళావేత్త‌లారా! మీరేవైపు?

మాగ్జిం గోర్కి | 16.12.2017 09:39:01pm

1932లో అమెరికా జ‌ర్న‌లిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ( సృజ‌న ప‌త్రిక నుంచి )...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •