సభా దీక్ష

| సంభాషణ

సభా దీక్ష

- పాణి | 19.12.2017 11:10:50pm

ప్రపంచ తెలుగు మహా సభల ʹగొప్పʹతనం చెప్పడానికి రచయితలు చాలా ప్రయాసపడుతున్నారు. ఇంత కష్టం గత సభలప్పుడు ఉండకపోవచ్చు. అదీ ఇవ్వాల్టి తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ సందర్భం. దీన్ని అన్నిటికంటే చాలా ప్రత్యేకంగా చర్చించాల్సిందే. ప్రస్తుతానికి అది అలా ఉంచితే మన రచయితలకు ఈ సభలంటే ఎందుకింత ముచ్చటగా ఉంది? దానిలోని అర్థం ఏమిటి? ఇంత కోలాహలంగా, ఇంత తమకంతో ఎందుకు పాల్గంటున్నారు? రచయితలు, కవులు ఒక దుప్పటి కూడా వదులుకోడానికి సిద్ధం కారనే వదంతి ఉన్నట్లు వినికిడి. ఇప్పుడు దేనికోసమో మరి..ఎక్కడెక్కడి నుంచో నానాయాతనా పడి వచ్చేశారు. కొందరు వయోభారం లెక్కపెట్టకుండా వచ్చేశారు. రాక తప్పలేదని అంగలార్చుతూ కొందరు వచ్చేశారు. సగౌరవంగా వచ్చినవాళ్లూ ఉన్నారు. ఎవరేమని అడిగినా సరే వీర విహారం చేయడానికి ఒరలో ఒక రహస్య ఎదురువాదన దాచుకొని వచ్చిన వాళ్లూ ఉన్నారు. ఇది ఎంత దృఢ సంకల్పమంటే కవి, రచయిత ఇంత దీక్షాబద్ధంగా ఉంటే లోకాన్ని తల్లకిందుల చేసేయగలరు కదా? అనిపిస్తోంది.

తెల్లారితే సభలనగా ముందు రోజు సాయంకాలానికే ఎనిమిది మంది విప్లవకారుల్ని తెలుగు అక్షరాలా తెలంగాణ ప్రభుత్వమే హత్య చేసింది. బహుశా అప్పటికి హతుల మీద ఒక్క నేరారోపణ కూడా లేదని గట్టిగా చెప్పవచ్చు. ఉంటే మాత్రం చంపేస్తారా? ఏమిటి అని కూడా ప్రశ్నించవచ్చు. నిత్యం ఈ ప్రగతిశీల కవులు గుండెలు బాదుకునే ఆదివాసులు, దళితులు మాత్రమే మృతుల్లో ఉన్నారు. ʹహంతకుడే రేపు సాహిత్యం, కళలు, భాష, సున్నిత మానవీయ విలువలు.. అని ప్రసంగించబోతున్నాడు. ఎంతో కాలంగా మనుషుల కోసం ఆరాటపడీ ఆరాటపడీ అక్షరాలన్నీ మనిషి కోసమే కూర్చుతూ వచ్చినవాళ్లం కదా.. ఈ హంతకుడు ఇలా వేదిక కట్టి, ఎత్తయిన గద్దె మీద కూర్చొని మనకు లలిత లలితమైన భావనల గురించి, భాష గురించి ప్రసంగం చేస్తాడు కదా? మన తల నేల పొరల్లోకి రాలిపోకుండా ఉండగలుగుతుందా? మనం మనుషులం కదా? మృతులు కూడా మనుషులే కదా? అంతా నవయవ్వనస్తులు.. విప్లవం తేగలరో లేదో గాని ఒక ఆశయం కోసం వెళ్లారు. నిలువునా కాల్చేశాడు. ఆ శవాల మీది నుంచి, ఆ నెత్తురు పాదాలకు అంటుకుంటూ ఉంటే తుడిచేసుకునే తీరక కూడా లేకుండా ఎగేసుకుంటూ ఎలా ఈ సభలకు పోగలం? మళ్లీ మానవీయత మన్నూ మశాన్నం అని ఎలా రాయగలం? మనసు ఒప్పుతుందా?ʹ అని క్షణం కాలం సందిగ్ధానికి గురికాని రచయితల సభాదీక్ష నిజంగా ముచ్చటగొలిపేదే. అది ఎలాంటిదంటే లోకంలో ఏం జరగనీగాక, సాధాణంగా ఊహించేవీ, ఊహించలేనివీ ముప్పిరిగొననీగాక, ఇప్పటికిప్పుడు ఏదో విరుచుకపబడి జనం మట్టిగొట్టుకొనిపోనీగాక, ఎవరెంత న్యాయమైన విమర్శ సంధించనీగాక.. వెళ్లేది వెళ్లేదే అనే సభా దీక్షను కవులెల్ల ప్రదర్శించారు. ఈ సభా నిబద్ధతకు అచ్చెరువొందాల్సిందే.

తెలుగు సాహిత్య సంప్రదాయాలపట్ల ఒక గొప్ప నమ్మకం.. బహుశా ఇదిగో వీళ్లు.. వీళ్లు.. రేపు గ్యారెంటీగా సభలకు వెళ్లరు. ఈ హత్యాకాండపట్ల తమ నిరసన వినిపించి వెనుదిరిగిపోతారు..అని కొందరి గురించైనా కొందరు ఆశించి ఉంటారు. ఇది పేరాశ కావడమే ఎనిమిది మంది హత్యకంటే, హంతకుడి సాంస్కృతిక మెహర్బానీకంటే విచారకరం. ʹఈ చంపుకోడాలు, హత్యా ప్రతిహత్యా వ్యూహాలు ఎప్పుడూ ఉన్నవే కదా, వీటి కోసం కవితా గానాన్ని వదులుకుంటామా? ఏమి. కాకపోతే ముందుగా రాసుకున్న ప్రసంగాన్ని పక్కన పెట్టి దీని మీదే సరికొత్తగా కవిత్వమల్లేద్దాం... ఏ వేదికనైనా ప్రజల కోసమే వాడుకోవడం కంటే గడసరితనం ఏముంది?ʹ అని తప్పక అనుకోరనే నమ్మకమున్న వాళ్లను హతాసులను చేసేశారు.

ʹమనం ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెబుతుంటాం.. రాస్తుంటాం కదా..రోడ్డెంట వెళుతుంటే ఎవరైనా నిలదీసి అడిగితే ఎట్ల? ఏం సమాధానం చెప్పుకుంటాం? ఒకరు అడగకపోయినా.. మనసుకు ఎలా సర్ది చెప్పుకోగలం? పాదాలకంటిన ఈ నెత్తుటి మరకలు చెరిగిపోకుండా రేప్పొద్దున కిందికి చూసుకున్నప్పుడు, అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటున్నప్పుడు, మన ఇంట్లో పసివాడ్ని ముద్దాడుతున్నప్పుడు కనిపిస్తే ఏం సమాధానం చెప్పుకోగలం? శాలువా తీసి బీర్వాలో పెట్టేసి మర్చిపోగలమేమోగాని ఈ ప్రశ్న వెన్నాడుతూ ఉంటుంది కదా? హంతకుడి సరసన నిలబడి పద్యం ఆలాపించకుండా ఉండలేని ఈ ప్రలోభం ఏమిటి? ఒక చిన్న అసమ్మతి, నిరసన. పిసరంత ఆగ్రహం కూడా లేకుండా ఏమైపోయాయి? ఇంత సహజాతాలు అడుగంటిపోయాక నా కవిత్వానికి ఎవరైనా ఏ వ్యాఖ్యానం చేస్తారు? నేనైనా తిరిగి చదువుకొని పలవరించేదేమైనా అందులో ఉంటుందా? పాలకుడు ఒక వేదిక పరిచి రండి.. అందరం కలిసి కవిత్వం చదువుకుందాం.. భాషను కలిసి ఉద్ధరిద్దాం.. అని పిలిస్తే తప్పించుకోలేని అనివార్యత ఏమిటి? పోనీ మళ్లీ ఎప్పుడైనా పాలకుల మీద ఆగ్రహం కలుగుతుందా? ఒక వేళ తీరికగా ఎప్పుడో కలిగితే మాత్రం దానికి అర్థం మాత్రం ఏముంటుంది? విలువ ఏముంటుంది? తిరిగి మళ్లీ రాజ్యంపై ఆగ్రహమనో, మానవత మీద మమకారమనో, జీవితంలోని సున్నితమైనవాటిపట్ల ఆర్తి అనో మనల్ని వ్యక్తం చేసుకునే అర్హత కోల్పోతానేమో కదా. అర్హతలు, హక్కుల గురించి కూడా కాదు. బరితెగిస్తే ఏ వాదనైనా చేసి సమర్థించుకోవచ్చుగాక.. కానీ లోపల కవి వేసే ప్రశ్నకు లోపలి మనిషి మాత్రమే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కదా? అప్పుడు నాకు తోడు ఎవరు? వాదనలు, ప్రయోజనాలు సరే.. ఏ సత్యం ఆలంబన అవుతుంది? సభలైపోయాక రేపు ఉదయం మళ్లీ వేదిక మీద నా ముఖం నాకు దొరికితేనే కదా గొంతెత్తి కవిత్వం చదవడానికి?ʹ అనే చిన్న విచికిత్స ఇదిగో.. వీళ్లకు... వీళ్లకు తప్పక కలుగుతుందని, నిరసనగా వెనక్కి వెళ్లిపోతారని ఎవరైనా నమ్మి ఉంటే వాళ్లకు ఎదురైన నిరాశ ఎనిమిది మంది హత్య కంటే లోతైనది. నగ్నమైనది. అది దర్శనమైన వేళ చప్పున కళ్లు మూసుకోవడం తప్ప మరేం చేయగలం?

No. of visitors : 329
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార స్వరాలకు ఆహ్వానం

virasam | 09.12.2017 10:13:47am

ప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ...
...ఇంకా చదవండి

గుండె గుర్తులు వెతుక్కుంటూ

అశోక్ కుంబము | 13.12.2017 11:37:22am

సాలు సాలులో సాగు వీరులు వరిగి పోతుంటె నీ కలంలోకి ప్రవహించిన రైతన్నల వెచ్చటి నెత్తురు అప్పుడే గడ్డకట్టిందా?! ఆపదలో అభయాన్నిచ్చే అక్షర సాహస విత్తనాలు భూమిన...
...ఇంకా చదవండి

వెలివేయబడ్డ అక్షరం

వెంకట్ కొండేటి | 13.12.2017 11:59:44am

అంటరానితనంతో వెలివేసిన నా అక్షరాల్ని ధిక్కార స్వరాలు చేసి నీ ʹజాత‌రʹలో నిన‌దించాల‌ని ఉంది...
...ఇంకా చదవండి

తెలంగాణ, తెలుగు మహా సభలు

పాణి | 05.12.2017 11:14:23pm

భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇం...
...ఇంకా చదవండి

కవి ఎక్కడ?

పాణి | 09.12.2017 11:50:36pm

కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా?...
...ఇంకా చదవండి

బుద్ధిజీవుల క‌ర్త‌వ్యం

వరవరరావు | 16.12.2017 06:17:47pm

పోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైనన...
...ఇంకా చదవండి

క‌ళావేత్త‌లారా! మీరేవైపు?

మాగ్జిం గోర్కి | 16.12.2017 09:39:01pm

1932లో అమెరికా జ‌ర్న‌లిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ( సృజ‌న ప‌త్రిక నుంచి )...
...ఇంకా చదవండి

పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాం

విర‌సం | 07.12.2017 12:39:17am

అగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ప్రజా నిరసనను దారి మళ్లిండానికే...
...ఇంకా చదవండి

తెలుగు మ‌హాస‌భ‌లు - కొన్నిబుల్పికలు

బమ్మిడి జగదీశ్వరరావు | 16.12.2017 09:02:30pm

వాళ్ళ చేతుల్లో గడ్డిపూచలున్నాయని అరెస్టు చేస్తరా?ʹ ʹఎందుకు చెయ్యరు?, ఆయుధాలుంటే అరెస్టు చెయ్యరా? ఉప రాష్ట్రపతి చెప్పిన్రు గదేనే?ʹ ʹఏమని?ʹ ʹతెలంగాణల గడ్డిపూ...
...ఇంకా చదవండి

తెగులు సోకిన రచయితలారా రండీ

అభిన‌వ్ బూరం | 13.12.2017 12:49:48pm

విలువలు వదిలిపెట్టి.. వడివడిగా ఉరికి రండి.. కత్తిరించుకున్న కులం తోక.. అతికించుకోని రండి.. తెలంగాణ యాస కాదు బాషాన్నోళ్లు.. తెలుగే వెలుగంటు మూసుకుని రండీ.. మ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఈవ్ టీజింగ్ సాకు తీసుకొని మొత్తం దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం అమానుషం
  మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...
  దేశద్రోహ నేరం!
  అగ్ర వుగ్రవాదం!
  ఆదాయం సున్నా ఖర్చు పన్నెండు!
  ఆ పిల్లకు క్షమాపణతో...
  కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
  చిన్న చేపల్ని చంపుతున్న పెద్ద పరిశ్రమ
  నేనూ అర్బన్ మావోయిస్టునే
  సుధా భరద్వాజ్ కు నా సెల్యూట్‌
  గౌతమ్‌నవలఖా సదా సూత్రబద్ధమైన అసమ్మతివాది.
  మానవ హక్కుల పరిరక్షకులపై దాడిని ఖండిస్తూ పంజాబ్‌ మేధావుల సంయుక్త ప్రకటన

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •