బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని ఓడిద్దాం

| సంపాద‌కీయం

బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని ఓడిద్దాం

- పి.వరలక్ష్మి | 03.01.2018 10:38:59pm

విరసం సాహిత్య పాఠశాల్లో, మహాసభల్లో ఒక నిర్దిష్టమైన అంశాన్ని తీసుకొని, దాన్ని వేరువేరు పార్స్వాల నుండి పరిశీలించి విశ్లేషించే ప్రయత్నం చేయడం, కలిసి అన్వేషించడం ఆనవాయితీ వస్తున్నది. ఈసారి 26వ మహాసభలు బ్రాహ్మనీయ హిందూ ఫాసిజం అనే అంశాన్ని కేంద్రంగా తీసుకొని చర్చించబోతున్నాయి. బిజెపి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ మతోన్మాదం ఆందోళన కలిగించే రీతిలో పెచ్చరిల్లిపోతున్నది. మతతత్వ రాజకీయాలని, హిందూ మతోన్మాదమని అభివర్ణించిన దశ నుండి ఇది ఫాసిజంగా పరిణమిస్తున్నది ముఖ్యంగా భావప్రకటన స్వేచ్చ మీద జరుగుతున్న దాడులు, వ్యక్తిగత ఇష్టాఇష్టాలు, అలవాట్లు, విశ్వాసాల్లోకి సంఘపరివార్ చొరబాటు, రాజ్యం అండతో హింసకు తెగబడటం, నిర్భీతిగా హత్యలు చేయడం వరకు హిందుత్వ పేట్రేగిపోయాక దీన్ని ఫాసిజమని అంటున్నాం.

చరిత్రలో ఫాసిజం పేరుతోనే వచ్చిన నియంతృత్వ ప్రభుత్వాలకు ఒక రాజకీయార్థిక నేపథ్యముంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో ఉండే వైరుధ్యం వల్ల దాని మార్కెట్ నిరంతరం సంక్షోభాలకు గురవుతూ ఉంటుంది. సంక్షోభాల నుండి బైట పడడానికి అది బలహీనమైన దేశాల మార్కెట్లను మింగేసి తన మార్కెట్ ను విస్తరించుకుంటుంది. ఆ క్రమంలో అది సామ్రాజ్యవాదంగా పరిణమించి ప్రపంచయుద్ధాలకు కారణమైంది. సంక్షోభం నుండి బైట పడడానికి అది ఎంచుకునే మరో మార్గం శ్రామికవర్గాన్ని మరింతగా అణచిపెట్టి, శ్రమను మరింతగా పిండుకొని దోపిడీ చేయడం. ఇందుకోసం అది కార్మిక హక్కులను హరించివేస్తుంది. బూర్జువా ప్రజాస్వామ్యం ద్వారా అది హామీపడిన హక్కులు దానికే అడ్డంకి అవుతాయి గనక ప్రజాస్వామ్యమనే భావనే పనికిరాదని చెప్పి నియంతృత్వ రాజ్యాన్ని నెలకొల్పుకుంటుంది. ఇటలీలో పారిశ్రామిక సమ్మెలు తీవ్ర స్థాయిలో ఉన్న దశలో అప్పటికింకా అధికారంలోకి రాని ఫాసిస్టులు కార్మికుల మీద దాడులు చేశారు. దేశ ప్రయోజనాల కోసం, సుస్థిరత, శాంతి, అభివృద్ధి కోసం పరిశ్రమల్లో అలజడులు రేపే శక్తుల్ని అణచివేయాలని పిలుపునిచ్చారు. అందుకని బూర్జువావర్గం వాళ్ళను తన సిసలైన ప్రతినిధులుగా ఎన్నుకుంది. ఫాసిస్టులు బూర్జువావర్గ ప్రయోజనాలనే జాతి ప్రయోజనాలుగా చెప్పారు. కరడుగట్టిన జాతీయత శ్రామిక ప్రజల పాలిటి మరణశాసనమైంది.

ఈ జాతీయతా భావన మనదేశంలో ఆర్.ఎస్.ఎస్. శక్తులను బాగా ఆకట్టుకుంది. భారతదేశం వలస పాలనగా ఉండింది గనక ఆనాడు బ్రిటీష్ సామ్రాజ్యవాద వ్యతిరేకత నుండి జాతీయతా భావన వచ్చింది. కానీ ఆర్.ఎస్.ఎస్.కు బ్రిటీష్ సామ్రాజ్యవాదం పట్ల వ్యతిరేకత లేదు. జాతీయత కోసం అది మతాన్ని ఆశ్రయించింది. హిందూ జాతీయవాదాన్ని అది ఎత్తుకుంది కానీ హిందూయిజం చాలా బలహీనమైనది. మతానికి ఉండే ఆర్గనైజేషన్, ఒకే ప్రామాణిక గ్రంధం, ఒకే దేవుడు, విశ్వాసాలు దానికి లేవు. వైవిధ్యపూరితమైన విశ్వాసాలు, పద్ధతులు, ఆచార వ్యవహారాలూ ఉన్న భారతదేశంలో శిలా సదృశ్యమైన నిర్మాణం ఒక్క కులవ్యవస్థ మాత్రమే. భూస్వామ్య వర్గ ప్రయోజనాలను పకడ్బందీగా పరిరక్షించే కులవ్యవస్థ బ్రాహ్మనీయ ఆధిపత్యం కింద మనుగడలో ఉంది. వర్గ ప్రయోజనాల రిత్యా బ్రాహ్మనీయ ఆధిపత్య శక్తులు సామ్రాజ్యవాదానికి అనుకూలమే. బ్రిటీష్ పాలకులు కూడా కులవ్యవస్థను తాకకుండా దాన్నలా కొనసాగానిచ్చారు. ఆర్.ఎస్.ఎస్. ప్రవచించిన హిందుత్వ సారాంశం బ్రాహ్మణీయ ఆధిపత్య కులవ్యవస్థే. అది చెప్పే సంస్కృతి వర్ణాశ్రమ ధర్మాలను చెప్పిన సనాతన సంస్కృతి. మనుధర్మం దాని రాజ్యాంగం. కేవలం ఇవి మాత్రమే అయితే దాని జాతీయతాభావానికి జనాన్ని కూడగట్టే శక్తి ఉండదు. అందుకోసమది ముస్లిం విద్వేషాన్ని తీసుకుంది. బ్రిటీష్ సామ్రాజ్యవాద వ్యతిరేకత నుండి జాతీయవాదం, జాతీయోద్యమం వస్తే, ముస్లిం వ్యతిరేకత నుండి అది హిందూ జాతీయవాదాన్ని ప్రవచించింది. వర్గ ప్రయోజనాల రిత్యా అది కమ్యూనిస్టులకు శ్రామికవర్గానికి బద్ధ విరోధి.

ఆర్ఎస్ఎస్ శాఖోపశాఖలుగా విస్తరించే క్రమంలో ఏకాత్మతా యాత్ర, శిలాన్యాస్ రూపంలో హిందూ జాతీయవాదం బలపడుతూ వచ్చింది. ఇందులో సంఘ్తోపాటు మొదటి నుంచి కాంగ్రెస్ పాత్ర కూడా ఉన్నది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే ఒకరకంగా హిందూ ఫాసిజానికి రహదారి వేసింది. మొదటి నుండి కాంగ్రెస్లో ఉంటూ జాతీయోద్యమంలో పాల్గొన్న ఆధిపత్య కులాలు, భూస్వామ్య వర్గాల్లో మత ఛాందసవాదులు ఉన్నారు. తర్వాత వీళ్లే ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర పోషిస్తూ వచ్చారు..రాజకీయాల్లో బ్రాహ్మణీయ హిందుత్వకు వాహికగా పని చేశారు. అసలు మొదటి నుంచీ భారతదేశ పాలకవర్గ సాంస్కృతిక అస్తిత్వం బ్రాహ్మణీయ హిందూయిజమే. బ్రాహ్మణీయ ఆధిపత్య వ్యవస్థ, సామ్రాజ్యవాద అనుకూల ఆర్థికవ్యవస్థ మన దేశ రాజకీయార్థిక సామాజిక రంగాలను నడిపిస్తున్నాయి. అనేక ప్రజాస్వామిక, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల నుండి, ప్రపంచంలో విస్తరించిన ఆధునిక రాజ్యభావన నుండి భారత రాజ్యాంగం లౌకిక ప్రజాస్వామ్య, సామ్యవాద లక్ష్యాలను నిర్దేశించుకుంది. కానీ దాని అర్ధ వలస అర్ధ భూస్వామ్య పార్లమెంటరీ రాజకీయాల స్వభావం వల్ల సమాజం ప్రజాస్వామికీకరణ చెందకపోగా అది హిందుత్వ ఫాసిస్టులకు స్థలం విశాలం చేస్తూ వచ్చింది.

ఇవాల బ్రాహ్మణీయ సాంఘిక సాంస్కృతిక భావజాల ఆధిపత్యశక్తిగా, దళారీ, సామ్రాజ్యవాద రాజకీయార్థిక దోపిడీ శక్తిగా, ఆ రెంటి మిలాఖత్గా ఫాసిజం మన దేశంలో ముందుకు వస్తోంది. బీజేపీ తొలిసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడే దాని బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు లక్షణం సామాన్యులకు కూడా తెలిసిపోయింది. గుజరాత్ జాతిహననంలో దాని రాజకీయార్థిక వ్యూహం కూడా స్పష్టమైపోయింది. హిందూ మతవర్గతత్వం బ్రాహ్మణ భావజాలంతో, సామ్రాజ్యవాద దళారీతనంతో కలిసి చాలా సంక్లిష్టంగా తయారైంది. దాన్ని స్పష్టంగా బ్రాహ్మణీయ హిందూ ఫాసిజంగా గుర్తించకపోతే నీడతో యుద్ధం చేసినట్లవుతుంది. నేడు నరేంద్రమోదీ నేతృత్వంలో సంఘపరివార్ అన్ని రంగాల్లో నిత్యం ఈ స్వభావాన్ని నగ్నంగా ప్రదర్శిస్తోంది.

మార్కెట్ సంక్షోభాల నుండి బైటపడడానికి సామ్రాజ్యవాద పెట్టుబడి పరమ అభివృద్ధి నిరోధక ఫాసిస్టు నియంతృత్వాన్ని నెలకొల్పడం ద్వారా శ్రామిక వర్గాలను అణచిపెట్టి దోపిడిని కొనసాగించడం చరిత్రలో చూశాం. ఇవాల అనేక దేశాల్లో అభివృద్ధి నిరోధక నియంతృత్వ పోకడలున్న ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి. భారతదేశంలోని నిర్దిష్ట సాంఘిక వ్యవస్థ వల్ల బ్రాహ్మణీయ హిందూ జాతీయవాదంగా ఫాసిస్టు ప్రమాదం ముందుకొచ్చింది. అయితే ఇండియాలో కరడుగట్టిన కులవ్యవస్థకు, బ్రాహ్మిణిజానికి వ్యతిరేకంగా మొదటి నుంచి అనేక ధిక్కార సంప్రదాయాలున్నాయి. అవైదిక ప్రతిఘటనా స్వరాలున్నాయి. గొప్ప ప్రజాస్వామిక విప్లవ పోరాట వారసత్వాలూ ఉన్నాయి. ఇవాళ దూకుడుగా ముందుకొస్తున్న బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి ఈ నేలలోంచే దాన్ని ప్రతిఘటించే శక్తుల బలాన్ని అంచనా వేయవలసి ఉన్నది. ఐక్యం చేయవలసి ఉన్నది. బ్రాహ్మణీయ హిందూ ఫాసిజానికి రాజకీయార్థిక మూలాలు ఉన్నందు వల్ల పీడిత కులాల ప్రతిఘటనా పోరాటాలు, ప్రజాస్వామిక, హేతువాద ఉద్యమాలతో పాటు శక్తివంతమైన వర్గపోరాటాల ద్వారానే దీన్ని నిలువరించగలం. మహాసభల్లో ఈ విషయాలన్నీ చర్చించుకుందాం. తప్పక రండి. విజయవంతం చేయండి.
(విరసం 26వ మహాసభలు, 13-14 జనవరి, క్రౌన్ గార్డన్ ఫంక్షన్ హాల్ (పాత ఎం.వి.ఎస్ కాలేజి), న్యూ టౌన్, మహబూబ్ నగర్)

No. of visitors : 547
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •