ప్రతెమ - కొన్ని కొసర బుల్పికలు!

| సాహిత్యం | క‌థ‌లు

ప్రతెమ - కొన్ని కొసర బుల్పికలు!

- బమ్మిడి జగదీశ్వరరావు | 03.01.2018 10:44:59pm

కాకిపిల్ల కాకికి ముద్దు!

ʹకన్నడం వర్ధిల్లాలి.. కన్నడం వర్ధిల్లాలి!ʹ అన్నాడు పిల్లకవి.

ʹఏమయిందిరా నీకు?ʹ ఆందోళన పడ్డాడు పెద్దకవి.

ʹకన్నతల్లి కన్నడంకీ..ʹ అని ʹజైʹ అని కూడా తనే అన్నాడు పిల్లకవి.

ʹనువ్వసలు తెలుగువాడివేనా? మన మాతృభాషను మనం ప్రేమించకపోతే యింక బతికి యెందుకు దండగ..?ʹ అన్నాడు పెద్దకవి.

ʹఅలా అనుకుంటే కన్నడీయుడైన శ్రీకృష్ణదేవరాయుల వల్లనే కదా అలనాడు తెలుగు తేజమై వెలిగింది యీనాడు మిగిలింది..ʹ అన్నాడు పిల్లకవి.

ʹనిజమే అనుకో..ʹ పెద్దకవి పదాలు వెతుక్కున్నాడు.

ʹఆయన మనలాగే ఆయన మాతృభాషనే ప్రేమించివుంటే?ʹ పిల్లకవి మాటకు పిడుగు పడ్డట్టు చూశాడు పెద్దకవి. ʹఅంచేత మన భాషని ప్రేమిస్తూనే పక్కవాడి భాషని గౌరవించాలి..ʹ అన్నాడు పిల్లకవి.

నీ కాల్మొక్తా బాంచెన్!

ʹమన తెలుగు సాహిత్యకారులు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యంవల్లనే సాహిత్య గౌరవం కలిగిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు..ʹ

ʹఅందుకే మన రచయితలందరం ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి..!ʹ

ʹమరకందుకు కూడా కృతజ్ఞతలు జెప్పాలె..ʹ

ʹఎందుకు..?ʹ

ʹనిన్నటిదంక వో ప్రగతి శీలురమని, వీరవిప్లవకారులమని, ప్రజలకోసమే రాస్తున్నామని మనదగ్గరే ఫోజులుగొట్టి ప్రగల్భాలు పలికిన చానా మంది రచయితలు వాళ్ళు యెంత అల్పులో కీర్తి కండూతిగాళ్లో బలహీనులో చక్కంగ బయటపెట్టిండు. వేరుజేసి జూపిండు. అందుక్కూడా కృతజ్ఞతలు జెప్పాలె!ʹ

వందకోట్ల ముచ్చట!

ʹయాభైకోట్లతో ప్రపంచ తెలుగు మహాసభలన్నరు! మల్ల నిన్నటికి యెనభై.. నేటికి వందకోట్లని ఆఫీసర్లు లెక్కలు జెపుతున్నరు..ʹ

ʹకేసీఆరు సారు ముందలే జెప్పిండు గదనే.. యాభై గాదు, వంద కోట్లైనా ఖర్చుపెడతామని!ʹ

ʹవందకోట్లు ఖర్చుజేస్తే వేలరైతులు బాగుపడేటోళ్ళు.. లక్షల యెకరాలకు నీళ్ళు అందేటివి, మనం ముందల బతికినంకే గదా..

తెలుగో తెలంగానో మాట్లాడి సచ్చేటిది?! అయినా మనం మన తెలంగాణల యాసల మాట్లాడకుంటా యింగ్లీసుల మాట్లాడుతన్నమా ఏంది? గిప్పుడు సంబురాలు ముగిసినై! యేమచ్చింది?ʹ

ʹయేడకెల్లి మాట్లాడుతున్నవే.. మన సియ్యమ్ముసారుకు యెన్ని పద్యాలు వచ్చినయో గ ముచ్చట తెల్సింది! గురువుకాళ్ళ మీద పడి తన సంస్కారం నిరూపించుకున్నడు. తెలుగు గురించి మాట్లాడి తన సాహిత్యం నిరూపించుకున్నడు. గింతకంటే యేమి కావాలె? వందకోట్లని వో వొర్రుతన్నవ్..ʹ

సిన్మా సిత్రం!

ʹఅన్నా.. తెలవకడుగుతా గీ సిన్మావోళ్ళని పేరంటం పెట్టినట్టు ప్రతొక్కల్లనీ పిల్చిమరీ సన్మానించుడేoదే? ప్రపంచ తెలుగు మహాసభలకీ యీల్లకి యేమి సంబంధమే?ʹ

ʹగట్లనేసినావేందన్నా? మన తెలంగాణ భాషని యాసని నిన్నటిదంక విలన్లకీ బఫూన్లకీ పెట్టి కేతిగాల్లను జేసి ఆడించిన్రు గదనే.. కాపాడిన్రు గదనే?ʹ

ʹబూతులు గూడా మంచిగనే తీసిన్రు..ʹ

ʹతీస్తే మల్ల? రాస్తే మల్ల? గంతా తెలుగులోనే గదా జేసిన్రు. ఆలని తప్పక సన్మానించాలె. గందుకే ఆల్ల ఋణం తీర్సుకున్నడు మన ముఖ్యమంత్రిసారు..ʹ

రెండో స్థానం!

ʹమనది రెండో స్థానం..ʹ యెందులోనో చెప్పండన్నట్టు చూసింది గులాబీ కండువా.

ʹమన దేశంలోనే అత్యధికులు మాట్లాడే భాషగా మన తెలుగుకు రెండో స్థానం వుంది..ʹ కండువా చెప్పబోయింది.

ʹరైతుల ఆత్మహత్యల్లో కూడా దేశంలో మనది రెండోస్థానం..ʹ వొక్కసారిగా వినిపించింది.
ఆడియో కట్ అయ్యింది!

లెర్నింగ్ యిన్ తెలుగు!

ʹవేలెడంత లేడు.. అమ్మనాబూతులు ఆడడంలో అష్టావధానిలాగున్నాడే..?ʹ

ʹమరి? వొక్క ఆంగ్లపదం లేకుండా రాకుండా మొత్తం తెలుగులోనే తిడతాడు వెధవ..!ʹ

ʹమాకదే సంతోషం! మావాడు అలా అయినా తెలుగు మర్చిపోకుండా వున్నాడు..!ʹ

ʹగ్రేట్.. మనం మన కాలంలో యింగ్లీషు నేర్చుకోవడానికి బూతుపుస్తకాలు చదవలే? అలాగే యిదీనూ!ʹ

తీపి తెగులు!

ʹనాకు తెలుగంటే ప్రాణం. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలో చదివించినా నేనెప్పుడూ తెలుగే మాట్లాడుతాను. ఈనాడు దినపత్రిక ద్వారా కొత్త పదాలను స్వీకరిస్తాను. దూరవాణి నుండి చేరవాణి దాక. నన్ను ʹతెలు-గోడుʹ అని వెక్కిరించినా తెలుగులో మాట్లాడడం మానను. ఎందుకంటే తేనె కన్నా తీయనిది తెలుగు భాష. అందుకనే ఆ తీపి యెంత తిన్నా నాకు తినాలనిపిస్తూనే వుంటుంది..ʹ అన్నాడు తెలుగు భర్త.

ʹఅందుకే మీకు షుగరొచ్చింది..ʹ అంది అతని భార్య.

ʹలేదు.. నేనొప్పుకోను.. చక్కెరవ్యాధి.. మధుమేహం లాంటి మధురమైన భాష వుండగా యేవిటా మాటలు? ఇదేనా యిన్నేళ్ళ మన సంసారంలో నన్ను అర్థం చేసుకున్నది..?ʹ దుఃఖపడ్డాడు తెలుగు భర్త. తనకు షుగర్ వచ్చినందుకు కాదు, భార్యకు తెలుగు రానందుకు బాధపడి కన్నీరు కూడా కార్చాడు!?

తద్దిన తాంబూలం!

ʹఇక యేటా తెలుగు మహాసభలే! డిసెంబరు నెలలో రెండ్రోజులు జరుపుతామని కేసీఆరు ప్రకటించేశాడు!ʹ అన్నాడో కవి.

ʹయా.. ఎవ్విర్ ఇయర్ టూ డేస్ ఫుల్గా తెల్గు మాట్లాడేసుకోవచ్చు!ʹ అన్నాడో తెలుగాభిమాని.

చలో అంటే పొలోమని!

ʹఎవ్విర్ ఇయర్ టూ డేస్ ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టడం బావుంది, బట్ చలికాలం లోనే యెందుకు?ʹ
ʹచలికాలంలోనే కదా శాలువాలకీ దుప్పట్లకీ మహా గిరాకీ?ʹ

తెలుగది యేలయన్న..!

అతనికి తెలుగులో మాట్లాడడమూ రాయడమూ చదవడమూ వొచ్చు! వ్యవసాయమే వృత్తి! తెలుగొచ్చినా సరే పురుగులమందు తాగాడు! ప్రాణాలు తీసుకున్నాడు!

ఇతనికి తెలుగులో మాట్లాడడమూ రాయడమూ చదవడమూ వొచ్చు! చేనేతనే వృత్తి! తెలుగొచ్చినా సరే వురిపోసుకున్నాడు! ఉసురు తీసుకున్నాడు!

ఆమె తెలుగు మీడియంలోనే చదువుకుంటోంది! చదువులతల్లి! తెలుగొచ్చినా సరే వొత్తిడి తట్టుకోలేక మేడమీదినుండి దూకింది! తనువూ చాలించింది!

ఈమె పెళ్ళాడింది! పిల్లలనీ కంది! ఇంటిని కంటికిరెప్పలా చూసుకొని ఉత్తమ గృహిణి అని కూడా అనిపించుకుంది! తెలుగొచ్చినా సరే కట్నం బాకీ తీర్చలేదు! సిలిండర్ పేలింది! గృహస్తురాలు స్వర్గస్తురాలైంది!

వాళ్ళు యిసుక మాఫియా యిబ్బందుల గురించి తెలుగులనే మాట్లాడిన్రు! తెలుగొచ్చినా సరే పోలీసు స్టేషన్ల పెట్టిన్రు! కొట్టినరు! సంపినరు!

వీళ్ళు దొరా నీ కాల్మొక్తా అని తెలుగులనే అన్నరు! తెలుగొచ్చినా సరే దొర వూకోలె! మురికి కుంటలోకి దిమ్పిండు! యిరవై రోజుల సంది బంధించి యిడిసి పెట్టిండు!

గదే తెలుగు?

ʹగదే తెలుగు?ʹ

ʹగ(అ)దే తెలుగు!ʹ

ʹపద్యాలు, అవధానాలు, శ్లోకాలు, మంత్రోచ్చారణలు, పూర్ణకుంభాలు, కలశాలు, దీపాలు, పురోహితులు.. అబ్బో తెలుగు మహాసభలు..ʹ

ʹఅచ్చం అగ్రహారాల్లోనే జరిగినట్టుంది. గడీల్లోంచి వొచ్చి సక్కంగ జరిపినట్టుంది!ʹ

ʹగిదే తెలుగు?ʹ

ʹయజ్ఞోపవీతాల జందెపు తెలుగు!ʹ

ʹమరి మనతెలుగు..?ʹ

No. of visitors : 453
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార స్వరాలకు ఆహ్వానం

virasam | 09.12.2017 10:13:47am

ప్రభుత్వ తిరణాలను, బాకాభజంత్రీలను, దుప్పట్లను, తాయిలాలను తిరస్కరించే రచయితలు ఎక్కడున్నా, నిక్కచ్చిగా ఒక్క పదమైనా ఫరవాలేదు.. రాజ్యం కళ్ళలోకి చూసి తలెగరేసే కవ...
...ఇంకా చదవండి

వెలివేయబడ్డ అక్షరం

వెంకట్ కొండేటి | 13.12.2017 11:59:44am

అంటరానితనంతో వెలివేసిన నా అక్షరాల్ని ధిక్కార స్వరాలు చేసి నీ ʹజాత‌రʹలో నిన‌దించాల‌ని ఉంది...
...ఇంకా చదవండి

గుండె గుర్తులు వెతుక్కుంటూ

అశోక్ కుంబము | 13.12.2017 11:37:22am

సాలు సాలులో సాగు వీరులు వరిగి పోతుంటె నీ కలంలోకి ప్రవహించిన రైతన్నల వెచ్చటి నెత్తురు అప్పుడే గడ్డకట్టిందా?! ఆపదలో అభయాన్నిచ్చే అక్షర సాహస విత్తనాలు భూమిన...
...ఇంకా చదవండి

తెలంగాణ, తెలుగు మహా సభలు

పాణి | 05.12.2017 11:14:23pm

భాషా సంస్కృతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికంటూ ప్రజా విధానం ఏదైనా ఉన్నదా? కోస్తాంధ్ర పాలకవర్గ సంస్కృతికంటే భిన్నమైన సాంసృతిక అవగాహన కేసీఆర్ కు ఉన్నదా? ఇం...
...ఇంకా చదవండి

కవి ఎక్కడ?

పాణి | 09.12.2017 11:50:36pm

కులము గలుగువాడు, గోత్రంబుగలవాడు, విద్యచేత విర్రవీగువాళ్లు... ఎందరు ఉన్నా, వాళ్ల చుట్టూ లోకం తిరుగుతున్నట్టనిపించినా కవి ఒప్పేసుకుంటాడా? చూస్తూ ఊరుకున్నాడా?...
...ఇంకా చదవండి

తెగులు సోకిన రచయితలారా రండీ

అభిన‌వ్ బూరం | 13.12.2017 12:49:48pm

విలువలు వదిలిపెట్టి.. వడివడిగా ఉరికి రండి.. కత్తిరించుకున్న కులం తోక.. అతికించుకోని రండి.. తెలంగాణ యాస కాదు బాషాన్నోళ్లు.. తెలుగే వెలుగంటు మూసుకుని రండీ.. మ...
...ఇంకా చదవండి

సుఖ విరోచనం!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.12.2017 11:58:32pm

ʹకవిత్వం యెలా వస్తుందో గవర్నరుగారు చెప్పారు..ʹ ʹఎలా వస్తుంది?ʹ ʹసుష్టైన భోజనం.. తాంబూలం.. వుంటే వస్తుందని..ʹ ʹఏమొస్తుంది.. నిద్రా?ʹ ʹకాదు, కవిత్వం..!ʹ.....
...ఇంకా చదవండి

పాలక వర్గ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరిద్దాం

విర‌సం | 07.12.2017 12:39:17am

అగ్రకుల, భూస్వామ్య, దళారీ పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. ప్రజా నిరసనను దారి మళ్లిండానికే...
...ఇంకా చదవండి

బుద్ధిజీవుల క‌ర్త‌వ్యం

వరవరరావు | 16.12.2017 06:17:47pm

పోతన ప్రాంగణంలో జరుగుతున్న ఈ సభల్లో సింగభూపాలునికి పోతన తన భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి నిరాకరించాడన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటారా! సత్కవులు హాలికులనైనన...
...ఇంకా చదవండి

క‌ళావేత్త‌లారా! మీరేవైపు?

మాగ్జిం గోర్కి | 16.12.2017 09:39:01pm

1932లో అమెరికా జ‌ర్న‌లిస్టుకి గోర్కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ( సృజ‌న ప‌త్రిక నుంచి )...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •