విద్యావిధానంలో ప్ర‌భుత్వ ద్వంద వైఖ‌రి

| సాహిత్యం | స‌మీక్ష‌లు

విద్యావిధానంలో ప్ర‌భుత్వ ద్వంద వైఖ‌రి

- వి.చెంచ‌య్య‌ | 03.01.2018 11:23:28pm

ʹʹదళిత బహుజనులకు తెలుగు, ʹʹఅగ్రకులాలకు ఇంగ్లీషు చదువా!?ʹʹ అనే పేరుతో కంచ ఐలయ్య పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ట్రస్టు 2006 జూన్‌లో ప్రచురించింది. ఇందులో ఆరు వ్యాసాలున్నాయి. ఇవన్నీ 2005, 2006 సంవత్సరాలలో వార్త దినప్రతికలో అచ్చయినవే. ఇది రాసి పది పదకొండు సంవత్సరాలయినా, ఇప్పటికీ సమకాలీనతను కలిగి ఉన్నవే. పుస్తకం శీర్షిక చివర రచయిత ఒక ఆశ్చర్యార్ధకాన్ని, ఒక ప్రశ్నర్ధాకాన్నీ ఉంచినట్టు, ఇప్పటికీ ఇందులోని కొన్ని విషయాలకు ఆశ్చర్యాపడాల్సిందే. మరికొన్ని విషయాలకు ప్రశ్నిల్ని సంధించాల్సిందే.

ఇటీవల ʹʹసామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళుʹʹ అనే చిన్న పుస్తకం ద్వారా సంచలనం రేకెత్తించిన కంచ ఐలయ్య, విద్యా విధానం గురించి రాసిన పై పుస్తకంలో కొన్ని ఆలోచనల్ని రేకెత్తించారు. ఈ పుస్తకంలోని వ్యాసాలలో కొన్ని విషయాలు అంగీకరించదగినవీ, కొన్ని ఆలోచింపదగినవీ, కొన్ని చర్చించ దగినవీ ఉన్నాయి. భాషాభిమానులే గాక, విద్యారంగం గురించి ఆలోచించే వాళ్ళు ఈ పుస్తకాన్ని చదివి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రస్తుత విద్యావిధానంలో భాషామాధ్యమం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఒక ద్వంద్వ వైఖరిని రచయిత ఎండగడుతున్నాడు. తీవ్రంగా ప్రశ్నిస్తున్నాడు. శీర్షకలోనే అది వ్యక్తమవుతోంది. దళిత బహుజనులకు తెలుగు మాధ్యమంలో బోధించడాన్నీ, అగ్ర కులాలకు ఇంగ్లీషు మాద్యమంలో బోధించడాన్నీ ఐలయ్య సూటిగా ప్రశ్నిస్తున్నాడు. పుస్తకం శీర్షిక చూడగానే ఐలయ్య పొరబడుతున్నాడేమో అనిపిస్తుంది. దళిత బహుజనుల్ని ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవద్దని ఎవరన్నారు అని కొందిరికి అడగాలనిపించవచ్చు. ఏ మాధ్యమంలోనైనా చదువుకోడానికి ఎవరికైనా అవకాశం ఉంది గదా అనిపిస్తుంది. కానీ పుస్తకం చదివితే అసలు నిజం తెలుస్తుంది.

ఇప్పటి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం మాత్రమే ఉంది. ప్రయివేటు పాఠశాలల్లోనే ఆంగ్ల మాధ్యమం ఉంది. ప్రయివేటు పాఠశాలలంటే ఇవాళ కార్పొరేట్‌ పాఠశాలలోనే అర్థం. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చెయ్యడం, ఎల్‌కేజీ నుండే ఇంగ్లీషు నేర్పించడం, ఆంగ్ల మాధ్యమంలో అన్ని సబ్జెకులు బోధించడం వీటి ప్రత్యేకత, వీటిల్లో చదివే పిల్లలకు ఇంగ్లీషు ఎంత వస్తుందో తెలియదుగానీ, అయిదవ తరగతి చదివిన పిల్లల్లో చాలా మందికి తెలుగు స్పష్టంగా చదవడం మాత్రం రావడం లేదు. ఆద్యంతం చదువంతా ఇంగ్లీషు మాధ్యమంలో సాగుతుంది కాబట్టి ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలు ఇంగ్లీషు విషయంలో వీళ్ళతో పోటీ పడడం కష్టం అన్నది కూడా ఒక వాస్తవం. దళిత బహుజనుల్లో ఎక్కువ మంది ప్రయివేటు పాఠశాలల్లో ఫీజులు కట్టలేక ప్రభుత్వ బడుల్లో చదువుతుంటారు. అందువల్ల వీరు తెలుగు మాధ్యమంలోనే చదవాలి. ఆంగ్ల మాధ్యమంలో చదివే అవకాశం లేదు. అందువల్ల దళిత బహుజనులకు ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని నిషేధించినట్టే అవుతుంది. దీనికి పరిష్కారంగా ఐలయ్య చేసిన ప్రతిపాదన సహుేకంగానే ఉంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనేది ఆ ప్రతిపాదన. ఐలయ్య ఆంగ్ల మాధ్యమాన్ని మాత్రమే ప్రవేశ పెట్టాలనడం లేదు. ఎవరికిష్టం వచ్చినట్టు వారు చదువుకోడానికి తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు రెండూ ఉండాలంటున్నాడు. దళిత బహుజనుల్నుండి ఆంగ్ల మాధ్యమ ఉద్యమం తలెత్తగానే ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండే ఒకటో తరగతి నుండి పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్నే ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. హఠాత్తుగా ఈ నిర్ణయం వచ్చేసరికి పిల్లల్లో, ఉపాధ్యాయుల్లో, తల్లదండ్రుల్లో వ్యతిరేకత వచ్చింది. విద్యా సంవత్సరం మధ్యలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తోందరపాటనిపించింది. పాఠ్య పుస్తకాలు, ఉపాధ్యాయులకు ట్రైనింగ్‌ మొదలైన ముందు ఏర్పాట్లు లేకుండా ఉన్నట్టుండి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం అనాలోచిత చర్యే. చివరకు ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుండి రెండు మాధ్యమాల్నీ ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకున్నది.

ఈ నేపథ్యంలో తెలుగు భాషా పరిరక్షణ సంస్థలు వేస్తున్న ప్రశ్న ఒకటుంది. కనీసం ప్రభుత్వ బడుల్లోనైనా తెలుగు ప్రాధాన్యం లేకపోతే ఎలా అన్నది వారి ప్రశ్న. రెండు మాధ్యమాలూ ఉంటే పిల్లలు ఎక్కువగా ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకుంటూరన్నది వారి భయం. ఇక్కడ ఐలయ్య వేస్తున్న ప్రశ్నలు ఆలోచింపదగినవి. తెలుగు భాషను పరిరక్షించాల్సిన బాధ్యత దళిత బహుజనులదేనా? అగ్రకులాల వారికి ఆబాధ్యత లేదా? ప్రయివేటు పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని కూడా పెట్టరాని ప్రభుత్వం ఎందుకు అడగడం లేదు? ప్రధానంగా ఆయన ప్రశ్నలు ఇవి. ఈ ప్రశ్నల్లో న్యాయం ఉంది. శాస్త్రీయత ఉంది. ఈ ప్రశ్నల్ని సంధించడంతో బాటు. ఐలయ్య దేశవ్యాప్తంగా ఒకే రకమయిన విద్యావిధానం ఉండాలని- అంటే ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఒకే విధానం, ఒకే సిలబస్‌ ఉండాలని కోరడంలో ఔచిత్యం ఉంది. కార్పోరేట్‌ పాఠశాలలు ఇవాళ పుట్టగొడుగుల్లా పుట్టుకోస్తున్నాయి. విద్య లాభాదాయకమైన వ్యాపారంగా మారిపోయింది. విద్య వైద్యం ఇలా వ్యాపారాలుగా మారుతుంటే ప్రభుత్వం మౌనంగా ఉండడమే గాక, ప్రోత్సాహిస్తున్నది కూడా. అగ్రకులాల పిల్లలతోబాటు, అట్టడుగు వర్గాల పిల్లలకు కూడా విద్యలో సమాన అవకాశాలుండాలనడం, అన్ని విద్యా సంస్థలపైనా ప్రభుత్వ అజమాయిషీ ఉండాలనడం గొంతెమ్మకోరిక కాదు. కాని ప్రభుత్వం దాన్ని పట్టించుకోదు. పట్టించుకోక పోవడంలో దాని ప్రయోజనాలు దానికున్నాయి.

ఐలయ్య ఈ ప్రతిపాదనతో ఆగలేదు. దేశవ్యాప్తంగా ఒకే విధానం, ఒకే సిలబసే ఉంది. అన్ని వర్గాల వారికీ విద్యలో సమాన అవకాశాలు వస్తే, అట్టడుగు వర్గాల పిల్లలు కూడా, అగ్రకులాల పిల్లలతో పోటీ పడగలరని, అప్పుడు రిజర్వేషన్ల అవసరం కూడా ఉండదనేంత వరకు ఐలయ్య ఆలోచనలు పోయాయి. రిజర్వేషన్లు ఉండాలనడంలో సామాజిక అవసరం, ఔచిత్యం, న్యాయం ఉన్నా, పై అవకాశాలన్నీ కవ్వించి రిజర్వేషన్లను తోలగించే సాహసానికి ప్రభుత్వం పూనుకోవడం జరిగే పనిలేదు. ఎందుకంటే రిజర్వేషన్లు ఒక సామాజిక అవసరం అనేదాని కన్నా, అవి ఇప్పుడు పాలక పార్టీలకు ఓటు బ్యాంకులుగా మారిపోయాయన్నది పరమసత్యం. అంతేగాకుండా ఇవాళ కొన్ని అగ్రకులాలు కూడా మమ్మల్ని ఎస్సీల్లో, ఎస్టీల్లో, బీసిల్లో చేర్చండని అడుగుతున్నారు. ఓట్లకు ఉపయోగ పడతాయనుకుంటే ఆ డిమాండ్లను తీర్చడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడడం చూస్తున్నాం. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ప్రకటించి, వారిని బీసిల్లో చేర్చాలని ప్రభుత్వం ఈమధ్య నిర్ణయించడం ఇందులో భాగంగానే చూడాలి. ఈ అవకాశం లేని సందర్భాల్లో బ్రహ్మణ కార్పోరేషన్‌ అనీ, వైశ్య కార్పోరేషన్‌ అనీ ఏర్పాటు చేసి, వాటికి కోట్లలో నిధుల్ని సమకూర్చుడం కూడా ఓటు రాజకీయాలే.

తెలుగు భాషను కాపాడుకోవాలని ఉద్యమించే వారివో చాలా మంది తమ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారని ఐలయ్య అనడంలో నిజం లేకపోలేదు. ప్రయివేటు విద్యాసంస్థల్లో అన్ని స్థాయిల్లోనూ తెలుగు భాషను బోధించకుండా దానికి బదులు మంచి మార్కులోస్తాయని సంస్కృతం బోధిస్తున్నారు. వీరికి తెలుగూ, సంస్కృతమూ రెండూ రాకుండా పోతున్నాయి.

మాతృభాషలో విద్యాబోధన విషయంలో రెండు అభిప్రాయాలు ఉన్నాయి. మాతృ భాషలో బోధన ఉంటే విద్యార్థులు విషయాన్ని బాగా అవగాహన చేసుకుంటారన్నది ఒక అభిప్రాయం. ఇది తిరుగులేని సత్యం. ఇంగ్లీషు రాకపోతే పోటీని ఎదుర్కోలేరని ఇంకో అభిప్రాయం. ఇందులోనూ కోంత నిజం లేకపోలేదు. ఐలయ్య ప్రతిపాదన ఈ విషయంలో రెండు అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపిస్తుంది. మూడు సబ్జెక్టులు తెలుగులోనూ, మూడు సబ్జెక్టులు ఇంగ్లీషులోనూ బోధించాలన్నది ఆయన అభిప్రాయం. ఆంగ్ల విద్యను, ప్రాంతీయ భాషను ప్రతిస్కూల్లో సమానంగా బోధించాలన్నది ఆయన వాదన. గ్రామాల్లోని పిల్లలకు కూడా మాధ్యమాన్ని ఎంచుకునే హక్కు ఉండాలనీ, రెండు మాధ్యమాల స్కూళ్ళు అక్కడా ఉండాలనీ ఆయన డిమాండు. ఆంగ్లభాష వల్ల తెలుగు చనిపోతుందని భాదపడేవారికి, తెలుగు భాష చేతిలో చనిపోతున్న లంబాడీ, గోండు, కోయ భాషలు గుర్తుకురావా అని ఐలయ్య సూటిగా అడుగుతున్నాడు.

ఇవాళ ఆంగ్ల భాషను వలసభాషగా భావించి ఆంగ్ల భాషాధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాని కొన్ని వేల సంవత్సరాల క్రితం సంస్కృతం కూడా వలస భాషే కదా అంటున్నాడు ఐలయ్య. మన దేశంలోని అనేక భాషలపైన సంస్కృతాధిపత్యం ఉంది. సంస్కృతం, ఇంగ్లీషు రెండూ భాషలే అయినపుడు ఆంగ్ల భాషాదిపత్యాన్నే వ్యతిరేకించాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్న. పైగా ఇవాళ ప్రపంచలో పోటీ పడాలంటే సంస్కృతం కన్నా ఇంగ్లీషే ఉపయోగపడుతుంది.

ఇలా ఈ చిన్న పుస్తకాంలో ఐలయ్య ఆలోచనలు ఆలోచింప దగినవిగా, కనిపిస్తున్నారయి. ఈ ధోరణిలో ఆలోచిస్తున్న ఐలయ్య కొన్ని వివాదాస్పద ప్రతిపాదనలు కూడా చేస్తున్నారు. లింక్‌ లాంగ్వేజ్‌గా, బోధనా భాషగా ఎలాగూ ఆచరణలో ఇంగ్లీషు ఉన్నప్పుడు దానినే ఆధికారికంగా జాతీయభాషగా గుర్తించాలన్నది ఆయన చేస్తున్న వివాదస్పదా ప్రకటనల్లో ఒకటి. ఆచరణలో ఇది నిజమే అయినా, ఎవరికి మాతృభాషకాని భాషను జాతీయభాషగా గుర్తించాలనడం, దేశంలోఎలాగూ దోంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని చట్టబద్ధం చెయ్యాలనడం లాంటిదే అవుతుంది. అవినీతి సర్వాంతర్యామిగా ఉంది కాబట్టి దాన్ని దైవంతో సమానంగా భావించమన్నట్టుంటుంది. ఆంగ్లాన్ని, ప్రాంతీయ భాషనూ రెండిటినీ సమనంగా బోధించాలంటున్నా ఐలయ్య స్ఫూర్తికి ఇది భిన్నంగా కనిపిస్తుంది.

బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం మతాలు కన్నా హిందూమతానికి సైన్సును అడ్డుకునే స్వభావం ఎక్కువగా ఉందని ఐలయ్య అభిప్రాయం. క్రైస్తవం ఉన్నా దేశాల్లోనూ సైన్సును అడ్డుకాని శాస్త్రవేత్తల్ని సజీవదహనం చేసిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఇది దాదాపు అన్ని మతాలకూ ఉన్నా స్వభావమే. అయితే క్రైస్తవం ఉన్న పాశ్చాత్య దేశాల్లో ముందుగా పెట్టుబడిదారీ విధానం రావడంతో స్వేచ్ఛ, సమానత్వం నినాదాలు అక్కడ వచ్చాయి. ఆధునిక భావాలు ముందుగా అక్కడే మొదలయ్యాయి. క్రీ.శ.16వ శతాబ్ధానికే ఆదేశాల్లో ఆధునికత ప్రవేశించి సైన్సు అభివృద్ధికి దోహదం చేసింది. కాస్త ముందుగా అక్కడ సైన్సు అభివృద్ధి చెందడంతో నూతన ఆవిష్కరణలు అక్కడే వచ్చాయి. హిందూ మతం ఉన్న భారత్‌, నేపాల్‌ దేశాల్లో ఏలాంటి నూతన ఆవిష్కరణలు లేవనడానికి ఐలయ్యకు అవకాశం ఏర్పడింది. అయితే క్రీ.పు.మే భారత దేశంలో ఆర్యభట్ట సున్నాను కనుక్కోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా గణిత శాస్త్రం పురోగతి సాధించడానికి అవకాశం ఏర్పడిందనాడంలో అతిశయోక్తి లేదు.

ఇలా కొన్ని వివాదస్పద వ్యాఖ్యలున్నా మొత్తం మీద ఈ పుస్తకాం పాఠకుల్లో కొత్తా ఆలోచనల్ని రేకెత్తిస్తుదనడంలో సందేహం లేదు.

No. of visitors : 153
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఒంటరిగా మిగిలిపోకూడని కవి

వి. చెంచయ్య | 05.09.2017 11:21:59pm

ఈ కవిలో ఒక వైరుధ్యం కనిపిస్తుంది. ఒకసారి ఆశ, మరోసారి నిరాశ; ఒకచోట చైతన్యం, మరోచోట వైరాగ్యం. ముందు ముందు ఈ కవి ఎటువైపు మొగ్గుతాడో అనే అనుమానం కలగక మానదు......
...ఇంకా చదవండి

తెలుగు భాషనే ఊపిరిగా పీలుస్తున్న చెన్నైవాసి

వి. చెంచయ్య | 18.11.2017 12:26:42am

తెలుగు భాషను సంబంధించిన అనేక విషయాల్ని సంజీవరావు ఈ 80 పేజీల పుస్తకంలో అద్దంలో చంద్రుడిలాగా వివరించడానికి ప్రయత్నించాడు. వర్ణవిభాగం, పద విభాగం, అర్థం - అన.....
...ఇంకా చదవండి

బుద్ధుడి ʹకాలామ సుత్తంʹ ఏం చెబుతుంది?

వి. చెంచయ్య | 02.11.2017 10:55:39am

అన్ని తాత్విక చింతనలనూ పరిశీలించి, సరైన నిర్ణయానికి రావడానికి బుద్ధుడి జ్ఞాన సిద్ధాంతాన్ని తెలియజేసే కాలామ సుత్తం ఆచరణాత్మకమైన ప్రాతిపదికన అందిస్తుందని రచయ...
...ఇంకా చదవండి

కవి ఆక్రోశం కవుల సమిష్టి ఆక్రోశం కావాలి

వి. చెంచయ్య | 06.10.2017 12:06:03am

అగ్రవర్ణ ఆధిపత్యం మన సమాజంలో అనాదిగా ఉన్నదే. అయితే కులవ్యవస్థలోని లోటుపాట్లను పాలకవర్గం ఎలా తెలివిగా ఉపయోగించుకుంటున్నదో కవి దృష్టిని వదిలిపోలేదు......
...ఇంకా చదవండి

కవిలో చిత్తశుద్ధి ఉంది - అవగాహనే కొరవడింది

వి. చెంచ‌య్య‌ | 06.12.2017 12:51:59am

సిద్ధాంత దృక్పథంతో విషయాల్ని పరిశీలించడంలో మాత్రం పొరబాట్లు జరుగుతున్నాయి. ʹʹఆటవిక యుద్ధాన్ని ఇంకెన్నాళ్ళు చేద్దాం?ʹʹ అన్నప్పుడు కవి ఆటవిక అనే మాటను దుర్మార...
...ఇంకా చదవండి


  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...

  విరసం 26వ మహాసభల్ని విజయవంతం చేసిన పాలమూరు ప్రజలకు, ఆహ్వానసంఘానికి, సాహితీ మిత్రులకు, ప్రజాసంఘాలకు కృతజ్ఞతలు
  అరుణతార జనవరి - 2018
  జయహో టి.టి.ఆర్‌.
  జెరూసలేంపై ట్రంప్‌ క్రూసేడ్‌
  కుందాపన
  కాస్త..దారిస్తారా!
  చూపుడు వేలై పొడుచుకొస్తాను
  చీగుడ్లు
  విద్యావిధానంలో ప్ర‌భుత్వ ద్వంద వైఖ‌రి
  కవులారా ఓ కళాకారుల్లారా
  కులమతాలు లేని సమాజం కోసం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •