కుందాపన

| సాహిత్యం | స‌మీక్ష‌లు

కుందాపన

- కెక్యూబ్ వర్మ | 04.01.2018 01:31:58pm

నేల విడిచి సాము చేస్తే అది యుద్ధమూ కాదు. మట్టిని మరచిన సృజన కవిత్వమూ కాదు కదా? తను ఉద్యోగ రీత్యా ఎంత దూరాన వున్నా తన ఊరి పట్ల వున్న ఆప్యాయత కుందాపనగా గుండె ఐమూలలలో దాగి సలపరమెట్టడమే ఆ గుబులే తనలోంచి భావధారగా వెలివడినదే ʹకుందాపనʹ రవీ వీరెల్లి గారి కవిత్వం.

ఈ కవిత్వం గురించి విరసం సాహిత్య పత్రికలలో మాటాడుకోవడమంటే కొత్తగానే అనిపించవచ్చు. కానీ దారులు తెరుచుకున్న వేళ మనలోని లోలోపలి స్వరాన్ని కూడా ఎక్కడో మీటి ఒక దగ్గరి జీవన తాత్వికతను తప్పక మరల మనమూ చదువుకోవాలని దానితో ముడివేసుకుని ఆస్వాదించాలనుకోవడమే ఈ కాస్తా స్పేస్ తీసుకోవడానికి నేను ఈ పరిచయాన్ని రాస్తున్నాను. జీవితములోని అన్ని పార్శ్వాలను ధారణ చేయాల్సిన అవసరము వుంది. ఒక కొత్త వాక్యమో ఒక కొత్త భావనో మనల్ని మన నేలపై నిలబెట్టే ఒక కుదుపును ఎప్పుడూ అనుభవంలోకి తీసుకోవాలని. ఆ అనుభవానికి సరిహద్దులు అక్కర్లేనితనం ఎప్పుడూ వెంటాడితేనే మనం మరింతగా లోతుగా జీవితాన్ని పరిశీలించగలం అని. తర్కానికి అందీ అందనట్టుగా వుండే ఒక లోతు ఏదో మనల్ని వెంటాడుతూ వుంటుంది. నిజానికి ఆ అన్వేషణే కదా మానవ పరిణామ క్రమంలో ఇన్ని మలుపులకూ కారణం. కార్య కారణ సంబంధాల శోధనలోంచి ఒక మనిషిని వెంటాడుతున్న భావధార వెనకున్న మూలాన్ని ఎవరికి వారు వెతికి పట్టుకోవాల్సిందే. రోజువారీ తీరికలేని ఉద్యోగం, తన చుట్టూ పరచుకున్న తనది కాని ఒక మాయా ప్రపంచంలోంచి కవి తన స్వాభావికమైన పసితనాన్ని వెతుక్కుంటూ చేసిన ఆక్రందన తనతో పాటుగా మనల్నీ మన ప్రపంచంలోకి తీసుకు వస్తుంది. వెంటాడుతున్న ఒంటరితనంలోంచి మెలకువలోంచి కలగనే ఒక తాత్వికత ఈ కవిత్వంలో మనము అనుభవిస్తాం. అందుకే ఇది విశాలమయ్యే ఒక కొత్త చూపునిచ్చే కవిత్వంగా భావిస్తూన్నా. ఇంక తన కవిత్వంలోకి నడుద్దాం.

ʹరాత్రికి లోకువైʹ కవితలో రవి ఇలా అంటారు

కలసినట్టే కలిసి విడిపోయే
రాత్రీపగళ్ళ పగుల్లనుంచి

ఒంటరి రోజులన్నీ
ఒక్కొక్కటే
విడివిడిగా దొర్లిపోతుంటే
కలిసి పంచుకున్న
ఆ కొద్ది క్షణాలు కూడా
కన్రెప్పల సందుల్లోంచి
ఎప్పుడో ద్రవించి పోయాయిలే.
చీకటికేం
అంచులను చురకత్తుల్లా చేసి
రంపపు కోత కోస్తుంది…..

సున్నితత్వాన్ని కోల్పోతున్న జీవితం మనిషిని అంతకన్నా మృధువుగా చేయడం ఈ కవిత్వానికున్న పరిమళం. ఎంత విసిరికొడుతున్నా అల మరల సంద్రంలోకి వెళ్ళి కొత్త నురుగుతో తీరాన్ని చేరే ప్రయత్నం చేయడం ఇందులో మనం చూడవచ్చు.

ʹనదితో నాలుగడుగులుʹ

మలుపు మలుపులో
మరో కొత్త పాటకు స్వరం దిద్దుకుంటు
మంద్రంగా
సాగిపోతుంది నది.

రెప్పపాటి రోజుల్లా
ఒకొక్కటిగా ఒడ్డు చేరి నిష్క్రమించే
అలలు.
జవాబు చెప్పే లోపే
ప్రశ్న మార్చే జీవితంలా
ఒకటి రెండై
రెండు నాలుగై
లెక్క తేలని
అలలలలు.

రోజూ చదివే పుస్తకమే కదాని
బడికెళ్ళడం మానడుగా!
పుట మారుస్తూ
మళ్ళీ
పొలిమేరల్లో సూర్యుడు………..

కవిత్వాన్ని చేయడానికి తనెక్కడా గాభరా పడడు. చాలా సూక్ష్మంగా అనిపించే దృశ్యాలనే మనముందు ఒక కొత్త పదచిత్రంతో రంగద్దడం ఈ కవిత్వంలో మనకు కనిపిస్తుంది.

చినుకును ముట్టుకుంటే
ఆకాశాన్ని ముద్దు పెట్టుకున్నట్టే

ఆకును పట్టుకుంటే
ఆరారు కాలాలని పిడికిట్లో బిగించినట్టే

కంటి కిటికీ తెరిచి
కాంతి కిరణాన్ని రా రమ్మని పిలిస్తే
ఏడేడు రంగులతో ఇల్లలుక్కున్నట్టే! ( దేహకాంతి)

రాత్రంతా సోపతున్న
ఈస్ట్మన్ కలర్ కల
అంజాన్ కొడుతూ
వెనక్కి తిరిగి సూడకుండా వెళ్ళిపోతది.

గుండె
అమ్మ లేని ఇల్లవుతది. (మొదటి వాక్యం)

తన చుట్టూ వున్న ప్రపంచంలోని అతకనితనం వెంటాడుతూ యుద్ధాన్ని వ్యతిరేకించే ʹPainʹ తన కవితలోకిలా ఒలికి

ఎప్పుడూ యుద్ధ కథలే చెప్పే
దిక్కుల గోడల మీద
ఒకరి తలని మరొకరు నరుక్కుంటున్న
చీకటి వెలుగుల చిత్రం.
సముద్రపు గుండెనొప్పిని
ఏమాత్రం పట్టించుకోకుండా
నిద్దరోతున్న ఆకాశం.
బాధల్ని
ముల్లుతో అవ్విచ్చుకుంటూ
తిరుగుతున్న కాలం.
గాయాల్ని కుట్టేందుకు
గాజు పెంకుల్ని నూరి దారం నేస్తున్నారెవరో.
ఎంతైనా
ఒకే కవిత్వానికి పుట్టిన కవలలం కదా
ఒకరికొకరం కాల్చిన సూదులనయినా అరువిచ్చుకుందాం.

ప్రయాణమైన తరువాత తిరుగు ప్రయాణం ఇంక వుంటుందా నిజంగా. గమ్యాన్ని చేరుకోవాలనే ఆకాంక్ష తప్పనిసరిగా తనని వెంటాడుతు తిరిగి తన గూటిలోకి అలాగే మరలి రాగలరా? కానీ ఒక ఆశ ఆర్తిగా మనిషిని వెంటాడుతుంది. జీవితమంతా యుద్ధమైనా చివరిగా తల్లి ఒడిలోకే చేరాలన్న పసిమనసు మనల్ని మేల్కొలుపుతూనే వుంటుంది.

రాళ్ళ కోతలు భరిస్తూ పరిగెత్తిన నదికి
ఏదో ఓ రోజు సముద్రం లేపనం రాస్తుంది.

వీస్తూ వీస్తూ పాయలుగా విడిపోయిన గాలిని
ఏదో ఓ దిక్కు ఒక్కటి చేసి తిరిగి ప్రాణం పోస్తుంది…


ఒంటరి మేఘంలా
అటూ ఇటూ
ఎంత సేపు తచ్చాడగలను?!
కాసేపట్లో వెయ్యిగా విడిపోతా.
చివరికి చినుకులన్నిటినీ చేరదీసుకుని
పెద్ద స్మూహమై దండెత్తుతా.
యుద్ధం వెలిసాక
ఏ ఏట్లోనో మళ్ళీ ఏకాకై పారుతా…

ఎప్పటికైనా
ఆ మెత్తటి మట్టి కౌగిట్లో
సరికొత్త కలొకటి మళ్ళీ పొరలు విప్పుకొని
మొలకెత్తుతుంది.
ఒంటరిగానే. (Solitary)

ఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం. సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది. కలసి నడవాల్సిన దారుల్ని వదిలి ఒక దిగులు మనిషిని కమ్ముకున్న ఆవిరి ఎంత ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ఏదీ ఆ దాహార్తిని తీర్చలేని ఒక వేదన వెంట పరుగెత్తడం ఈ కవిత్వం మనల్ని మేల్కొలుపుతుంది. అత్యంత వేగవంతమైన జీవితంలో వున్న మనిషిని తన చుట్టు వున్న సాంకేతికత యాంత్రికత ఎంత వేదనా భరితమో తెలియ చేస్తుంది. ఇది రవీ వీరెల్లి గారి రెండవ కవితా సంపుటి. మొదటిది ʹదూపʹ. తనది కరీంనగర్. చివరిగా ముగింపుగా తన వాక్యంతోనే

అనుకుంటాం గానీ
చీకట్లోకి నడిచినంత స్వేచ్ఛగా వెలుగులోకి వెళ్ళలేం
…………….. నగ్నంగా!

No. of visitors : 355
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆకు క‌ద‌ల‌ని చోట వ‌ర్షించిన క‌విత్వం

కేక్యూబ్ వ‌ర్మ‌ | 20.10.2016 12:53:32am

ఒకమారుమూలపాఠశాలఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్నిభరించలేక ఈ ఉక్కపోతనుధిక్కరిస్తూతనచుట్టూవున్నఆకుకదలనితనాన్నికవిత్వంగామనముందుఆవిష్కరించినదే ఈ సంకలనం.......
...ఇంకా చదవండి

ఆ పావురాలు!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 02.01.2017 11:39:40pm

ఒలికిన నెత్తురు అద్దిన జెండానందుకుంటూ గుంపుగా ఆ పావురాలు! ...
...ఇంకా చదవండి

తెలవారని ఆకాశం!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.12.2016 11:52:30am

కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన వాన చివుళ్ళ నుండి రాలుతూ రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ...
...ఇంకా చదవండి

మస్వాల్..

కెక్యూబ్ వ‌ర్మ‌ | 03.09.2016 12:37:26am

మరుగుతున్న మంచు తెరలుగా విడిపోతూ రాలిపోతున్న మస్వాల్ పూలెన్నో ఇప్పుడిక్కడ ఒకటే హృదయ ఘోష ఆజాదీ ఆజాదీ .......
...ఇంకా చదవండి

ఒంటరి వెన్నెల

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.05.2016 08:29:33am

ఈ ఇప్ప పూల వనం రాలిపోతూ నిబ్బరాన్ని వదిలి నివురు కప్పుకుంది తూరుపింకా తెలవారక నీ పేరు తలుస్తూ పొలమారుతొంది...
...ఇంకా చదవండి

గులాబీ!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 17.04.2017 11:32:19am

వాడెంత విధ్వంసం చేసినా నీ పసివాడి చేతిలో గులాబీ విచ్చుకుంటూ వాడిని భయపెడుతూనే వుంది!!...
...ఇంకా చదవండి

నమస్కరిస్తూ..

కేక్యూబ్ వ‌ర్మ‌ | 04.09.2017 11:18:59am

కళ్ళకు గంతలు కట్టుకొన్నదని మీ న్యాయ దేవత ముందు నగ్నంగా నిలబడిన ఆ పదముగ్గురూ విడిచిన లజ్జను మీ మఖంపై నెత్తుటి ఉమ్ముగా ఊసి!...
...ఇంకా చదవండి

దక్షిణ యాత్ర

కెక్యూబ్ వర్మ | 04.06.2017 01:12:22pm

నీ ఒంటి రంగును హేళన చేసి నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!...
...ఇంకా చదవండి

వాళ్ళేడుగురు..

కేక్యూబ్ వ‌ర్మ‌ | 05.03.2018 07:53:11am

ఆ ఏడుగురూ ఈ నేలకు హామీపడిన వాగ్దానం నీకూ నాకూ తోవ చూపే సప్త వర్ణాల పతాకం నీలో నాలో సుళ్ళు తిరిగే దుఃఖం...
...ఇంకా చదవండి

ఇప్పుడు

కెక్యూబ్ వర్మ | 06.02.2018 01:01:56pm

ఇప్పుడు వాళ్ళే మాటాడుతున్నారు నిన్నూ నన్ను గుడ్డివాళ్ళని చేసి!!...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...

  ఈ మానవ హననాన్ని ఆపండి
  అరుణతార మే - 2018
  మైనింగ్ మాఫియా కోస‌మే బోరియా - కసనూర్ నరమేధం
  గెలుచుకోవాల్సిన ప్రపంచం దిశగా కారల్‌ మార్క్స్‌
  మార్క్స్ ప్రాసంగిక‌త ఎప్ప‌టికీ ఉంటుంది : అరుణాంక్‌
  Long live the 1st of May
  విరసం క‌థా వ‌ర్క్‌షాప్‌
  marx selected poetry
  మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం
  ఎట్టి మనుషుల మట్టి కథలు
  మొద్దుబారుతున్న సమాజం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •