విరసం 26వ మహాసభల్ని విజయవంతం చేసిన పాలమూరు ప్రజలకు, ఆహ్వానసంఘానికి, సాహితీ మిత్రులకు, ప్రజాసంఘాలకు కృతజ్ఞతలు

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

విరసం 26వ మహాసభల్ని విజయవంతం చేసిన పాలమూరు ప్రజలకు, ఆహ్వానసంఘానికి, సాహితీ మిత్రులకు, ప్రజాసంఘాలకు కృతజ్ఞతలు

- విప్లవ రచయితల సంఘం | 17.01.2018 11:45:59am

విరసం రెండేళ్లకోసారి నిర్వహించే మహాసభలకు, సాహిత్య పాఠశాలకు ఒక నిర్దిష్టమైన అంశాన్ని ఎంచుకొని దాన్ని వేరువేరు కోణాల నుండి విశ్లేషించి, చర్చకు పెడుతూ వస్తున్నది. 1985లో గద్వాల సాహిత్య పాఠశాల తర్వాత 33 ఏళ్లకు మళ్లీ పాలమూరు ప్రాంతంలో ఏర్పాటు చేసిన మహాసభలకు ʹబ్రాహ్మనీయ హిందూ ఫాసిజాన్నిʹ కేంద్ర అంశంగా తీసుకొని రెండు రోజుల పాటు చర్చించింది. ప్రస్తుతం దేశంలో ప్రమాదకరంగా ముందుకొస్తున్న సంఘపరివార్‌ దౌర్జన్యాలకు రాజకీయార్థిక, భావజాల మూలాలను వివరించే ప్రయత్నం చేశాం. సంఘపరివార్‌ హిందూ జాతీయవాదానికి సాంస్కృతిక మూలం బ్రాహ్మణీయ ధర్మంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల ఆధిపత్య వ్యవస్థ. అది ఫాసిజంగా అమలవుతోంది కనుక దాన్ని బ్రాహ్మనీయ హిందూ ఫాసిజం అని విప్లవోద్యమం నిర్వచిస్తుంది. ఈ అంశం మీద మాతో పాటు సభలో తమ ఆలోచనలు పంచుకున్న ప్రొఫెసర్‌ ఆనంద్‌ తేల్‌తుంబ్డేకు, ప్రజాకళాకారుడు వీర్‌సాతెదార్‌కు, సియాసత్‌ ఎడిటర్‌ జహీర్‌ అలీఖాన్‌కు, కామ్రేడ్‌ దుడ్డు ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

విరసం మహాసభలను తమ భుజాల మీదేసుకొని విజయవంతం అయ్యేదాకా శ్రమించిన ఆహ్వాన సంఘానికి, సభలను విజయవంతం చేయడం ద్వారా మాకెంతో స్ఫూర్తిని నింపిన పాలమూరు ప్రజలకు, ప్రజాసంఘాల మిత్రులకు, సాహితీ మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

ఊరేగింపుకు అనుమతులు లేవని అడ్డుపడిన ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, దురన్యాయాలను, రాజ్యహింసను ప్రజల్లో ఎక్కడ బహిరంగపరుస్తామోనన్న జంకుతోనే మా ఊరేగింపును అనుమతించలేదు. హాల్‌ మీటింగ్‌కే పరిమితం చేసినా పెద్ద సంఖ్యలో హాజరై తమ మద్దతు తెలిపిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

విరసం 26వ మహాసభలు 15 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించాయి.

1.దేశవ్యాప్తంగా దళితులపై, ముస్లింలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం మౌన ఆమోదాన్ని తెలుపుతోంది. స్వయంగా మంత్రులే రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాల కోసం బి.జె.పి ఫాసిజాన్ని అమలుచేయడానికే అధికారంలోకి వచ్చింది. దీన్ని అడ్డుకోడానికి ఐక్య ఉద్యమాలకు పిలుపునిస్తున్నాం.

2.ఆరెస్సెస్‌, ఎబివిపి, ఇతర సంఘపరివార్‌ గ్రూపులు రచయితలపైనా, యూనివర్సిటీ ప్రొఫెసర్లపైనా దాడులు చేయడాన్ని, ప్రభుత్వం, పోలీసులు వాటిని ఆపడానికి ఏ మాత్రం ప్రయత్నించకపోవడాన్ని ఖండిస్తున్నాం.

3.జర్నలిస్టులను హత్యలు చేస్తూ అంతంత మాత్రంగా ఉన్న పత్రికా స్వాతంత్య్రాన్ని హరించివేయడాన్ని ఖండిస్తున్నాం.

4.ఎం.ఆర్‌.పి.ఎస్‌పై నిర్బంధాన్ని, మందకృష్ణ మాదిగ అరెస్టును ఖండిస్తున్నాం. తక్షణమే ఎస్‌సి వర్గీకరణ చట్టం చేయాలని డియాండ్‌ చేస్తున్నాం.

5.లంబాడాలను ఎస్‌టి జాబితా నుండి తొలగించి, వారికి వేరే ప్రత్యామ్నాయం చూపి, ప్రభుత్వం ఆదివాసులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

6.ఆలకూరపాడు అమరుల స్థూపనిర్మాణం సందర్భంగా విరసం సభ్యుడు కామ్రేడ్‌ కళ్యాణరావుపై తప్పుడు కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. అలాగే సికింద్రాబాద్‌లో నిర్మించ తలపెట్టిన ప్రభాకర్‌ స్థూపాన్ని అడ్డుకోవడమే కాక ప్రభాకర్‌ కుటుంబ సభ్యులపై, ప్రజాసంఘాల బాధ్యులపై కేసు పెట్టి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

7.బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ప్రజాసంఘాలు చేపట్టిన నిరసనకు పోటీగా ప్రభుత్వం ధర్నా చేయించడం, అక్కడికి అమరుడి తల్లి మస్తానమ్మను పోలీసులు బలవంతంగా తీసుకురావడాన్ని విరసం ఖండిస్తోంది.

8.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 1600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇదే స్థితి. పాలకులు నేరపూరిత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీన్ని మేం ఖండిస్తూ, రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు కదలాలని డియాండ్‌ చేస్తున్నాం.

9. ఝార్ఖండ్‌లో మజ్దూర్‌ సంఘటన్‌ సమితి (ఎం.ఎస్‌.ఎస్‌) అనే కార్మిక సంఘంపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

10. చాలా కాలంగా హేతువాదులు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్న మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని వెంటనే తీసుకురావాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలను విరసం డిమాండ్‌ చేస్తోంది.

11. చైనా సోషల్‌ సామ్రాజ్యవాదం వెనకబడిన దేశాల మార్కెట్లపై ఆధిపత్యాన్ని సంపాదించుకొని సహజ వనరులను దోచుకుంటోంది. అమెరికాతో పోటీ పడుతూ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ అదొక కొత్త సామ్రాజ్యవాద దేశంగా అవతరించింది. అమెరికా, చైనా సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు విరసం పిలుపునిస్తోంది.

12. తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలో రాజ్యహింస పెచ్చరిల్లిపోతోంది. బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తూ, వాక్‌, సభా, స్వాతంత్రాలను రద్దు చేస్తూ, ప్రజాసంఘాలపై దాడులు, తప్పుడు కేసులు పెడుతూ నియంతృత్వాన్ని అమలుచేస్తున్నారు. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.

13. మయన్మార్‌లో ఉన్న, పొరుగు దేశాలకు శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాలకు విరసం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. రోహింగ్యాలపై దమనకాండను తక్షణమే ఆపివేయాలని మయన్మార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాలందరికీ రక్షణ, సంపూర్ణ హక్కులు కల్పించాలని భారత ప్రభుత్వాన్ని డియాండ్‌ చేస్తోంది.

14.ఇండియా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహూల కూటమి ప్రపంచానికే ప్రమాదకరమైన జాతీయోన్మాద దుష్ట కూటమిగా ఏర్పడింది. దీనిని గుర్తించి ప్రతిఘటించాలని వివిధ సమూహాల ప్రజానీకానికి విరసం పిలుపునిస్తోంది.

15.గడిచిన రెండు నెలల కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో 50 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ప్రభుత్వాలు కార్పొరేట్‌ కాలేజీలకు అనేక రాయితీలు కల్పిస్తూ విద్య పేరుతో దోపిడి చేసుకొనేందుకు ద్వారాలు తెరిచాక విద్యావ్యాపారానికి విద్యార్థులు బలవుతున్నారు. కార్పొరేట్‌ కాలేజీపై చర్యలు తీసుకోవాలని, అందరికీ సమాన విద్యను ప్రభుత్వమే ఉచితంగా అందజేయాలని విరసం డిమాండ్‌ చేస్తోంది.

16.01.2018


పాణి, కార్యదర్శి
వరలక్ష్మి, పూర్వకార్యదర్శి
విప్లవ రచయితల సంఘం






No. of visitors : 460
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    ఈ మానవ హననాన్ని ఆపండి
    అరుణతార మే - 2018
    మైనింగ్ మాఫియా కోస‌మే బోరియా - కసనూర్ నరమేధం
    గెలుచుకోవాల్సిన ప్రపంచం దిశగా కారల్‌ మార్క్స్‌
    మార్క్స్ ప్రాసంగిక‌త ఎప్ప‌టికీ ఉంటుంది : అరుణాంక్‌
    Long live the 1st of May
    విరసం క‌థా వ‌ర్క్‌షాప్‌
    marx selected poetry
    మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం
    ఎట్టి మనుషుల మట్టి కథలు
    మొద్దుబారుతున్న సమాజం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •