భావజాల సంఘర్షణలో విరసం

| సంపాద‌కీయం

భావజాల సంఘర్షణలో విరసం

- వరవరరావు | 20.01.2018 12:18:39am

1985 జనవరిలో అవిభక్త మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాలలో విరసం సాహిత్య పాఠశాల జరిగింది. తర్వాత ముప్పై మూడేళ్లకు ఇప్పుడు మహబూబ్‌నగర్‌లోనే మొదటిసారిగా 2018 జనవరి 13, 14 తేదీల్లో విరసం మహా సభలు జరిగాయి. రెండుసార్లూ కీలకాంశం ఒక్కటే అప్పుడు ʹమత వర్గతత్వంʹ. ఇప్పుడు ʹబ్రాహ్మణీయ హిందూ ఫాసిజంʹ నేపథ్యం కూడ ఒక్కటే. కాకపోతే ఈ ముప్పై ఐదేళ్ల - ఇంకా చరిత్రలోకి వెళ్తే మనువాద కంపెనీవాద కాలాల నుంచి పాలకవర్గాలు పెంచి పోషిస్తున్న సామ్రాజ్యవాద దళారీ బ్రాహ్మణీయ ఫాసిజమే.

గద్వాల సాహిత్య పాఠశాల ముందుకాలం ఇప్పటి వలెనే దేశం నెత్తుటి చిత్తడిగా ఉన్నది. మురాదాబాద్‌ (1980) నెల్లి (1983), బివాండీలలో ముస్లింపై పెద్దఎత్తున దాడులు చేసి, మారణకాండ సృష్టించారు. పంజాబ్‌ మిలిటెంట్‌ ఉద్యమంపై, స్వర్ణ దేవాలయంపై భారత సైన్యం దాడితో మొదలై వేగవంతమైన పరిణామాలు ఇందిరాగాంధీ హత్య, ఢిల్లీ, పంజాబ్‌ పరిసర రాష్ట్రాల్లో సిక్కుల ఊచకోతకు దారితీసినవి. భోపాల్‌ విష వాయు ప్రమాదలో వేలాది మంది చనిపోయారు. అయినా లోక్‌ ఎన్నికలు జరిగినవి. కాంగ్రెస్‌ పార్టీ నూరేళ్ల సభ బొంబాయిలో ఒక వైపు రాజీవ్‌గాంధీ ఎన్నికల్లో హిందీ రాష్ట్రాల్లో ʹహిందీ కరేగా హిందూరాజ్‌ʹ అనే నినాదంతో రాజీవ్‌గాంధీ హిందీ రాష్ట్రాలలో ప్రచారం చేసాడు. 401 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్నాడు. మరొక వైపు బొంబాయికి వెళ్లి నూరేళ్ల కాంగ్రెస్‌ సభలో దేశాన్ని ఇరవ ఒకటో శతాబ్దంలోకి తీసుకపోతానని వాగ్దానం చేసాడు.

ఆ పని ʹతిలాపాపం తలా పిడికెడుʹ అన్నట్లు ఈ మూడున్నర దశాబ్దాలలో కేంద్రంలో, రాష్ట్రాలలో పాలించిన వాళ్లంతా పరిపక్వం చేసి, సామ్రాజ్యవాద-బ్రాహ్మణీయ ఫాసిజం ప్రాంగణంలో ʹఅచ్ఛేదిన్‌ʹ ఆయేగా వాగ్దానాలతో దేశాన్ని నరహంతకుల చేతుల్లో పెట్టారు. రాజ్యం కోల్పోయిన ధర్మరాజు సత్యం చెప్పక తప్పనట్లు పాలకుల ప్రతి మెతుకూ పాలితుల నెత్తురంటినదే. చరిత్ర ఫార్సుగానూ, విషాదంగానూ పునరావృమవుతుంది.

1984లో లాల్‌ కృష్ణ అద్వానీ ఏకత్మతా రథయాత్ర ప్రారంభించాడు. అవి ప్రపంచ మార్కెట్‌ అనుగుణమైన ఉపరితల భావజాలం తప్ప మరేమి కాదు. అయోధ్యలోని బాబ్రీ మసీద్‌లో రామ జన్మభూమి ఉందని సంఘ్‌ పరివార్‌ విశ్వాసం. నుక అక్కడ రామమందిరం నిర్మాణం చేయాలని వాళ్ల లక్ష్యం. ఆ ప్రభుత్వాలు చేయకపోతే తామే చేస్తామని ప్రకటించడానికే ఈ రథయాత్ర. ఈ రథయాత్ర గుజరాత్‌లోని ద్వారకలో ప్రారంభమైంది. ఇది కృష్ణుడు పరిపాలించిన ప్రాంతమని వారి విశ్వాసం. దేశమంతా తిరిగి అయోధ్యకు చేరుకోవడం వీళ్ల కార్యక్రమం. ఇది ఈ దేశవ్యాప్తంగా ముస్లింలపై దాడులు, మసీద్‌ల కూల్చివేతతో కొనసాగింది. అట్లా అట్టుడిగిన ప్రాంతాల్లో మహబూబ్‌నగర్‌ ఉంది. గుజరాత్‌, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ఈ రథయాత్ర బిహార్‌లో లాలు ప్రసాద్‌ ప్రభుత్వం నిల్వరించే దాకా కొనసాగింది. దీని ప్రభావమే రాజీవ్‌గాంధీ ప్రభుత్వం బాబ్రీ మసీద్‌లో రామ్‌లల్లా పూజల కోసం ద్వారా తెరిచారు. అది 1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీద్‌ విధ్వసంతో పరిపూర్తయింది. లేదా గుజరాత్‌ ముజఫర్‌నగర్‌ మీదుగా ఇప్పటి దాకా మారణకాండ కొనసాగుతూనే ఉన్నది. కాకపోతే అదనంగా హిందుత్వ శక్తుల అసహనం దళితులు, ఆదివాసలు, హేతువాదులు, లింగాయతులు, తమకు తాము హిందువులు కాదని భావించుకుంటున్న లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద విలువలు కాడుకుంటూ సైంటిఫిక్‌ టెంపర్‌ అవరచుకోవాలని భావిస్తున్న, విశ్వసిస్తున్న అందరి మీద ఈ దాడులు, హత్యలు జరుగుతున్నాయి. మతమార్పిడి, గోవధలను దీనికి సాకుగా చూపుతున్నారు. ఒకవైపు డీమానిటైజేషన్‌, డిజిటలైజేషన్‌, జిఎస్‌టిలు, ఆధార్‌ నిర్బంధాలు-మరొక వైపు గోవధ నిషేధం-ఘర్‌వాపసీ-ఇవీ మనకు వచ్చిన అచ్ఛేదిన్‌, మేక్‌ ఇండియా పరిణామాలు.

కనుక మరింత నిర్దిష్టంగా ఆనాటి మత వర్గతత్వం ఇవ్వాళ బ్రాహ్మణీయ హిందూ ఫాసిజంగా అక్టోపస్‌ వలె విస్తరిందని చెప్నున్నాం. రాష్ట్రంలో విప్లవోద్యమం బలంగా ఉన్న రోజులవి. రాజ్యానికి కళ్లు చెవులుగా సంఘ్‌ పరివార్‌ శక్తులు విప్లవోద్యమంపై దానికి అండగా ఉన్న ప్రజలపై తీవ్రమైన దాడులు చేస్తున్న కాలం కూడ.

గద్వాల ఆ రోజుల్లో రాడికల్స్‌కు పెట్టనికోట. తెలంగాణ వ్యాప్తంగా భూస్వాముల బిడ్డలైన ఎబివిపి వాళ్లకు, దళిత బడుగు వర్గాల నుంచి కాలేజిల్లో చేరిన రాడికల్స్‌కు మధ్యన తీవ్ర ఘర్షణలవుతున్న కాలం. అందులో గద్వాల, మహాబూబ్‌నగర్‌ జిల్లా రెండు శక్తులకు కూడా బలమైన కేంద్రం. తర్వాతకాలంలో విప్లవోద్యమ ంలో అమరులైన సుదర్శన్‌రెడ్డి(కిరణ్‌, జిల్లా పీపుల్స్‌వార్‌ కార్యదర్శిగా 1989లో ఒక ఆదివాసి సహచరుడు చెరువులో మునిగిపోతుంటే కాపాడబోయి అమరుడయ్యాడు). పురుషోత్తం, సుగుణ, పటేల్‌ సుధాకర్‌రెడ్డి అప్పటి రాడికల్‌ విద్యార్థి నాయకులు వీళ్లు, ఇప్పుడు విప్లవోద్యమంలో అజ్ఞాతం ఉన్నవాళ్లు, మరికొందరు ఇప్పుడు సాధారణ జీవితంలో ఉన్నవాళ్లు ఈ సభలు జరగడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పూనుకున్నారు. నిర్వహించారు.

ఉస్మానియాలో జార్జ్‌రెడ్డి ఒరవడిలో, వరంగల్‌లో జనార్దన్‌ ఒరవడిలో సంఘ్‌ పరివార్‌ శక్తులతో పోరాడవల్సిన అవశ్యత 1970లలోనే విప్లవ విద్యార్థుల ఎజెండాగా ముందుకు వచ్చింది. ఆర్‌ఎస్‌యు, పిడిఎస్‌యులు ఏర్పడి 1980లలో ఈ పోరాటాన్ని మరింత మిలిటెంట్‌గా మార్చినవి. అంత మాత్రమే కాదు ఈ సంఘాలలోకి, ఈ కాలానికి జగిత్యాల, సిరిసిల్ల రైతాంగ పోరాటాల వల్ల దళిత, ముస్లిం మైనారిటీ వర్గాలు ఎక్కువగా వచ్చాయి. సిరిసిల్లలో చాంద్‌ పాషా(పిడిఎస్‌యు) నల్గొండలో తుమ్మల శేషయ్య (ఆర్‌ఎస్‌యు) అమరత్వం ఇందుకు ఒక ఉదాహరణ.

నక్సలైట్లు ఏ దేశ భక్తులు, రష్యా తొత్తులు, చైనా చెంచాలు, మనమంతా హిందువులం, దేశ భక్త సింధువులం అనే నినాదాలు తెలంగాణ అన్ని జిల్లాలలో ఎబివిపి వాళ్లు గోడల మీద రాస్తూ ప్రచారం చేస్తూ ఉండేవాళ్లు. ʹలాల్‌ గులామీ చోడో, బోలో వందేమాతరంʹ అనే నినాదం ఎబివిపి విస్తృతంగా ప్రచారంలో పెట్టింది. దేశమంటే మనుషులు, మట్టి మనుషులు అనే అర్థంలో భక్తి కాకుండా ప్రజలకు సేవ చేయడమే నిజమైన ప్రజాభిమానంగా వర్గ పోరాట చరిత్రలోకి వెళ్లి రాడికల్స్‌ ʹలాల్‌ బనో, గులామీ చోడో బోలో వందేమాతరంʹ అనీ, నక్సలైట్లే దేశ భక్తులని ధీటైన సమాధానం ఆచరణలో కూడ చెప్పారు.

గద్వాల సాహిత్య పాఠశాల రెండు రోజులు గోడల మీద ఈ నినాదాలు, వేలాది మంది ఊరేగింపులో ఈ నినాదాలు పది వేల బహిరంగ సభలో ఎన్‌కె భావోద్వేగంతో తాను రాసి, చదివిన ʹలాల్‌బనో గులామీ చోడోʹ దీర్ఘ కవిత ఈనాటికీ ఆనాటి దృశ్యాన్ని చూసినవాళ్ల మనుసుల్లో చెరగని ముద్రగా నిలిచినవి.

మనుస్మృతికి ʹభారతమాతʹకు అభేదం కల్పిస్తున్న ఇవాళ్టి విద్వేషపూరిత వాతావరణంలో దేశభక్తి అనేది ʹద్వేషభుక్తిʹగా మారింది. ప్రతక్షంగా జాత్యంహరి ట్రంప్‌కు ఊడిగం చేస్తూ, దేశాన్ని కార్పొరేట్‌ శక్తులకు తెగనమ్ముతూ దేశభక్తిని ఒక గుత్త సొమ్ముగా మార్చుకుంటున్న వాళ్ల కన్నా టర్కీ విప్లవ కవి నజీం హిక్మత్‌ చెప్పినట్లు ప్రజలను ప్రేమిస్తూ ఫాసిజాన్ని ప్రతిఘటిస్తున్న వాళ్లు ఇవాళ దేశ ద్రోహులుగా చిత్రించబడుతున్న వాళ్లే నిజమైన దేశాభిమానులు.

1980లలో విప్లవ శక్తులు వారికి అండగా ఉన్న ప్రజలపై జరిగిన దాడులు ఇవాళ విశాల ప్రజారాసులపై దాడులుగా మారినవి. ఈ ఫాసిస్టు దాడుల లక్ష్యం ముస్లింలు, దళితులు, ఆదివాసులు, రైతాంగం, కార్మికవర్గం, వాళ్లు సంరక్షకులుగా ఉన్న భూమి, ప్రకృతి సంపద, శ్రమ.

వందల సంవత్సరాల పోరాటాల ఫలితంగా రాజ్యాంగంలో పొందుపర్చబడిన ఉపోద్ఘాతం, ఆదేశిక సూత్రాలు పాటించాలని కోరుకునే వాళ్లు, ఈ దేశంలోని వైవిధ్యం గల జీవన సంస్కృతికి విశ్వాసాలకు హామీ పడే లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థను కోరుకునే వాళ్లు ఈ ఫాసిస్టు దాడులకు లక్ష్యం అవుతున్నారు. ఇంక రాజ్యాంగంలోనే పొందుపర్చబడిన శాస్త్రీయ సునిశిత్వం (సైంటిఫిక్‌ టెంపర్‌) సామ్యవాద లక్ష్యం అయితే వీళ్లకు సహించరానివి. తాము ఒక నిమిత్తం లేకుండా ఒక కులంలోనో, ఒక మతంలోనో పుట్టినప్పటికి ఇతర కులాలు, మతాలు కూడ ఈ దేశంలో కలిసి సహజీవనం చేయవచ్చు అని భావించే వారిపట్ల కూడ విపరీతమైన అసహిష్ణుత పెరిగిన కాలానికి మనం ఇప్పుడు చేరుకున్నాం.

నామాల బాలస్వామి వంటి రాడికల్స్‌, లక్ష్మి వంటి ఆదివాసి మహిళ, మున్నెప్పు వంటి ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయుడు, కనకా చారి వంటి ప్రజాస్వామిక పోరాటకారుడు చేసిన త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడ మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే పాతపల్లి దళితులను ఇళ్ల నుంచి తరిమేసిన దగ్గరి నుంచి నేరెళ్ల, అభంగపట్నం దాడుల దాకా మాఫియాలు, మతం అధిపత్య భావజాలం ఒక స్వార్థ మతంగా చెట్టపట్టాలు వేసుకొని పాలన చేస్తున్నాయి. ఇందులో 1984లోనే పొడచూపి 1991 నుంచి ఒక అభివృద్ధి నమూనాగా ముందుకు వచ్చిన విధ్వంసకరమైన సామ్రాజ్యవాద రాజకీయ విధానం ఉన్నది. దానితో మిలాఖత్‌ అయి దళారీ పాత్ర నిర్వహిస్తున్న అధిపత్య వర్గాల, కులాల భూస్వామ్య పెట్టుబడిదారీ బ్రాహ్మణీయ భావజాలమూ ఉన్నది. ఈ రాజకీయ ఆర్థిక విధానమూ, ఈ అధిపత్య భావజాలమూ విడిగా ఉన్నవి కావు, జమిలిగా ఉన్నవి. అందుకే దీనిని ఫాసిజం అంటున్నాం. ఏ రాజకీయ పరిపాలనా విధానం, ఏ నియమం, ఏ నైసర్గిక జీవన విధానంలో ఇమడలేని ఏకైక అధిపత్య భావన దీని మూలతత్వం. ప్రకృతికి, మానవ ప్రకృతికి విరుద్ధమైన ఈ భావజాలాన్ని, దీనికి పునాది అయిన రాజకీయ ఆర్థిక భావజాలాన్ని సంఘటితంగా ప్రతిఘటించి ఓడించాల్సిన కర్తవ్యం ఇవాళ విప్లవ, ప్రజాస్వామిక, దళిత, ఆదివాసి, ముస్లిం మైనారిటీ మొదలైన ప్రజా బాహుళ్యంపైన ఉన్నది. ఈ కర్తవ్యం నిర్వహణలో 1970 నుంచి నిమగ్నమై ఉన్న విప్లవ రచయిత సంఘం ఈ మహా సభలలో ఫాసిస్టు దశలో తాను నిర్వహించవల్సిన సాహిత్య, సాంస్కృతిక, తాత్విక బాధ్యతలను భుజానికి ఎత్తుకుంది.

No. of visitors : 531
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •