మన సమయసందర్భాలలో ఉదయగీతిక

| సాహిత్యం | స‌మీక్ష‌లు

మన సమయసందర్భాలలో ఉదయగీతిక

- -పి.వరలక్ష్మి | 20.01.2018 12:24:14am

సాధారణ మానవులు అసాధారణ శక్తిసామర్థ్యాలను సంతరించుకుని తమ ఒట్టి చేతులతో చరిత్రను నిర్మించే క్రమాన్ని విప్లవోద్యమం అద్దంలోవలె చూపుతుంది. సమాజ గుణాత్మక పరిణామంలోని సంఘర్షణలో గొప్ప ప్రేమాస్పదులు, త్యాగశీలురు, సాహసవంతులైన మనుషులు రూపొందడం అక్కడ చూస్తాం. సరిగ్గా ఇలాంటి మానవులు ఉదయగీతికలో మనకు పరిచయమవుతారు. చైనా విప్లవ చరిత్రలో సంక్షుభితమైన 1930ల కాలంలో విద్యార్థి యువజనుల పోరాటాలు జాతి యావత్తునూ మేల్కొలిపాయి. ఆనాటి యువ విప్లవకారులు, విద్యార్థుల వీరోచిత పోరాటాలను, త్యాగాలను ఉదయగీతిక సజీవంగా కళ్లకు కడుతుంది. ఆనాడున్న దుర్భర భూస్వామ్య వర్గ పీడనలో నిరాశా నిస్పృహలలో కూరుకుపోయిన నిస్సహాయురాలైన యువతికి ప్రతిక ఈ నవలలోని కథానాయిక టావ్‌చింగ్‌. ఒక దశలో ఆమె తన జీవితాన్ని అంతం చేసుకోవాలన్నంత విషాదంలో మునిగిపోతుంది. విప్లవం ఆమెను అత్యంత శక్తివంతంగా, సాహసోపేతంగా తీర్చిదిద్దుతుంది. అటువంటి గొప్ప స్ఫూర్తిని అందించగల శక్తి ఈ నవలకుంది.

ఎనభై ఏళ్ల క్రితం మన పొరుగున ఉన్న చైనా సమాజం, ఇవాళ మనం జీవిస్తున్న సమాజ సందర్భం చాలా భిన్నమైనవి. అయినా చలనశీలమైన సమాజంలో వర్గపోరాటంలో భాగంగా యువతీయువకులు ఎటువంటి చైతన్యయుతమైన పాత్ర పోషించగలరో తెలుసుకోవడం ప్రతి తరానికి అవసరం. దేశ ప్రయోజనాలంటూ నిత్యం వల్లెవేసే పాలకులు తమ వర్గప్రయోజనాల కోసం దేశాన్ని పరాయిపాలకులకు ధారాదత్తం చేసేయడానికి ఏ మాత్రం సంకోచించరన్నది అన్ని వేళలా ప్రపంచవ్యాప్తంగా రుజువైన సత్యం. విప్లవకారులను, చైనా ప్రజలను లక్షలాదిగా చంపేసిన కొమింటాంగ్‌ ప్రభుత్వం, జపాన్‌ సామ్రాజ్యవాదులు చైనా భూభాగాన్ని వేగంగా దురాక్రమిస్తూ వచ్చినప్పుడు సామ్రాజ్యవాదులకు సాగిలపడి లొంగిపోతుంది. దానికి సామ్రాజ్యవాదులకన్నా విప్లవ ప్రజానీకమే శతృవు. అలాంటి సందర్భంలో ఒకవైపు అభివృద్ధి నిరోధక ప్రభుత్వ సైన్యంతో పోరాడుతూ తీవ్ర ఒడిదుడుకులనకు, అపార కష్టనష్టాలనకు ఎదుర్కొంటూ కూడా జపాన్‌ సైన్యానికి ఎదురొడ్డి కమ్యూనిస్టు విప్లవకారులే దేశాన్ని రక్షిస్తారు. వర్గపోరాటంలో పుటం పెట్టిన విద్యార్థి యువజనులు దేశభక్తిని ఎల్లెడలా రగిలించి ఎర్రసైన్యానికి విశాల ప్రజానీకపు మద్దతు కూడగడతారు. జైళ్లు పాఠశాలలుగా, విశ్వవిద్యాలయాలు పోరాట కేంద్రాలుగా మారిన రోజులవి. వర్గపోరాటం దేశభక్తిని, దేశభక్తి వర్గపోరాట జ్వాలను ఎగసిపడేలా చేసాయి.

తెలుగులో మొదటిసారి రాడికల్‌ ప్రచురణగా 1985లో ఈ పుస్తకం వెలువడింది. రాడికల్‌ విద్యార్థి ఉద్యమ ఉద్వేగభరిత , రోమాంచిత రోజులవి. భారతదేశంలోనే మహోజ్వల విద్యార్థి ఉద్యమంగా ఎందరో అద్భుత మానవులను సమాజానికందించిన రాడికల్‌ విద్యార్థి ఉద్యమం కరడుగట్టిన భూస్వామ్య భావజాలంపై సమ్మెటపోటు వేసింది. కార్మికవర్గ పార్టీ నాయకత్వంలో జరిగే రౖెెతాంగ విప్లవంలో విద్యార్థులు ఎటువంటి పాత్ర పోషించగలరు అన్న విషయంలో అప్పటి విప్లవోద్యమం, రాడికల్‌ విద్యార్థులు మౌలిక స్థాయిలో ప్రయోగాలు చేసారు. విద్యార్థులు తరగతి గదులు దాటి గ్రామసీమల్లో సమాజాన్ని చదివారు. సాయుధపోరాటంలో అనన్యసామాన్యమైన త్యాగాలు చేసారు. అదికాక మరో ముఖ్యమైన పార్శ్వం విద్యార్థి ఉద్యమాలకుంది. విద్యావంతుల్లో సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యతను గుర్తింపజేయడం. బూర్జువా విద్య విద్యార్థులను, బుద్ధిజీవులను సమాజం నుండి, ప్రజల నుండి పరాయీకరిస్తుంది. ఒకవేళ వాళ్లు శ్రామికవర్గం నుండి వచ్చినా, ఆ వర్గం నుండి విడదీయబడి పాలకవర్గానికి ఊడిగం చేసేలా తయారుచేస్తుంది. వర్గపోరాట రాజకీయాలు సమాజ ఉమ్మడి శ్రమ ఫలితమైన జ్ఞానాన్ని తిరిగి సమాజానికి, ఇంకా చెప్పాలంటే మంచి సమాజం రూపొందడానికి, హింస, అసమానతల దుర్భర పరిస్థితులను మార్చడానికి దోహదపడేలా చేస్తాయి. రూపొందుతున్న సమాజంలో ఎదిగివస్తున్న విద్యార్థులు ఆ రాజకీయాలనందుకుంటే అద్భుతాలు చేయగలరు. నవనవలాడే యువశక్తి ఒక మానవీయ సమాజాన్ని నిర్మించడానికి దోహదపడుతుంది. అటువంటి విప్లవ విద్యార్థి ఉద్యమం నడుస్తున్న రోజుల్లో ఆ సందర్భానికి అర్థవంతంగా ఈ ప్రచురణ వచ్చింది. విద్యార్థులను గాఢంగా ప్రభావితం చేసింది. మళ్లీ 1991లో ఇది పునర్ముద్రణ పొందేనాటికి ఉద్యమం తీవ్రమైన అణచివేతను ఎదుర్కొంటోంది.

2003లో పర్‌స్పెక్టివ్స్‌ వాళ్లు మలికూర్పు వెలువరించారు. ఇంతకాలం తర్వాత ఇప్పుడు విరసం ప్రచురణగా ఉదయగీతిక మళ్లీ వస్తోంది. ఇవాళ పూర్తి భిన్నమైన సామాజిక సందర్భంలో మనమున్నాం. ప్రధానంగా వర్గేతర సామాజిక ఉద్యమాలు విద్యార్థి రాజకీయాలను నడిపిస్తున్నాయి. పీడిత సమూహాల న్యాయమైన ఆకాంక్షల నుండి వచ్చిన ఆ ఉద్యమాలు ప్రజాస్వామికమైనవి, ప్రగతిశీలమైనవి కూడా. ఇటీవలి తెలంగాణ విద్యార్థి ఉద్యమం ఒక విధమైన స్తబ్దతకు గురైన యూనివర్సిటీలను, విద్యాకేంద్రాలను మరోసారి కదలబార్చింది. అయితే తెలంగాణవాదానికే పరిమితమైనవారు సులువుగా పాలకపక్షంలో మమేకమైతే, వర్గపోరాట రాజకీయాలను ఆకళింపుజేసుకున్న వివేక్‌, శృతి వంటివారు అట్టడుగు ప్రజల కోసం వెలకట్టలేని త్యాగాలు చేయగలిగారు. విద్యార్థి ఉద్యమానికి వర్గపోరాట రాజకీయాల ఆవశ్యకత ఎంత ఉన్నదో అర్థం చేసుకోడానికి ఉదయగీతిక వంటి నవలలు ఉపయోగపడతాయి. వ్యవస్థ అమానవీయతకు విద్యావ్యవస్థ ఉదాహరణగా నిలుస్తున్న వర్తమానంలో వేలాది విద్యార్థులు నిస్పృహతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ దుర్భర స్థితిని సమాజం లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. వ్యవస్థ మూలాలను ప్రశ్నించి, సమాజాన్ని కదిలించే విద్యార్థి ఉద్యమాలు మాత్రమే విద్యావ్యవస్థలోని అమానవీయతను రూపుమాపగలవు. అవి మొత్తం వ్యవస్థకై జరిగే ఉద్యమాలకూ శక్తినివ్వగలవు. ఆవైపు నుండి విప్లవ విద్యార్థి ఉద్యమ నవల ఉదయగీతిక నేటితరం విద్యార్థులకూ స్ఫూర్తిదాయకం కాగలదు.

ఆనాడు చైనా కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో విద్యార్థులు దేశభక్తి అంటే కేవలం సెంటిమెంట్‌ కాదని, జీవితాన్ని పణం పెట్టేంతగా ప్రజల్ని ప్రేమించడమని చాటారు. విప్లవకారులే నిజమైన దేశభక్తులని అలవోకగా అనవచ్చునుగానీ ఇటీవల దేశభక్తి అనే పదానికి అర్థం మారిపోయింది. ʹభక్తిʹ వంటి అహేతుకభావన తగదుగానీ సమాజం కోసం త్యాగం చేస్తున్న వాళ్లను దేశభక్తులనడం, ఉదాహరణకు నక్సలైట్లే దేశభక్తులు అనడం వ్యవహారంలో ఉంది. కానీ ఈ మధ్య దేశభక్తి అనే మాట విన్నామంటే చాలు చికాకు పుట్టుకొస్తుంది. ఆర్‌.ఎస్‌.ఎస్‌ దాన్నంత అప్రతిష్టపాలు చేసేసింది. దాన్ని ద్వేషానికి, ఉన్మాదానికి మారుపేరుగా తయారుచేసింది. దేశాన్ని ప్రేమించడమంటే శ్రమ ద్వారా సమస్తాన్ని సృష్టించే ప్రజల్ని ప్రేమించడం. అలా ప్రేమించగలిగేవాళ్లు ఆ శ్రమను, సంపదను కొల్లగొట్టే దోపిడిని ద్వేషిస్తారు. మనుషుల్ని జంతువులకన్నా తక్కువ చేసి చూసే అసమానతల్ని నిరసిస్తారు. దేశంలో దోపిడి, అసమానతలపై పోరాటం చేసేవాళ్లే తమ దేశంపై సామ్రాజ్యవాదుల పెత్తనాన్ని, గుత్తమార్కెట్‌ దోపిడిని ఎదిరిస్తారు. దేశసార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టే పాలకులపై పోరాటం చేసి సామ్రాజ్యవాద ఉక్కు సంకెళ్లు ఛేదించి దేశాన్ని విముక్తం చేస్తారు. ఇవాల దేశాన్ని సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టేవాళ్లే దేశభక్తి దబాయింపులకు, బలప్రదర్శనలకు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఉత్పత్తి వర్గాల ప్రజలపై దారుణ హింసను ప్రయోగిస్తూ విశ్వాసాల పేర ఉన్మాదాన్ని వ్యాపింపజేస్తున్నారు. సమాజ ప్రగతిని, సమానత్వాన్ని కాంక్షించే మేధావులను హత్యలు చేస్తూ, దేశంలో అభివృద్ధి నిరోధక సనాతన భావజాలాన్ని జొప్పిస్తున్నారు. యూనివర్సిటీలలో సంఘపరివార్‌ దౌర్జన్యాలను ప్రగతిశీల విద్యార్థులు సవాల్‌ చేస్తున్న తరుణంలో, ఆనాడు అభివృద్ధి నిరోధక ప్రభుత్వంపైనా, కరడుగట్టిన సనాతన భావజాలంపైనా, కెరీరిజంపైనా యుద్ధం చేసి ఉదయగీతిక పాడిన యువతీ యువకుల్ని కలవండి. వాళ్ల మానవీయతను, త్యాగనిరతిని స్పృశించండి.

No. of visitors : 450
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •