చూపులు

| సాహిత్యం | క‌విత్వం

చూపులు

- మహమూద్ | 20.01.2018 01:04:56am


1

నన్ను నేను

కొత్తగా

ఆవిష్కరించుకున్నాను

ఆవిష్కరణలకు ఆద్యమౌతున్నది

మీ

చూపులే

2

చూపులెవిరికుంటాయి?

***అట్లాంటిట్లాంటివా మరి అవి ****

మనుషులకి మనుషులమే ఎరుకనివ్వడానికి

మ్మ్.. చెవులు రిక్కించలేనంత మౌనమైనవీ

ఎడారి మదిలో మెదిలే ఒయాస్సిస్సంత గాఢమైనవీ

భళ్ళున పగిలే ముసలి నక్షత్ర మరణమంత వెలుతురున్నవీ

లోకంలోని పచ్చదనమంత స్వఛ్ఛమైనవీ

దూర దూరాల దృశ్యాలను స్పష్టంగా చూపగలిన

టెలిస్కోపుల కన్నులా సూదైనవీ

3

నన్నెంత బాగా

గుర్తించారు వాళ్ళూ

నాలో వాళ్ళ లాంటి పారదర్శక

సెలయేళ్ళేవో పరుగులిడుతున్నాయనీ

తడికి తడి తెలిసిపోయింది

ఒక సామూహికత ఎర్రజెండాల ఎగరేసుకొని

ఒకవిప్లవాన్ని నా చూపు

కలగా ధరించింది

నడిచే తోవలు తోవలు కాదిపుడు

మార్పును సుస్పష్టం చేసిన వ్యూహాలు

అద్దంలాంటి మీ చూపులో

నన్ను చూసుకోవడం మొదలెట్టాక

బతకడం నేర్చాను

బతికించడం నేర్చాను

తల్లి ప్రేమ మొదటి స్పర్శలోనే

తెలిసుకున్న బిడ్డలాంటి నేను

మూలాల్నించి పచ్చని నినాదాల్ని

లోచనాల శాఖల్నిండా

పుష్పించుకుంటున్న

సూర్యరశ్మిని...





No. of visitors : 343
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


తలపుల తోవలోకి స్వాగతం

మహమూద్ | 03.01.2017 12:14:11am

ఓ చారిత్రకదశతో ఘర్షణపడి విశిష్ట వ్యక్తులుగా నిలబడ్డ ఇద్దరి జీవితాల గురించి మనకు పరిచయం చేసే రచన. ఆ మలుపుల్లో కైఫీ షౌకత్లు నిర్వహించిన పాత్రనూ సమాజం కచ్చితం...
...ఇంకా చదవండి

అలుగు నేత్రం

మహమూద్ | 03.07.2016 01:40:43am

ఒకరి కన్నుల తడి ఇంకొకరి కన్ను మోస్తున్న ఈ దివ్య సందర్భం కంటున్న కల ఒకటి కావడం ఎంత కాకతాళీయం...
...ఇంకా చదవండి

డ్రాక్యులా నీడ

మహమూద్ | 20.10.2016 02:01:40am

దశాబ్దాల దాహపు రెక్కలు విచ్చుకొని ఎడారి దేహం ఒయాసిస్సుల తడి కోసం వెదుకులాడుతుంది ఇసుక పరదాల మధ్య స్వప్న కళేబరాల విస్ఫోటన ఉక్కపోతలో జీవితం ఉడికిపోతుంది...
...ఇంకా చదవండి

వారిద్దరూ

మహమూద్ | 01.06.2016 11:40:00am

కాలాన్ని మండించాలి లేదా మనమే మంటలమవ్వాలి...
...ఇంకా చదవండి

సజీవ జ్ఞాపకమై…

మహమూద్ | 17.04.2017 11:25:45am

వర్ణసంకరం చేయడానికి తను సిధ్ధపడిందంటే తన వర్ణమేదో మరిచిపోయెంతగా ఎంత మొహబ్బత్ కురిపించి ఉంటావో నువ్వు నీ నీలి కౌగిళ్ళలో నలిగిన ఆ కురుల మీంచి ప్రహించిన గాలి...
...ఇంకా చదవండి

వెల్తుర్ధ్వని

మహమూద్ | 21.12.2018 07:42:29pm

నీవెపుడూ నాకు దూరం కావు నీ కంటిరెప్పలు గీసిచ్చిన అరణ్య కవాతులు నీ సాంగత్యాన్ని గుర్తు చేసే స్నేహవీచికలు…....
...ఇంకా చదవండి

బందిష్

మహమూద్ | 16.08.2019 08:51:51pm

ప్రతిఘటన ఊపిరిగా నిలబడిన కాశ్మీరంలో నిషేదాజ్ఞల మధ్యే నినాదాలు పదునెక్కుతాయి మంచుకోనల్లోంచి లావాలు పెల్లుబుకుతాయి ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార ఆగస్టు 2019

    ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేకం
    వేటగాడి వల
    పదునెక్కుతున్న కోరలు
    ఎదురుచూపులు
    యురేనియమం
    మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ
    నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
    దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"
    చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి
    ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •