ద్రోణాచార్యుడి వేలు తెగాల్సిందే

| సాహిత్యం | క‌విత్వం

ద్రోణాచార్యుడి వేలు తెగాల్సిందే

- అశోక్ కుంబము | 20.01.2018 01:08:15am

భక్తి
ముక్తి
దైవశక్తి ...
విరక్తి లేకుండ
రామకోటీ రాస్తుంటే
మాట మాటకి విముక్తని
ఆ నినాదాలేంటి
మా చెడ్ద చిరాక్ గా వుంది
అదేమి విడ్డూరం
మనుధర్మాన్ని కూల్చి
మనిషిని నిలబెడుతారంటారేమి
ఇన్నేండ్ల మా అణిచివేత అయుధాలను
ఇప్పుడు ఏ జమ్మి చెట్టుపై దాచుకోవాలి?

అరగనంత అజ్ణాణాన్ని కడుపునిండాతిని
ఏ పుట్ట, గుట్ట, చెట్టు చుట్టో
పొర్లు దండాలు పెట్టమంటే
తలెత్తుకొని
జ్ణాణ సిద్ధాంతాలు చెబుతారేం
ఇలా అయితే మా చెవుల్లో మేమే
సల సల మరిగే శీసం పోసుకోవాలా?

సూర్యుడు, చంద్రుడు, భూమి
ఒకే సరళరేఖ మీదికొస్తే
రాహువు, కేతువు, గ్రహణమని
భయపడి చావాల్సిందిపోయి
ఏకంగా నక్ష్యత్రధూళిలోనే
విహరించాలని ఊహచేస్తారా
ఇన్నాళ్ళు పుక్కటి పురాణాలు చెప్పిన మా నాలుకల
ఇప్పుడు మేమే తెగ్గోసుకోవాలా?

అంటరానోళ్లంతా మా అగ్రహార విద్యాలయాలలో
పిడికిళ్ళ వనమై విస్తరిస్తుంటే
మా అగ్రవర్ణ ఆదిపత్య పిలకలెట్ల మొలుస్తయ్?
మీ నీడనే మహా పాతకమనుకుంటే
నీలి ఆకాశమై కమ్మేస్తున్నారే
సంధ్యావందనం చేద్దామంటే
ఎర్రటి రోహితులై ఉదయిస్తున్నారే
ఎన్ని కుట్రలు చేసినా
ఏకలవ్యులై వెంటపడుతున్నారే

ఇక ద్రోణాచార్యుడి వేలు తెగాల్సిందేనా?!

(అమరుడు రోహిత్ వేములకు జోహార్లు అర్పిస్తు)





No. of visitors : 377
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    मार्क्स सिद्धांत और राजनैतिकता के बारे में आप के राय वीडियो के रूप में भिजाइए।
    Share your views on Karl Marx, his ideology and Politics
    21వ శతాబ్దంలో మార్క్స్‌
    అరుణతార ఏప్రిల్ - 2018
    యురేనియం కర్మాగారం చేస్తున్న కాలుష్యాన్ని ప్రశించిన ప్రజాసంఘాల నాయకుల అరెస్టులను ఖండిస్తున్నాం
    గోడ ఒక ఆయుధం
    చెప్పులు కొందాం రండి
    ఎలా వెళ్ల‌ను?
    ʹహెచ్‌సీయూ వీసీ హ‌త్య‌కు ప‌థ‌కంʹ బూట‌కం
    భవిష్యత్తును కాల్చేశారు
    రజనీతిలక్ లేని లోటు భర్తీ చేయలేనిది
    కలకత్తా సాహిత్య ఉత్సవాల్లో పాల్గొన్న ముగ్గురు కవయిత్రులు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •