ʹవసంతగీతంʹ వర్థిల్లాలి!

| సాహిత్యం | వ్యాసాలు

ʹవసంతగీతంʹ వర్థిల్లాలి!

- వరవరరావు | 20.01.2018 01:16:17am

గజ్జెల లక్ష్మమ్మ స్మృతిలో....

ఆకురాలుకాలం శిశిర శైథిల్యంలోకి మారుతున్నవేళ పాత ఆదిలాబాదుజిల్లా ఐదుడిగ్రీల చలికి వణుకుతున్న వేళ, గోదావరిలోయ ఓపెన్‌కాస్ట్‌ విధ్వంసంతో బొందలగడ్డగా మారుతున్నవేళ, మావోయిస్టు సాకుతో ఆదివాసులపై నూటనలబై సెక్షన్లు, కరెంటుకోతలు, కర్ఫ్యూలు అమలవుతున్నవేళ ఎనబై పున్నములు అమావాస్యలు చూసిన అమ్మ - విప్లవ అమ్మ - పావెల్‌ తల్లిగా అందరూ తలచుకునే, పిలుచుకునే గజ్జెల లక్ష్మి (85) బెల్లంపల్లిలో అమరురాలైంది. అల్లంరాజయ్య కథలు నవలలు చదివేవారికి, ఆ మాటకొస్తే ఆదిలాబాదు కరీంనగర్‌ రైతాంగ పోరాటాలు మొదలు దండకారణ్య విప్లవోద్యమం వరకు సాహిత్యంతో పరిచయం ఉన్న వారెవరికీ బెల్లంపల్లి అమ్మను పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

విప్లవంలో జగిత్యాల జైత్రయాత్ర తరానికి ఆమె గజ్జెల గంగారామ్‌ తల్లిగా తెలుసు. నల్లా ఆదిరెడ్డి (శ్యాం) కూడ అమ్మగా పిలుచుకునే పిల్లనిచ్చిన తల్లిగా తెలుసు. ఆమె కన్న తల్లే గానీ, విప్లవ ఉగ్గుపాలు తాగిన బిడ్డగా ఎదిగిన గజ్జెల సరోజ విప్లవంలో ఎంచుకున్న సహచరుడు శ్యాం. అంతమాత్రమే చాలు నిజానికి - అందులో ఒక్క గంగారామ్‌ తల్లి కావడమే చాలు ఆమె పావెల్‌ అమ్మ కావడానికి. పావెల్‌ అమ్మను రష్యన్‌ విప్లవంలో అమ్మను చూసి మాగ్జిం గోర్కీ సృష్టించాడు. రష్యా విప్లవంలో తమ సంతానం ప్రభావంతో విప్లవ అమ్మలయిన ఎందరో కన్నతల్లుల సమాహార రూపం పావెల్‌ అమ్మ.

బెల్లంపల్లి అమ్మ, ఆమె సహచరుడు - సింగరేణి కార్మికుడు - సింగరేణి బొగ్గుగనుల్లోకి విప్లవాన్ని తెచ్చిన తలిదండ్రుల తరం వాళ్లు. 1967-68 నక్సల్బరీ శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు గోదావరి లోయలోకి, మంథని, మహదేవ్‌పూర్‌, బలార్షా - చంద్రపూర్‌ అడవుల్లోకి, ముఖ్యంగా బొగ్గుబావుల్లోకి నిప్పురవ్వగా ప్రవేశించినపుడే పోగొట్టుకోవడానికి ఏమీలేని కార్మికులుగా, భూమిహీనులైన దళితులుగా విప్లవంలోకి అతి సహజంగా ఆకర్షితులైనవారు. 1956 నాటికే కృష్ణాజిల్లా నుంచి ములుగు ఘనపురం, అక్కడినుంచి జన్నారం బతుకుతెరువుకు వెళ్లిన కొండపల్లి సీతారామయ్య లక్సెట్టిపేట జన్నారం ప్రాంతాలకు కమ్యూనిస్టు రాజకీయాలు తీసుకపోయాడు. ఆయనక్కడ ఎక్కువకాలం లేకపోయినా ఆయన రాజకీయాల ప్రభావం కొనసాగింది. లక్సెట్టిపేటలో స్థిరపడిన కళ్యాణం వెంకటేశ్వరరావు - ఆంధ్రాబోరుగా పిలుచుకునే ప్రాంతం నుంచి బెల్లంపల్లి కాగజ్‌నగర్‌ల దాకా నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాల వెలుగులను ప్రసరింపచేసాడు. కాగజ్‌నగర్‌కు 1967 లోనే చారుమజుందార్‌ విగ్రహ విధ్వంస రాజకీయాలు సుప్రసిద్ధ హిందీకవులు వేణుగోపాల్‌, తేజ్‌రాజేందర్‌సింగ్‌ల ద్వారా ప్రత్యక్షంగా, వాళ్ల గురువయిన ఎం.టి.ఖాన్‌ ద్వారా పరోక్షంగా చేరుకున్నాయి. అక్కడ విప్లవ విద్యార్థిగా రూపొందినవాడే తుషార్‌కాంత భట్టాచార్య. ఈ జ్ఞాపకాలన్నీ బెల్లంపల్లి అమ్మ ఆఖరిశ్వాస గురించి రాత్రి పదిన్నరవేళలో విన్నపుడు నాతో సికిందరాబాదు (ముషీరాబాదు) జైల్లో ఎమర్జెన్సీలో గడిపిన బెల్లంపల్లి ఎంఎల్‌ పార్టీ సిఒసి సానుభూతిపరులుగా మీసా డిటెన్యూలుగా వచ్చిన మలయాళీ మిత్రుడు నాయర్‌, (సింగరేణిలో పరిపాలనాశాఖలో పనిచేసి విద్యావంతుడైన సానుభూతిపరుడు), మరికొందరు యువకులు, పేర్లు కూడ మరచిపోయినవాళ్లు కళ్లల్లో మెదిలారు. జ్ఞాపకాల్లోకి వచ్చారు.

అల్లంరాజయ్య ʹతల్లిచేపʹ కథలో ఉపాధ్యాయురాలు మనసులో ఎవరిని పెట్టుకొని చెప్పిందోకానీ గజ్జెల లక్ష్మి అటువంటి తల్లిచేప. సింగరేణి కార్మికుల్లో సికాసగా, పల్లెల్లో రైతుకూలీసంఘ సభ్యులుగా, పల్లెల్లో పట్నంలో గంగారామ్‌, పెద్దిశంకర్‌ వంటి రాడికల్స్‌గా, తర్వాత విప్లవకారులుగా ఎదిగినవాళ్ళందరూ ఆమె భావాల్లో ఈదినవాళ్లే. ఆమె కొడుకు కమలాకర్‌ పోలీసుల చిత్రహింసలతో మరణించాడు. పద్మ జననాట్యమండలిలో పనిచేసి, ఒక ముస్లిం యువకుణ్ని ప్రేమించి పెళ్లిచేసుకొని తర్వాత జీవితంలో చాల నలిగిపోయి విషాదంగా మరణించింది.

ఆ ఇంట దీపపు ప్రమదలోని వత్తులే, ఆ ఇంట కుంపటిలో రగిలిన బొగ్గుకణికలే ఆమె కొడుకు గజ్జెల గంగారామ్‌, పెద్దిశంకర్‌, నల్లా ఆదిరెడ్డి (శ్యాం), మధునయ్యలు. జగిత్యాల జైత్రయాత్రతో ప్రారంభమైనా రఘుగా పార్టీనిర్మాణం, సికాస నిర్మాణం, అడవి ఉద్యమ నిర్మాణం, రైతాంగపోరాట నిర్మాణంతో పాటు నల్లా ఆదిరెడ్డి బహుముఖ ఆచరణంతా ఆదిలాబాదు జిల్లానుంచే, బెల్లంపల్లి, గోదావరిఖని, ఇంద్రవెల్లి వంటి పోరాట క్షేత్రాల నుంచే. విప్లవంలో ఏర్పడిన స్నేహబంధమే ప్రేమానుబంధంగా మారి గజ్జెల సరోజ, జననాట్యమండలి నుంచి క్రమంగా ఎదుగుతూ పార్టీ నుంచి ఆదిలాబాదు జిల్లా నిర్మాణం నుంచి దండకారణ్యం దాకా వెళ్లి గంగారామ్‌, శ్యాంల వలెనే జీవితమంతా విప్లవానికి అంకితమై క్యాన్సర్‌ వ్యాధితో 11 డిసెంబర్‌ 2013న అమరురాలైంది. ఆమె మృతదేహాన్ని కూడ చూసుకోలేకపోయిన తల్లి సరోజ అమరత్వం తర్వాత వెలువడిన ఆమె రచనలు, ఆమె గురించిన స్మృతుల పుస్తకం ʹసాహస యోధురాలుʹ పుస్తకాలను బెల్లంపల్లిలో గానీ, హనుమకొండలో గానీ సభ ఏర్పాటుచేసి ఆవిష్కరింపచేయాలనే మా ఆకాంక్ష నెరవేరకుండానే ఆమె అనారోగ్యానికి గురయింది. కాని హనుమకొండ కాళోజీనగర్‌ అంబేద్కర్‌భవన్‌లో 2014 జనవరిలో జరిగిన విరసం మహాసభల్లో తన చేతుల మీదుగా ఆమె పులి మధునయ్యకు అంకితమైన అల్లంరాజయ్య నవల ʹవసంతగీతంʹను ఆవిష్కరించింది.

మావోయిస్టుపార్టీ ఇంకా పీపుల్స్‌వార్‌గా రూపొందుతున్న రోజుల్లోనే విప్లవకారులు శత్రువునుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు, తమ ఆయుధాలు, ఆయుధాగారాలు తామే రూపొందించుకోవాలనే సృజనాత్మకతను ప్రవేశపెట్టిన తొలితరం యువనాయకుడు గజ్జెల గంగారామ్‌ వరంగల్‌ రీజనల్‌ ఇంజినీరింగ్‌ కాలెజి విద్యార్థి. జనార్దన్‌ సాహచర్యంలో పదునెక్కి ఆదిలాబాదు కరీంనగర్‌ రైతాంగపోరాటాన్ని ఎర్రజెండెర్రజెండెన్నియలుగా తన వాక్ప్రవాహంతో భద్రాచలం దాకా ప్రచారం చేసినవాడు. దండకారణ్యంలో 1982లో తాను తయారుచేస్తున్న బాంబు పేలి మొహమూ, నోరు, శరీరమూ ఛిద్రమై అమరుడయ్యాడు. అప్పుడే సాహు, మల్లోజుల కోటేశ్వర్లు కూడ గాయపడ్డారు. అల్లంరాజయ్య ʹసెంట్రీʹ ఆ దృశ్యాన్ని గజ్జెల గంగారామ్‌ ఎప్పుడూ చెప్పే స్పార్టకస్‌ కథను గర్తుచేసుకుంటాడు. ఈ అమ్మ పూనికపై బెల్లంపల్లిలో గంగారామ్‌, పెద్దిశంకర్‌ వంటి అమరులకోసం మేస్త్రీలు స్వచ్చందంగా అర్థరాత్రిపూట స్థూపం నిర్మిస్తే పోలీసులు కూల్చేసిన సందర్భాన్ని అల్లంరాజయ్య మరొక కథ ʹదూదిపులిʹలో చెప్తాడు.

అమరవీరులైన విప్లవకారుల కథలు, గాథలు చదువుకుంటాం. కాని వాళ్ల తల్లులు, సహచరులు - నిజంగా ఆ విప్లవకారులు రూపొందడంలో నిజమైన భూమిక అయి దోహదం చేసినవాళ్లు, వాళ్ల ఊళ్లల్లోనో, స్థానికంగానో పరిసరాల్లోనో కాకుండా ప్రజలకంతా తెలియాలి. అందాకా ఆ అన్‌సంగ్‌ తల్లుల కోసం, ఎవరి కన్నీళ్లు వాళ్ల వెక్కిళ్లలోనే, ఎవరి జ్ఞాపకాలు వారి గుండెల్లోనే దాచుకొని ఈ నేలవిముక్తికి తమ రక్తమాంసాలిచ్చిన తల్లుల కోసం.......






No. of visitors : 407
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ఈవ్ టీజింగ్ సాకు తీసుకొని మొత్తం దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం అమానుషం
    మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...
    దేశద్రోహ నేరం!
    అగ్ర వుగ్రవాదం!
    ఆదాయం సున్నా ఖర్చు పన్నెండు!
    ఆ పిల్లకు క్షమాపణతో...
    కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
    చిన్న చేపల్ని చంపుతున్న పెద్ద పరిశ్రమ
    నేనూ అర్బన్ మావోయిస్టునే
    సుధా భరద్వాజ్ కు నా సెల్యూట్‌
    గౌతమ్‌నవలఖా సదా సూత్రబద్ధమైన అసమ్మతివాది.
    మానవ హక్కుల పరిరక్షకులపై దాడిని ఖండిస్తూ పంజాబ్‌ మేధావుల సంయుక్త ప్రకటన

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •