విరసం 26వ మహా సభలకు వచ్చిన ప్రతినిధులకు స్వాగతం. ఈ సభల్లో మనం బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం గురించి చర్చించుకుంటున్నాం. హిందూ ఫాసిజం గురించి, బ్రాహ్మిణిజం గురించి కొన్ని దశాబ్దాలుగా విరసం, విప్లవోద్యమం విశ్లేషిస్తున్నాయి. బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం గురించి కూడా చాలా ఏళ్లుగా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ అవసరం మరింత పెరిగింది. మన దేశంలో ఫాసిజం బ్రాహ్మణీయ హిందుత్వ రూపంలో వస్తోందని చెప్పడం మొదలు పెట్టాం. ఎందుకు ఇంత తీవ్రంగా బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం ముంచుకొస్తున్నదో చెప్పే ప్రయత్నం చేశాం. దానికి ఉన్న రాజకీయార్థిక కారణాలను, భావజాల, సాంస్కృతిక కారణాలు ప్రజల ముందు పెడుతూ వచ్చాం. అయినా ఫాసిస్టు శక్తులదే పై చేయి అయింది. మానవ జీవితంలోకి అన్ని రంగాలను అది తన చేతుల్లోకి తీసుకుంటున్నది. ప్రశ్నించినవాళ్లను హత్య చేస్తున్నది. బెదిరిస్తున్నది. మన సంస్కృతి సంప్రదాయాలు అని గొంతు చించుకునే సంఘపరివార్ ఎలాంటి భాష ఉపయోగిస్తోందో తాజాగా ప్రొ. సూరేపల్లి సుజాతగారిని బెదిరించడంలో చూస్తున్నాం. బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు శక్తుల చేతిలో బలైపోయిన ప్రముఖ రచయిత, పాత్రికేయురాలు గౌరీలంకేష్ స్మారకంగా ఈ వేదికకు ఆమె పేరు పెట్టుకున్నాం. ఆమె ఒక్కరే కాదు, ఇటీవల సంఘపరివార్ చేతిలో బలైపోయిన రచయితలు, బుద్ధిజీవులు, ప్రజలందరి స్మృతిలో బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని ఎదుర్కోవాలనే లక్ష్యంతో ఈ సభలు జరుపుకుంటున్నాం.
మన సమాజంలో మతం పాత్ర క్రమంగా పెరుగుతోంది. రోజువారీ జీవితంలో సైన్స్‌ను పరిచారికగా వాడుకంటూనే మతం చుట్టూ తిరగడం ఎక్కువైంది. ఆలోచనాపరులు ఆందోళనకు గురవుతున్న విషయం ఇది. దీన్ని వివరించుకుంటే తేలే సత్యం ఒకటి ఉంది. అదేమంటే మతానికి ఆధ్యాత్మిక పాత్ర మాత్రమే లేదని. ఇంకా ఏదో ఉంది. దీన్ని పూజా పునస్కారాలు, క్రతువులు హెరెత్తిపోయే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లి వివరించడం అయ్యే పని కాదు. దేవుడున్నాడా లేదా నే చర్చలో తేల్చుకునేదీ కాదు. విశ్వాసాలు, పూజలు, పాత దేవుళ్లు చాలక ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే దేవతలు, వాళ్లకు పెరిగిపోతున్న గిరాకీ మొదలైనవి మతం పాత్ర పెరుగుతోందనడానికి సూచికలు. వీటన్నిటి లబ్ధిదారులు బ్రాహ్మణులే. ఈ మత వ్యవహారాల చుట్టూ జరిగే వ్యాపారం కూడా చిన్నది కాదు. వీటన్నిటినీ వివరించాల్సిందే. వీటికి తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే.
కానీ మతం ఇంత పరిమితమైంది కాదు. మానవజాతి చరిత్రలో దోపిడీని సులభం చేయడానికి మతం రంగం మీదికి వచ్చింది. దానికి అవసరమైన భావజాలాన్ని మతం నిరంతరం ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అది ప్రజలకు లోబరుచుకుంటుంది. అన్ని మతాలు ఈ పనే చేశాయి. అయితే బ్రాహ్మిణిజం లేదా సనాతన ధర్మం వర్గ దోపిడీకి అవసరమైన అత్యంత అమానుష పద్ధతులను తీసుకొచ్చింది. వర్గాలు ఏర్పడ్డానికంటే ముందే మత, ఆధ్యాత్మిక భావనలు మనుషుల మధ్య ఏర్పడ్డాయి. ఆ తర్వాత అవి మతంగా వ్యవస్థీకృతం అయ్యాయి. అప్పటి నుంచి అది వర్గదోపిడీకి తోడైంది. దోపిడీ చేసే వర్గానికి ప్రతినిధి అయిన రాజ్యాన్ని ఆశ్రయించి మతం బతికింది. మతాన్ని రాజ్యం బతికించింది. సామాజిక సంబంధాల్లో, భావజాల ప్రపంచంలో మతానికి పునాది ఉన్నప్పటికీ రాజ్యం నుంచి దొరికిన ఆసరా అంతా ఇంత కాదు. రెండూ కలిసే చరిత్రలో ప్రయాణిస్తూ వచ్చాయి. కొంచెం అటూ ఇటూగా అన్ని సమాజాల్లో మతం, వర్గం, రాజ్యం ఇలాగే సహజీవనం చేశాయి.
అయితే వర్గదోపిడీ లేని సమాజాన్ని నిర్మించుకోవడం ఎలా సాధ్యమో మతం లేని జీవితం కూడా సాధ్యమే అని మార్క్సిస్టు మహోపాధ్యాయులు అన్నారు. దీన్ని చారిత్రకంగా విశ్లేషించారు. మతం అవసరం లేని సమాజాన్ని, మతం ఉనికి చెల్లుబాటు కాని జీవితాన్ని ప్రజలు నిర్మించుకోడానికి వీలవుతుందని చెప్పారు. మతం పుట్టుకకు, కొనసాగడానికి కారణాలు గుర్తించి వాటిని తీసేస్తే మతం బతకలేదని చెప్పారు. అంటే చెట్టు మీది నుంచి పండు ఎలా రాలిపోతుందో అంతే సహజంగా మతం సమాజం నుంచి, చరిత్ర నుంచి తొలగిపోతుందని అభిప్రాయపడ్డారు. అలాంటి ప్రగతిదాయకమైన మార్గంలోకి చరిత్రను కార్మికవర్గం నడిపిస్తుందని చెప్పారు.
అప్పటి దాకా మానవ జీవితంలో మతం ఉంటుంది. కొన్ని వేల లక్షల రూపాల్లో వ్యక్తమవుతూనే ఉంటుంది. ఈలోగా ఎప్పటికప్పుడు మతానికి సంబంధించిన పునాదిలో, రాజ్యం మతాన్ని వాడుకునే పద్ధతిలో మార్పు వస్తూనే ఉంటుంది. అలాంటి మార్పులు జరిగినప్పుడల్లా జీవితంలో మతం విస్తీర్ణం పెరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త రూపాల్లో అది వ్యక్తమవుతూనే ఉంటుంది. అంతగా అది జీవితమంతా అలుముకపోతుంది. వీటి గురించిన విశ్లేషణ ఎంత అయినా ఇచ్చుకోవచ్చు.
కానీ దాని వర్గ పునాది ఏమిటి? దాన్ని రాజ్యం ఎలా వాడుకుంటున్నది? మత భావజాలం సమాజంలో ఎలా కొనసాగుతున్నది? అది రాజ్యాన్ని ఆశ్రయించి ఎలా బతుకుతున్నది? అనే విషయాల మీద మార్క్సిస్టులు శ్రద్ధ పెడతారు. అలాగే అన్ని మానవ సమాజాలకు స్థూలంగా వర్తించే ఈ విషయాలు నిర్దిష్టంగా భారత దేశంలో ఎలా ఉంటాయి? అనేది చాలా ముఖ్యం. మతం ఆయా సామాజిక వ్యవస్థలు, లేదా సామాజిక క్రమాలతో సంబంధం లేకుండా ఉండదు. మతం పనితీరును ఈ సంబంధంలో భాగంగానే చూడాలి. అసలు మతం, సామాజిక వ్యవస్థ ఒకటే అని అనుకునేలా రెండూ పెనవేసుకొని ఉంటాయి. భారతదేశంలో హిందూ మత వ్యవస్థే (హిందూ మతం అనేది ఒకటి ఉందా? అనే వివరాలు తర్వాత చూద్దాం) ఇక్కడి సమాజిక వ్యవస్థ అనిపిస్తూ ఉంటుంది. కేవలం ఆరాధన పద్ధతులు, కర్మకాండలు, నమ్మకాలు, భావజాలాలు, స్మృతులుగానే గాక రాజకీయ, ఆర్థిక, నైతిక సంబంధమైన విషయాలన్నిటిలోనూ హిందూ మతం నిర్ణాయకంగా ఉంటూ వచ్చింది. అందుకే మతం లేని సాంఘిక జీవితాన్ని ఊహించలేమని చాలా మంది అనుకూలంగా, ప్రతికూలంగా సూత్రీకరించారు.
బ్రాహ్మిణిజం ఇంత శక్తివంతమైన ఆధిపత్య భావజాలంగా ఉన్నందు వల్ల ఫాసిజం ఇక్కడ మత రూపంలో వస్తున్నది. ఇలాంటి వాటన్నిటినీ కలిసి బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని వివరించే శాస్త్రీయ పరిశీలనా చట్రాన్ని తయారు చేసుకోవాలి. అది ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక, భావజాల రంగాలన్నిటిలోంచి ఫాసిజాన్ని వివరించగలగాలి. వీటిలో రాజకీయార్థిక రంగాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చే వాళ్లు వాటికే పరిమితమై బ్రాహ్మిణిజాన్ని విస్మరిస్తే మన దేశంలోని బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని అర్థం చేసుకోవడంలో పూర్తిగా పొరబడ్డట్లే. అలాగే దీన్ని బ్రాహ్మిణిజం గురించి మాట్లాడే సందర్భంగానే మలుచుకుంటే మార్క్సిస్టు పద్ధతిలోని అతి ముఖ్యమైన రాజకీయార్థిక పునాది ఎగిరిపోతుంది. అప్పుడు సాంఘిక అస్తిత్వ దృష్టితో మాత్రమే ఫాసిజాన్ని ఎదుర్కోబోయినట్లవుతుంది. అది తప్పక ఓడిపోయే పోరాటమవుతుంది. బ్రాహ్మిణిజం తానే ఆర్థిక నియమాలు, వ్యవహారాలు నిర్దేశించిన కాలం కూడా చరిత్రలో ఉండింది. కాలక్రమంలో ఆర్థిక వ్యవస్థ తనదైన సొంత ఆంతరంగిక నియమాల ద్వారా నడవడం మొదలు పెట్టింది. అందువల్ల బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం చర్చ అంతిమంగా వర్గ పద్ధతికి సంబంధించిన చర్చ అవుతుంది. జాతీయత గురించిన సంఘ్‌పరివార్ మాటలనూ, సంస్కృతి సంప్రదాయాలనే అరుపులనూ కూడా వర్గమనే గీటురాయి మీద తేల్చాల్సిందే. దీన్ని మర్చిపోయి బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని విశ్లేషించబోయినా చాలా సునాయాసంగా బూర్జువా తీరం చేరుకునే ప్రమాదం ఉంది.
దీనికి ఒక ప్రబల ఉదాహరణ చెప్పుకొని ముందుకు పోవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో యూరప్‌లోని సోషల్ డెమోక్రటిక్ పార్టీల ఉద్దండ కమ్యూనిస్టు నాయకులందరూ పితృదేశం, దాని సంరక్షణ అనే జాతీయతా రుగ్మతలకు గురై సామ్రాజ్యవాద యుద్ధం ముందు మోకరిల్లారు. మహోపాధ్యాయుడు లెనిన్ మాత్రమే శ్రామికవర్గ అంతర్జాతీయతను ఎత్తిపట్టాడు. సామ్రాజ్యవాద యుద్ధాన్ని అంతర్జాతీయ కార్మిక వర్గ యుద్ధంగా తీర్చిదిద్దాడు. బోల్షివిక్ విప్లవాన్ని విజయవంతం చేశాడు. ఇలాంటి అంతర్జాతీయతను, దాని రాజకీయార్థిక సమీకరణాలను మర్చిపోతే ప్రయోజనం ఉండదు. ఈ సంఘ్‌పరివార్ చేస్తున్న అమానవీయ, ఆధిపత్య, హింసాత్మక చర్యలను, వాటి కింద బూర్జువా వర్గ రాజకీయార్థిక దోపిడీ విధానాలను కలిసి విమర్శించగలగాలి
Type in English and Press Space to Convert in Telugu |
వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల...... |
ఈ తీసివేతలు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా......... |
ఆజాదీ కశ్మీర్ : చల్లారని ప్రజల ఆకాంక్షకాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........ |
వివేక్ స్మృతిలో...వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు....... |
రైతు - నీళ్లురైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం...... |
భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమేఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి...... |
మానవ హననంగా మారిన రాజ్యహింస ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం....... |
జీవిత కవిత్వం విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్ పద్ధతులకు వ... |
కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్ దేశస్థుల స్వేచ్ఛ గు... |
నాగపూర్ వర్సెస్ దండకారణ్యందండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ... |
Open letter to Krishna BandyopadhyayAs a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol.. |