పెదగొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలి

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

పెదగొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలి

- విరసం | 24.01.2018 11:42:19pm

పెదగొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలి
అరెస్టు చేసిన ప్రజాసంఘాల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి

గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో ఆధిపత్య కమ్మ కులస్తుల దాడులకు, అవమానాలకు గురైన దళితుల న్యాయపోరాటానికి మద్దతుగా ఏర్పడిన అఖిలపక్ష కమిటీ సభ్యులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పెదగొట్టిపాడులో డిసెంబర్‌ 31 రాత్రి ఇద్దరు దళిత యువకులు బైక్‌ మీద వస్తూ ఒక చాకలివాళ్ల ఇంటి ముందు ముగ్గుపై జారిపడ్డారు. అక్కడి మహిళలు వారిని కోప్పడితే క్షమాపణలు చెప్పారు. ఇంతలో కమ్మ ఇళ్ల నుండి మగవాళ్లు కూడా వచ్చి ఆ యువకులను కోప్పడి కొట్టారు. అంతటితో వాళ్లు ఆగదలచుకోలేదు. ఎప్పటి నుండో దళితుల మీద పెంచుకున్న కసిని ఈ ఘటన సాకుగా తీర్చుకోవాలనుకున్నారు. ఆ ఊరిలో కొంతకాలంగా దళితులు పొలం పనులను కాదని పట్టణానికి పోయి పనులు చేసుకుంటున్నారు. గ్రామ పంచాయితీ అభివృద్ధి పనుల్లో దళితవాడకు కేటాయించవలసిన వాటా అడుగుతున్నారు. దళిత యువకులు బైకుల్లో తిరుగుతున్నారు. ఇటువంటివన్నీ ఆ ఊరి ఆధిపత్య కులం వాళ్లకు కంటగింపయ్యాయి. కారంచేడు, చుండూరులు ఇక్కడ మనకు గుర్తొస్తాయి. ఈ నేపథ్యంలో కమ్మ కులం వాళ్లు ఆ రాత్రి ట్రాక్టరులో ఆయుధాలేసుకొని వచ్చి చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్న దళితులపై దాడి చేశారు. పరమ అసభ్యంగా మహిళల ముందు లుంగీలెత్తి చూపించారు. దళితులు తమను తాము కాపాడుకోడానికి రాళ్లు విసురుతూ ప్రతిఘటించారు. ఈ దాడిలో నలుగురు దళితులకు గాయాలవ్వగా వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకొని ఘర్షణను అదుపుచేసి ఇరువైపులా కేసులు పెట్టినట్టు చూపారు. కమ్మవాళ్లు ముగ్గురి మీద ఎస్‌.సి.,ఎస్‌.టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన వాళ్లందరి మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, ముఖ్యులు సహా, ముద్దాయిలందర్నీ అరెస్టు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

మంత్రులు, అధికారులు బాధిత దళితులమీద ఒత్తిడి తెచ్చి రాజీ ప్రయత్నాలు చేశారు. రాజీపడినట్లుగా కూడా ప్రకటించారు గానీ దీనిని చాలా మంది, ముఖ్యంగా ఆ ఊరి దళిత మహిళలు అంగీకరించడం లేదు. ఆ మహిళల పట్టుదల, సంఘటిక పోరాట శక్తి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది. పెదగొట్టిపాడు దళితులకు న్యాయం జరగాలని ముందుకొచ్చిన దళితసంఘాలు, వామపక్షాలు, ప్రజాసంఘాలతో పెదగొట్టిపాడు దళిత న్యాయపోరాట కమిటి ఏర్పడి ఆందోళనలు జరుగుతున్నాయి. కమిటీ జనవరి 25న చలో పెదగొట్టిపాడు పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కమ్మవారి పక్షాన ఉద్యమాన్ని అణచివేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. పెదగొట్టిపాడులోనూ, ఆ ఊరిని చేరుకునే దారుల వెంట, పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌, 30యాక్ట్‌ విధించి వేలాది పోలీసులను మోహరించింది.

నిన్నటి నుండి ప్రజాసంఘాల నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నది. ఐక్య కార్యాచరణ కమిటి కన్వీనర్‌, న్యాయవాది శాంతకుమార్‌, కోకన్వీనర్‌ కొరివి వినయ్‌కుమార్‌, సి.పి.యం రాష్ట్ర కార్యదర్శి మధు, న్యాయవాది వై.కె, కులనిర్మూలనా పోరాట సమితి నాయకులు కృష్ణ, విజయ్‌భాస్కర్‌, పౌరహక్కుల సంఘం కార్యదర్శి చిలకా చంద్రశేఖర్‌, చైతన్య మహిళా సంఘం నాయకురాలు రాజేశ్వరి, ప్రగతిశీల కార్మిక సంఘం నాయకుడు కొండారెడ్డి తదితరులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని పెదగొట్టిపాడు దళిత మహిళలు చాటిచెబుతున్నారు. పోలీసు బలగాల మోహరింపుల మధ్యనే అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని, తమకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్నారు. గతంలో ఆ ఊరిని సందర్శించిన ఆడ్వకేట్‌ వై.కెను పోలీసులు అరెస్టు చేస్తే ఆయన్ని వదిలే వరకు ఆందోళన చేసిన మహిళలు న్యాయం కోసం దృఢంగా పోరాడుతున్నారు. వారికి జేజేలు చెబుదాం. పెదగొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలని, అరెస్టు చేసిన ప్రజాసంఘాల కార్యకర్తలందరినీ విడుదల చేయాలని విరసం డిమాండ్‌ చేస్తోంది.

పాణి (కార్యదర్శి)
వరలక్ష్మి, కాశీం, అరసవిల్లి కృష్ణ, కిరణ్‌ (కార్యవర్గ సభ్యులు)





No. of visitors : 484
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
    అరుణతార నవంబర్ - 2018
    International Seminar on Nationality Question
    రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
    ప్రభుత్వమే అసలైన కుట్రదారు
    సూర్యాక్షరం
    శ్వాసిస్తున్న స్వ‌ప్నం
    చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
    వెలిసిన రంగులు
    అతనేం చేసిండు?
    సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
    ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •