హ‌క్కులపై ఉక్కుపాదం

| సంపాద‌కీయం

హ‌క్కులపై ఉక్కుపాదం

- క్రాంతి | 06.02.2018 12:28:44pm

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు, పోలీసుస్వామ్యం వ‌ర్థిల్లుతోంది. ఆక‌ల‌ని అర‌వ కూడ‌దు... ఆత్మగౌర‌వం కోసం గొంతెత్త‌కూడ‌దు. హ‌క్కులంటూ రోడ్డెక్క‌కూడ‌దు. మొత్తంగా రాజ్యాన్ని ప్ర‌శ్నించ‌కూడ‌దు. లేదంటే.. లాఠీ, తూటాలు, చెర‌సాల‌లూ సిద్ధంగా ఉంటాయి. అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డం కోసం ఇద్ద‌రు చంద్రులూ ప్ర‌జ‌ల ద‌మ‌న‌కాండ‌ను ప్ర‌యోగిస్తున్నారు. స‌భ పెట్టుకునే హ‌క్కుని, నిర‌స‌న తెలిపే హ‌క్కుని హ‌రించి నియంతృత్వ పాల‌న సాగిస్తున్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్య‌మంపై, వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై, పెదగొట్టిపాడు ద‌ళితుల‌పై అమ‌ల‌వుతున్న నిర్బంధమే అందుకు నిద‌ర్శ‌నం.

రెండు ద‌శాబ్ధాల‌కు పైగా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ నినాదాన్ని వినిపిస్తున్న‌ ఎమ్మార్పీస్ ఉద్య‌మంపై ఇద్ద‌రు చంద్రులూ క‌త్తిగ‌ట్టారు. ఎమ్మార్పీఎస్ త‌ల‌పెట్టిన కురుక్షేత్ర స‌భ‌ను అడ్డుకొని కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేసిన ఏపీ స‌ర్కారు బాట‌లోనే తెలంగాణ స‌ర్కారు ప‌య‌నిస్తోంది. హైద‌రాబాద్‌లో మంద‌కృష్ణ మాదిగ చేప‌ట్టిన నిరాహార‌దీక్ష‌ను అడ్డుకొని జైలులో నిర్బంధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త‌ల‌పైనా అక్ర‌మ కేసులు మోపి జైలు పాలు చేసింది. ఒక న్యాయ‌మైన డిమాండ్‌ని అణ‌చివేసేందుకు పాల‌కులు అవలంభిస్తున్న విధానాలు అత్యంత అప్ర‌జాస్వామిక‌మైన‌వి.

ఒక్క ఎమ్మార్పీఎస్ విష‌యంలోనే కాదు.. రెండు రాష్ట్రాల్లో అన్ని ప్ర‌జా ఉద్య‌మాల‌పైనా ఈ నిర్భందం కొన‌సాగుతోంది. గుంటూరు జిల్లా పెదగొట్టిపాడులో ద‌ళితుల‌పై దాడి చేసిన క‌మ్మ‌కుల‌స్థుల‌కు అండ‌గా నిలిచిన ప్ర‌భుత్వం ద‌ళితుల‌పై దాడుల‌ను ప్రోత్స‌హిస్తోంది. పెదగొట్టిపాడు దళితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ప్ర‌జా సంఘాలు జనవరి 25న పిలుపునిచ్చిన ఛ‌లో పెదగొట్టిపాడును సైతం పోలీసులు అడ్డుకున్నారు. ప్ర‌జా సంఘాల నాయ‌కుల‌ను రాత్రికి రాత్రే ఇళ్ల‌లోంచి అరెస్టు చేసి తీసుకెళ్లారు. పెద్ద‌గొట్టిపాడు ద‌ళితుల‌కు అండ‌గా నిలిచిన రాజేశ్వ‌రి(సీఎంఎస్‌), సిపోరా (సీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు), కొండారెడ్డి (పీకేఎస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి), కృష్ణ‌ (కేఎన్‌పీఎస్ రాష్ట్ర కార్య‌దర్శి) త‌దిత‌రుల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించారు.

ప్ర‌త్యేకించి గత సంవత్సర కాలంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజాసంఘాలపై హేయమైన దాడిని ఎక్కుపెట్టింది. ఏఓబీ బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్‌లో 31 మందిని హ‌త్య చేసిన పోలీసులు, ఆ ఘ‌ట‌నపై న్యాయ‌విచార‌ణ‌కు డిమాండ్ చేసిన ప్ర‌జా సంఘాల‌పై దాడిని ఎక్కుపెట్టారు. ముసుగు సంఘాల పేరుతో ప్ర‌జా సంఘాల నాయ‌కుల‌ను మావోయిస్టులుగా చిత్రీక‌రిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట‌ర్లు అంటించారు.విశాఖ నుంచి క‌డ‌ప వ‌ర‌కు ప్ర‌జా సంఘాల నాయ‌కుల‌ను హంత‌కులుగా చిత్రీక‌రిస్తూ క‌ర‌ప‌త్రాలు పంపిణి చేశారు. మ‌ద్య నిషేదం గురించి మాట్లాడినా, రాజ‌కీయ ఖైదీల విడుద‌ల గురించి మాట్లాడినా, విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల గురించి మాట్లాడినా ప్రజాసంఘాల కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ పోటీ కార్యక్రమం చేయిస్తున్నారు. చైత‌న్య మ‌హిళా సంఘం నాయ‌కురాళ్ల ఫోటోల‌ను ముద్రించి వీళ్ల‌ను న‌మ్మ‌వ‌ద్దు, మీ కాలేజీల‌కు, హాస్ట‌ళ్ల‌కు రానీయ‌వ‌ద్దు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అంటించారు. తాజాగా పెద్ద‌గొట్టిపాడు నేప‌థ్యంలో మ‌ళ్లీ ఇదే ప్ర‌చారాన్ని తెర‌మీదికి తెచ్చారు పోలీసులు.

మ‌రో వైపు తెలంగాణ‌లోనూ ప్ర‌జా సంఘాల‌పై ఇదే ర‌క‌మైన నిర్బంధం కొన‌సాగుతోంది. ధ‌ర్నా చౌక్‌ని ఎత్తివేసి, ప్ర‌జ‌ల నిర‌స‌న హ‌క్కును హ‌రించిన ప్ర‌భుత్వం పాల‌క ప‌క్షం త‌ప్ప‌, ప్ర‌తి ప‌క్షం ఉండ‌కూడ‌ద‌నే వైఖ‌రిని అవ‌లంభిస్తోంది. ప్ర‌పంచ తెలుగు మహాస‌భ‌ల‌ను వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేసిన ర‌చయిత‌ల‌ను అరెస్టు చేసింది. ఎసీ వ‌ర్గీక‌ర‌ణ అడిగినందుకు మంద‌కృష్ణ‌ను జైలు పాలు చేసింది. వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ 20 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌జా ఫ్రంట్ నిర్వ‌హించిన స‌భ‌పైనా పోలీసులు నిర్బంధ‌కాండ‌ను ప్ర‌ద‌ర్శించారు. స‌భ‌కు అనుతిచ్చిన ప్ర‌భుత్వ‌మే స‌భ‌కు వ‌చ్చేవాళ్ల‌ను అడ్డుకునేందుకు య‌త్నించింది. అమ‌రుల స్తూపం వ‌ద్ద నివాళుల‌ర్పిస్తున్న ప్ర‌జా సంఘాల నాయ‌కుల‌ను లాఠీల‌ను ప్ర‌యోగించారు. మ‌హిళ‌ల ప‌ట్ల విచ‌క్ష‌ణా ర‌హితంగా వ్య‌వ‌హ‌రించారు. గుండు సూదులల‌తో గాయ‌ప‌రిచారు. యాక్ష‌న్ ప్లాన్‌ 2018, స‌మాధాన్ పేరిట కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేప‌ట్టిన యుద్ధతంత్రంలో భాగంగానే వీటిని చూడాల్సి ఉంది. పాల‌క విధానాల‌కు విధానాల‌కు వ్య‌తిరేకంగా ఉమ్మ‌డిగా పోరాడాల్సిన అవ‌స‌ర‌మూ ఉంది.

No. of visitors : 602
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణ‌తార - మే 2019
  ఎర్ర‌జెండా - కార‌ల్‌మార్క్స్
  ర‌చ‌న - స్వేచ్ఛ - ప్ర‌జాస్వామ్యం
  వివి, ఆయన సహచర అర్బన్‌ మావోయిస్టు ఖైదీలతో ఆ కొన్ని ఘడియలు
  159 కేసులను ఎదుర్కొన్న ఒక మహిళా నక్సలైట్ కథ
  ఒక వికృతి
  ఎవ‌రు పాస‌ర‌య్యార‌ని?
  స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ
  స‌త్యాన్ని స‌మాధి చేసే కుట్ర‌
  విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •