ఈ పక్షం బుల్పికలు!

| సాహిత్యం | క‌థ‌లు

ఈ పక్షం బుల్పికలు!

- బమ్మిడి జగదీశ్వరరావు | 06.02.2018 12:30:59pm

" బుల్పికలు


త్రిబులెక్స్ : సంస్కారవంతమైన సోప్!

"బూతులు రాస్తావా? యిది కవిత్వమేనా.. నీయమ్మా.."*

అవమానవ హక్కులు!

"తెలుగు తల్లిని నిందించాడు.."
"ఆంద్రోల్లని నిందించాడు.."
"ఎవరు.. కేసీఆరా?"
"కాదు, స్కైబాబా.. కవట!"*

మర్కట న్యాయం!

"రాష్ట్రం విడిపోయింది.. మనం అన్నదమ్ముల్లా వుండాలి.."
"ఇద్దరు చంద్రులూ యెంత అన్యోన్యంగా వున్నారో చూడండి.."
"మల్ల.. కాంట్రాక్టులు మారలేదు.. బిజినెస్ గిజినెస్ కలిసే చేసుకుంటున్నాం కదా?"
"లగడపాటిలాంటి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తామని ఆనాడే చెప్పారు కదా?"
"గతంలో అనుకున్నవి వుద్యమ తీవ్రతలోనివి.. అవియేవీ పట్టించుకోకూడదు.."
"మరి స్కైబాబా కవిత్వం?"
"అందులో కవిత్వం యెక్కడుంది.. అన్నీ బూతులే కదా?"
"మీరూ బూతులెక్కువయ్యయని బూతులు తిట్టారు కదా?"
"అన్నీ పంచుకున్న వాళ్ళం.. బూతులు మాత్రం యెందుకు పంచుకోకూడదు?"*

రాజ్యʹఅంగముʹ!

"ఎవరినైనా కాల్చి చంపాలంటే వాళ్ళని నక్సలైట్లలో చేరమని చెప్పాలి.."
"అదేంటి? అది రాజ్యాంగ విరుద్దం కాదా..?"
"రాజ్యాంగం మీద గౌరవంలేని వాళ్ళనే నక్సల్స్ చేరమని.. అప్పుడు వాళ్ళ శరీరాల్లో తూటాలు దించుతామని కదా కేంద్రమంత్రి హన్స్ రాజ్ అహీర్ చెప్పింది.."
"రాజ్యాంగంమీద నమ్మకం కలిగించాలంటే..?"
"రాజ్యాంగాన్ని వ్యతిరేకించక తప్పదు..!"*

కలువపూల కత్తులు!"ఆవుల్ని చంపినవాళ్ళని అక్కడికక్కడే చంపేస్తాం.."
"ఇది కదా తీవ్రవాదం?!"
"గోవుల్ని రవాణా చేసేవాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, చంపుతాం.."
"ఇది కాదా వుగ్రవాదం?!"
"అంటే.. జకీర్ ను మీరేనా కొట్టింది..?"
"లేదు.. ట్రక్కు తిరగబడడంవల్లే తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు.."
బీజేపీ రాజస్థాన్ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా వీర దేశభక్తుడని అతని అనుయాయులు మరోమారు కీర్తించారు!*

రిచ్ డాడ్.. పూర్ పీపుల్!

"మోడీగారు ఎన్వీ తినరు తెలుసా..?"
"అవునా?"
"ఫుడ్ కూడా సింపుల్.. రోజుకు ఐదు పుట్టగొడుగులు తింటారు.."
"అంతేనా?"
"కాకపోతే వొక్కో పుట్టగొడుగు కేవలం యెనభై వేలే.."
"అంటే రోజుకు నాలుగు లక్షలే? నెలకు కోటీ యిరవై లక్షలు.."
"అంత ఆశ్చర్యపోతావేంటి? ఆయన కోట్ల రూపాయల ఖరీదుగల కోటుతోనే గదా అమెరికా అధ్యక్షున్ని కలిసి మనకు గుర్తుండిపోయింది?!"
"గ్రేట్.. ఆయనకి ఫ్యామిలీ లేకపోవడం బతికిపోయాం!"*

గొబ్బెమ్మల సాక్షిగా!

"రాజ్యాంగం ఏమయ్యింది?"
"చిరిగిపోయింది!"
"ఎలా..?"
"కోళ్ళ కాళ్ళకు కత్తులు కట్టారుగా?"*

దురదగొండాకు!

అది బెంగుళూరు బిడది ఆశ్రమం. అక్కడి ధ్యాన పీఠంలో దేశ విదేశాల భక్తులు సందేశాలు అందుకుంటున్నారు. నిత్యానందంలో మునిగితేలుతున్నారు!
"అది రాసలీల కాదు. ఆధ్యాత్మిక సేవ. సినీనటులు సేవ చేయకూడదా?" అని బూకరించారు నిత్యానందస్వాములు.
సీడీ చూపించారు. హాట్ గా హీట్ గా వుందది!
"నేను కాదు, మార్ఫింగ్. నకిలీ. నాలా వేషం వేసుకొని చేసారెవరో. నేనయితే కాదు. నేను అసలు పురుషున్నే కాదు.."
పురుషత్వ పరీక్షల్లో నిత్యానందస్వాములు పురుషుడనే తేలింది!
"నేను పురుషుడే కావచ్చు. కానీ సీడీలో వున్నది మాత్రం నేను కాదు"
సమగ్ర పరిశీలనానంతరం సీడీలో వున్నది నిత్యానందస్వాములవారేనని ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది!
"ఇందుస గలడు.. అందు లేడని సందేహం వలదు.. ఎందెందు చూసిన అందందే.."
నిత్యానందులై భక్తుల భజనలు యధావిధిగా జోరందుకున్నాయి!*

రోబో వొక్కటి కాదు!

"కొత్త సంవత్సర కానుకగా కొత్త పోలీసొచ్చాడు! నెల నెలా జీతానికి కాదు! మూడులక్షల మదుపు పెడితే చాలు! చెప్పినట్టు వింటాడు! ఆడమన్నట్టు ఆడుతాడు! పాడమన్నట్టు పాడుతాడు!"
"ఓహో.. రోబోల్లెక్కా?"
"ల్లెక్కా.. కాదు, రోబోయే..!"
"ఆల్రెడీ పొలిటీషియన్ల చేతుల్లో వొక్క పోలీసేంటి.. మొత్తం డిపార్ట్మెంటే రోబోలా పనిచేస్తోంది కదా? మళ్ళీ కొత్తగా ఈ రోబోలెందుకు?"
"..................................!?!"*

ఒరిజినల్ పోలీస్!

"దుబాయ్ లో నయితే చక్రాల మీద పరిగెత్తేలా పోలీసు రోబో విధులు నిర్వర్తిస్తోంది.."
"మరి మనదగ్గర..?"
"మన పోలీసు రోబో నడిచి విధులు నిర్వర్తిస్తుంది..!"
"అవున్లే.. మన హైదరాబాదులో ట్రాఫిక్ గదా? రోడ్లమీద పరిగెత్తడం కష్టం!"
"అచ్చం మామూలు పోలీసుల్లానే అనుమానితులను, బాంబులను గుర్తిస్తుంది కూడా.."
"మామూలు అంటే గుర్తొచ్చింది మామూలు పోలీసుల్లానే మామూళ్ళు యిస్తే వొదిలేస్తుందా..?"
"ఆ..?"
"ముందు ముందు నేర్చుకుంటుందేమో? మన పోలీసులూ నేర్పిస్తారేమో? మామూళ్ళు వసూలు చేసే చిప్ పెడితే మరీ మంచిది.. డిపార్ట్మెంటుకూ లాభం.. జనానికి కూడా పోలీసులన్న భయమూ వుంటుంది!"*

No. of visitors : 497
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నీతి కథ! - రాజకీయ వ్యంగ్య కథ

బమ్మిడి జగదీశ్వరరావు | 03.07.2016 10:39:36pm

మన గౌరవ ముఖమంత్రి పగలూ రాత్రీ నిద్రపోకుండా నిద్రపోనివ్వకుండా శ్రమిస్తున్నారు.. ప్రపంచస్థాయి రాజధానిలాగే ప్రపంచస్థాయి నీతిని సాధిస్తాం.. సాధించి తీరుతాం........
...ఇంకా చదవండి

ʹనోట్ʹలో మట్టి!

బమ్మిడి జగదీశ్వరరావు | 20.12.2016 11:23:30pm

పుండొక చోట వుంటే వైద్యం వొక చోట..ʹ అన్నాడు మా బావమర్ది. వాతలు పెట్టిన నేతల దిబ్బల మీద దీపం పెట్టాలని.. మా ఆవిడ శక్తివంచన లేకుండా శాపం పెడుతోంది. తిడుతోంద...
...ఇంకా చదవండి

మధు వడ్డించిన అన్నం!

బమ్మిడి జగదీశ్వరరావు | 05.03.2018 08:03:16am

ఆకలి అందరికీ వుండొచ్చు! తినే అర్హత మాత్రం అందరికీ వుండదు! లేదని తిన్నావో నువ్వు దొంగవి! చిరుగుల బట్టా మాసినజుట్టూ అందుకు సాక్ష్యం! అయినా దేశానికి కన్నమేస్తే...
...ఇంకా చదవండి

దునియా అంతా ʹదొరల రాజ్యముʹ షూటింగే గదనే?!

బమ్మిడి జగదీశ్వరరావు | 06.12.2017 12:38:01am

లేదు.. లేదు.. గిది సినిమా కాదు.. మేం నటించలేదు.. అని లక్ష్మణూ రాజేషూ అంటే గది కూడా స్క్రిప్టే! వాళ్ళ స్క్రిప్టు వాళ్లకుంటది! మన స్క్రిప్టు మనకుంటది! మన సిని...
...ఇంకా చదవండి

100% డిజబులిటి నీడెడ్!

-బమ్మిడి జగదీశ్వరరావు | 06.11.2017 09:04:16am

అన్నిదారులూ మూసేస్తే? తలుపులన్నీ మూసేస్తే? పిల్లి తిరగబడుతుంది.. మనుషులు తిరగబడరా? బడతారు! అవే మిలిటెంటు ఉద్యమాలు అవుతాయి! సాయుధ పోరాటాలు అవుతాయి! చెయ్యవలసి...
...ఇంకా చదవండి

నీ అడుగులోన అడుగు వేసి నడవనీ.. నన్ను నడవనీ!

బమ్మిడి జగదీశ్వరరావు | 05.10.2017 11:27:55pm

సెంట్రల్ సర్కారే నడుపుతున్న రైల్వే డిపార్టమెంట్ యేమి చేసింది? రిజర్వేషన్లు అయిపోయాయని చెపుతూ ʹతత్కాల్ʹ పేరుతో యెక్కువ రేట్లకీ- అదనపు రెట్లకీ- డబ్బుండీ ......
...ఇంకా చదవండి

లౌకిక రామరాజ్యం వర్ధిల్లాలి!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.09.2017 11:32:20pm

దేవుడయినా దేశమయినా మనదే పేటెంట్! భక్తీ మనదే! దేశభక్తీ మనదే! సత్యము చెప్పుటకు సంశయించ తగదు.. మన దాయాదులు యీ విషయమందు ముందంజన వున్నారు! మొన్నటికి మొన్న పాకిస్...
...ఇంకా చదవండి

ఫ్యాన్స్ బాబూ.. ఫ్యాన్స్!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.10.2017 09:46:33pm

ప్రతొక్కడూ ఫ్యాన్సు మీద బురదచల్లి మాట్లాడడం ఫ్యాన్సుగా మనం సహించవొద్దు! ఫ్యాన్సుగా మనం వొక్కటిగా లేకపోతే యేకం కాకపోతే ఐక్యంగా వుండకపోతే డేమేజ్ అయిపోయి చాలా ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార మార్చి 2019
  కలకత్తా ప్రజా సాహిత్య ఉత్సవాల్లో మట్టిపరిమళాలూ, రుధిరాక్షర స్వప్నాలు
  నేరమే అధికారమైన వేళ
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర: మార్క్సిజం
  306
  స్వేచ్ఛ‌ను కాంక్షించ‌డ‌మూ దేశద్రోహ‌మైన చోట‌
  భగ్న సభోత్తేజం
  దేశీ సాహిత్య ఒర‌వ‌డి.. వ‌ర్గ‌పోరాట స్ఫూర్తి
  అధర్మ యుద్ధ దుష్పలితమే కాశ్మీరు మారణకాండ !
  పొద్దు
  క‌వితా వ‌చ‌నం
  సుక్మా బూటకపు ఎదురుకాల్పులు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •