ఇద్ద‌రు ఆదివాసీ యువ‌తుల పోరాటం

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

ఇద్ద‌రు ఆదివాసీ యువ‌తుల పోరాటం

- అశ్లిన్ మాథ్యూ | 06.02.2018 12:49:05pm

బ‌స్త‌ర్‌... నిత్యం నెత్తురోడుతున్న నేల‌. బూట‌క‌పు ఎదురుకాల్పులు, అక్ర‌మ కేసులు, జైలు నిర్బంధాలు, అత్యాచారాలు, గృహ‌ద‌హ‌నాలు నిత్య‌కృత్య‌మైన చోటు. మావోయిస్టు ఉద్య‌మాన్ని అణ‌చివేసే ల‌క్ష్యంతో... ఆదివాసీల‌పై అమ‌లు చేస్తున్న ద‌మ‌న‌కాండ‌కు అంతులేకుండా పోతోంది. ఆప‌రేష‌న్ గ్రీన్‌హంట్‌, యాక్ష‌న్ ప్లాన్ 2018, స‌మాధాన్ పేరిట ప్ర‌జ‌ల‌పై యుద్ధాన్నికొన‌సాగిస్తోంది ప్ర‌భుత్వం. ఏ అర్థ‌రాత్రి ఏ ఆప‌దొస్తుందో ఎవ‌రికీ తెలీదు. ఎప్పుడు ఎవ‌రు ఎన్‌కౌంట‌ర్ పేర హ‌త్య‌గావించ‌బ‌డ‌తారో తెలీదు. అలా పోలీసు బ‌ల‌గాల చేతుల్లో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన వారి ప‌క్షాన ఇప్పుడు ఇద్ద‌రు ఆదివాసీ యువ‌తులు పోరాటం చేస్తున్నారు. చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని బ‌స్త‌ర్ ప్రాంతంలో మున్ని పొట్టం (19), సునీత పొట్టం(20) అనే యువ‌తులు వారి గ్రామాల్లో జ‌రిగే బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్లు, మ‌హిళ‌ల‌పై జ‌రిగే లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతున్నారు. పోలీసు బ‌ల‌గాల నుంచి శారీర‌క‌, లైంగిక దాడుల‌ను ఎదుర్కొంటున్న‌ప్ప‌టికీ బిలాస్‌పూర్ హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఆదివాసీ గ్రామాల్లో పోలీసుల అకృత్యాల గురించి ఆ ఇద్ద‌రు యువ‌తులూ, నేష‌న‌ల్‌ హెరాల్డ్ ప‌త్రిక‌తో పంచుకున్న విష‌యాలు పాఠ‌కుల కోసం...

సునీత‌


న‌న్ను మావోయిస్టు అనేవారు. నేను మావోయిస్టును అయిఉంటే.. ఇక్క‌డ ఉండి ఎందుకు పోరాడుతాను. బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్లు, హ‌త్య‌లు, అనేవి ఇక్క‌డ కొత్తేమీ కాదు. మా గ్రామ‌మైన క‌ర్చోలిలో పోలీసు బ‌ల‌గాలు ఎన్నోసార్లు మ‌గ‌వారిపై శారీర‌క హింస‌కు, ఆడ‌వారిపై లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. వారు ఎందుకు దాడికి పాల్ప‌డుతున్నారో కూడా అర్థ‌మ‌య్యేది కాదు. వారు అడిగే ప్ర‌శ్న‌ల‌కు మా వ‌ద్ద స‌మాధానం ఉండేది కాదు. నేను మూడ‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కే చ‌దువుకున్నాను. 2005లో స‌ల్వాజుడుం మా గ్రామానికి వ‌చ్చి మా ఇళ్ల‌ను, స్కూల్‌ను ద‌గ్ధం చేశారు. అలాంటి ప‌రిస్థితులో్ల మేము త‌ల‌దాచుకోవ‌డానికి అడ‌వికి రావ‌ల్సి వ‌చ్చింది. కానీ ఉండ‌డానికి సుర‌క్షిత‌మైన ప్రాంతం కానందువ‌ల్ల మేము మా ఇళ్ల‌ను పున‌ర్నిర్మించుకున్నాం. సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌పీఓలు మా ఇంటిని మూడు సార్లు త‌గుల‌బెట్టారు. 2005లో స‌ల్వాజుడుం త‌గ‌ల‌పబెట్టిన 300 గ్రామాల్లో మా గ్రామం కూడా ఒక‌టి. దాని త‌రువాత నేను బ‌డికి వెళ్ల‌లేదు. అందువ‌ల్ల హిందీ మాట్లాడ‌గ‌ల‌ను కానీ, చ‌ద‌వ‌లేను.

మున్ని


నేను స్ప‌ష్ట‌మైన హిందీ మాట్లాడ‌గ‌లేను. సునీత అన‌ర్గళంగా మాట్లాడ‌గ‌ల‌దు. మేము ప‌క్క ప‌క్క‌న ఇళ్ల వాళ్లం. మేమిద్ద‌రం మాత్ర‌మే ఈ కేసు విష‌యంలో ఎందుకు పోరాడుతున్నామ‌ని మీరు అడ‌గొచ్చు. కానీ మేము ఒంట‌రిగా లేము. మా గ్రామానికి వ‌స్తే ఏ ఒక్క‌రూ కూడా నిజం మాట్లాడ‌డానికి భ‌య‌ప‌డ‌రు. మేము ఏదైనతే చెబుతున్నామో ఖ‌చ్చితంగా వాళ్లంద‌రూ కూడా అదే చెబుతారు. వారికంటే కొంత ఎక్క‌వ హిందీ భాష అర్థం చేసుకోగ‌లం క‌నుక ఈ విష‌య‌మై మేము రాష్ట్రంతో చ‌ర్చించ‌వ‌ల‌సి వుంది. ఉమెన్ ఎగ‌నెస్ట్ సెక్సువ‌ల్ వ‌య‌లెన్స్ అండ్ స్టేట్ రిప్రెష‌న్ సంస్థ వారు నిజ‌నిర్థార‌ణ‌లో భాగంగా 2015లో మా గ్రామానికి వ‌చ్చారు. వారు... ఇక్క‌డి మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను గురించి అంచ‌నా వేయుట‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల వివ‌రాల‌ను న‌మోదు చేయ‌డానికి వ‌చ్చారు. మేము ఎప్పుడూ అన్యాయాన్ని ప్ర‌తిఘ‌టిస్తూనే ఉన్నా, చ‌ట్ట‌ప‌ర‌మైన మార్గంలో వెళ్ల‌డం మాకు తెలీదు. 2016లో ఈ విధంగా చేయ‌వ‌చ్చ‌ని డ‌బ్యూఎస్ఎస్ వారు తెలియ‌జెప్పి, మాకు స‌హాయం చేశారు. అంతే కాదు, బీజాపూర్‌లోబూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్‌ల‌పై వేసిన పిల్‌లో సైతం డబ్ల్యూఎస్ఎస్ పిటిషిన‌ర్‌గా భాగ‌మైంది.

సునీత‌


కేసు న‌మోద‌యిన త‌రువాత కూడా ఒక సారి స్టేష‌న్‌కు రావ‌ల్సి ఉంద‌ని పోలీసులు ఇంటికి వ‌చ్చారు. నేను ఆరోజు ఇంట్లో లేను. ఒక వేళ వెళ్లి ఉన్న‌ట్ల‌యితే ఈ రోజున బ‌తికి ఉండేదాన్ని అని న‌మ్మ‌కంగా చెప్ప‌లేను. మాకు భ‌ద్ర‌త క‌ల్పించ‌మ‌ని కోర‌డం కోసం కూడా మేము సుప్రీంకోర్టుకు వెళ్లాం. మ‌మ్మ‌ల‌ను ర‌క్షించ‌మ‌ని రాష్ట్రానికి కోర్టు ఆదేశిస్తుంద‌ని ఆశిస్తున్నాము. మాకు ర‌క్ష‌ణ క‌ల్పించ‌మ‌ని హైకోర్టు రాష్ట్ర పోలీసుల‌కు ఆదేశాలు ఇచ్చినా ఇప్ప‌టి వ‌ర‌కు అది అమ‌లు జ‌ర‌గ‌లేదు. ఈ ప‌రిస్తితుల్లో అడుగు బ‌య‌ట మోపాలంటే ఆందోళ‌న ప‌డ‌వ‌ల‌సి వ‌స్తోంది. అంతేకాదు, మా కుటుంబాలకు ఎప్ప‌డు ఏం జ‌రుగుతుందో అన్న ఆందోళ‌న మ‌మ్మ‌ల్ని వెంటాడుతోంది. నాకొక త‌మ్ముడు ఉన్నాడు. నేను మా త‌ల్లిదండ్రుల‌కు పొలం ప‌నుల్లో సాయం చేస్తాను. వ్య‌వ‌సాయ‌మే మా కుటుంబానికి ఆధారం.

మున్ని


మా నాన్న 2009లో మ‌ర‌ణించారు. నాకు న‌లుగురు తోబుట్టువులు. అంద‌రూ బీజాపూర్‌లోని బ‌డికి వెళ్తుంటారు. పొలం ప‌నిలో నేను మాత్ర‌మే అమ్మ‌కు సాయంగా ఉంటాను. ఒక్కోసారి, మేము తెలంగాణ వెళ్లి అక్క‌డ దాదాపు 45 రోజుల పాటు మిర‌ప‌కాయ‌ల చేల్లో కూలి ప‌ని చేస్తాము. అలా వెళ్లేట‌ప్పుడు మాతో పాటు ధాన్యం, పాత్ర‌లు, ఇత‌ర సామ‌గ్రి తీసుకెళ్తాము. ఎందుకంటే... తిరిగి వ‌చ్చేవ‌ర‌కు అవి ఉంటాయ‌న్న న‌మ్మ‌కం లేక‌, మాతో పాటే తీసుకెళ్తాము. తిరిగి వ‌చ్చాక‌, మ‌హువా సీజ‌న్ వ‌స్తుంది. మ‌ళ్లీ జూన్ నెల‌లో ధాన్యం పండించ‌డం మొద‌లు పెడ‌తాం.

సునీత‌


ఎన్‌కౌంట‌ర్‌కు గురైన ఆరుగురి కోసం మొట్ట‌మొద‌టి పిటీష‌న్ దాఖ‌లు చేశాం. అందులో ఒక‌టి కొర్చోలి గ్రామంలో జ‌రిగింది. మిగిలిన‌వి బీజాపూర్ జిల్లాలోని క‌డేనార్‌, పాల్నార్‌, ఆండ్రీల్లో జ‌రిగాయి. ఇప్పుడు, ఇంకా కొత్త కేసులు కూడా జోడించ‌డం జ‌రిగింది. మాది బ‌ల‌మైన కేసు. మా వ‌ద్ద మ‌ర‌ణించిన వారి కుటుంబ స‌భ్యులు, ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు ఇచ్చిన అఫిడ‌విట్‌లు కూడా ఉన్నాయి. వారు చెప్పే విష‌యాలు పోలీసుల వ‌ర్ష‌న్‌ని స‌వాల్ చేస్తాయి. మేము ఎన్నోసార్లు కేసు విష‌య‌మై బెదిరింపుల‌కు లోన‌య్యాం. ఈ మ‌ధ్యకాలంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గ్రామంలోని స్త్రీల‌పై దాడులు చేశారు. ఈ విష‌యంలో గ్రామ ప్ర‌జ‌లు క‌లెక్ట‌రేట్‌లో ఫిర్యాదు చేశారు కూడా. త‌రువాత బీజాపూర్ ఏఎస్‌పీ, ఎస్‌పీ మ‌మ్మ‌ల్ని పిలిచి "మీరిలా స్పందిస్తే... మిమ్మ‌ల్ని న‌క్స‌లైట్ల పేరుతో అరెస్టు చేయాల్సి వ‌స్తుంది" అని బెదిరించారు. అయినా స‌రే, మాముందు పోరాటం త‌ప్ప మ‌రో దారిలేదు.

Source : National Herald
అనువాదం : స‌్వేచ్ఛ‌


No. of visitors : 1279
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

International Seminar on Nationality Question

AIPRF | 20.11.2018 11:30:05pm

AIPRF - International Seminar on Nationality Question | Delhi | 16 - 19 Feb 1996| William Hinton | Saibaba | Varavararao | Ngugi |Noam Chomsky...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •