నిలబడి తీరాల్సిన దారుల్లో...

| సాహిత్యం | స‌మీక్ష‌లు

నిలబడి తీరాల్సిన దారుల్లో...

- గీతాంజ‌లి | 06.02.2018 12:58:16pm

ప్రముఖ విప్లవ కవి, రచయిత ఇక్బాల్ గారి ʹరాఁహేʹ కవితా సంపుటి జనవరి 13, 14వ తేదీల్లో ఆయన స్వంత జిల్లా పాలమూరులో జరిగే విప్లవ రచయితల 26వ మహాసభల్లో ఆవిష్కరించబడుతున్నది. ఆయనకు నా అభినందనలు. సభలు హిందూత్వ బ్రాహ్మణీయ ఫాసిజాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్నవి - అయితే ఇక్బాల్ గారి రాహేఁ కవితా సంపుటిలో హిందూ ఫాసిజం వ్యతిరేక కవిత్వంతో పాటు దళితులపై స్త్రీలపై జరిగే దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా కూడా రాసిన కవితలు పాటలు ఉ న్నాయి. ఇక్బాల్ గారు ఇంతకు ముందు 1985 - స్పందన అనే కవితల సంకలను - గద్వాల్ల్లో విరసం సాహిత్య పాఠశాలలో ఆవిష్కరించబడింది. అలాగే 2011లో సేద్యమనే కవితా సంపుటి వచ్చింది. 2012లో కఫన్ అనే కథా సంకలనం వచ్చింది. ఇక్బాల్గారి పాటలు ʹసాంగ్ ఆఫ్ ఫెర్రోస్ʹ అనే పేరుతో 2017లో ఇంగ్లీష్లోకి అనువదించబడినాయి. | రాహేఁ హిందీ పదం అర్థం దారులు... ఇక్బాల్ కి తన దాని ఎటువైపో స్పష్టత చాలా ముందు నించీ ఉంది. ఆ స్పష్టతే ఆయన్ని విప్లవ రాజకీయాల వైపుకీ విప్లవ సాహిత్య సృజనవైపుకీ దారి తీసి నిబద్దత కల విప్లవ రచయితగా నిలబెట్టాయి. కేవలం విప్లవ రచయితల సంఘంలోనే కాదు పాలమూరు అధ్యయన వేదికలో కూడా ఆయన మహబూబ్ నగర్ ప్రజల వలస బతుకుల దుఃఖాన్ని తన కవితల్లో కథల్లో పాటల్లో రాస్తూనే ఉన్నారు. పాలమూరు జిల్లా వెనకబాటుతనానికి కారణమైన సీమాంధ్ర వలస దోపిడీని తన సాహిత్యంలో ప్రశ్నిస్తూనే ఉన్నారు.

సామ్రాజ్యవాద కంపెనీలకు తొత్తులుగా మారిన దళారీ పాలకవర్గపు బూటకపు అభివృద్ధి నమూనాని ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేరుతో పోలేపల్లి దళితుల పంటపొలాల దోపిడీని వ్యతిరేకిస్తూ పోలేపల్లి ప్రజలు చేసిన సెజ్ వ్యతిరేక మహెూద్యమంలో కలిసి నడిచారాయన. పచ్చని పంటలు అరబిందో . హెటిరో మందుల కంపెనీకి కట్టబెట్టే పోలేపల్లిని కాంక్రీటు జంగిల్గా మార్చినపుడు ఆ కఠిన వాస్తవాల్ని భూమి నించి రైతుని, విత్తనాన్ని వేరు చేసిన పాలక వర్గ కుట్ర రాజకీయాల్ని ఆయన ఒప్పుకోలేదు భూమినీ - విత్తనాల్ని రైతునీ ప్రేమించిన కవి ఇక్బాల్ అందుకే

విత్తన గర్భాన్ని చీలుస్తూ
మొలక చేసే
మహా విస్ఫోటనం
నాకాదర్శం అంటారు ఇక్బాల్. అందుకే పాతపల్లి బాసగూడ, ధర్మవరం, పోలేపల్లి సున్ని పెంటల్లో రైతుల ఆదివాసీల భూపోరాటాల్ని - అడవిని ---భూమిని, రక్షించుకోవడానికి ఆ దళిత ఆదివాసీ బిడ్డలు చేసిన పోరాటాల్ని ఆయన తన అక్షరాల్లో కవితలుగా సాక్షాత్కరింప చేసారు. ఆయన ఆదివాసీల జీవితాల్లో ఉదయిస్తున్న కలల్ని చూస్తారు. ఆయన కవితల్లో ఎక్కువగా ఆపరేషన్ గ్రీన్హంటీను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న దండకారణ్యం ఆదివాసీలపై రాసిన కవితలే ఎక్కువగా ఉన్నాయి. అడవిలోని ఖనిజ సంపదను సామ్రాజ్యవాదులకు అప్పచెప్పటానికి రాజ్యం క్రూరాతి క్రూరంగా ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఆదివాసీలపై అమలు చేస్తున్న రాజ్యహింసను గురించి చెప్తూ...

పరదా వెనుక
వేలాడుతున్న ఉరితాళ్ళు
ఆ వెనుక
అడవి బిడ్డలు రాజేస్తున్న
విల్లంబుల నెత్తుటి నెగడు
కాళరాత్రి కడుపు చీల్చుకొని
కలలు ఉదయిస్తున్నాయి ... అంటారు. అలాగే ఆదివాసీలకు నేలంటే ప్రాణమున్న దేహమనీ, దోచుకోవటానికి సైన్యం బెటాలియన్లుగా దూసుకొస్తున్నప్పుడు ఆ భూమి తమ దేహమనీ, ప్రాణమనీ, హృదయమనీ, చెవి ఒగ్గి నిందే హృదయ స్పంపదనగా భూమీ నేలా అడవీ తమవని కేవలం తమవేనని చెప్తాయని అంటారు. అందుకే
ఒళ్ళంతా ఛిద్రమైనా
స్రవిస్తున్న గాయాలే
విల్లంబులుగా సారిస్తున్నా
ఈ నేల ఏమంటున్నదో
విను...
జల్ జంగిల్ జమీన్
హమారాహై... అని అంటారు.

బూటకపు పార్లమెంటరీ రాజకీయాలను, పాలనను తిరస్కరిస్తూ, దండకారణ్యంలో ఆదివాసీలు మావోయిస్టుల సహకారంతో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని జనతన సర్కార్ రూపంలో ఆవిష్కరించుకుంటున్నారు. అదిప్పుడు బీజప్రాయంలో ఉన్నా రేపు సాక్షాత్కారం కానున్న ఒక వాస్తవం. అందుకే

బీజం - పిందెగా కాయగా కాచి రాలినా మరో వంద విత్తులై మొలకెత్తుతున్నానే సంబరపడుందని... అదే రీతిలో
పోరాట రంగాన
ఫాసిస్టు రక్కసి పంజాదెబ్బకు
నేలరాలి నెత్తుర్లు చిందినా
ఈ రణం ఆగదు
నెత్తుటి గడ్డపై వేలాది
వీరులు ఉద్భవించి
ఉద్యమం మహాజ్వలమవుతుంది
తప్ప!!!

అని 1986వ సంవత్సరంలోనే రాడికల్ మార్చ్ పత్రికలో ప్రేరణ అనే కవితలో చెబుతారు. ముఫై ఏళ్ళ క్రితం ఆయన చూసిన స్వప్నం, ప్రేరణ ఈ రోజు దండకారణ్యంలో జనతన సర్కార్గా ఆవిష్కరింపబడి మనముందుంది.

రాజ్యానికీ ఆదివాసీలకు మధ్య ఒక భీకర పోరు నడుస్తున్నది ఫాసిజానికీ ప్రజాస్వామిక ఆకాంక్షలకు నడుమ, ధర్మ-అధర్మాలకు మధ్య యుద్ధం నడుస్తున్నది.

ఒక పక్క ధర్మ యుద్దాల గురించి చెప్తూనే మరో పక్క ధర్మబద్ధమైన ప్రజా ఉ ద్యమాల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికి బలహీనపరచడానికీ, మనుషుల్లో ఉంటూ తిరిగే కూర మృగాల్లాంటి, మిత్రులుగా చెలామణి అయ్యే ద్రోహుల గురించి హెచ్చరిస్తారు ఇదీ యుద్దమే కవితలో మారిన కాలంతో పాటు కత్తులూ కటార్లూ కనపడకుండా - తుపాకీ మోతలు వినపడకుండా తలలు తీసే తీరులా ఒక మాయా యుద్దంలా ప్రజా ఉద్యమాలకు అణిచివేసే రాజ్యానికి సహకరించే ఎన్జీఓల మోసాల గురించి చెబుతారు.

అందుకే శతృవు సవాలక్ష రూపాల్లో
షికారి పిట్టె
మాటేసి ఉన్నాడు
ఇక బరిగీసి
నిలవాల్సిందీ
రాటు దేలాల్సిందీ
మనమే! అని హెచ్చరిస్తారు ఇక్బాల్.

ఇక్బాల్ కి అడవి ఒక మానవ దేహం. అడవి ఒక ఎడతెగని తమకం, ఒక ఆవాహనం అందుకే మళ్ళీ అడవి గురించి ఆదివాసీల గురించి మాట్లాడుతూ -
కొత్త చిగురులు కవితలో...
తుపాకుల పహారా నడుమ
నువ్వు నిప్పుల కుంపటి
దగ్గమవుతుంటే...
డొంక మలుపులోనే ఆగిపోయి
ఎగజిమ్ముతున్న
నెత్తుటి ధారలకు సాక్ష్యంగా
కన్నీటి పొంగుపై నిలిచారు.
అమ్మా అడవి తల్లీ -
నువ్వు బతుకుపోరులో
బరిగీసి నిలిచిన .
మా బాసగూడవో
సవరల పోరుకు
స్మృతులు కూర్చిననా సున్నిపెంటవో ... అంటూ రాజ్యహింసకూ దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా అడవి - భూమి కేంద్రంగా నడ్చిన ఆదివాసీ - దళిత ఉద్యమాల్లోను చిత్రక పడతారు. వాళ్ళ నెత్తుటి గాయాల్ని గురించి రాస్తూ -

గాయానికి నేను దర్పణాన్ని కాదు
నిజానికి నేనే ఒక గాయాన్ని
అవును
నిర్విఘ్నంగా పారే ఏరులాగా
గాయాలలోనే కదా
నా చెలిమీ - బలిమీ... అంటారు

ఇక్బాల్ అడవి మీద ఆదివాసీల మీద జరుగుతున్న దాడిని హింసను, ప్రజల మీద కొనసాగుతున్న దోపిడీని పై పైన విషయంగా చూడలేదు. వీటన్నింటిని అమెరికా సామ్రాజ్యవాదం ఆసియా దేశాల మీద వనరుల దోపిడీ కోసం ఆధిపత్యాల కోసం చేస్తున్న మంద్రస్థాయి యుద్ధంలో భాగంగానే చూస్తున్నారు. దానిలో భాగంగానే భారతదేశంలో దోపిడీకి ప్రజల బలహీనతగా, యధ విశ్వాసంగా ఉన్న హిందూ మతాన్ని తన ఆయుధంగా వాడుకొంటున్నారని దళారీ బ్రాహ్మణీయ హిందూ పాలకవర్గాలు హిందూ మతత్వాన్ని ఫాసిజంగా మార్చివేసి భారత ప్రజలపై ముఖ్యంగా మెజారిటీ దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, క్రిస్టియన్లు, స్త్రీలపై హింసారచనకు పూనుకుంటున్నాయని ఆయన అర్థం చేస్కున్నారు. అలాగే ఈ ఫాసిజాన్ని అడ్డుకుంటున్న ఆదివాసీల యుద్ధంలో పాలకవర్గానికి ఏ గతి పట్టనుందో కూడా చెబుతారు ఇక్బాల్.

ʹరక్తపాతమే - శాంతిʹ
--దోపిడీ ప్రజాపాలన
మనుధర్మమే - మనుధర్మం
నినాదత్రయాన్ని తీరంగ గీతం
చేయగలవాడ్ని...
అడ్డూ అదుపూ లేని
కాషాయ కండ కావరంలో
సామ్రాజ్యవాదంలో దోస్తీ గట్టి
అడవినీ మైదానాన్ని ఆకాశాన్నీ
చెరబట్టి
విశ్వవిపణిలో విజేతనని
వికటాట్టహాసం చేస్తూ
నట్టనడి అడవిలో
సెగలు పొంగుతున్న
పురిటి నెగళ్ళ
చేతచిక్కిన వీడ్ని
ఆదుకోవడం ఎవరి తరం? అంటారు.

అంతిమంగా ప్రజాయుద్దాలదే గెలుపనీ చెబుతారు. అంతేకాదు... భారత దేశాన్ని అఖండ హిందూ దేశంగా మార్చాలన్న హిందూత్వ శక్తుల మతమేథ్యానికి తోడు, హిందువుల జెట్ల పోలరైజేషన్, గుజరాత్లో ముస్లిమ్ వ్యాపారాలను దోచుకోవడం అనే రాజకీయార్థిక కారణాలు రహస్య ఎజెండాగా 2002లో గుజరాత్లో ముస్లిమ్ జాతి హననం చేసిన అప్పటి సిఎం ఇప్పటి పిఎం అయిన నరేంద్రమోడి పిఎం కాక మునుపు ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చినపుడు హైదరాబాదులోని ముస్లిమ్ సమాజం, పైర ప్రజాస్వామ్యవాదులు - రచయితలు, కవులు, కళాకారులు , ఉద్యమకారులు అచ్చం ఇక్బాల్ ల్లాగే తీవ్రమైన ఆందోళన చెందారు. కలత చెందారు. మోడీని రానిద్దామా అని ప్రశ్నలు వేస్కున్నారు.

మన తల్లుల మానాల్లో
త్రిశూలాలు దించి సంబరాలు చేసుకున్నాడు
మన గర్భస్థ శిశువుల గుండెల్ని
గునపాలతో కుళ్ళబొడిచినోడు
మన అమ్మీ అబ్బాల
ఆర్దూ - అర్మాన్లపై
కషాయపు విషాన్ని కుమ్మరించి
బతుకు బూడిద చేసినోడు
మన బాహువుల్లో మతం
మంటలు లేపినోడు
వీడిని
మన హైదరాబాద్
హృదయాంచల్ల్లోకి - గల్లీల్లోకి
షహర్లోకి రానిద్దామా?
ఒళ్ళంతా నెత్తుటి చప్పరింతల
వేల నాలుకల జెండాలలో
దిక్కు దిక్కుకి ఎగబాకాలని
గుజరాత్ రక్తపు మడుగులోంచి
కోరలు పదునెక్కించుకుని
దూసుకొస్తున్న మృగాన్ని
రానిద్దామా - రానిద్దామా
వొస్తే ప్రాణంతో
వీణ్ణి పోనిద్దామా???
అంటూ తన ఆగ్రహ ప్రకటన చేస్తూ బెదిరిస్తారు కూడా! కానీ మోడీ రానే వచ్చాడు ఢిల్లీకి తిరిగి పోయాడు. పిఎంగా గెలిచాడు. ఇప్పుడు భారతదేశమంతా గుజరాత్ నమూనాలుగా మార్చేసాడు. హిందూ మతోన్మాదాన్ని - మౌఢ్యాన్ని ప్రశ్నిస్తున్న ప్రజల్ని - ప్రజాస్వామిక వాదుల్ని హత్యలు చేయిస్తున్నాడు. దేశం మొత్తం మీద రాజకీయ - సాంస్కృతిక ఆధిపత్యాన్ని నెరపుతూ హిందూ టెర్రరిసాన్ని స్థాపించి హిట్లర్ కంటే భయంకరమైన నియంతృత్వాన్ని కొనసాగిస్తున్నడు. అందుకే ప్రజల్ని - ప్రజల పక్షాన నిలబడి పోరాడే ప్రజాస్వామికవాదుల్ని బుద్ధి జీవులకీ పిలుపునిస్తారు. అగ్రకుల బ్రాహ్మణీయ హిందూ మత తత్వ శక్తుల ఫాసిజానికి బలైపోతున్న దళితుల ముస్లిం . ఆదివాసీల క్రిస్టియన్లకు బాసటగా మత, కుల వ్యతిరేక పోరాటాల్లో ముందుండాలని ఇక్బాల్ చెబుతూ ..

మాట నడక నీడ యుద్ధ రూపాన్ని సంతరించుకుంటూ ప్రతీదీ స్రవిస్తున్న మహా గాయమైనపుడు... మొలకెత్తే బాసగూడల్ని కల్లోలం చేసి బలిదీసుకున్నోడి మీదకి...

పగలూ, రాత్రి పండు వెన్నెల, పచ్చదనాన్ని
పహారా కాస్తున్న వసంత కోయిలల్ని
నేల కూలుస్తున్న లూఠీ సర్కార్ల మీదకి
ఇప్పుడు గడ్డిపోచలు సైతం
ఎక్కు పెట్టిన ఆయుధాలై
నిక్కబొడుచుకుని లేస్తున్నాయి.
వాడు చిదంబరమో... మన్మోహనో
ఒబామానో... ట్రంపో
ఎవడైతేనేం?
వెన్నులో వణుకు పుట్టదా మరి?
.. అంటారు ఇక్బాల్. అందుకేగా కాబట్టే ఇన్ని నిర్బంధాలు? అలాగే ఈ సంపుటిలో రాజ్యహింసకు, హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా రాసిన కవితలతో పాటుగా కాశ్మీర్ ప్రజల స్వయం పరిపాలనా ఆక్షాంక్ష ప్రపంచ తెలుగు సభలు – భాష పాలక వర్గానికి తొత్తిగా దళారీగా మారిన మీడియా గురించి కవితలున్నాయి. విద్యార్థి - దళిత - ఆదివాసీ ఉద్యమాల మీద పాటలూ ఉన్నాయి. భాష గురించి ఇక్బాల్ అద్భుతమైన కవిత రాసారు.

మనసు పూతోటె
అయితే దాని భాష ఆ పూల పరిమళం
హృదయం సముద్రమైతే
అలల పెనుగులాటే భాష
రాబందు రాజ్యదాడుల్లో
రాటు దేలిన రణనినాదం
నా భాష..
సామ్రాజ్యవాది వెన్నులో
వణుకుపుట్టిస్తున్న ఆదివాసి
తెగువే... భాష .
అంటూ ప్రజల నిజమైన భాషకున్న ఒక నేటివిటీని... సంఘర్షణా పోరాటాల్లోంచి పుట్టిన భాషే నిజమైన భాషంటూ...
సంబరాల్లో, సాగిలబడేది
కాదు
సాగే సమరాలకు
సంఘీభావం తెలిపే
భాషను ఆహ్వానిద్దాం.. అని చెబుతూ ప్రపంచ తెలుగు మహాసభల్లో శ్రమ సంస్కృతికి చెందిన ప్రజల భాషను ప్రక్కన పెట్టి అగ్రవర్ణ, వర్గ బ్రాహ్మణీయ హిందూత్వ, పెట్టుబడిదారీ భూస్వామ్య భాషను... తను అష్టావధానుల కందపద్యాల్లో --- వించిన విధానాన్ని తప్పు బట్టారు ఇక్బాల్.

అట్లనే ఇక్బాల్ ఒక ఉపాధ్యాయులు కావడం వలన తన విద్యార్థులలో సమాజం చలన సూత్రాల పట్ల నిర్దిష్టమైన అవగాహనను కలిగించే అవకాశం ఉండడం దానిని ఆయన సద్వినియోగం చేస్కోడం రెండూ మనకు అవగతమవుతున్న విషయాలు. విద్యార్థులలో ఆయనకు ఒక కృత్రిమమైన సంబంధం కాకుండా ఒక మానవీయమైన సంబంధం ఉందన్న విషయం ఆయన ʹమా సారుʹ కవితలో కనిపిస్తుంది బహుశా ఆయనకు కూడా - తనలాంటి గురువే దొరికి ఉండచ్చు. తమ సారు అక్షరాల్ని అక్షరాలుగా కాక అక్షరాలలో సమాజాన్ని సమాజంతో అక్షరాల్ని ఎలా తీర్చిదిద్దుచ్చు చెబుతూనే మళ్ళీ ఇక్కడ కూడా తనకు అత్యంత ప్రియమైన అడవిని మరచిపోరు ఇక్బాల్.

మా సారైతే
చారెడు కాగితంల ఎన్ని పట్టిస్తడో
అక్షరాల్ని కూర్చోబెట్టి
ఆశలను నిటారుగా నిలబెడ్తడు
పదాల్ని దట్టించి
భావాల్ని దౌడు తీయిస్తడు
మా అడవి అంతరంగాన్ని
తట్టి లేపి
కొత్త లోకాన్ని పుట్టిస్తడు
అందుకే మా సారంటే మాకిష్టం... అంటారు. బహుశ ఇక్బాల్ గారి గురువే ఇక్బాల్ గారికి అడవిని పరిచయం చేస్తుంటారు. అ - అంటే అమ్మతో పాటు అడవి కూడా వస్తుందని అడవంటే ఆదివాసీకి అమ్మని చెప్తుంటారు. అడవిలోని కల్లోలాన్ని ప్రజాయుద్దాన్ని చెప్పి ఉంటారు. అప్పుడే ఇక్బాల్ గారి భవిష్యత్ దారులు (రాహేఁ) ఏర్పడిపోయి ఉంటాయి.

అక్కడ్నించి ప్రయాణించిన కవి ఇప్పుడు సరిగ్గా మంద్రస్థాయి యుద్ధ సందర్భంలో సరిగ్గా నడవాల్సిన దారులలో నడుస్తూ సమాచారాన్ని జాగృతపరుస్తూ - హిందూమతతత్వ శక్తుల్ని హెచ్చరిస్తున్నాడు.

(ʹరాఁహేʹ ఇక్బాల్ కవితా సంపుటికి గీతాంజ‌లి రాసిన ముందుమాట‌)

No. of visitors : 542
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!
  అయోధ్యకి మళ్ళీ రెక్కలొచ్చినయ్
  రాయలసీమ బతుకు పోరాటం
  మట్టివాసనెపుడూ జీవనోత్సవమే.
  పాలమూరి దుఃఖం
  బతుకు వెతుకులాట లో పాఠకుడికి యెదురయ్యే నిఖార్సైన మానవుడు
  తొలితరం విప్లవ కథకుడు
  స్వేచ్చా స్వప్నం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •