ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

| సాహిత్యం | క‌థ‌లు

ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

- మెట్టు ముర‌ళీధ‌ర్‌ | 06.02.2018 01:50:53pm

రాత్రి సరిగా నిద్రపట్టక తెల్లవారుఝామున కునుకు పట్టింది చందుకు. ఫోన్‌ రింగైతే ʹఎవరిదో?ʹ అనుకుంటూ ఫోన్‌ తీశాడు చందు. అది విలాసరావు దగ్గరి నుండి.

ʹʹచందూ! బయలుదేరావా?ʹʹ అడిగాడు విలాసరావు.

ʹʹలేదుసార్‌! జ్వరం వచ్చింది. ఇవ్వాళ రావడం లేదుʹʹ అన్నాడు చందు.

ʹʹఛʹʹ అంటూ ఫోన్‌ పెట్టేశాడు విలాసరావు.

ఆనాడు నిజంగానే చందుకు జ్వరమొచ్చింది. చేతకావడం లేదు. జ్వరం రావడం ఒకవైపు, అమ్మతో ఉండాలనే కోరిక మరో వైపు ఉండడంతో విలాసరావుతో రానని చెప్పేశాడు చందు.

చందు విలాసరావుతో మాట్లాడుతుంటే సాయమ్మ విన్నది. లేచివచ్చి చందు ఒళ్ళుపట్టి చూచింది. చందు ఒళ్ళు వేడిగా ఉంది.

ʹʹడాక్టరు దగ్గరికి పోవాలె కొడుకా!ʹʹ అంది.

ʹʹఅలాగేʹʹ అన్నాడు చందు.

లత వంట చేసింది. గత రెండు రోజుల నుండి సాయమ్మ మొత్తం వంట పని మానేసింది. బాధపడుతూ, ఏడుస్తూనే ఉంది. అంతకు ముందు వంట పనంతా తానే చేసేది సాయమ్మ. లతను దగ్గరకు కూడా రానిచ్చేది కాదు. పెద్ద నోట్ల రద్దు వార్త తెలిసినప్పటినుండి సాయమ్మ మునుపటిలా లేదు. ఎంతో ధైర్యంగా ఉండే అమ్మ ఇలా ధైర్యం కోల్పోరుు ఉండడం లతకు ఆశ్చర్యంగా ఉంది.

చందుకూ అలాగే ఉంది. అమ్మ ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలనుకునే వాడు. ʹనాన్న చనిపోవడం, ఆర్ధిక ఇబ్బందులు, మగదిక్కు లేని ఒంటరి పోరాటం... ఇలాంటి సందర్భాల్లో కూడా అమ్మ సమయోచిత ధైర్యాన్ని ప్రదర్శించింది. అమ్మ అలా ఉండకపోతే తాను, లత పెరిగి పెద్దయే వాళ్ళమే కాదుʹ అనుకున్నాడు చందు.

ప్రస్తుతం సాయమ్మకు లత గురించి బెంగపట్టుకున్నది. ʹలత పెళ్ళి జరుగుతుందా? జరుగదా?ʹ అని భయపడుతోందామె. ఎందుకంటే జగద్గిరిగుట్ట వాళ్ళు డబ్బు దగ్గర ఖచ్చితమైన మనుషులు. అన్నీ వాళ్ళు అనుకున్నట్టు జరగాల్సిందే. ఏం తక్కువైనా ఒప్పుకోరు. అన్నింటికన్నా ముఖ్యం ʹతాము వరకట్నంగా ఇచ్చిన రెండు లక్షలు తిరిగి పంపించారు. అంటే పెళ్ళి ఒప్పందం ఉన్నట్టా? లేనట్టా?ʹ అని మధనపడుతోంది సాయమ్మ.

ఈ సమయంలో తనకు ధైర్యం చెప్పేవాళ్ళు తన కొడుకు చందు తప్ప మరెవరు లేరనుకుంది సాయమ్మ.

చందు జగద్గిరిగుట్ట నుండి వచ్చిన తరువాత కొడుకుతో కొంతసేపైనా నెమ్మదిగా మాట్లాడే అవకాశం చిక్కలేదు సాయమ్మకు. చందు అక్కడి నుండి వచ్చే సరికే రాత్రరుుంది. తెల్లవారి లేస్తూనే విలాసరావు డ్యూటీ అంటూ పోయాడు. తిరిగి ఇల్లు చేరేప్పటికి మళ్ళీ రాత్రరుుంది. ఇప్పుడు మాట్లాడే అవకాశం వచ్చింది సాయమ్మకు.

ʹʹజగద్గిరి గుట్టోళ్ళు ఏమన్నరు కొడుకా?ʹʹ అని అడిగింది.

ʹʹమొత్తం పైసలు పెండ్లికి ముందే ఇయ్యాలన్నారుʹʹ చెప్పాడు చందు.

ʹʹపాత పైసలు తీసుకోరటనా?ʹʹ

ʹʹతీసుకోరటʹʹ

ʹʹవరపూజ చేసిన రెండు లక్షలు వాపసెందుకిచ్చిండ్లు?ʹʹ

ʹʹఏమోనే! అత్తే నా చేతిలో పెట్టింది. ఏంచేసేది? వద్దన్నా ఆమె వినేటట్టు లేకుండె. ఆమెతో మాట్లాడడం మన వశమవుతుందా?ʹʹ

ʹʹమరెట్ల బిడ్డా! ఏం చేద్దాం?ʹʹ

ʹʹఏమన్నా చెయ్యాలేʹʹ

ʹʹఏం చేద్దామనుకుంటున్నావ్‌?ʹʹ

ʹʹమనం బ్యాంకు ఖాతాలు తీద్దాముʹʹ

ʹʹతీస్తే?... అండ్ల వేసుకోవచ్చా?ʹʹ

ʹʹఒక్కొక్కరు రెండున్నర లక్షలు వేసుకోవచ్చటʹʹ

ʹʹమిగిలిన పైసలు?ʹʹ

ʹʹవేసుకుంటే లెక్క చెప్పాల్నట. ట్యాక్స్‌ కట్టాల్నటʹʹ

ʹʹఅవి మన పైసలే కదరా? లెక్కెందుకు? ట్యాక్సెందుకు?ʹʹ

ʹʹపద్ధతి అట్లనే ఉంటుందట. పేపర్లో అలాగే ఉందిʹʹ.

సాయమ్మకు చందు మాటలు అర్ధం కాలేదు. తనకే అర్ధంకావడం లేదా? లేక చందుకే చెప్పరావడం లేదా? తెలియడం లేదామెకు.

ʹస్వంత పైసలకు ఇంటోళ్ళు లెక్కడుగుతారు కాని గవర్నమెంటుకేం సంబంధం? కష్టపడి సంపాదించుకున్న పైసలకు లెక్కెందుకు చెప్పాలె? తన మొగడు చనిపోరుునప్పుడు ఈ గవర్నమెంటు ఏమైనా సహాయం చేసిందా? తన పిల్లల్ని పెంచిందా? సవరించిందా? వాళ్ళు ఆకలి అని ఏడిస్తే అన్నం పెట్టిందా? వాళ్ళు బరిబాత తిరుగుతాంటే బట్టలు కొనిచ్చిందా? వాళ్ళ మానం కాపాడిందా? మరి ఏం చేయని గవర్నమెంటుకు లెక్కెందుకు చెప్పాలె? ట్యాక్సెందుకు కట్టాలె?ʹ సాయమ్మకు అన్నీ ప్రశ్నలే.

రెండు మూడు నిమిషాలు గదిలో నిశ్శబ్దం తాండవించింది. తర్వాత అంది సాయమ్మ.

ʹʹసరే కొడుకా! ముందైతే డాక్టరు దగ్గరికి పోరుురా!ʹʹ అంటూ వంద రూపాయలు చందు చేతిలో పెట్టింది.

వాళ్ళింటికి దగ్గరే ఉన్న ఒక ఆర్‌.ఎం.పి. డాక్టరు రాజేశం దగ్గరికి పోయాడు చందు. ఆయన 50 రూపాయలు ఫీజు తీసుకొని పరీక్షించి రెండు ఇంజక్షన్లు చేశాడు. తర్వాత మూడు రోజులకు మందులు వ్రాసి వాడమన్నాడు.

ʹʹమామూలు జ్వరమే. రెండు రోజులు రెస్టుతీసుకోʹʹ అన్నాడు.

రాజేశం డాక్టరు తన దగ్గరికి వచ్చిన పేషెంట్లకు తప్పకుండా ఇంజక్షన్లు ఇస్తాడు. దిన కూలీలు, మామూలు జనం ఉన్న ఆ ప్రాంతంలో ఇంజక్షన్లు ఇస్తేనే పేషెంట్లకు తృప్తిగా ఉంటుందట. గత 30 సంవత్సరాలకు పైగా రాజేశం ఈ పద్ధతినే పాటిస్తున్నాడు.

రాజేశం కొంత కాలం ఒక డాక్టర్‌ దగ్గర కాంపౌండర్‌గా పని చేశాడు. తర్వాత ఒక ఆర్‌.ఎం.పి. సర్టిఫికేట్‌ సంపాదించాడు. ఆ తర్వాత పెద్దమ్మ గడ్డలో ఒక క్లినిక్‌ తెరిచాడు. మొదట్లో ఫీజు పది రూపాయలే తీసుకునేవాడు. క్రమేణా పెరుగుతూ ఇప్పుడది 50 రూపాయలరుుంది. ఐనా ఒక మామూలు ఎం.బి.బి.ఎస్‌. డాక్టరు కన్నా ఎక్కువే సంపాదిస్తాడు రాజేశం.

డాక్టరు ఫీజు 50 రూపాయలు పోగా మిగిలిన 50 రూపాయలతో రెండు రోజులకు సరిపోయే మందులొచ్చారుు చందుకు. సరిపోతారుులే అనుకొని ఇంటికి వచ్చాడు. అమ్మకు అదే చెప్పాడు.

పగలంతా ఇంట్లోనే ఉండి, ʹఏమైనా విషయాలు తెలుస్తారుు బయటʹ అనుకుంటూ బజారుకు పోయాడు చందు.

13

తెల్లవారి కూడా విలాసరావు డ్యూటీకిపోలేదు చందు. ఉదయం పదిగంటలకే అన్నంతిని బ్యాంకుకు చేరుకున్నాడు. డాక్టరిచ్చిన రెండు ఇంజక్షన్లు, రెండుపూటలా వేసుకున్న మందుగోళీలతో ఒక్క రోజులోనే జ్వరం తగ్గినట్టనిపించింది. కొద్దిగా చేతనవుతున్నది. నిన్న సాయంత్రం బజరుకు పోతే అక్కడ కొంత మంది కలిశారు. నోట్లరద్దు వల్ల కలుగుతున్న కష్టాలను ఒకరికొకరు చెప్పుకున్నారు. అప్పటి వరకు చందుకు అలాంటి కష్టాలుంటాయని తెలియదు. ఆధార్‌ కార్డ్‌ చూపిస్తే ఏ బ్యాంకులోనైనా నాలుగు వేల రూపాయల పాతనోట్లు మార్చుకోవచ్చని కూడా చందుకు అక్కడే తెలిసింది.

ఇంటి నుండి వచ్చేటప్పుడే ఆధార్‌ కార్డు మరియు నాలుగు పాత వెయ్యి రూపాయల నోట్లు జేబులో పెట్టుకున్నాడు చందు. నాలుగు వేలు మార్చుకోవడం, ఖాతాలు తెరిచే విషయం తెలుసుకోవడం ఆరోజు చందు చేయాలనుకున్న పనులు. బ్యాంకు వాళ్ళు చెప్పిందాన్ని బట్టి మధ్యాహ్నం వచ్చి ఖాతాలు తెరవాలని కూడా అనుకున్నాడు.

చందు ఇంటికి దగ్గరలోనే రోడ్డు మీద ఒక బ్యాంకుంది. అది చాలా పెద్ద బ్యాంకు. అక్కడికే పోయాడు చందు. అక్కడి పరిస్థితి చూచి అతడు ఆశ్చర్యపోయాడు.

బ్యాంకు ఇంకా తెరువనేలేదు. ఐనా అక్కడ విపరీతమైన జనం పోగయ్యారు. ఆ బ్యాంకు పెద్దరోడ్డు మీదుంది. ఆ రోడ్డుపైన ట్రాఫిక్‌ కూడా ఎక్కువే. బ్యాంకుకు అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి రెండు గల్లీలున్నాయి. మెయిన్‌ రోడ్డు మీదికి వాహనాలు రాకుండా అడ్డంపెట్టి ట్రాఫిక్‌ను గల్లీల మీదుగా మళ్ళించారు పోలీసులు. నిన్న ఆ పరిస్థితి లేదట. అక్కడ కూడిన జనంతోను, వచ్చిపోయే ట్రాఫిక్‌తోను చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయట. ఒక పెద్దాయన రోడ్డు దాటే తొందరలో ట్రాఫిక్‌లో చిక్కుకొని, పడిపోయి కాలు విరగ్గొట్టుకున్నాడట. అందుకే ఇవ్వాళ అలా చేశారట.

అంత జనాన్ని జాతరలప్పుడు తప్ప మామూలు రోజుల్లో చూడలేదు చందు. బ్యాంకు మెరుున్‌ డోర్‌ దగ్గర మొదలైన రెండు లైన్లురెండు మెలికలు తిరిగి అంతదాకా ఉన్నారుు. ఆడ, మగ, చిన్న, పెద్ద అందరూ లైన్లలోనే ఉన్నారు. ఒక లైను పాతనోట్లు డిపాజిట్‌ చేసేవారికట. రెండోలైను పాతనోట్లు మార్చుకునేందుకట. మొదటి లైను కన్నా రెండో లైను చాలా పొడవుంది. రెండో లైన్లో నిలుచున్నాడు చందు.

పదిన్నర కాకముందేఎండ తీవ్రరూపం దాల్చింది. లైన్లలో ఉన్న కొందరు తలమీద టోపీలు పెట్టుకున్నారు. కొందరు కర్చీఫ్‌లు కట్టుకున్నారు. ముసలివారు చిన్న చిన్న తువ్వాలలు కట్టుకున్నారు. ఇంకా ఆడవాళ్ళు చున్నీలు, ఓణీలు, కొంగులు కప్పుకున్నారు. చాలామంది చేతులల్లో వాటరు బాటిళ్ళున్నారుు. నిన్న ఏమీ తెచ్చుకోనందుకు నీళ్ళకు ఇబ్బంది అరుుందట.

తన ముందున్న మందిని చూశాడు చందు. బ్యాంకు తెరచి తన వంతు వచ్చేసరికి రెండు గంటలు దాటుతుందనుకున్నాడు.

అప్పటికే ఆడవాళ్ళ ఒడిలో ఉన్న చిన్నపిల్లలు కొందరు పాలకోసం ఏడుస్తున్నారు. అంతమందిలో పాలు ఇవ్వలేక, పిల్లల్ని సముదారుుంచలేక నానా యాతన పడుతున్నారు తల్లులు. కొందరు తల్లులు మళ్ళీ వస్తామని, తమ సీటు తమదే అని పక్కకు పోరుు పాలు ఇస్తున్నారు. చిన్నపిల్లలు ఆబగా పాలు తాగుతుంటే అంతకన్న ఆబగా పోకిరీ వెధవలు అటువైపు చూస్తున్నారు. వారి చూపుల నుండి తప్పుకోవడానికి తల్లులు, పిల్లలపై కొంగులు కప్పుతున్నారు. లోపల గాలి ఆడక ఆ కొంగుల్ని తొలగిస్తున్నారు పిల్లలు.

ఆ లైన్లలో 60 సంవత్సరాలు పైబడ్డ వృద్ధులూ ఉన్నారు. ముక్కుతూ, మూల్గుతూ చేతికర్ర సాయంతో నిలుచున్నవారు కొందరైతే, తమ మనవలను లైన్లలో ఉంచి తాము కాస్త దూరంగా కూర్చున్నవారు మరికొందరు. ప్రతివారిలోను తమ సీటు భద్రంగా ఉండాలన్న కోరికే కనబడుతోంది. ఎంత కష్టమైనా సరే ఇవ్వాళ నాలుగువేలు మార్చుకోవాలన్న ఆతృత కనబడుతోంది.

చందుకు ఆశ్చర్యం వేసింది. తనతోపాటు అక్కడ ఆ లైన్లలో ఉన్నవారందరు మామూలు జనమే. కూలి నాలి చేసుకునేవారు కొందరు, కూరగాయలమ్ముకునేవారు మరికొందరు, తోపుడు బండ్లతో చిల్లర సామాన్లు అమ్ముకునేవాళ్ళు, కాగితాలు ఏరుకునే వాళ్ళు, ఆటో డ్రైవర్లు ఇంకా కొందరు. అంతేగాని డబ్బున్నవాళ్ళుగాని, నల్లకుబేరులు గాని ఒక్కరూ లేరు. అక్కడున్న వాళ్ళందరు తమ శ్రమను 500 నోటుగాను, 1000 నోటుగాను మార్చుకున్నవారే. అవి రేపటి తిండికోసం, పిల్లల చదువుల కోసం, ఆరోగ్య భద్రత కోసం దాచుకున్న పెద్దనోట్లే తప్ప కూడబెట్టిన నల్లనోట్లు కావు. అక్కడి జనాన్ని, పరిస్థితిని చూస్తుంటే తాను నిన్నమొన్న పేపర్లలో చదివిన వార్తలకు ప్రతిరూపాలుగా కనిపిస్తున్నారుు చందుకు.

పదిన్నర కాగానే బ్యాంకు డోర్లు తెరుచుకున్నారుు. జనంలో కలకలం మొదలరుుంది. అంతలోనే, ఇంతసేపు ఎక్కడున్నారో తెలియదు గాని బిలబిలమంటూ నలుగురు పోలీసులు మెరుున్‌ డోరు వద్దకు చేరుకున్నారు. తమ చేతులల్లో ఉన్న కర్రలతో ʹకొడతాం, జాగ్రత్తʹ అని గాలిలో ఊపుతూ బెదిరిస్తున్నారు. ʹబ్యాంకు సిబ్బంది లోపలికి ఎలా పోయారబ్బా?ʹ అని చందు ఆశ్చర్యపడుతుండగానే ʹబ్యాక్‌ డోర్‌ ఒకటుందిʹ అని పక్కాయన అన్నాడు.

పోలీసులు ప్రతి లైనులో ముందున్న పది మందిని లోపలికి పంపించారు. తర్వాత డోరుకు అడ్డంగా కర్రలు పెట్టారు. లోపలికి పోరుునవారు 20 మంది మాత్రమే. అప్పటికే బ్యాంకు నిండి పోరుుందట.

బయట నిలుచున్నవారు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిలబడలేక కూలిపోరుునవారు కొందరు. ఎండను తట్టుకోలేక చెక్కరొచ్చి పడిపోరుునవారు మరికొందరు. ఇక చంటిపిల్లల ఏడుపులైతే భయంకరంగా ఉన్నారుు.

ʹʹఈ పైసలు లేకున్నా ఫరవాలేదు, ఈ బాధ పడలేనుʹʹ అంటూ చందు చూస్తుండగానే వెళ్ళిపోరుుంది ఓ చంటిపిల్ల తల్లి.

లోపలినుండి బయటకు వస్తున్నవారిలో విజయగర్వం తొణికిసలాడుతోంది. ఇంతకూ వారు సంపాదించింది 4 వేలే. అవి కూడా వాళ్ళ స్వంత పైసలే. ఫ్రీగా దొరికాయన్నంత సంతోషం కనబడుతుంది వారి ముఖంలో.

ʹʹఈ రెండు వేలకు చిల్లరెలాగో?ʹʹ అంటూ వాపోతున్నాడు బయటికి వస్తున్న ఒకాయన.

ʹʹఅదేమిటి? చిల్లర ఇవ్వలేదా?ʹʹ మరొకాయన సందేహంతో అడిగాడు.

ʹʹచిల్లరా? ఇంకా నయంʹʹ అంటూ వెళ్ళిపోయాడాయన.

అందరికీ రెండు నోట్లు రెండువేలవి చేతిలోపెట్టి పంపిస్తున్నారట. ఇంకా ఐదు వందల నోట్లను రిజర్వు బ్యాంకు పంపించలేదట. అవి ప్రింట్‌లో ఉన్నాయట.

ʹʹవంద నోట్లు ఇవ్వవచ్చు కదా?ʹʹ అన్నాడు చందు.

ʹʹఅవెప్పుడో బ్లాకరుుపోరుునారుు. ఉన్నవాళ్ళు కొందరు దాచేస్తున్నారు. మరికొందరు బిజినెస్‌ చేస్తున్నారు.ʹʹ

ʹʹఅంటే?ʹʹ అర్థం కాలేదు చందుకు.

ʹʹ10 శాతం కమీషన్‌తో వ్యాపారం చేస్తున్నారు. మనం రెండు వేల కొత్తనోటిస్తే వాళ్ళు 18 వంద నోట్లిస్తారు.ʹʹ

ʹʹఅబ్బో! వందనోటు చాలా విలువైందన్నమాట ఈనాడు!ʹʹ అన్నాడొకాయన.

అక్కడ వాళ్ళ మాటలు వింటుంటే చందుకు ఆశ్చర్యంగా ఉంది. ʹపెద్దనోట్లు రద్దుచేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు ఆలోచించలేదా? ఏం ప్రభుత్వమది? ఏం ముందుచూపది?ʹʹ అనిపించింది.

లోపలికి పోరుున 20 మంది బయటకు రావడానికి 20 నిమిషాల పైనే పడుతోంది. 20 మంది వచ్చేవరకు వేరే వాళ్ళను పంపడంలేదు పోలీసులు.

ʹʹఒకరు వస్తే ఒకరిని పంపొచ్చు గదా?ʹʹ అన్నాడు ఓ పెద్దాయన.

పోలీసులకు ఆ మాట నచ్చలేదు. నోరు విప్పకుండా లాఠీ పైకిలేపి సమాధానమిచ్చారు. ముసలాయన నోరు మూసుకున్నాడు.

ʹʹఇలా ఐతే నావంతు వచ్చేసరికి గంటలు పట్టేట్టుందిʹʹ అని మనసులో అనుకుంటూ పైకే అనేశాడు చందు.

ʹʹఅనుమానమా? అర్థం కావడం లేదా?ʹʹ అన్నాడు చందు వెనకాయన. అర్థమవుతుందన్నట్టుగా తలూపాడు చందు.

బ్యాంకు బయట కోలాహలంగా ఉంది. ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. అవన్నీ వాస్తవాలే.

ʹʹమీకో విషయం తెలుసా? ఇక్కడ నిలబడ్డవాళ్ళలో సగం మంది డబ్బున్నవాళ్ళ మనుషులే. ఎలాగూ కూలి జనానికి బయట పని దొరకడం లేదు. అలాంటి వాళ్ళందరినీ పోగుచేసి ఓ ముఠా కొంతమందిని తయారు చేసిందట. వారికి ఒక్కొక్కరికి నాలుగు వేలు పాతనోట్లిచ్చి లైన్లలో నిలబెడుతుందట. వారు ఆధార్‌ జిరాక్స్‌ చూపించి కొత్తనోట్లు తెచ్చి ముఠా నాయకునికిస్తున్నారట. అతను వీరికి రెండు వందలు కూలిగా ఇస్తున్నాడట. ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక్కో వ్యక్తి రెండు మూడు బ్యాంకులకు తిరుగుతూ వేల రూపాయలు మారుస్తున్నాడట. ఒక ముఠాను చూచి, అలాంటి ముఠాలు సిటీలో చాలా తయారయ్యాయట.ʹʹ

ʹʹఆ!ʹʹ అంటూ ఆశ్చర్యపోయాడొకతను.

ʹʹఅప్పుడే ఆశ్చర్యపడకు. ఇంకా ఉంది. ఇలా ఒక్కో నల్లకుబేరుడు వీళ్ళ ద్వారా కొన్ని లక్షల బ్లాక్‌మనీని వైట్‌ చేసుకుంటున్నాడట.ʹʹ

ʹʹఔనా?ʹʹ ఇంతకు ముందు ఆశ్చర్యపడ్డాయన మరింత ఆశ్చర్యపడ్డాడు.

ʹʹనాలుగు వేలు తీసుకొని కూలి జనం ఉడారుుస్తే...?ʹʹ అంటూ ఒకాయన సందేహం వెలిబుచ్చాడు.

ʹʹఎలా ఉడారుుస్తారు? ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు గదా?ʹʹ

ʹʹఆహ! బలే బిజినెస్‌.ʹʹ

ʹʹఔను మరి. ఏం చేసినా ఉన్నోనికి, మధ్యవర్తికే లాభం.ʹʹ

చందు అందరి మాటలు ఆశ్చర్యంగా వింటున్నాడు. ʹనల్లకుబేరునికి ఇన్ని ఉపాయాలా?ʹ అనిపించింది.

లైను ముందుకు కదులుతోంది. అప్పటికి చందు లైనులో నిలబడి రెండు గంటలరుుంది. అతనికి కాళ్ళు పీకుతున్నారుు.

అంతలోనే బ్యాంకు గేటు వద్ద కలకలం బయలుదేరింది. ఒక పోలీసాయన లోపలికి పోబోతున్న ఓ వయసులో ఉన్న అమ్మారుుని చేరుుపట్టి బయటకు లాగాడు. ఆ వేగానికి ఆ అమ్మారుు క్రింద పడింది. ప్రక్కనే ఉన్న అమ్మారుుకి కావలసినవారు కోపంతో పోలీసాయన్ని నెట్టివేశారు. పోలీసాయన క్రింద పడ్డాడు. దాంతో పోలీసులకు కోపం వచ్చి విచక్షణా రహితంగా లాఠీలతో దెబ్బలు కొట్టారు. ఆ దెబ్బలను తట్టుకోలేక ఒకాయన క్రింద పడిపోయాడు. మరో ఇద్దరు ముగ్గురికి తీవ్రంగా దెబ్బలు తాకారుు. అంతా గందరగోళంగా ఉంది.

ఈ గందరగోళంలో లైను చెదిరిపోరుుంది. వెనునున్నవారు ఒక్కసారిగా ముందుకు పరుగెత్తుకొచ్చి పోలీసులపై అరుస్తున్నారు.

ʹʹఆడపిల్ల మీద చేరుువేస్తావా?ʹʹ అని ఒకరు

ʹʹపోలీసులు బలిసిపోయారుʹʹ అని ఒకరు

ʹʹమహిళా పోలీసులు లేరా?ʹʹ అని ఒకరు

ఇలా అందరూ పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నారు. ఈ గొడవనంతా చూచి బ్యాంకువాళ్ళు డోరు మూసేశారు.

వైర్‌లెస్‌లో వార్త పోరుుందో ఏమో? ఓ పోలీసు వ్యాను రానే వచ్చింది. వ్యాను ఆగీ ఆగకముందే అందులోంచి ఓ ఇరవై మంది పోలీసులు కిందికి దుమికారు. విషయం తెలుసుకోకుండానే లాఠీలు ఝలిపించారు. చాలా మందికి దెబ్బలు తాకారుు. ʹʹలైన్‌, లైన్‌ʹʹ అంటూ పోలీసులు కర్రలు ఎత్తి అరుస్తున్నారు. ఎక్కడ తమమీద దెబ్బపడుతుందోనని భయపడి జనం వీలైనచోట లైనుగా మారుతున్నారు. ఎవరు ముందో, ఎవరు వెనకో తెలియడం లేదు. తెలివిగలవారు, బలం కలవారు ముందుకు చేరారు. అల్లరి కాకముందు దాదాపు గేటు దాకా వచ్చిన చందు చూస్తే చాలా వెనుకకుపోయాడు. తన వంతు రావడానికి మరోగంట పైన పడుతుందనిపించింది.

ఉదయం తగ్గిందనుకున్న జ్వరం మళ్ళీ మొదలరుునట్టుంది చందుకు. ఎండవేడిమికి తోడు ఒళ్ళు వేడిచేసి నిలబడలేకపోతున్నాడు. ఇక ఓపిక లేదనుకొని ఇంటికి బయటుదేరాడు. రేపు తను, లత ఇద్దరూ వచ్చి తలొక నాలుగు వేలు మార్చుకోవాలనుకున్నాడు చందు.

No. of visitors : 635
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •