గూగీ వా థియాంగో - జి ఎన్‌ సాయిబాబా - యుద్ధకాలంలో స్వప్నాలు

| సాహిత్యం | వ్యాసాలు

గూగీ వా థియాంగో - జి ఎన్‌ సాయిబాబా - యుద్ధకాలంలో స్వప్నాలు

- వరవరరావు | 19.02.2018 11:58:03pm


గూగీ నవలల్లో ఆఫ్రికా ప్రజలు ద్వేషించే యూరపు వలసవాదుల తర్వాత మనకు కనిపించేది గుజరాతీ వ్యాపారులే. కాని ఆయనకు భారతప్రజల పట్ల వాళ్ల పోరాటాల పట్ల ఎంతో ఆసక్తి ఉంది.

గూగీ మొదటిసారి 1996 ఫిబ్రవరిలో ఎఐపిఆర్‌ఎఫ్‌ (ఆల్‌ఇండియా పీపుల్స్‌ రెసిస్టెన్స్‌ ఫోరమ్‌) ఆహ్వానంపై ఢిల్లీలో జరిగిన జాతుల సమస్య పై అంతర్జాతీయ సదస్సుకు వచ్చాడు. అక్కడ ఆయన ప్రపంచీకరణ - జాతుల సమస్య గురించి చేసిన ప్రసంగానికి సాయిబాబా అధ్యక్షత వహించాడు.

అక్కడినుంచి గూగీ హైదరాబాదు, కాకతీయ యునివర్సిటీ, 1990 వరకు కరీంనగర్‌ విప్లవోద్యమ అమరుల స్మృతిలో నిర్మించిన హుస్నాబాద్‌ స్థూపం చూసి తాను అప్పటికే ప్రవాస జీవితం గడుపుతున్న అమెరికాకు వెళ్లిపోయాడు. తన ఇండియా పర్యటన ప్రభావంతోనే ʹవిజార్డ్‌ క్రౌʹ అనే బృహత్తర నవల రాసాడు. అప్పటినుంచీ ఆయనకు ఇండియా, తెలంగాణ - ఈ దేశంలో, ఈ ప్రాంతంలోని విప్లవోద్యమం, ఇక్కడి జీవితానికి, పోరాటానికి తాను ఎంచుకున్న ఒక సంభాషణ వంటి సాయిబాబాతో గాఢానుబంధం ఏర్పడింది.

గూగీ దంపతులకు హుస్నాబాద్‌ స్థూపాన్ని చూసిన అనుభవం ఒక అపూర్వ అనుభూతిగా మిగిలింది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీ ఎఐఎల్‌ఆర్‌సి (ఆల్‌ ఇండియా లీగ్‌ ఫర్‌ రెవల్యూషనరీ కల్చర్‌) తరఫున ఎం.టి.ఖాన్‌ ఏర్పాటుచేసిన రచయితల సదస్సులో ఆ ఇద్దరూ ఆ అనుభవాన్ని ఒక ఈవెంట్‌ (సంఘటన)గా చెప్పుకున్నారు.

ఈ అనుబంధానికి ఒక కారణముంది. 1946-51 తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వలెనే కెన్యాలోనూ వలసవాద విముక్తి పోరాటంలో భాగంగా మౌమౌ ఉద్యమం 1952 నుంచి 62 వరకు సాయుధంగా సాగింది. మరొకవైపు కెన్యాట్టా నాయకత్వంలో జాతివిముక్తి పోరాటం జరిగి 1963లో కెన్యా బ్రిటిష్‌ వలస నుంచి విముక్తమై జోమో కెన్యాట్టా కెన్యా అధ్యక్షుడయ్యాడు. కాని తన బాల్యంలో తన అన్న స్వయంగా పాల్గొన్న విముక్తిపోరాట లక్ష్యాలయిన భూమి, భుక్తి, సామ్రాజ్యవాద దళారీ దోపిడీ నుంచి ప్రజల స్వేచ్ఛ ఎండమావులే అయ్యాయి. ఈ బాల్య జ్ఞాపకాలే - ముఖ్యంగా తాను 1938లో పుట్టి యుద్ధకాలంలో కన్న కలలే తన ఆత్మకథలోని మొదటిభాగం ʹయుద్ధకాలంలో స్వప్నాలుʹ.

తెలంగాణ ప్రజల అనుభవం కూడ అదే అయినప్పటికీ కెన్యా ప్రజలకు గూగీకి మౌమౌ పోరాటం ఒక జ్ఞాపకం, ఒక తొణికిన స్వప్నంగా మిగిలిపోతే - తెలంగాణ ప్రజలకు మాత్రం అది గతమే కాకుండా, వర్తమానంగానూ భవిష్యత్‌తో పోరాట సంభాషణగానూ కొనసాగుతున్నది.

గూగీని ఢిల్లీ జాతీయసదస్సుకు పిలిచిన నవీన్‌బాబు, ఆ తర్వాత కాలంలో విప్లవోద్యమంలో ఎన్‌కౌంటర్‌లో అమరుడయినాడని రాసినపుడైనా, పీపుల్స్‌వార్‌ కేంద్రకమిటీ సభ్యుల ఎన్‌కౌంటర్‌ తర్వాత 1999 డిసెంబర్‌ ఆఖరులో శ్యాం అంతిమయాత్ర ముగిసాక రాజ్యం హుస్నాబాదు స్థూపాన్ని కూల్చేసిందని రాసినా - ఆయన ఈ చీకటిమబ్బు అంచున ఎప్పుడూ మీ వర్తమానంలో ఒక మెరుపుతీగ వంటి ఆకాంక్ష, ఆశ మిగిలే ఉంటాయి అని రాసేవాడు. మీకు పోరాటం ఉంటుంది, పోరాటయోధులు అమరులైన జ్ఞాపకచిహ్నాలుంటాయి, అవి తుడిచేసినా వాళ్ల ఆకాంక్షలను జెండాలుగా పూని నడిచే పోరాటం ఉంటుంది అని రాసేవాడు.

మనసును వలసవాదం నుంచి విముక్తం చేయాలని, భాషను ఒక పదునైన అస్త్రంగా, సాహిత్యాన్ని అత్యంత ఆధునిక, సాంకేతిక నైపుణ్యంతో మెత్తటి మట్టిలాగ మార్చగలగాలంటే భాషా సాహిత్యాలు కూడ మానవశ్రమ నుంచి ఉత్పత్తి అయినవేననే ఎరుక కలగాలని ఆయన ఢిల్లీ సదస్సులోనూ, నిజాం కాలెజి సభలోను, చలసాని ప్రసాద్‌ అధ్యక్షతన బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విరసం సభలోనూ మాట్లాడాడు.

తెలుగు భాషలో వస్తున్న ప్రజా విప్లవ సాహిత్యం తాను నేరుగా గికియు భాషలోకి తీసుకపోగలిగితే ఎంతబాగుండును అని ఆశించాడు.

ఈ అవగాహనే ఒక సాంస్కృతిక పోరాటయోధునిగా గూగీని ఒక ప్రజాస్వామిక పోరాటయోధుడైన సాయిబాబాతో నిరంతర అనుబంధంలో కొనసాగించింది. గూగీ తన నవలలు, నాటకాలు, ప్రజారంగస్థల నిర్మాణం వలన కెన్యాలోని నియంతలకు కన్నెర్ర అయి 1978-79 కెన్యా ఆత్యయికస్థితి కాలంలో జైలుపాలయినట్లుగానే సాయిబాబా తన గ్రీన్‌హంట్‌ వ్యతిరేక పోరాటం వలన జైలుపాలయ్యాడు. బెయిలుపై విడుదల కావడానికన్న ముందే నాగపూర్‌ హై సెక్యూరిటీ జైల్లోని అండాసెల్‌లోనే గూగీ ఆత్మకథను తెలుగు చేసాడు.

ʹʹఅది అక్షరాలా ఒక యుద్ధకాలంలో పుట్టిన శిశువు స్వప్నాలకు ఒక యుద్ధఖైదీ చేసిన అనుసృజన. ప్రొఫెసర్‌ సాయిబాబా దీన్ని అనువదించడం నాకు చాల సంతోషం - 1996 ఫిబ్రవరిలో ఢిల్లీలో కలిసినపుడు కష్టజీవి సాయిబాబాతో నా కలయిక జ్ఞాపకాలను నేనెన్నటికీ మరచిపోలేను. హైదరాబాదులో ఒక పుస్తకాల దుకాణంలో అనుకోకుండా దొరికిన నా పుస్తకం డెవిల్‌ ఆన్‌ ది క్రాస్‌ తన జీవితం మీద ఎంత ప్రభావం వేసిందో ఆయన చెప్పడం నాకింకా గుర్తుంది. నేను ఆ నవలను కెన్యాలోని కామిటి మాగ్జిమమ్‌ సెక్యూరిటీజైలులో 1978లో టాయిలెట్‌పేపర్‌ మీద రాసాను. నా సాంస్కృతిక కార్యాచరణ వల్ల ముఖ్యంగా కెన్యాలోని కామిరితు గ్రామంలో రైతులు, కార్మికులు, తమ భాషలో తమ పోరాటాల గురించి చెప్పే తమ సొంత నాటకరంగాన్ని సృష్టించాలని చేసిన ప్రయత్నానికి సహకరించినందువల్ల నన్ను జైలులో పెట్టారు. నా పుస్తకాల్లో మరొకదాన్ని (యుద్ధకాలంలో స్వప్నాలు) అదే సాయిబాబా మహారాష్ట్ర లోని నాగపూర్‌ హై సెక్యూరిటీ జైలులో ఖైదీగా వుండి అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి! దుర్భరమైన పరిస్థితులో అనువాదం చేయడం! ఆయన తన జీవిత, సాంస్కృతిక కార్యాచరణ కోసం జైలుజీవితం గడుపుతున్నాడంటే నాకు ఆయనతో ఇప్పుడు, మరొకసారి, ఒక ప్రత్యేకమైన బంధం ఉందనిపిస్తుంది.ʹʹ

ఆ బంధం వల్లనే, ప్రపంచవ్యాప్తంగా సాయిబాబా అతని సహచర ఖైదీల విడుదల కోసం, రాజకీయ ఖైదీల విడుదల కోసం, జైళ్లు, నిర్బంధాలు లేని, అణచివేత దోపిడీ పీడనా లేని వ్యవస్థ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘీభావ, ప్రజాస్వామిక పోరాటంలో తన వంతు కర్తవ్యంగా గూగీ వా థియాంగో ఈ ఫిబ్రవరి 18న జిఎన్‌ సాయిబాబా అనువదించిన తన పుస్తకావిష్కరణ సభలో పాల్గొనడానికి హైదరాబాదుకు వచ్చాడు. కాని మన మధ్యన మన భాషలో గూగీ యుద్ధకాలపు బాల్యజ్ఞాపకాలు వివరించిన సాయిబాబా ఉండకపోవచ్చు. తానాశించినట్లుగా నాగపూర్‌కు వెళ్లి గూగీ సాయిబాబాను కలుసుకోలేక పోవచ్చు. కాని ఇప్పటికి ఇర్వురి భావజాలంతో పెనవేసుకొని సుదృఢమవుతున్న మన స్వేచ్ఛాకాంక్షల్ని పంచుకోవడానికి ఒక సాహిత్య, సాంస్కృతిక పోరాట సాయంత్రం కలుసుకుందాం.

ముఖ్యంగా ఈ బాధ్యత మనపై ఎందుకుందో తాను జైలులో బందీ అయిన రోజుల్లోనే 1978లో కార్ల్‌మార్క్స్‌ మాటల్లో చెప్పాడు. అవి కార్ల్‌మార్క్స్‌ చెప్పినవి కూడ కాదు. ఆయనకు ఒక కార్మిక ప్రతినిధి రాసినవి. కార్ల్‌మార్క్స్‌ 25 ఆగస్టు 1852 న్యూయార్క్‌ డెయిలీ ట్రిబ్యూన్‌కు చేసిన రచనలో ఉల్లేఖించాడు.

ʹʹనేను నీ హక్కుల్ని విస్తృతపరచడానికి ప్రయత్నించాను. కాబట్టే నా హక్కుల్ని హరించారు. మీ అందరికోసం స్వేచ్ఛామందిరాన్ని నిర్మించాలని ప్రయత్నించాను. కాబట్టే నన్నొక హంతకుని జైల్లోని సెల్‌లోకి తోసేసారు.... నేను సత్యానికి స్వరాన్ని అందించడానికి ప్రయత్నించాను. కాబట్టి నన్ను నిశ్శబ్దంలోకి తోసివేశారు.....జైల్లో ఒంటరి నిర్బంధంలో నిశ్శబ్ద వ్యవస్థలో ఉంచారు. నువ్వు ఇది ప్రజా సంబంధమైన సమస్య కాదనవచ్చు. కాని ఇది అయితీరుతుంది. ఎందుకంటే ఖైదీ భార్య గురించి పట్టించుకోని మనిషి కార్మికుని భార్య గురించి కూడ పట్టించుకోడు. బంధితుని పిల్లల గురించి వ్యగ్రత చూపనివాడు శ్రామిక సేవకుని పిల్లల గురించి కూడ వ్యగ్రత చూపడు. అందువల్ల ఇది ప్రజాసమస్య.

(గూగీ వాథియాంగో జైలు డైరీ ʹబందీʹ - జైలునోట్స్‌ నుంచి)





No. of visitors : 187
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    ఈ మానవ హననాన్ని ఆపండి
    అరుణతార మే - 2018
    మైనింగ్ మాఫియా కోస‌మే బోరియా - కసనూర్ నరమేధం
    గెలుచుకోవాల్సిన ప్రపంచం దిశగా కారల్‌ మార్క్స్‌
    మార్క్స్ ప్రాసంగిక‌త ఎప్ప‌టికీ ఉంటుంది : అరుణాంక్‌
    Long live the 1st of May
    విరసం క‌థా వ‌ర్క్‌షాప్‌
    marx selected poetry
    మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం
    ఎట్టి మనుషుల మట్టి కథలు
    మొద్దుబారుతున్న సమాజం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •