వీఆర్‌యే విధుల్లో సాయిలు చనిపోలేదా

| సంభాషణ

వీఆర్‌యే విధుల్లో సాయిలు చనిపోలేదా

- ప్రొ|| లక్ష్మణ్‌ గడ్డం | 20.02.2018 12:21:14am

కష్టం చేసేటోడు పోయె, డ్యూటికెళ్తున్నానని చెప్పిండు, తిరిగి రాని లోకానికెళ్ళిండు. పిల్లలు చిన్నోళ్ళు, తల్లిదండ్రులు ముసలోళ్ళు నేనెట్ల బ్రతికించాలని సాయిలు భార్య సాయమ్మ కంటికి పుట్టెడు ఏడుస్తుస్తున్నది. ప్రభుత్వ పనుల్లో చనిపోయిన సాయిలు ప్రభుత్వానికి పట్టని వ్యక్తి అయిండు.

కామారెడ్డి జిల్లా, పిట్లం మండలం కారేగావ్‌ గ్రామానికి చెందిన బోయిన సాయిలు (35) విఆర్‌యే విధులు నిర్వర్తిస్తూ 3 జనవరి 2018న ఇసుక ట్రాక్టరు ఢీ కొట్టడంతో చనిపోయాడు. భార్యా పిల్లలు అనాధలయ్యారు. ప్రభుత్వం సాయిలు మా వుద్యోగి కాదంటూ బాధ్యతల నుండి తప్పించుకుంటుంది. కాని పిట్లం మండలం ప్రజలకు మాత్రం సాయిలు విఆర్‌యేగానే తెలుసు.

తెలంగాణలో విఆర్‌యేలను కాందార్‌, సుంకరి, మస్కూరి, నీరుడి, కావాలి కార్‌ లని ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ విధులు అధికంగా దళిత, వెనుకబడిన తరగతి కుటుంబాలు మాత్రమే నిర్వర్తిస్తారు. ముదిరాజ్‌ కులానికి చెందిన బోయిన సాయిలు జూన్‌ 2017 నుండి పక్క గ్రామమైన మార్థాండ్‌లో డ్యూటి చేస్తున్నాడు. యితనికి యిద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు వున్నారు. పెద్దకూతురు సోని పెళ్ళైంది. చిన్న కూతురు లావణ్య 8వ తరగతి, కొడుకు విఠల్‌ 6వ తరగతి చదువుతున్నారు. యిది వీరికి వంశ పారంపర్యంగా సంక్రమిస్తున్న ప్రభుత్వ బాధ్యత. కారేగావ్‌లో మొత్తం 30 ముదిరాజ్‌ కుటుంబాలున్నాయి. ఏళ్ళ తరబడి ఈ కుటుంబాలే ఒకరి తర్వాత ఒకరు వంతుల వారిగా ఈ కాందార్‌ విధులు నిర్వహిస్తున్నారు. అయితే కుటుంబాలు పెరిగిపోవడంతో ఒక అవగామనకు వచ్చిన ఈ కుటుంబాలన్ని కలిసి 1992లో రూ. 25100లకు బోయిన విఠల్‌కు అమ్మేశారు. ఈ మేరకు బాండు పేపరు రాసుకున్నారు. విఠల్‌ అనంతరం ఆయన కుమారులైన శివయ్య, నారాయణ వంతుల వారిగా కాందార్‌ పనులు నిర్వహిస్తున్నాయి. అయితే అధికారికంగా మాత్రం నారాయణ పేరుమీద ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది. శివయ్య నారాయణ నిరక్షరాస్యులు గనుక వారి కుమారులను డ్యూటిలోకి పంపమని ప్రభుత్వ అధికారులు సూచించారు. కనుక నారాయణ కొడుకు సంతోష్‌, శివయ్య కొడుకు సాయిలు వంతుల వారీగా డ్యూటీ చేస్తున్నారు, జూన్‌ 2017 వరకు సంతోష్‌ చేసిన విదిని ఆ తర్వాతి నుంచి చనిపోయేంత వరకు సాయిలు నిర్వర్తించాడు. సాయిలు 10వ తరగతి వరకు చదువుకున్నాడు.

సాయిలుకు ప్రతి బుధవారం ప్రత్యేక డ్యూటి పడుతుంది. మండల కేంద్రమైన పిట్లంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో రాత్రిపూట కాపలా డ్యూటి చేయాలి. ఆ రోజు 3 జనవరి 2018న మార్ధాండ గ్రామంలో మధ్యాహ్నం వరకు గ్రామ సభ పనులు ముగించుకుని తర్వాత పిట్లంలోని విఆర్‌వో శ్రీనివాస్‌ దగ్గర పనులు చేసిండు. సాయంత్రం 6 వరకు భూమి సర్వేకు సంబంధించిన ఫైళ్ళన్ని మోసిండు. ఈ పనులన్ని ముగిసిన తర్వాత సాయంత్రం 6.30 కు కారేగావ్‌లో తన యింటికి చేరుకున్నాడు.

భోజనం చేశాక తిరిగి ఏడున్నర ఎనిమిది గంటలకు డ్యూటీ కెళుతున్నానని భార్యకు చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు వస్తానన్నాడు. సాయిలు నేరుగా పిట్లం వెళ్ళకుండ మార్ధాండు మీదుగా వెళ్ళాలన్నాడు. మార్ధాండులో సర్పంచ్‌ను కలిసి వెళ్ళాలనుకున్నాడు. అనుకోకుండ తన మోపేడ్‌ పంక్చర్‌ అయి వుండడంతో కాలినడకన బయలు దేరాడు. మోపెడు పంక్షర్‌ కాకపోతే నా భర్త బ్రతికేవాడని సాయమ్మ వాపోతుంది. శివారులోని కాకి వాగు దాటి దాదాపుగా 100 మీటర్ల దూరంలో ఇసుక ట్రాక్టరు ఢీ కొట్టడంతో శవమై పడిపోయాడు. ట్రాక్టరు టైర్లు తలమీదుగా ఎక్కడంతో సాయిలు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.

కాకి వాగు నిజానికి పెద్ద ఇసుక రీచ్‌ కాని మాట ఎంత వాస్తమో యిక్కడి నుంచి యిసుక రవాణా జరుగుతుందనే మాట కూడా అంతే వాస్తవం. ఈ ఘటన జరిగిన వారం రోజుల ముందు కుర్మ దర్గయ్య, మేతరి హన్నాండ్ల ట్రాక్టర్లను ఇసుక అక్రమ రవాణా నేరం కింద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన విచారణలో భాగంగా ఈ యిద్దరిని పిలిపించి కూడా పోలీసులు ప్రశ్నించారు. కనుక ఆ రోజు కారెగావ్‌ గ్రామానికి చెందిన ఎర్ర దుర్గయ్య ట్రాక్టరు డ్రైవరు ఎర్ర అంబయ్య ట్రాక్టర్‌ పై ఇసుక తరలించిన మాట వాస్తవం. ప్రతి రోజు రాత్రిపూట వీరు యిదే పని చేస్తారు. రాత్రి తొమ్మిది గంటల తర్వాత యిసుకని తీసుకొని తడ్కల్‌, సిర్నాపూర్‌, నారాయణ ఖేడ్‌, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తారు. అయితే దీనికి ఏ అనుమతులు లేవు. దొంగతనంగా ట్రాక్టర్‌ లైట్లు కూడా వేసుకోకుండా తరలించడం నిత్యం జరిగే పని. ఆ రోజు కూడా లైట్లు వేసుకోకుండా హడావిడిగా నడుపుతున్న క్రమంలో సాయిలు కనబడ్డాడు. విషయం బయటికి పొక్కుతుందనే భయంతో ఢీ కొట్టడంతో సాయిలు మరణించాడు. సాయిలు మద్యం సేవించి రహదారిపై పడుకుని వుండడంతో జరిగిందనడం వాస్తవం కాదు.

నీలిరంగు ప్యాంటు, తెల్లని షర్టు వేసుకుని, షర్టుకు ప్రభుత్వం యిచ్చిన బ్యాడ్జు పెట్టుకుని, శాలువ మెడలో వేసుకున్న సాయిలు పిట్లం ఎంఆర్‌ఓ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డు డ్యూటీ చేయడానికి బయలు దేరాడు. ఏ వ్యక్తికైనా కొరికే చలిలో బహిరంగంగా బాటలో, పైగా ట్రాక్టర్‌ టైర్ల దిశలో తలబెట్టి పడుకోవడం సాధ్యమేనా? ఎంతటి మద్యం మత్తులో వున్న వ్యక్తి అయినా వెచ్చటి ప్రదేశం చూసుకుని పడుకుంటాడు కదా! భారత సైనికునికి బ్యాడ్జ్‌ వున్నట్టు గానే సాయిలు ఎదలో తెల్లటి షర్టుపై బ్యాడ్జ్‌ చెక్కుచెదరకుండానే వుంది. ʹʹఅతను విఆర్‌యే కాదు, అసలు ప్రభుత్వ ఉద్యోగి కాదు. ట్రాక్టర్‌తో గుద్దించి చంపించింది వాస్తవం కాదుʹʹ అని గరవ్నర్‌ నరసింహన్‌ అంటారు. ʹʹజిల్లా కలెక్టర్‌కు ఫోను చేసి వాస్తవాలు తెలుసుకున్నా, ఆ ఘటనలో చనిపోయిన సాయిలు విఆర్‌యే కాదు అని మంత్రి కెటిఆర్‌ అంటారు. జిల్లా కలెక్టరు కూడా అదే మాటంటారు. కాని సంబంధిత విఆర్‌వో గదా సాయిలు విఆర్‌యే నా కాదా అని తేల్చాల్సింది. సాంకేతికంగా సాయిలు పేరున ఆర్డర్‌ లేని మాట వాస్తవమే కాని ఆ డ్యూటి 8 నెలలుగా చేస్తున్నది మరింత వాస్తవం. ఆ మాట కాస్తే ఆర్డర్‌ వున్న నారాయణ ఆ డ్యూటి చేసింది ఎన్నడూ లేదు. చేసిందల్లా వంతుల వారిగా సంతోస్‌, సాయిలు లే గదా! వీరు చేస్తేనే కదా కింది స్థాయి పనులు సజావుగా సాగినవి. రోజూ రిజిష్టర్‌లో సాయిలు సంతకాల ఎదురుగా ధృవీకరిస్తూ ఎం.ఆర్‌.వో. లేదా విఆర్‌వో సంతకాల సాక్షం వుంది కదా. యిన్న రోజులు పని చేయించుకుని చనిపోయిన వెంటనే ఆయనెవరో మాకు తెలియదనడం అన్యాయం, అమానవీయం కదా! పిట్లం మండలంలోనే యింకా 70 మంది యిలాంటి నిరాదరణ వ్యవస్ధలో పని చేస్తున్నారు. రేపు వీరి గతి యింతేనా. ప్రభుత్వమంటే మనుషులే గదా మరి వారికి మానతవ్వం వుండదా. అనాధలుగా మారిన పిల్లల ఎడల కనీస బాధ్యత వుండదా. గవర్నర్‌ దగ్గర్నుంచి ఎస్సీ వరకు అసలు సాయిలు కాందార్‌ కాదని చెప్పడంలో, ఆయనను ఢీ కొట్టింది యిసుక లారీ కాదని చెప్పడంలో చూపిన ఆసక్తత కనీసం చనిపోయిన వ్యక్తి కుటుంబీకులను పరామర్శించడం వ్యక్తపరచలేదు. ప్రభుత్వం కనీసం దహన సంస్కారాలకు కూడా డబ్బులు యివ్వలేదు.

రాష్ట్రంలో యిసుక మాఫియా మారణకాండ కొనసాగుతుందంటే ప్రభుత్వం ఎందుకంత ఉలిక్కి పడుతుంది. గత జూలైలో సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ళలో బదనాపురం భూమయ్యను అక్రమ రవాణా చేస్తున్న యిసుక లారీ గుద్ది చంపింది. అంతకు ముందే యిక్కడ మరో 5గురు చనిపోయారు. ఆగస్టు 2న గన్నె వారి పల్లెకు చెందిన గన్నె శంకరయ్యను పోతుగల్‌ గ్రామం దగ్గర వేగంగా వస్తున్న యిసుక లారీ ఢీ కొట్టి చంపేసింది. ఈ నేరం వెంటాడు తుంది గనుక ఉన్నత స్థాయి యంత్రాంగమంత రంగంలోకి దిగి భుజాలు తడుముకునే ప్రయత్నం చేశారు. యిలాంటి వైరుద్యాలు ఏర్పడినపుడు ప్రభుత్వాలు తప్పుకునే ప్రయత్నం చేయడం కాకుండ మానవీయంగా పరిష్కరించే ప్రయత్నాలు చేయాలి.

సాయిలు విధి నిర్వహణలో భాగంగానే చనిపోయాడు. ప్రతి బుధవారం ఎంఆర్‌వో ఆఫీసు రాత్రి కాపలా డ్యూటి సంబంధిత ఎంఆర్‌వోనే నిర్ధేశించాడు. ఈ డ్యూటిలో ఆ రోజు సాయిలుతో బాటు కిష్టాపూర్‌ బాలరాజుకు, బూర్నిపూర్‌ హన్మాండ్లుకు, పోతెరెడ్డిపల్లి అంజయ్యకు రాత్రి కాపలా డ్యూటి వేసింది పిట్లం ఎంఆర్‌వోనే. అటెండెన్సు రిజిష్టరులో సాయిలు సంతకాలను ఎంఆర్‌వో ధృవీకరించాడు గనుక సాయిలును విఆర్‌యేగా గుర్తించాలి. పైగా ప్రజలందరు సాయలును కాందార్‌గా గుర్తింస్తారంటే ఆ డ్యూటి చేస్తేనే గదా.

సాయిలుకు జరిగిన అన్యాయం పునరావృతం కాకూడదంటే ఎవ్వరు డ్యూటిలో చేరితే వారి పేరున నిర్ధిష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలి. ఒకరితో పని చేయించుకుని వేరొకరి పేరున జీతం జమ చేసే వ్యవస్ధకు స్వస్థి పలకాలి. రాష్ట్రంలో సాయిలు లాగ ఎంత మంది విఆర్‌యేలు పనిచేస్తున్నారో గుర్తించి వారి పేరున నిర్ధిష్ట సమయానికి ఉత్తర్వులు జారీ చేసి ఆర్డర్లు లేని విఆర్‌యేలను రక్షించాలి. సాయిలు కుటుంబానికి 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి కుటుంబాన్ని ఆదుకోవాలి. సాయిలు భార్య సాయమ్మకు ఉద్యోగం కల్పించి, పిల్లలకు రిసిడెన్షియల్‌ పాఠశాలలో విద్యనందించాలి. రాష్ట్రంలో ఇసుక మాఫియాను అరికడితే తప్ప ఈ మరణకాండ ఆగదు.

ప్రొ|| లక్ష్మణ్‌ గడ్డం

అధ్యక్షుడు

పౌర హక్కుల సంఘం

No. of visitors : 429
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •