ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

| సాహిత్యం | క‌థ‌లు

ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

- మెట్టు ముర‌ళీధ‌ర్‌ | 20.02.2018 12:38:01am

జ్వరంతోనే ఇల్లు చేరుకున్నాడు చందు. పాతనోట్లు మార్చి కొత్తనోట్లు తేవాలనుకున్న చందు ఆ పని చేయలేకపోయాడు. రద్దీ ఎక్కువగా ఉండడం, బ్యాంకు దగ్గర జరిగిన గొడవ కారణంతో ఆరోజు తన పని కాలేదు.

జ్వరంతో ఇల్లు చేరిన కొడుకును చూచి కంగారు పడింది సాయమ్మ. చందు రాగానే ఒళ్ళు పట్టి చూచింది. పక్కవేసి పడుకోబెట్టింది.

చందుకు తలనొప్పిగా ఉంది. అంత వేడిలోనూ ʹటీʹ తాగాలనిపించింది. అదేమాట లతతో అన్నాడు. ఐతే అప్పుడు ఇంట్లో టీ పొడిగాని, శర్కరగాని బొత్తిగా లేవు. ఇంట్లో ఉన్న చిల్లర నోట్లు జగద్గిరిగుట్టకు పోరుురావడానికి మరియు డాక్టరుకు చూపించుకోవడానికే అరుుపోయారుు. టీపొడి, శర్కరతో పాటు వంటనూనె కూడా లేదు. ఈ రెండు రోజులు ఉన్నదాంట్లోనే సర్దింది లత. అమ్మకు తెలియనీయలేదు.

అన్న ʹటీʹ కావాలని అడిగేసరికి బాధపడిపోరుుంది లత. అమ్మనడిగి ఒక పాత ఐదువందల నోటు తీసుకొని బజారుకు పోరుుంది.

పెద్దమ్మగడ్డలోనే ఉన్న ఒక దుకాణంలో పాతనోట్లు తీసుకొని కిరాణా సామాన్లు ఇస్తున్నారట. ఈ విషయం పక్కింటి ఆంటీ అంటే విన్నది లత. ఐతే 500 రూపాయలకు 10 శాతం తక్కువ అంటే 450 రూపాయల సామాన్లే ఇస్తున్నారట. అంత సామాను తప్పకుండా తీసుకోవాలట. తక్కువైతే బిస్కెట్లో, షాంపూలో, చాక్‌లెట్లో, మరేవో తీసుకోవాలి తప్ప చిల్లర ఇవ్వడం లేదట.

పెద్దనోట్లు రద్దుకాకముందు ఏ సామాన్లు కావాలన్నా, బజార్లో ఏ పని ఉన్నా సాయమ్మే స్వయంగా పోయేది. పెద్దనోట్ల రద్దు విషయం తెలిసినప్పటినుండి సాయమ్మ ఇంట్లోంచి కాలు బయటపెట్టడం లేదు. అలా అని వంటపని కూడా చేయడం లేదు. అన్ని పనులూ లతే చేస్తోంది. సాయమ్మలో మునుపటి ఉత్సాహం లేదు. ʹడబ్బుల్ని ఏం చేయాలి?ʹ అనే బెంగతోనే ఉండిపోరుుంది. ఆమెను చూస్తే మూర్తీభవించిన శోక దేవతలా ఉంది.

అందుకే సంచీ తీసుకొని బజారుకు బయలుదేరింది లత. ఆమె ఈ కొన్ని నెలల నుండే ధైర్యంగా బయటకు వస్తోంది. అంతకు ముందు సంవత్సరం పైగా ఇంట్లోనే ఉండిపోరుుంది. నాగరాజు ఎపుడు వస్తాడో? ఏం చేస్తాడో అన్న భయంతో ఒంటరిగా బజారుకు వెళ్ళాలంటేనే భయపడేది. అమ్మ ఉంటేనో లేక అన్న ఉంటేనో తప్ప బయటకు రాకపోయేది. గత జనవరిలో నాగరాజు జైల్లో పడ్డప్పటి నుండి లత ధైర్యంగా బయటకు వస్తోంది.

ఐనా బజార్లో నడుస్తున్నప్పుడు లతకు పూర్తిగా భయం పోలేదు. నాగరాజు డిసంబరు చివరి దాకా రాడని తెలిసి కూడా ధైర్యంగా ఉండలేకపోతోంది. నాగరాజు తనను వెంబడిస్తున్నట్టు, ఆసిడ్‌ బాటిల్‌తో వెంటబడుతున్నట్టే అనిపిస్తోంది లతకు. రెండు మూడు రోజుల నుండి అమ్మ బయటకు వెళ్ళడంలేదు గనుక లతకు ఆ పనులు తప్పడం లేదు.

దుకాణం చేరుకుంది లత. వంటనూనె, శర్కర, టీపొడితో పాటు కొన్ని ఇతర సామాన్లు కొన్నది. దుకాణం యజమాని సరిగ్గా లెక్కకట్టి 450 రూపాయలకు సామాను పోగా మిగిలిన ఎనిమిది రూపాయలకు నాలుగు షాంపూలిచ్చాడు. ఐదు వందల నోటు దుకాణం సేటుకిచ్చి సామానుతో ఇంటికి బయలుదేరింది లత.

ఇంటికిచేరిన లత సంచీలోంచి సామాన్లు బయటికి తీసింది. అన్నకు టీ పెట్టి ఇచ్చింది. టీ తాగడానికి ముందు చందు డాక్టరు వ్రాసి ఇచ్చిన టాబ్లెట్లు వేసుకున్నాడు.

ఇక ఈరోజు రెస్ట్‌ తీసుకొని రేపు కాస్త ముందుగానే లతను వెంటబెట్టుకొని బ్యాంకుకు పోవాలనుకున్నాడు చందు. ʹతను, లత బ్యాంకు లైన్లలో నిలబడి, ఆధార్‌ కార్డులు చూపించి చెరి నాలుగు వేల రూపాయలు మార్చుకోవాలి. ఇలా ఐదారు రోజులు వరుసగా పోతే కనీసం యాభై వేలైనా మారుతారుు. తక్షణ అవసరాలకు ఉపయోగపడుతారుుʹ అనుకున్నాడు చందు. ఆ పనితో పాటు రేపే బ్యాంకు ఖాతాలు తెరవడం గురించి కూడా తెలుసుకోవాలనుకున్నాడు.

అమ్మను చూశాడు చందు. లత తనతోపాటు అమ్మకు కూడా టీ ఇచ్చింది. ఆమె టీ గ్లాసు పట్టుకుంది గాని తాగడం లేదు. చాలా పరధ్యానంలో ఉంది. ఆమెలో మునుపటి ఉత్సాహం లేదు. ఆమె బెంగంతా లత గురించే అని తెలుసు చందుకు.

ʹఏదన్నా చేసి అమ్మ మనసులోని బాధను పోగొట్టాలి. లత పెళ్ళి సజావుగా జరగాలి. ఎలాగైనా జగద్గిరిగుట్టవాళ్ళకు సకాలంలో డబ్బు అందజేయాలి. అమ్మ కళ్ళలో సంతోషం చూడాలిʹ అనుకున్నాడు చందు.

అంతలోనే అంతసేపూ మాట్లాడని సాయమ్మ పెదవి విప్పింది.

ʹʹబ్యాంకు ఖాతాలు తీశావా బిడ్డా?ʹʹ అంది.

ʹʹతీయలేదమ్మాʹʹ అంటూ అక్కడ జరిగిన విషయాలన్నీ అమ్మకు చెప్పాడు చందు.

కొడుకు మాటలు విని నీరుగారిపోరుుంది సాయమ్మ.

తెల్లవారి ఉదయం పది గంటలకే చందు, లత ఇద్దరూ బ్యాంకుకు చేరుకున్నారు. అప్పటికే రెండు లైన్లు తయారై ఉన్నారుు. నోట్లు మార్చుకునే లైను కాస్త పెద్దగా ఉంది. నిన్నటి గొడవను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ముందుగానే వచ్చారు. అందులో ఒక మహిళా పోలీసు కూడా ఉంది.

ట్రాఫిక్‌ మళ్ళింపు అలాగే ఉంది. పోలీసులు ట్రాఫిక్‌ను గళ్లీల ద్వారా పంపిస్తున్నారు.

ఆధార్‌ కార్డు చూపించి ఏ బ్యాంకులోనైనా డబ్బు మార్చుకోవచ్చు గనుక డబ్బు మార్చుకునే లైను మాటిమాటికి పెరుగుతోంది. ఒక స్వచ్ఛంద సంస్థ అక్కడ తాగునీటిని ఏర్పాటు చేసింది. ʹచాయ్‌! చాయ్‌!ʹ అంటూ ఈరోజు చాయ్‌వాలాలు కూడా సందడి చేస్తున్నారు.

పెద్దమ్మగడ్డలో ఉన్నది ప్రభుత్వ బ్యాంకు. రిజర్వు బ్యాంకు వాళ్ళు జాతీయం చేయబడ్డ బ్యాంకులకే కొత్తనోట్లు ఎక్కువగా పంపిస్తున్నారట. నిన్న, మొన్న ప్రైవేటు బ్యాంకులలో గంటలోనే డబ్బు అరుుపోరుుందట. అందుకే జనం ఇటు ఎగబడ్డారు. దాంతో నిన్నటికన్నా రద్దీ పెరిగింది.

దానికి తోడు కమీషన్‌ వ్యాపారం చేస్తున్న నల్లకుబేరుల ముఠా సభ్యుల వీరంగం కూడా ఎక్కువగానే ఉంది.

నోట్లు మార్చుకునే లైనులో చందు, లత ఇద్దరూ నిలుచున్నారు. ఆధార్‌ కార్డు జిరాక్స్‌ పేపరుతో పాటు 4 వేలు లత చేతికిచ్చి మరో 4 వేలు తాను పట్టుకొని నిలుచున్నాడు చందు.

లైన్లలో నిలబడ్డవారు ఎవరికి తోచింది వారు మాట్లాడుతూనే ఉన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవారే ఎక్కువగా ఉన్నారు.

అక్కడ లైన్లలో ఉన్నవారికి శ్రమ తెలియకుండా ఉండడానికి ఏవో మాటలు కావాలి. అందుకు ఒక టాపిక్‌ కావాలి. ప్రస్తుతం నోట్లరద్దు కన్నా మంచి టాపిక్‌ మరొకటి లేదు. అందుకే తలో మాట అంటున్నారు. చూస్తే అవి పెదాల మీదినుండి వస్తున్న మాటల్లా లేవు. గుండెలోతుల్లోంచి బాధల సెగలుగా వస్తున్న మాటల్లా ఉన్నారుు.

ʹʹఅంతా రాజకీయమే. ఎవరడిగారు పెద్దనోట్లు రద్దుచేయమని? ఐనా పెద్దపెద్దోళ్ళు ఎప్పుడో తమ ట్రెండు మార్చుకున్నారు. వాళ్ళ బ్లాక్‌మనీ అంతా ఆస్తులు, బంగారం, వజ్రాలుగా మారిపోరుుంది. కొండను తవ్వి ఎలుకను పట్టాలనుకుంటోంది ప్రభుత్వం. కాని వృథా ప్రయాసే మిగులుతుందిʹʹ అన్నాడొకాయన.

ʹʹచూశారా? ఈ లైన్లలో ఉన్నవాళ్ళందరు మామూలు వాళ్ళే. ఒక్క డబ్బున్నోడు కూడా లేడు.ʹʹ మరొకాయన అన్నాడు.

ʹʹడబ్బున్నోళ్ళు లైన్లలో ఎందుకుంటారు? వాళ్ళ దగ్గరికే బ్యాంకులు పోతుంటేను!ʹʹ

కొందరు అలా మాట్లాడుతుంటే మరికొందరు మరోలా మాట్లాడుతున్నారు.

ʹʹఅబ్బ! ఏం లైన్లో ఏమో? నిన్న నేను మూడు గంటలు నిలుచున్నాను. తీరా నావంతు వచ్చేసరికి క్యాష్‌ అరుుపోరుుంది.ʹʹ

ʹʹనాకు దొరికారుు, ఏం లాభం? రెండువేల నోట్లు రెండు. ఎక్కడా చిల్లర దొరకలేదు.ʹʹ

ʹʹఐనా రెండువేల నోట్లు ఎవరడిగారండీ? అవి నల్లకుబేరుల కోసం గాని మనకోసం కాదు. వాళ్ళైతే సులభంగా, పెద్దమొత్తంలో దాచుకోవచ్చు.ʹʹ

ʹʹఔను. రెండువేల నోట్లు మనమేం చేసుకుంటాం? మనకు చిల్లర కావాలి.ʹʹ

ʹʹఆ రెండువేల నోట్లు కూడా ఎంతసేపు మారుస్తున్నారండీ? ఓ రెండు మూడు గంటలు, అంతే. తర్వాత అరుుపోయాయంటున్నారు. ఏమన్నా అంటే ఆర్‌.బి.ఐ. వాళ్ళు పంపించడం లేదంటున్నారు.ʹʹ

ʹʹవాళ్ళు సరిగానే పంపిస్తున్నారు. పంపిన దాంట్లో సగానికి పైగా పెద్దోళ్ళకే చేరుతున్నారుు. వాళ్ళు ఇంట్లో కూర్చొనే డబ్బులు తెప్పించుకుంటున్నారు.ʹʹ

ʹʹఅసలు మన డబ్బు మనం తీసుకోవడానికి ఇన్ని ఆంక్షలెందుకండీ? నేను దాచుకున్న పైసలు నాకివ్వకపోవడమేమిటి? ఇది ఒకరకంగా హక్కుల భంగమే.ʹʹ ఒకతను చాలా కోపంగా అన్నాడు.

ʹʹనల్లకుబేరులు, బ్యాంకు వాళ్ళు ఒక్కటైనారు. ఎవరేం చేయగలరు?ʹʹ మరొకతను నిర్వేదాన్ని ప్రకటించాడు.

ʹʹఅలా చేస్తే బ్యాంకోళ్ళకేం లాభం?ʹʹ అమాయకంగా అడిగాడు ఒకాయన.

ʹʹఏం లాభమా? వాళ్ళ కమీషన్‌ వాళ్ళకుంటుంది.ʹʹ

ʹʹఔనా? అందుకేనా ఏమిటి, కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా కమీషన్‌ తీసుకొని నోట్లు మారుస్తున్నారని వినిపిస్తోంది? బ్యాంకోళ్ళు తీసుకోగా లేంది మేం తీసుకుంటే తప్పేమిటి అనుకుంటున్నారో ఏమో?ʹʹ

ʹʹఔనౌను, నిజమే. మా కాలనీలోనే అలాంటి ఏజన్సీ ఒకటి తయారరుుంది. ఒకరిద్దరికి లక్షల్లోనే మార్చారట.ʹʹ

ʹʹఅంతా గందరగోళంగా తయారయింది.ʹʹ

ʹʹఏది ఏమైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, పెద్దనోట్లు రద్దుచేయడం ఏమీ బాగా లేదండీ,ʹʹ

ఇలా ఒక్కొకరు ఒక్కొక రకంగా మాట్లాడుతున్నారు. కొందరు కోపాన్ని వెళ్ళగక్కుతున్నారు. కొందరు శాపనార్థాలు పెడుతున్నారు. కొందరేమో బాధను వ్యక్తపరుస్తున్నారు.

అవన్నీ వింటుంటే చందుకు చాలా కొత్త విషయాలు తెలుస్తున్నారుు. ఆలోచిస్తుంటే అవన్నీ నిజాలే అనిపిస్తున్నారుు.

పదిన్నరరుుంది. బ్యాంకు తెరిచారు. నిన్నటి లాగానే ఒక్కోలైను నుండి పదిమంది చొప్పున లోపలికి పంపిస్తున్నారు.

ʹʹలోపల కూడా బయట ఉన్నట్టే హడావిడిగా ఉందిʹʹ అన్నాడొకాయన బయటకు వస్తూ.

ʹʹలోపలికైతే వచ్చాం గాని, తమదాకా డబ్బులు వస్తాయో, రావోనన్న ఆందోళన కనిపిస్తుంది అందరి ముఖాల్లో.ʹʹ

బయటకు వస్తున్న మరొకాయన అన్న మాటలవి.

ʹజనాన్ని ఇంత పెద్ద టెన్షన్‌కు గురిచేయడం అవసరమా?ʹ అనిపించింది చందుకు.

గంట తర్వాత చందు, లత ల వంతు వచ్చింది. ఇద్దరూ లోపలికి పోయారు.

మరో పావుగంట తర్వాత ఇద్దరూ చెరొక నాలుగువేల చొప్పున మొత్తం ఎనిమిది వేలు మార్చుకున్నారు.

తాను నాలుగు వేలు మార్చుకుంటున్నపుడే క్యాషియర్‌ను అడిగాడు చందు,

ʹʹకొత్త అకౌంట్లు తీయాలి. ఎలా సార్‌?ʹʹ అని.

ʹʹమేనేజర్‌ను అడగండిʹʹ అన్నాడు క్యాషియర్‌ విసుగ్గా.

మీద మీద పడుతున్న మంది, తెరిపిలేని పనితో బ్యాంకు సిబ్బంది కూడా చిరాకు పడుతున్నారు. ఖాతాదారులు అడుగుతున్న ప్రశ్నలకు పట్టింపులేనట్టుగా సమాధానాలు చెపుతున్నారు. అవి అర్థం అరుూ, కాక కొత్తగా బ్యాంకులో అడుగుపెట్టినవారు అయోమయానికి గురవుతున్నారు.

చందు లైను నుండి తప్పుకున్నాడు. తర్వాత మేనేజరు రూము వద్దకు పోరుు కాసేపాగి లోపలికి ప్రవేశించాడు.

మేనేజరు రూములో అప్పటికే ఇద్దరు ముగ్గురున్నారు. చందు వెళ్ళి నిలబడగానే,

ʹʹఏం కావాలి.ʹʹ అని అడిగాడు మేనేజరు.

ʹʹనేను, మా చెల్లి, మా అమ్మ ముగ్గురం ఖాతాలు తెరవాలనుకుంటున్నాం సార్‌!ʹʹ అన్నాడు. చందు మాటలకు మేనేజరు నవ్వాడు.

ʹʹచూస్తున్నావుగా ఈ జనాన్ని? ఇంకా పది, పదిహేను రోజుల దాకా కొత్త అకౌంట్లు తెరవడం కుదరదు. తర్వాత ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, అడ్రసు ప్రూఫు, ఫోటోలతో కనిపించు.ʹʹ

ʹʹపాన్‌ కార్డు లేదు సార్‌ʹʹ అనాడు చందు.

ʹʹకావాలి.ʹʹ

ʹʹపాన్‌ లేకుండా ఖాతాలు తెరవడం కుదరదా సార్‌?ʹʹ

ʹʹకుదరదు.ʹʹ

ʹʹఎలాగైనా మాకు అకౌంట్లు కావలి సార్‌!ʹʹ అంటూ చందు ప్రాధేయపడ్డాడు.

ʹʹఈ పరిస్థితుల్లో పాన్‌ లేకుండా అది వీలుకాదు బాబూ! పాన్‌ తీసుకోʹʹ అన్నాడు మేనేజరు

ʹʹఎక్కడ దొరుకుతారుు సార్‌?ʹʹ

ʹʹఇంటర్నెట్‌ షాపులో అడుగు.ʹʹ

అని మేనేజరు తన పనిలో పడ్డాడు. చేసేదిలేక చందు బయటకు వచ్చాడు.

డబ్బు మార్చుకుంటున్నప్పుడే క్యాషియర్‌ రెండు, రెండువేల నోట్లు చందు చేతిలో పెట్టి పొమ్మన్నాడు. ఇంట్లో చిల్లరలేవు కాబట్టి,

ʹʹచిల్లర ఇవ్వండి సార్‌!ʹʹ అంటూ అడిగాడు చందు.

ʹʹలేవుʹʹ అన్నాడు క్యాషియర్‌.

ʹʹవందలున్నారుు కదా సార్‌! కొన్ని ఇవ్వండిʹʹ అంటూ అక్కడున్న వందల్ని చూపించాడు చందు.

ʹʹఅవి మీకోసం కాదుʹʹ అంటూ వందనోట్ల కట్టను లోపల వేసుకున్నాడు క్యాషియర్‌.

ʹఅవి ఎవరికోసమో?ʹ అడగాలనిపించింది చందుకు. కాని క్యాషియర్‌ ఆ అవకాశమివ్వలేదు. క్యాషియర్‌ పద్ధతి చందుకు నచ్చలేదు.

పని అరుుపోరుున వారిని సెక్యూరిటీ లోపల ఉండనివ్వడం లేదు. దాంతో చందు, లత బయటకు వచ్చారు.

అప్పటికే అతని కాళ్ళు పీకుతున్నారుు. మళ్ళీ ఒళ్ళు వేడి చేసినట్టనిపిస్తోంది. ఇంటర్నెట్‌ షాపుకు పోరుు పాన్‌ కార్డుల విషయం తెలుసుకోవాలనుకున్నాడు చందు. కాని పూర్తిగా ఓపిక లేదతనికి. ʹకాసేపు రెస్ట్‌ తీసుకొని సాయంత్రం పాన్‌ కార్డుల గురించి తెలుసుకుంటానుʹ అనుకొని ఇంటికి బయలుదేరబోయాడు.

అంతలోనే సెక్యూరిటీ వచ్చి బ్యాంకు షటర్‌ను సగం కిందికి లాగాడు.

ʹʹక్యాష్‌ అరుుపోరుుందిʹʹ అంటూ.

ʹʹక్యాష్‌ అరుుపోరుుందా?ʹʹ

ʹʹఅప్పుడే అరుుపోరుుందా?ʹʹ అంటూ నిలుచున్న జనం నీరుకారిపోయారు.

ʹʹఆర్‌.బి.ఐ. వాళ్ళు పంపించడం లేదు. వీళ్ళేం చేస్తారు?ʹʹ అన్నాడు పోలీసాయన. జనంలో ఒకతనికి ఒళ్ళు మండింది.

ʹʹనీకు తెలుసా? నీవు చూశావా?ʹʹ అన్నాడు సీరియస్‌గా.

ʹʹషటర్‌ వేశారు గదా?ʹʹ

ʹʹవేస్తే అరుుపోరుునట్టా?ʹʹ

ʹʹమరి?ʹʹ

ʹʹబ్యాక్‌ డోర్‌ లేదా?ʹʹ

ʹʹఏమో గురూ! నాకు తెలియదుʹʹ అంటూ పోలీసాయన నోరుమూసుకున్నాడు.

బ్యాంకును, ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ లైను చెదరిపోరుుంది.

No. of visitors : 761
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆ యాభై రోజులు (నవల)

మెట్టు మురళీధర్‌ | 18.11.2017 12:35:34am

విలాసరావు పాతనోట్ల మార్పిడి ప్రయత్నాలు తీవ్రంగానే చేస్తున్నట్టు అర్థమవుతోంది చందుకు. ఆయనది, తనది ఒకే రకమైన పరిస్థితి. ఆయన మార్పిడి ప్రయత్నాలు మొదలుపెట్టా.....
...ఇంకా చదవండి

ఆ యాభై రోజులు (న‌వ‌ల‌)

మెట్టు ముర‌ళీధ‌ర్‌ | 20.01.2018 11:13:05am

పెద్ద నోట్ల రద్దు కారణంగా ఆ 50 రోజుల కాలంలో రైతులు, ఇతరులు ప్రభుత్వానికి చెల్లించవలసిన ఋణాలు పాత పెద్ద నోట్లలో చెల్లించవచ్చని ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. త.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఖైదు కవి స్వేచ్చ కోసం పోరాడదాం
  అరుణతార నవంబర్ - 2018
  International Seminar on Nationality Question
  రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
  ప్రభుత్వమే అసలైన కుట్రదారు
  సూర్యాక్షరం
  శ్వాసిస్తున్న స్వ‌ప్నం
  చిరున‌వ్వే ఓ ప్ర‌క‌ట‌న‌
  వెలిసిన రంగులు
  అతనేం చేసిండు?
  సరిహద్దున సముద్రమైనా లేన‌ప్పుడు
  ఊరు మీది మనాది, నిశ్శబ్దపు రాజ్యపు హింస

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •