సీమ రైతుల స్వప్నం,కేసి కాలువ జీవనాడి-గుండ్రేవుల రిజర్వాయర్

| సాహిత్యం | వ్యాసాలు

సీమ రైతుల స్వప్నం,కేసి కాలువ జీవనాడి-గుండ్రేవుల రిజర్వాయర్

- కే ఆర్ వై. రాయలసీమ విద్యావంతుల వేదిక. | 20.02.2018 01:01:52am


సిద్దేశ్వరం అలుగు,వేదవతి ఎత్తిపోతల, ఆర్డిఎస్ కుడి వరద కాలువ,తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ ,గుండ్రేవుల రిజర్వాయర్- యివన్నీ సీమ రైతుల గుండెల్లో ఆశలు నింపే అందమైన స్వప్నాలుగా మిగిలిపోతున్నాయి.రాయలసీమలో నీళ్ళు లేవు, కరువులూ,వలసలూ-ప్రక్రుతి శాపాలన్న తప్పుడు అవగాహన నుండి యిప్పుడే బయటపడి, చుట్టూ నీరున్నా వినియోగించుకోలేని దుస్థితిని తలచుకోవడం మాని, పాలకులపై నమ్మకం కోల్పోయి ,తమకు తామే సంఘటితమై ఉద్యమాల ద్వారా ఏమైనా సాధించుకోగలరు అనే విశ్వాసాన్ని కలుగ చేసింది " సిద్దేశ్వరం అలుగు- ప్రజా శంకుస్థాపన" ఉద్యమం. అది, సీమ ప్రజలు తమ హక్కులకోసం చేస్తున్న పోరుబాటలో తొలి అడుగయితే, గుండ్రేవుల రిజర్వాయర్ కోసం సీమ ప్రజలు చేపట్టిన 40కి.మీ.లపాదయాత్ర మలి అడుగు అని చెప్పవచ్చు.

20 tmc ల సామర్థ్యం గల ఈ రిజర్వాయర్ ఇటు కేసి కాలువ ఆయకట్టుకు , అటు మహబూబ్ నగర్ జిల్లా లోని ఆర్డిఎస్ ఆయకట్టుదారుల సాగు స్థిరీకరణకు ఏకైక వనరు.ఆ గుండ్రేవుల రిజర్వాయర్ కళను సాకారంచేసుకునేందు కై రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యాన జరిగినఈ ప్రజా పాదయాత్రలో దారి పొడుగునా ప్రతిగ్రామంలో ప్రజల నీరాజనాలు. వారి మాటలలో వారి,ఆశలు, ఆకాంక్షలు నమ్మకాల తో పాటు భూములు కోల్పోయేవారి భయాలూ వ్యక్తమయ్యాయి.జనవరి 28 న కర్నూల్ నగర కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్రకు వేలాది మంది స్వాగతం పలికారు, తమ సంఘీబావాన్ని తెల్పారు.దాదాపు 500 మందికి పైగా ప్రజలు,రైతులు,ప్రజాసంఘాల,విద్యార్థి సంఘాల కార్యకర్తలు అలుపెరుగక స్వచ్చందంగా ఈ 45 కి.మీ. పాదయాత్రలో పాల్గొనడం ఒక ప్రత్యేకత,రాయలసీమ చరిత్ర పొడవునా ముఠా వైషమ్యాలు,కక్షలు,కరువులూ, వలసలూ,ప్రాంత రాజకీయనాయకుల ద్రోహం - ఇవే కన్పిస్తాయి.పారాయి పాలకులే,సీమలో కరువును ప్రత్యక్షంగా చూసి,చలించి యిక్కడ సాగు,తాగు నీటి ప్రణాలికలపై శ్రద్ద పెట్టారు. వాటి పలితమే కర్నూల్-కడప జిల్లాలాలలో దాదాపు 2 ల.75 వే ల ఎకరాకు సాగునీరందించే కే సి కాలువ.రెండు జిల్లాల ప్రజలకు పిడికెడు గింజలు,గుక్కెడు నీరందించే ప్రథమ సాగునీటి పథకం కే సి కాలువే నని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.పంటపొలాలకు నీరందించడమే గాకా తోవ వెంట లక్షలాది ప్రజల,పశువుల గొంతు తడిపేది ఈ కాలువే.

కాలక్రమాన పాలకులనిర్లక్ష్యం వల్ల ఈ కాలువ నిర్వహణ అధ్వాన్నంగా మారింది.దానికి తోడు ఈ కాలువకు నీరందించే తుంగభద్రరిజర్వాయర్ లో పూడిక చేరడం తో కాలువకు విడుదల చేయాల్సిన 10tmc లలో నీటివాట తగ్గుతూ వస్తూంది. అదీగాక,నదీ ప్రవాహం ద్వారా కాలువ తీసుకోవాల్సిన 29.9 tmc ల నీటిని నిల్వ చేసుకునేందుకు తగినన్ని రిజర్వాయర్లూ లేక పోవడంతో ఆయకట్టుదారుల పరిస్థితి మరింత దిగజారింది. దాంతో సాగునీటి శాఖ అధికారూ రైతులకుఏ పంట వేసుకోవాలో,ఎన్ని నీళ్ళను ఎంతకాలం విడుదల చేస్తారో చెప్పలేని స్థితి.ఫలితంగా వ్యవసాయం జూదంగా మారింది,నదీ ప్రవాహ నీటిని వినియోగించుకోక పోవడంతో తుంగభద్ర జలాలు కృష్ణలో కలుస్తున్నాయి. సం.నికి కృష్ణకు కేటాయించిన 21.5 tmc ల మించి వందల tmc ల తుంగభద్ర జలాలు కృష్ణలో కలుస్తున్నాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.ఆ విధంగా కళ్ళ ముందు తుంగభద్ర నది పారుతున్నా,వృధా అవుతున్నా నిలవచేసుకోలేక కన్నీటి పాలవుతున్నారు సీమ వాసులు.ఈ సమస్యకు ఏకైక పరిష్కారమే గుండ్రేవుల రిజర్వాయర్.

కర్నూల్ జిల్లా సి.బెళగల్ మండలం లోని గుండ్రేవుల గ్రామం వద్ద తుంగభద్ర నదిపై 20 tmc ల సామర్థ్యం తో ఒక రిజర్వాయర్ నిర్మించాలన్న ప్రతిపాదన నేటిది కాదు.4 ఏళ్ళ క్రితమే దానికి సంభందించిన సర్వేలు పూర్తయ్యి,వివరనైన ప్రాజెక్ట్ నివేదికప్రభుత్వానికి సమర్పించినాకూడా.కోస్తా సంపన్నవర్గాల బానిసగా పనిచేస్తున్న ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తుంగలో తొక్కింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ,అమరావతి,పట్టిసీమ లాంటి కోస్తా ప్రాజెక్టుల పై చూపిన,చూపుతున్న శ్రద్దలో కనీసం 1% కూడా, నీటికి అలమటిస్తున్న రాయలసీమ నీటిపథకాలపై పెట్టలేదు. దీంతో ఆగ్రహించిన సీమ ప్రజలు తమ కనీస నీటి అవసరాలకై రాయలసీమ సాగునీటి సాధన సమితి ,రాయలసీమ విద్యావంతుల వేదిక,అనంతపురం సాగునీటి సాధనా సమితి,రాయలసీమ విద్యార్థివేదిక,మరియు RYPS,BDSF లాంటిఇతర విద్యార్థిసంఘాలు .మరియు యితర ప్రజాసంఘాలతో ఉద్యమాలు మొదలెట్టారు.. నాలుగు జిల్లాల ప్రజలు రాజకీయ పార్టీలకతీతంగా ఈ ఉద్యమాల్లో పాల్గొనడం ఒక విశిష్టత.

గుండ్రేవుల రిజర్వాయర్ వల్ల తుంగభద్ర నదిపై 20 tmc ల నీటిని నిల్వవుంచుకొని,వాటిలో 10 tmc ల నీటిని కే సి కాలువ ఆయకట్టు స్థిరీకరణకు,మిగతా 10 tmc ల నీటిని సీమలాగే కరువుపీడిత ప్రాంతమైన మహబూబ్ నగర్ జిల్లా లోని ఆర్డిఎస్ ఆయకట్టు స్థిరీకరణకు వినియోగించవచ్చు.దీనివల్ల కే సి కాలువ ఆయకట్టు దారులకు,మరియు ఆర్ డి ఎస్ ఆయకట్టు దారులకు సకాలం లో సాగునీరు అందివ్వడమే గాక కర్నూల్ నగర ,చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తాగునీరి సౌకర్యం కల్గుతూంది.తద్వారా కే సి కాలువ మరియు ఆర్డిఎస్ లకు కేటాయించిన నీరు వృధా కాకుండా వినియోగించుకొనే అవకాశం కల్గుతూంది.అయితే కోస్తా సంపన్నవర్గాల అడుగులకు మడుగులు ఒత్తుతున్న ప్రభుత్వానికి సీమ సంపన్నం కావడం యిష్టం లేదు.రాయలసీమ ప్రతినిదులేవ్వరూ ఈ అన్యాయాలను ప్రశ్నించడం లేదంటే వారు కోస్తా సంపన్న వర్గాలకు యెంత బానిసలయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఈ విద్రోహాలను ఎండగడుతూ ,న్యాయమైన నీటివాటాకోసం, గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం కోసం జనవరి 28,29 లలో రైతులూ, విద్యార్థులు,బుద్దిజీవులూ సంఘటితంగా చేపట్టినదే 45 కి.మీ.ప్రజాయాత్ర
కర్నూల్ నగరం లోని కలెక్టరేట్ నుండి ఉదయం 10 గం. ల కు ప్రారంభమైన ఈ యాత్రకు వేలాదిమంది ప్రజలు విద్యార్థులూ హాజరయ్యారు.పాదయాత్ర పొడవునా ఎన్నో గ్రామాలూ,ఎల్.పేట,ఉల్చాల,రేమట,కొత్తకోట,సింగవరం,ముడుమాల రంగాపురం ల మీదుగా గుండ్రేవుల చేరిన పాదయాత్రకు .ఎందరో రైతులూ,రైతు కూలీలు స్వాగతంచేబుతూ ,వారి ఆశలు,భయాలు వెలిబుచ్చారు.రెండు రోజులా ఈ పాదయాత్రలో దాదాపు 500 మంది పాల్గొనగా, తమ స్వప్నాన్ని సాకారం చేసుకొని , రైతులు తాము జీవిస్తూ పదిమంది ఉపాధి కల్పించాలన్నదే అందరిలో వున్న ఒకే తపన. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే భూగర్భజలాలు పెరుగుతాయి పంటలు పుష్కలంగా పండుతాయి,వలసలు ఆగుతాయి. ఇవీ ఈ ప్రాంత ప్రజల ఆశ. కొందరిలో తమ పోలాలు పోతాయని,సరైనా నష్ట పరిహారం రాదేమోననే,తాము బతుకుతెరువు కోల్పోతామనే సహజమైనా భయమూ .వీటన్నికీ భరోసా యిస్తూ రాయలసీమ సాగునీటి సాధనా సమితి నాయకత్వం ప్రజల్ని,ముఖ్యంగా గుండ్రేవుల చుట్టుపక్కల గ్రామాల ప్రజా విశ్వాసాన్ని పొంధకలిగింది. ఈ పాదయాత్రకు యిక్కడి సిపీఐ,సిపిఎం పార్టీలు సంఘీబావం తెలపగా,ఆర్డిఎస్ కాలువ రైతాంగ ఉద్యమ భాధ్యుడు సీతారామిరెడ్డి గారినాయకత్వం లో సీమ రైతులతో కలిసి తెలంగాణా రైతులూపాదయాత్ర చేయడం ఒక విశేషం,.రైతాంగం ఏ ప్రాంతం వారైన ఒక్కటే అని రుజువు చేసారు.

గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం కొరకు ముందుముందు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాల్సిన అవసరం వుంది,భూసేఖరణ విషయం లో అన్యాయం జరుగుతుందేమోననే రైతాంగపు భయాందోళనల తొలగించి,వారికి తగినంత ,న్యాయమైన లబ్దిచేకూర్చే నష్టపరిహారం వచ్చేలా చూడాల్సిన భాద్యత ఉద్యమ కారులపై వుంది. లేక పొతే కొందరి అసంతృప్తిని రెచ్చగొట్టి,ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మాణంను చేపట్టకుండా వుండే ప్రమాదమూ వుంది.సీమ ప్రాంతం లో ఎలాంటి సాగునీటి పథకాలు నిర్మించకుండా అడ్డుకునే సైందవులను ఓడించాల్సిన భాద్యత వుద్యమనాయకత్వం పై వుందని చెప్పక తప్పదు.

No. of visitors : 391
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2019
  అరుణతార జనవరి - 2019
  కిటికీ పిట్ట వెలుతురు పాట‌
  చిన్ని కథ
  నెల్లిమర్ల కార్మికోద్యమ ఉజ్వల సన్నివేశాల్నిగుర్తుచేసుకుందాం
  ముస్లిం జీవితాల వాస్తవిక కథలు
  రాయలసీమ ప్రజల ఆకాంక్షలు
  అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం
  దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం
  యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి
  మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు
  నీలి కురుంజిల్ని... లాల్ కురింజిలుగా విరబూయిద్దాం!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •