నిన్నటి దాకా ఊరు ఉంది వాడ ఉంది
వాడ అంటే వెలివాడనే
అంటరాని వాళ్లు ఉండేవాడ
అంటరాని తనం పాటించే బ్రాహ్మణ్యం ఉండేది
ఇప్పుడది ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా
అమరావతికి సైబరాబాద్కూ ఢిల్లీకి ఎగబాగి
పార్లమెంటును న్యాయస్థానాలను ఉన్నత విద్యాలయాలను
ఆవరించింది
ఇప్పుడు దానికి ప్రపంచ బ్యాంకు అప్పు గొడుగు పట్టింది
వాడలో మాల మాదిగలకు
కోలాటాలు బాగోతులు చిర్రన చిటకేసే డప్పులూ
తెల్లవార్లూ దుఃఖాలను గాయాలను మరిపించే
పాటలు ఆటలుండే స్థలాలుండేవి
కీలవేణ్మణిలే గుడిసెలను మనుషుల్ని కాల్చేస్తే
ఆ వెలివాడలైనా మిగిలేవి
యూనివర్శిటీల్లో వెలివేతలున్నప్పుడు
వెలివాడలుంటాయిగదా
బ్రాహ్మణ ప్రొఫెసర్లకు వాళ్లుగా తవ్వించుకున్న
మంచినీళ్ల బావులున్నట్లుగా
వీసీ లాడ్జిలు రాజభవన్లు ఉన్నట్లుగా
వాళ్లకూ రోహిత్ వేముల వేదికలుంటాయి గదా
ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్‌ను మరుగుజ్జుగా మరిపించే
సంఘ్ పరివార్ ముద్దుబిడ్డ అప్పారావు
రోహిత్ వేముల వేదికను కూల్చేస్తాడట
వెలివాడను ధ్వంసం చేస్తాడట
అంటరాని ప్రతిభాశాలురను ఆత్మహత్యలు చేసి
అంటుకున్న మంటల వేదికను ఆర్పేస్తాడట
కదలండి ఎదిరించండి
Type in English and Press Space to Convert in Telugu |
సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ జిల్లా రిజర్వ్ గార్డ్లు చేసిన లైంగిక అత్యాచారం, హ........ |
నిజమైన వీరులు నేల నుంచి వస్తారు1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్ జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది....... |
చరిత్ర - చర్చభగత్సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్ బాంబ్ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ... |
ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణంఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్ను స్మరించుకున్న దేశద్రోహి,... |
దండకారణ్య ఆదివాసీల స్వప్నాన్ని కాపాడుకుందాం : వరవరరావు18 జూలై 2016, అమరుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ సభ సందర్భంగా వరవరరావు ఉపన్యాసం...... |
రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?అరుంధతీ రాయ్ మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల...... |
రచయితలేం చేయగలరు?1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్ 370 మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ....... |
వాగ్ధాటి కాశీపతి1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండపల్లి....
... |
Save the life of the Indian writer and activist Varavara Rao!His condition reveals the absolute neglect of his health by the prison authorities. We join our voices with academics from all over the world, intellectuals... |
రాజకీయ ఖైదీలు - చావు బతుకుల్లో కె. మురళీధరన్ (అజిత్)అజిత్‌గా విప్లవ శిబిరంలో ప్రసిద్ధుడైన కె. మురళీధరన్ 61వ ఏట అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 2015, మే 9న మహారాష్ట్రలోని పూనెకు దగ్గరగా ఉన్న తాలేగాకువ్ ధబాడే..... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |