ప్రపంచాన్ని ప్రేమిస్తున్న మనిషి!!

| సాహిత్యం | క‌విత్వం

ప్రపంచాన్ని ప్రేమిస్తున్న మనిషి!!

- గీతాంజలి | 20.02.2018 08:53:47am

యుధ్ధ శ్వాస

అతడొక చక్రాల కుర్చీ కి
అంటుకు పోయిన
కాళ్లు లేని మనిషే...
కానీ హృదయమున్న మనిషి..!
మనుషుల్ని ప్రేమిస్తున్న మనిషి...!
అందుకే రాతి గుహలాంటి చీకటి నిండిన జైలు గది లోంచే‌‌
జాతిహననాల్లో తెగి పడుతున్న ఒక్కో దేహంతో...మాట్లాడుతుంటాడు
ఊపిరాడని దుఃఖం తో
వెక్కిళ్ళు పడుతుంటాడు
చరిత్ర పొడవునా పారిన
రక్తపుటేరుల దూరాలు కొలుస్తూ అలుపెరుగక పరిగెడుతుంటాడు
మనిషిని ప్రేమిస్తున్న వాడు మరి...!!
తన ఒంటరి రాత్రుళ్ళ... ఏకాంత సంభాషణ లను, దుఃఖాలను
ఖాళీ అయిపోయిన ఆకాశం నుంచి నిద్ర పట్ట ని
తన ప్రేయసి రాత్రుళ్ళకి చేరవేస్తుంటాడు
గత వారపు ములాఖత్ లో ఆమె చేయి తాకిన
గోడల్ని తడుముతూ..
ఆమెను పలకరిస్తూంటాడు.
బందీ కాక ముందరి ఆమె చివరి
చెమ్మగిల్లిన చూపు నో...
విడివడ లేక విడి వడిన
ఆమె వెచ్చని కౌగిలినో,
మరీ మరీ
జ్ఞాపకం చేస్కుంటాడు
బహుశ.‌.
ఆమె స్పర్శ అంటిన చలి కాలపు స్వెటర్ను ..
మరింత ప్రియంగా...హృదయానికి హత్తుకొని ఉంటాడు
ఆమె లేఖ తెచ్చిన జైలరు అర చేతి ని ముద్దు పెట్టుకొని ఉంటాడు
తనకు తా నొక గాయపడిన గజల్ అవుతాడు
జైలు...
అతని నుంచి సూర్యోదయాలను
చంద్రోదయాలను లాక్కుంది!
వాళ్ళకేం తెలుసు?
అతను సమస్త భూగోళాన్ని ప్రేమించిన మనిషని?
అయినా అతడు జైలు గోడల్నుంచే...సమస్త మానవాళి దుఃఖం గురించి.,
భూమిని అల్లుకున్న మనుషుల ఆశల గురించి ,
పోరాటాల గురించి ఆమెతో మాట్లాడుతూంటాడు
చౌరస్తాల్లోనో... ప్రెస్ క్లబ్బుల్లోనో ...
తన గురించి మాట్లాడుతున్న ప్పుడు..
చిరునవ్వుతో నే మాట్లాడమంటాడు.
అప్పుడు కూడా...
అన్నం దొరకని మనుషుల గురించి
అమరుల బందుమితృల గురించే మాట్లాడమంటాడు
ఆమె దుఃఖాన్ని తను తీసుకుని
తన చిరునవ్వుని ఆమె పెదాలకు అంటించి సాగనంపుతాడు
గోడలకు అవతల..
తన వెక్కిళ్ళను
బహుశా.. ఆపుకునే వుంటాడు
ఒంటరి జైలు గది లో..
తనతో తానే సమావేశం అవుతుంటాడు
తన జైలు అవతలి మనుషులతో కలిసి,
మనుషుల కోసం చేయాల్సిన ప్రయాణం గురించిన పథక రచన చేస్తుంటాడు
అతన్నొక్కోసారి, మృత్యు భయం కమ్ముకొంటుంది
మరు క్షణం .. అతనొక ఉత్తరం రాస్తాడు..
జైలు బయటి మనుషులు, అడవిలో ని మనుషులు, స్రీలు, పిల్లలు,
ఇంకా...
రోహింగ్యాలు బతకడం గురించి ఆరా తీస్తాడు
ఆమె మాత్రం?
ఆమె కూడా ఒక ఉత్తరం తెస్తుంది..
ఉత్తరం నిండా..‌ ఊపిరందని మనుషుల కథల్ని నింపి మరీ ఇస్తుంది
అతని శ్వాస ఉత్తరంలో కి
లోకం మీదకు కమ్ముకుంటుంది
ఊపిరందని మనుషుల తో పాటుగా అతనూ బతుకుతాడు...
అతను...
ప్రపంచాన్ని ప్రేమిస్తాడు
చివరి శ్వాస దాకా...
ఎందుకంటే
ఇప్పుడతడొక యుద్ధ శ్వాస.....!!





No. of visitors : 398
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


స్వ‌ప్న ర‌హ‌స్యం

గీతాంజ‌లి | 04.06.2017 02:29:47pm

దుఃఖం వ‌స్తే వ‌చ్చింది హృద‌యం ప‌గిలితే ప‌గిలింది నీ నుంచి విడిపోవ‌ల్సే ఉంది నువ్వు... కొద్దిమంది వీరులూ.. పోతూపోతూ...
...ఇంకా చదవండి

ర‌హ‌స్య ఒప్పందం

గీతాంజ‌లి | 03.09.2016 02:20:56am

అంతిమంగా... నిన్ను చేరాల‌నే ర‌హ‌స్య ఒప్పందం నీకూ నాకూ మ‌ధ్య‌......
...ఇంకా చదవండి

ఎప్పటిలాగే ... !

గీతాంజ‌లి | 19.10.2016 11:26:40pm

తోటలు.. చెలకలు ... చెరువులు పరిమళాలు- పచ్చదనాలు తుమ్మెద వాలే - పువ్వులు - రంగులు కమ్మని - భూ సుగంధం...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ఈవ్ టీజింగ్ సాకు తీసుకొని మొత్తం దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం అమానుషం
    మళ్ళీ ఒకసారి జాషువాను స్మరించుకుంటూ...
    దేశద్రోహ నేరం!
    అగ్ర వుగ్రవాదం!
    ఆదాయం సున్నా ఖర్చు పన్నెండు!
    ఆ పిల్లకు క్షమాపణతో...
    కవి, విమర్శకుడు, కథారచయిత చైతన్య ప్రకాశ్ కు విరసం నివాళి!
    చిన్న చేపల్ని చంపుతున్న పెద్ద పరిశ్రమ
    నేనూ అర్బన్ మావోయిస్టునే
    సుధా భరద్వాజ్ కు నా సెల్యూట్‌
    గౌతమ్‌నవలఖా సదా సూత్రబద్ధమైన అసమ్మతివాది.
    మానవ హక్కుల పరిరక్షకులపై దాడిని ఖండిస్తూ పంజాబ్‌ మేధావుల సంయుక్త ప్రకటన

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •