ఈ ʹదుర్మార్గపుʹ స్టాలిన్

| సాహిత్యం | వ్యాసాలు

ఈ ʹదుర్మార్గపుʹ స్టాలిన్

- | 05.03.2018 12:14:44am


This ʹsinisterʹ Stalin

వి. ఐ. లెనిన్ను అనుసరించాడు కాబట్టే స్టాలిన్ చాలా ఘోరమై పొరపాట్లు చేశాడు !

1920లలోనే రష్యా ప్రజలెవ్వరూ కోరనివిʹ మరియు ʹఎవరికీʹ అవసరంలేని ఫ్యాక్టరీలను, పరిశ్రమలను, గ్రంథాలయాలనూ స్టాలిన్ స్థాపించడం మొదలెట్టాడు. ప్రజలందరికీ చదవడం, రాయడం బలవంతంగా నేర్పించాడు. సంస్కృతికి, కళలకూ ప్రాధాన్యత యిచ్చాడు. వారు తమ వెనుకబాటుతనం నుండి బయటపడేందుకు ప్రాధాన్యత యిచ్చాడు. (దాంతో) 1930ల నాటికే స్టాలిన్ ʹఉక్కుపాదంʹ కింద సోవియట్ యూనియన్ ప్రపంచంలో యెక్కువగా అక్షరాస్యులున్న దేశాల్లో ఒకటైంది. ఆది సిగ్గుచేటైన విషయం. క్షమించరానిది కూడా. (ఇప్పుడు) "విద్య నభ్యసించడం సోవియట్ యూనియన్ కు సంభవించిన విపత్తు" అని "అతి మంచి జర్మన్" గోర్బచెవ్ వ్యాఖ్యానించడంలో ఆశ్చర్యమేముంది ?

మ్యూజియం, ఖగోళ పరిశోధన కేంద్రాలు, థియేటర్లు, కాలేజీలు, క్రీడారంగ స్థలాలలాంటి ప్రదేశాలకు ప్రజలు వెళ్ళేటట్టు స్టాలినిజం ʹఒత్తిడి చేసింది. దీని వల్లనే ʹస్టాలిన్ శాంతి బహుమతిʹని పొందగలిగే అనేకమంది శాస్త్రవేత్తలు తయారయ్యారు. తన వ్యక్తిపూజను ప్రోత్సహించడానికై వీరికి స్టాలిన్ తన స్వంత జేబుల్లోంచి బహుమానాలందజేశాడు.

స్టాలిన్ వల్ల మరియు ప్రజలంతా విద్యావంతులు కావాలనే ఆతని కోరికవల్లే గదా, ప్రజలంతా ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలుగా మరియు గొప్ప వృత్తి నిపుణులుగా తయారయుండేది. అలా జరిగినందుకేగదా సోవియట్ యూనియన్ ను అమెరికా ప్రభుత్వం ద్వేషిస్తూండేది. స్టాలిన్ సృష్టించిన భయోత్పాతం వల్లేగదా, అమెరికన్ మరియు జర్మన్ ఇంజనీర్లు తయారుచేసిన విమానంకన్నా అతి వేగవంతమైన మరియు ఎక్కువ సామర్థ్యంగల విమానాన్ని రష్యా ఇంజనీరు యాకోప్లేవ్ నిర్మించింది. ఇది రష్యా యొక్క భయంకర ప్రాంతీయ తత్వం కాక మరేమిటి ? స్టాలిన్ చేసిన ఆ తప్పును సరిదిద్దడానికి, అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ ను సంతృప్తిపరచడానికి, స్టాలిన్ మరణానంతరం, (రష్యన్ పాలకులకు) 40 సంవత్సరాల కాలం పట్టింది. అయినా ఈ చర్య, గత 40 సంవత్సరాల కాలంగా ఈనాటి పాలకులు తమ ప్రజల్ని సంతోషంగా, ప్రగతిపథంలో వుంచడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఒక సూచిక (కదా !) | రష్యాకు కళంకం కల్గించే స్టాలిన్ చిహ్నాలు (అతను నిర్మించిన) పయొనీర్ కాంప్స్ బాలల సాంస్కృతిక భవనాలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, నాటకశాలలు మరియు యితర సాంస్కృతిక మరియు క్రీడావసతులు యివన్నీ ఈనాటికీ పదిలంగా వున్నాయి. ఇప్పటికే వాటిని ప్రైవేటీకరణ చేయడమో, లేక నాశనం చేయడమో జరిగుండాల్సి వుంది. (ఇలాంటివి) యింకా ప్రాముఖ్యం కల్గిన పనులు ప్రభుత్వం చేయవలసినవి చాలా మిగిలివున్నాయి.

ఇప్పటికీ, స్టాలినిష్టులు స్టాలిన్ ప్రజల సంక్షేమం కొరకు పాటుపడ్డారని చెబుతూనే వున్నారు. ఇది నూటికి నూరుపాళ్ళు అబద్ధం. వారు చెప్పినదే నిజమైతే, యుద్ధానంతరం రెండేళ్ళకే స్టాలిన్ రేషన్ కార్డులను రద్దు చేసేవాడు కాదు .... ప్రతి సంవత్సరం వస్తువుల ధరలు తగ్గేవి కావు. స్టాలిన్ చేసిన ఆ తప్పిదాన్ని సరిదిద్దేందుకే, యిప్పుడు ధరలకు ఆకాసాన్నందుకునే స్వేచ్ఛ లభించింది.

కొద్దికాలం క్రితం వరకు గోర్బచెవ్ కూడా స్టాలినిస్టే. అతడు సోవియట్ యూనియన్ కమ్యూనిష్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయినపుడు : ʹస్టాలినిజం - దీన్ని సోషలిజపు శత్రువులు తప్పుగా ప్రచారం చేశారు. సోవియట్ యూనియన్ మరియు మొత్తం సోషలిజాన్నే అపఖ్యాతిపాలు చేసేందుకు వినియోగించారు" అని గోర్బచెవ్ అన్నారు. అయితే అప్పుడు గోర్బచెవ్ వయసు కేవలం 55 సంవత్సరాలే కావడంతో ఆ వ్యాఖ్యను గోర్బచెవ్ పొరపాటుగా చేసాడని చెప్పవచ్చు. చిన్న వయసుగదా ఆయనిది ! అయితే గోర్బచెవ్ అమెరికాలో ఒక వారం రోజులు గడిపాక, బుష్ తో తాను (గోర్బచెవ్) హృదయమిప్పి మాట్లాడుకున్నాకʹ, గోర్బచెవ్ కు జ్ఞానోదయమయింది. అతడు బుద్ధిమంతుడు, నూతన వ్యక్తిగా మారాడు. ఏలిత్సిన్తో కలసి సోవియట్ యూనియన్ ను ముక్కలు ముక్కలు చేశాడు.

బోరిస్ ఎలిత్సిన్ కూడా అంతే. తన యవ్వనంలో తప్పులు చేస్తూ వుండేవాడు. అప్పుడు అతడూ స్టాలినిస్టే ఎలిత్సిన్ మాస్కో కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి అయినపుడు ʹమన విప్లవం పెట్టుబడిదారీ వ్యవస్థను కమ్యూనిష్టు వ్యవస్థగా మార్చే ఒక తిరుగులేని క్రమంʹ అన్నాడు. దురదృష్టవశాత్తు అప్పుడు ఎలిత్సిన్ వయసు కేవలం 56 సం||రాలు మాత్రమే. కానీ, అతడు అమెరికాకు వెళ్ళి, న్యూయార్క్లోని "స్టాట్యూ ఆఫ్ లిబర్టీ" చుట్టూ హెలికాప్టర్ పై రెండుమార్లు ప్రదక్షిణం చేశాడు. దాంతో రెండుమార్లు స్వేచ్ఛ పొందాడు (జ్ఞానోదయమైంది). ఇక బుష్ తో చర్చల అనంతరం ఎలిత్సిన్ తన భావాలను యెంత మార్చుకున్నాడంటే (సోవియట్ యూనియన్ ను) పెట్టుబడిదారీ వ్యవస్థగా మార్చాడు.

స్టాలిన్ యొక్క నియంతృత్వం సంపూర్తిగా బయటపడింది పంచవర్ష ప్రణాళికల కాలంలోనే. స్టాలిన్ ప్రజల్ని, స్టాకనోవైట్ పద్దతిʹ లో పనిచేసేటట్టు చేసాడు. అసలు ఎవరీ స్టాకనోవ్ ? సాధారణ ఉత్పత్తికన్నా 14 రెట్లు ఉత్పత్తిని అధికం చేసే పద్దతిని స్టాకనోవోకు తెల్పింది స్టాలినే. ప్రజలంతా భయానక వాతావరణంలో పనిచేసారు. కేవలం 11 నెలలలోనే స్టాలిన్ ట్రాక్టర్ వర్క్ ను నిర్మించారు. ఇప్పుడు అలాంటి నిర్మాణం జరగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. మేరియా డెమెన్ లాంటి బలహీనమైన మహిళలు కూడా ఒక హెక్టార్ కు 500 సెట్నర్స్ బీటు ఉత్పత్తి చేస్తారు. దీనికి కారణం స్టాలిన్ బెదిరింపులే. ఇక సోవియట్ అంతరిక్షయాత్రికులు చౌలోవ్, బేడుకోవ్ మరియు బెలియకోవ్ లు స్టాలిన్ నియంతృత్వం వల్ల యెంత భీతి చెందారంటే మొదటిసారిగా ఉత్తరధృవం నుండి అమెరికాకు, అమెరికా నుండి తిరిగి ʹజాతుల బందీఖానాʹ కు అంతరిక్ష యాత్ర చేసారు.

(స్టాలిన్ కాలంలోనే) సంఘ వ్యతిరేకశక్తులు, నేరస్తులు మరియు వారి ఏజెంట్లు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ఒడిగట్టకుండా, వారి చేతుల్నీ ʹఅతి క్రూర చట్టాలుʹ కట్టివేసి, అలాంటి వారికి స్వేచ్ఛ లేకుండా అణచివేస్తాయి. అక్కడక్కడ కొందరు వ్యక్తులు స్వేచ్చగా వుండగల్గినా యుద్దకాలంలో అంతర్గత విద్రోహాలు లేవు. అయితే యిపుడు బ్యాంకర్లకు, మోసగాళ్ళకు, బ్రోకర్లకు, అవినీతికి మరియు మాఫియాకు మన సమాజంలో సంపూర్ణ స్వేచ్చ పుంది (గతంలో) మనకు సమావేశాలుగాని, సమ్మెలుగానీ లేవని మీరు ఊహించగలరా ! దానికి కారణం స్టాలినిజం యొక్క భయమే.

స్టాలిన్ పాలనలో అజర్ బైజాన్ కు చెందినవారు ఆర్మేనియన్లకు అతిథులుగా వెళ్ళేవారు. అజర్ బైజాన్ కు చెందిన స్త్రీలను ఆర్మేనియన్లు వివాహమాడేవారు. జార్జియన్లు మరియు ఆసటేనియన్లు కలసిమెలసి పనిచేసేవారు. ఎందువల్ల ? వారికి స్టాలిన్ అంటే భయం కాబట్టి.

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో పావ్లోవ్ భవనాన్ని (THE HOUSE OF PAVLQV) కేవలం 12 మంది ఎర్ర సైనికులు, వారు 8 విభిన్నజాతులకు చెందినవారు, మాత్రమే రక్షణ కల్పించారు. అయినా వాళ్ళంతకన్నా వేరే యేం చేయగలరు ? వారికి కళ్ళముందు స్టాలిన్ కన్పడుతూ వుంటే. .

పై వాటన్నిటికన్నా ఘోర కృత్యమేమంటే 1941 అక్టోబర్ చివరన మాస్కో నగరాన్ని జర్మన్లకు అప్పగించడానికి స్టాలిన్ అనుమతించకపోవడమే. (అంతేగాదు) రెడ్ స్క్వేర్లో నవంబర్ 7 సైన్యపు కవాతును నిర్వహించే సాహసం చేసాడు, అతడెవ్వరినీ సంప్రదించలేదు. ఆ పని తన వ్యక్తి పూజను పెంపొందించడానికి చేసాడనుకోండి. చాలా అన్యాయం జరిగిపోయింది. ఆ రెడ్ స్క్వేర్ కవాతు గురించి జర్మన్లకు చాలా ఆలశ్యంగా తెల్సింది. లేకపోతే వారు, దాదాపు 50 సంవత్సరాల తర్వాత చేసినట్టుగా తమ విమానాలలో ఒకదాన్ని నేరుగా అక్కడే దింపేవారు.

స్టాలిన్ భయంకరమైన కమాండర్ అని అందరికీ తెలుసు. 1943లో కుర్క్స్ యుద్ధం జరుగుతూంటే, స్టాలిన్ సైన్యాన్ని ముందుకు నడిపే బదులు, పార్లమెంట్లో పరిసర వాతావరణ సంరక్షణ కోసం ఆడవులకు సంబంధించిన చట్టాలపై చర్చలు సాగించాడు..... అదేదో సోవియట్ యూనియన్లో అడవులే లేనట్టు ! ఆ తర్వాత కృశ్చేవ్ అడవుల చుట్టూ వున్న నాచుతో (mass) సహా అడవులనన్నిటినీ కూకటి వేళ్ళతో పెకలింపజేశాడు కాబట్టి మంచిదయింది. ఆ తర్వాత గోర్బచెవ్ ద్రాక్షతోటలన్నింటినీ నరికి వేయమని అదే విధంగా ఉత్తర్వులిచ్చాడనుకోండి.

వాటన్నిటికన్నా స్టాలిన్ చేసిన ఘోరమైన నేరమేమిటంటే, సోవియట్ యూనియన్ కు మంచి మిత్రుడైన హిట్లర్ ఆత్మహత్య చేసుకొనేందుకు అనుమతినివ్వడమే. ఆ విషయమై చివరకు, యూదులు కూడా స్టాలిన్ ను క్షమించలేదు. వాళ్ళు వెంటనే ʹస్టాలినిజం మరియు సోషలిజంʹ పై పెద్ద దుమారం సృష్టించారు.

యుద్ధకాలంలో, రష్యాకు చెందిన ఇవాన్లుʹ మరఫిరంగుల కెదురుగా రొమ్మొడి పోరాడేటట్టు చేసాడు. వాళ్ళు స్టాలిన్ చేత భయ పెట్టబడటం చేతనే యిదంతా జరిగింది.

స్టాలిన్ ప్రైవేట్ పరిశ్రమలకు అనుమతినీయలేదు. ఎంత ఘోరమైన నష్టాన్ని అతను కలుగజేశాడు ! అయినా, మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు దాని స్వంత చట్టాలుంటాయి గదా ! పెట్టుబడిదారులు యెంతగా ధనికులవుతారో, దేశం కూడా అంతగా సంపన్నమవుతుంది !

మనకు దేశంలో యిప్పుడు ʹఅత్యున్నత జర్మన్ʹ వున్నారు. త్వరలోనే, అవవకాశమిస్తే ʹగొప్ప జపానీయులుʹ, ʹగొన్న అమెరికన్లు. మనదేశంలో లభ్యమవుతారు. భవిష్యత్తు మనకు ఆశాజనకంగా వుంది. మనం ʹగొప్ప విదేశీయులంʹ కాగలమనే నమ్మకాన్ని భవిష్యత్తు కలుగజేస్తున్నది. ఆ విధంగా విదేశీయమైనవి, అన్నిటికన్నా ఉత్తమమైనవి మనకు లభ్యమైతాయి.

యెప్పుడూ ప్రపంచ బ్యాంక్ నుండి లేక పశ్చిమ దేశాల నుండి అప్పు తీసుకొనేందుకు స్టాలిన్ మనల్ని అనుమతించలేదనే వాస్తవం క్షమించరానిది. అంతేగాక, దాదాపు 2,500 టన్నుల బంగారాన్ని సోవియట్ యూనియన్ కు నిల్వగా దాచి వుంచాడు. అతడెప్పుడూ బంగారాన్ని డాలర్ల కోసం తెగనమ్మలేదు. అన్ని నాగరిక దేశాల మాదిరిగా, అప్పు చేయడం, వడ్డీలు చెల్లించటం, బంగారాన్ని అమ్మడం లాంటివి చేయక, స్టాలిన్ సోవియట్ ప్రజల ప్రయోజనాలకై ఈ బంగారాన్ని నిల్వ చేసాడు. ఈ వాస్తవమొక్కటి చాలు. అతన్ని క్షమించకుండా వుండటానికి..

ఇప్పుడు మనకు బంగారపు నిల్వలను అమ్మివేయడానికి, 24 బిలియన్ డాలర్లు అప్పుచేయడానికి స్వేచ్చ వుంది. బంగారపు నిల్వలంతా పూర్తిగా కరగిపోయాయి. కానీ, మనం చేసి అప్పులపై వడ్డీ విషయంలో మనం అదృష్టవంతులం, మనం వాటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందువల్లనంటే మన రెండవ, మూడవ, బహుశా నాలుగవ తరం వాళ్ళు ఆ వడ్డీని చెల్లిస్తారు..

ఈనాటి ʹప్రజాస్వామ్యవాదుల్నిʹ ఒక పాత సామెతను గుర్తుంచుకొనేటట్టుగా మనం చేయాలి. ʹఒక అజ్ఞాన్ని నన్ను పరిపాలిస్తుంటే, అతనికన్నా నేను రెండురెట్లు అజ్ఞానిని". కాని ఒక అజ్ఞానీ నన్ను పాలిస్తున్నపుడు, అతన్ని నేను ఆకాశమెత్తున పొగడుతూ వున్నానంటే నేను పరమ మూర్ఖున్ని" అనే సామెతను నేటి ʹప్రజాస్వామ్యవాదులకుʹ తెలియజేయాలి..

(ఉత్తర - ఆసేషియన్ కు చెందిన దినపత్రికల నుండి మరియు ʹయూనిటి" మరియు ʹఆండ్రోటోవసాయాప్రాజ్జాʹ లాంటి పత్రికల నుండి సేకరించిన సంగ్రహ వ్యాసం "ఫ్రాంటియర్" సెప్టెంబర్ 16, 1995 సౌజన్యంతో)

అనువాదం : ʹఅరుణ్ʹ

No. of visitors : 660
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


SOME ASPECTS OF PROLETARIAN INTERNATIONALISM OF STALINIST SOVIET UNION

K. RAMKOTESH | 05.03.2018 07:24:00pm

In the course of the conversation Stalin informed Mao that USSR was ready to render assistance in the industrialisation of the economy and the training ......
...ఇంకా చదవండి

స్టాలినో నీ ఎర్రసైన్యం...

పి.వరలక్ష్మి | 04.03.2018 10:53:05pm

ప్రపంచ శ్రామికవర్గ ఉద్యమ నాయకుడు స్టాలిన్. స్టాలిన్ ఎర్ర సైన్యం ఎంతగా సామ్రాజ్యవాదులకు భీతి గోలిపిస్తుందో ప్రపంచ పీడిత ప్రజలకు అంత విశ్వాసాన్నిస్తుంది......
...ఇంకా చదవండి

స్టాలిన్ కవితలు

రమేష్ చంద్ర | 05.03.2018 06:54:07pm

విద్యార్థిగా ఉన్నపుడే రష్యన్ సాహిత్యానంతా స్టాలిన్ ఔపోశన పట్టేశాడు. గొగోల్ ఏమిటి, చేహవ్ ఏమిటి, విక్టర్ యగో థాకరే- యిలా దేశ దేశాంతర మహారచయతల రచనలు స్టాలిన్.....
...ఇంకా చదవండి

జీవించు జీవించు హే సూర్య బింబమా...

తోలేటి జగన్మోహనరావు, స్టాలిన్ సొసైటి, ఇండియా | 04.03.2018 11:32:57pm

దశాబ్దాలుగా సాగుతున్న స్టాలిన్ వ్యతిరేక ప్రచార వర్గ స్వభావాన్ని కార్మికవర్గం అర్థం చేసుకుని, ʹస్టాలిన్ మా నాయకుడుʹ అని సగర్వంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది......
...ఇంకా చదవండి

ఒక జాతిలో వర్గాలుంటాయి గాని, వర్గభాషలుండవు

వి. చెంచయ్య | 05.03.2018 12:05:27am

స్టాలిన్‌ భాషను పునాదితోనూ, కట్టడం (ఉపరితలం)తోనూ గాకుండా ఉత్పత్తి సాధనాలతో పోల్చాడు. భాషలాగానే ఉత్పత్తి సాధనాలు (యంత్రాలు వగైరా) కూడా వర్గ విచక్షణ లేకుండా.....
...ఇంకా చదవండి

స్టాలిన్‌ వ్యతిరేకత?

పాణి | 06.03.2018 11:57:50am

ఒక వ్యక్తి గురించి ఇన్ని అబద్ధాలు, ఇన్ని వక్రీకరణలు.. ఇన్ని వేల రెట్ల మోతాదులో మరెవరి విషయంలో జరిగి ఉండకపోవచ్చు. అందువల్ల స్టాలిన్‌ మార్గంపట్ల రాజకీయ ఏ......
...ఇంకా చదవండి

ట్రాట్స్కీ అసత్యాలు - ఆ అసత్యాల అంతరార్థాలు

గ్రోవర్ ఫర్ | 06.03.2018 10:23:19am

1930లలో ట్రాట్స్కీస్టాలిన్ పై చేసిన నిందారోపణలనేతదనంతర కాలంలో కృశ్చేవ్ చేశాడు. కృశ్చేవ్ అసత్యాలు తప్ప మరేమీ చెప్పలేదనే విషయం, ట్రాట్స్కీ కూడా అబద్ధాలే......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ దేశాలమధ్య యుద్ధాల అనివార్యత

స్టాలిన్ | 05.03.2018 12:09:45pm

శాంతి ఉద్యమం ఎన్ని విజయాలు సాధించినప్పటికీ సామ్రాజ్యవాదం జీవించే ఉంటుంది. అందువలన యుద్దాల అనివార్యతకూడా వాస్తవంగానే ఉంటుంది.యుద్దాల అనివార్యతను తొలగించా......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •