దొరలరాజ్యంలో దొంగైన మధూ చిందాకికి..
నాయనా.. చచ్చిపొయ్యావా? నీ వుసురు తీసేసారా? నీ వూపిరి ఆపేసారా? నీ జీవాలు ఆర్పేసారా? నీ బుర్రచిక్కేసారా? నెత్తుటి ముద్దని చేసేసారా? నిన్ను చంపేసారా?
నువ్వు అడవిల వున్నప్పుడు యెరుక లేకపోయినా నడిచింది! ఊర్లోకి అడుగుపెట్టినప్పుడు వొంటి మీద సెతన వుండాలికదా నాయనా?నువ్వొక మనిషివి! మనుషుల్లోనేవున్నావని అనుకున్నావు! అదే నీ పీకమీదికి తెచ్చింది! నీ ప్రాణం తీసింది!
అయ్యా ఆదివాసీ.. నీకు గాలంటే అందరిదీ అని తెలుసు! నీడంటే అందరిదీ అని తెలుసు! నీళ్ళంటే అందరివీ అని తెలుసు! పట్టు తేనె పంచుకు తాగడం తెలుసు! ఇప్పపూలు ఏరుకున్నన్నితినొచ్చునని తెలుసు! చింతాకు దూసుకున్నంత వొడిల కట్టుకోవచ్చునని తెలుసు! వాగుల చేపపిల్లలు కావలసినన్ని పట్టుకోవచ్చునని తెలుసు! వనరులన్నీ వొడిగట్టుకోవచ్చనని తెలుసు! అన్నీ అందరివీ అని తెలుసు! నీ కంతే తెలుసు!
ఆకలెంత సహజమో ఆహారమూ అంతే సహజమని మాత్రమే నీకు తెలుసు! నీకు తెలిసిందదే! నువ్వక్కడే ఆగిపోయావ్! అనేక వ్యవస్థలు దాటొచ్చిన ఆధునికం నీకంట లేదు! ఆ అభివృద్ధి నీదాక రాలేదు! నీ మెదడుకి అస్సలు తాకలేదు! నువ్వు అడవి మనిషివి! నాగరికత తెలియని మనిషివి!
నీకు ఆకలేస్తే మాత్రం చీమచింత బొట్ట చేతికి అందినట్టు అందుకొని తింటావా? తప్పుకదూ? నేరం కదూ? ఘోరం కదూ?అయినా తినే ఆహారం మీద తినేవాడి పేరు రాసి వుంటుందని నీకు తెలీదా? ఈ కర్మభూమిలో నీకెవరూ చెప్పలేదా? గింజయినా గంజయినా దాని మీద యెవరి పేరుంటే వాళ్ళే తినాలని తాగాలని మీ అమ్మ నీకు వుగ్గుపాలతో నేర్పించలేదా? లేదా నువ్వు వెతికితే ఏ ఆహార పదార్ధంమీదా నీ పేరు కనిపించలేదా? నీకు చదువు రాదా? చదువుకోలేదా? నీ నుదిటిమీది రాతని అద్దంలో నీకు నువ్వు చూసుకోలేదా?
నువ్వు పుట్టక ముందే.. నీ ఆకలి పుట్టక ముందే.. నీ ఆకలి తీర్చే అన్నం మెతుకు పుట్టక ముందే.. ఆ గంజో గింజో పుట్టక ముందే.. తరాల తరబడి పదార్ధం మీద నీ పేరే నమోదు కానప్పుడు నువ్వు ఆకలితో చచ్చిపోవాలి! నీ చెల్లి సంతోషికుమారి జార్ఖండులో ఆకలికి అల్లల్లాడి అలానే చచ్చిపోయింది! కాదని నీలా ఆకలి తీర్చుకొనే ప్రయత్నం చేస్తే కూడా పదుగురి చేతిలో యిదిగో యిలా చచ్చిపోవాలి! అది అగలీ కావచ్చు! ఆగ్రా కావచ్చు! ఎక్కడైనా వొక్కటే!
ఆకలి అందరికీ వుండొచ్చు! తినే అర్హత మాత్రం అందరికీ వుండదు! లేదని తిన్నావో నువ్వు దొంగవి! చిరుగుల బట్టా మాసినజుట్టూ అందుకు సాక్ష్యం! అయినా దేశానికి కన్నమేస్తే దయతలుస్తారు గాని యింటికి కన్నమేస్తే పేగులు చీరేసి మెళ్ళో వేసుకోరూ?! అంతటి వీర దేశభక్త ఘనాపాటీలు మనవాళ్ళు! మేరా భారత్ మహాన్!
నిజమే.. నువ్వు మానసిక వికలాంగుడివి! నిన్ను చావ చితక్కొట్టి నీతో సెల్ఫీలు దిగినవాళ్ళు సకలాంగులు! పోతున్న నీ కొన ప్రాణం ముందు చిరునవ్వులు నవ్వగలిగి ఫోజులిచ్చిన వాళ్ళు వాళ్ళూ మనుషులే! దోపిడీని సహించి దొంగతనాన్ని భరించలేని భావి భారత పౌరులే!
కేరళ కేవలం ముడ్డి మీంచి జారిపోయిన వొక బట్ట! మధూ.. మంది చంపినవాళ్ళలో నువ్వు మొదటి వాడివీ కాదు, చివరి వాడివీ కాదు! పెడరెక్కలు విరిచికట్టి పిడిగుద్దులు పొట్టలో దింపినా నీతో తిన్నది కక్కించలేక పోయారు! నువ్వు కక్కుకున్న రక్తపు ముద్దల్లో నీ దేహశుద్ధిలో దేశశుద్ధి జరిగిందని నమ్ముతారు వాళ్ళు! ఇక్కడ నీ దగ్గర అయ్యో అన్నవాళ్ళే మరో దగ్గర నీ అయ్యా అని పిడికిలి కత్తులు బిగించి కంఠాలు కోస్తారు!
ఇది శ్రేయో రాజ్యం! యధారాజా తధాప్రజా! రాజ్యం అహింసని కీర్తిస్తూ హింసాత్మకంగా పాలిస్తున్నప్పుడు ప్రజలూ పోలీసులవుతారు! ప్రజలూ లాఠీలు అవుతారు! ప్రజలే జడ్జీలు అవుతారు! సహజమైన వాటిని అసహజంగా చూస్తారు! ఆకలిని నేరంగా యెంచుతారు! శిక్షలూ విధిస్తారు! శిరస్సులు నేల రాలుస్తారు! ధర్మాన్ని నిలబెట్టే కొత్త అవతారం అవుతారు! అవతార పురుషులవుతారు!
అట్టప్పాడిలోని కడుకూమన్నలో పుట్టిన నువ్వు నాకు ఆకలయినప్పుడల్లా నా కంచంలో అన్నమై అగుపిస్తున్నావు! ముద్ద ముడితే నీ చల్లని దేహాన్ని తాకినట్టుంటుంది! మెతుకు మెతుకులో నీ ముఖమే నవ్వుతూ.. కాదు కాదు వెక్కిరిస్తూ కనిపిస్తోంది!
నీలాగే మనిషినయినందుకు మనుషుల్లో వున్నందుకు నాకీ శిక్ష తప్పదు! తప్పు కాదు!
నన్ను క్షమించు!
Type in English and Press Space to Convert in Telugu |
నీతి కథ! - రాజకీయ వ్యంగ్య కథమన గౌరవ ముఖమంత్రి పగలూ రాత్రీ నిద్రపోకుండా నిద్రపోనివ్వకుండా శ్రమిస్తున్నారు.. ప్రపంచస్థాయి రాజధానిలాగే ప్రపంచస్థాయి నీతిని సాధిస్తాం.. సాధించి తీరుతాం........ |
ʹనోట్ʹలో మట్టి!పుండొక చోట వుంటే వైద్యం వొక చోట..ʹ అన్నాడు మా బావమర్ది.
వాతలు పెట్టిన నేతల దిబ్బల మీద దీపం పెట్టాలని.. మా ఆవిడ శక్తివంచన లేకుండా శాపం పెడుతోంది. తిడుతోంద... |
దునియా అంతా ʹదొరల రాజ్యముʹ షూటింగే గదనే?!లేదు.. లేదు.. గిది సినిమా కాదు.. మేం నటించలేదు.. అని లక్ష్మణూ రాజేషూ అంటే గది కూడా స్క్రిప్టే! వాళ్ళ స్క్రిప్టు వాళ్లకుంటది! మన స్క్రిప్టు మనకుంటది! మన సిని... |
100% డిజబులిటి నీడెడ్!అన్నిదారులూ మూసేస్తే? తలుపులన్నీ మూసేస్తే? పిల్లి తిరగబడుతుంది.. మనుషులు తిరగబడరా? బడతారు! అవే మిలిటెంటు ఉద్యమాలు అవుతాయి! సాయుధ పోరాటాలు అవుతాయి! చెయ్యవలసి... |
నీ అడుగులోన అడుగు వేసి నడవనీ.. నన్ను నడవనీ!సెంట్రల్ సర్కారే నడుపుతున్న రైల్వే డిపార్టమెంట్ యేమి చేసింది? రిజర్వేషన్లు అయిపోయాయని చెపుతూ ʹతత్కాల్ʹ పేరుతో యెక్కువ రేట్లకీ- అదనపు రెట్లకీ- డబ్బుండీ ...... |
లౌకిక రామరాజ్యం వర్ధిల్లాలి!దేవుడయినా దేశమయినా మనదే పేటెంట్! భక్తీ మనదే! దేశభక్తీ మనదే! సత్యము చెప్పుటకు సంశయించ తగదు.. మన దాయాదులు యీ విషయమందు ముందంజన వున్నారు! మొన్నటికి మొన్న పాకిస్... |
ఈ పక్షం బుల్పికలు!రాజ్యాంగం ఏమయ్యింది?"
"చిరిగిపోయింది!"
"ఎలా..?"
"కోళ్ళ కాళ్ళకు కత్తులు కట్టారుగా?... |
ఫ్యాన్స్ బాబూ.. ఫ్యాన్స్!ప్రతొక్కడూ ఫ్యాన్సు మీద బురదచల్లి మాట్లాడడం ఫ్యాన్సుగా మనం సహించవొద్దు! ఫ్యాన్సుగా మనం వొక్కటిగా లేకపోతే యేకం కాకపోతే ఐక్యంగా వుండకపోతే డేమేజ్ అయిపోయి చాలా ... |
Open letter to Krishna BandyopadhyayAs a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol.. |