ఛత్తీస్ ఘడ్ ఆదివాసీ గ్రామాలపై దాడులు చేసి, హత్యలు, అత్యాచారాలు జరిపిన భద్రతా దళాలపై చర్యలు తీసుకోవాలి

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

ఛత్తీస్ ఘడ్ ఆదివాసీ గ్రామాలపై దాడులు చేసి, హత్యలు, అత్యాచారాలు జరిపిన భద్రతా దళాలపై చర్యలు తీసుకోవాలి

- విమెన్ అగైనెస్ట్ సెక్సువల్ వైలెన్స్ అండ్ స్టేట్ రిప్రెషన్ | 24.05.2016 09:55:15am

ఇటీవల ఆదివాసీ మహిళలపై రక్షణ దళాలు, పోలీసుల దాడులు, సామూహిక అత్యాచారాల వరుస కథనాల నేపథ్యంలో విమెన్ అగైనెస్ట్ సెక్సువల్ వైలెన్స్ అండ్ స్టేట్ రిప్రెషన్ (లైంగిక అత్యాచారాలు, రాజ్య నిర్బంధ వ్యతిరేక మహిళా వేదిక -wss ) బృందం, స్వతంత్య్ర మహిళా కార్యకర్తలు, విలేకరులు బీజాపూర్ లోని గ్రామాలను సందర్శించారు. పోలీసుల, భద్రతా దళాల సోదాలు, కూంబింగ్‌ ఆపరేషన్‌ లో హింసాత్మక సంఘటనల వార్తలు వచ్చిన గంగలూరు ధానా ప్రాంతంలోని కొన్ని గ్రామాలను బృందం సందర్శించింది.

ఈ గ్రామాలలో హింసాత్మక బెదిరింపులు, లూటీలు జరిగిన చరిత్ర ఉందని బృందం గుర్తించింది. గత కొన్ని సంవత్సరాలుగా లూటీలు, దోపిడీలు, అరెస్టుల వంటి ఎన్నో హింసాత్మక ఘటనల గురించి గ్రామీణులు చెప్పారు. తాజాగా జరిగిన అటువంటి రెండు ఆపరేషన్లలో ఒక యువకుడిని కాల్చి చంపి నక్సలైటని ప్రకటించారు. ఇది అబద్ధం. ఇద్దరు యువతుల గుడ్డలూడదీసి ఎత్తుకెళ్లారు. బిడ్డకు పాలిచ్చే తల్లిపై అత్యాచారం జరిపారు. ఈ సంఘటనల వివరాలు కింద ఇస్తున్నాము.

అపహరణ, లైంగిక దాడి


నవంబరు 2015 చివర్లో ఈ ప్రాంతంలో పెద్ద కూంబింగ్‌ ఆపరేషన్‌ జరిగింది. కొన్ని వందల భద్రతా సేనలు, ʹఐతావర్‌ʹ అనే గ్రామంలోకి చుట్టూ ఉన్న గుట్టల నుంచి ప్రవేశించాయి. భద్రతా దళాలు సుక్కు కుంజం ఇంటి వద్ద మకాం వేసుకొన్నాయి. వాళ్లు చేపలు, కోళ్లు, ఇంట్లో నిలువ చేసిన ఒక క్వింటాల్‌ బియ్యం బలవంతంగా తీసుకొని అక్కడే వంట చేయడం ప్రారంభించారు. మహిళలను ప్రక్కనున్న అడవిలోకి లాక్కెళ్లి, గుడ్డలూడదీసి చితకబాదారు. రెండు రోజుల పాటు అడవిలోనే ఉంచి తరువాత ʹదోవల్‌ నేంద్రʹ అనే ప్రక్క గ్రామం దగ్గర్లో వదిలివేసారు.

బూటకపు ఎన్‌కౌంటర్‌


సుక్కు కుంజంను తమకు దారి చూపాలని బలవంతంగా ఎత్తుకెళ్లారు. అతడిని కోర్చోలికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆ గ్రామానికి చెందిన కొందరితో కలిసి అతడు తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. అయితే అతన్ని కాల్చి చంపారు. అతడి శరీరాన్ని గుడ్డలో చుట్టి బీజాపూర్‌ ధానాకు తీసుకొచ్చారు. అక్కడ అతడు నక్సలైటనే అబద్ధపు ప్రకటన ఇచ్చారు. ʹఐతావార్‌ʹ గ్రామానికి చెందిన మహిళలు అతడి శవం కోసం బీజాపూర్‌ వచ్చారు. వారి వెంట సుక్కు కుంజుం మేనల్లుడు 13ఏళ్ల లక్కు కుంజం వచ్చాడు. శవాన్నివ్వమని వాళ్ళు అడిగినందుకు అతడ్ని ధానాలోనే వేసి విపరీతంగా కొట్టారు. చివరకు సుక్కు శవాన్ని ఇచ్చారు. అతడి అంత్యక్రియలు 27 నవంబర్‌ 2015న జరిగాయి.

మరోవైపు కోర్చోలిలో గుట్టలు దిగివస్తున్న గేటపార గ్రామానికి చెందిన పొట్టం మంగ్లీని కొంతమంది భద్రతా సిబ్బంది ఈడ్చుకొచ్చారు. వాళ్లామెను వదిలిపెట్టేదాక అదే గ్రామానికి చెందిన మరో మహిళ జోక్యం చేసుకుంది.

విడిగా మరో సంఘటన కూడా కోర్చోలిలో జరిగింది. పోలీసులు రోని పొట్టం ఇంట్లో జొరబడి వంట గిన్నెలను ధ్వంస చితక్కొట్టి, ఆమె స్కూలు పుస్తకాలను, పెళ్లి సందర్భంగా ధరించడానికి తెచ్చిన కొత్త బట్టలను కాల్చి పారేశారు. అప్పుడు ఆమె అక్క ముని, వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. మునిని ఉద్దేశించి నక్సలైటని తిట్టుకుంటు ఫోను పోలీసులు, భద్రతా దళాలు ఆమె ఫోటో పట్టుకెళ్లారు.

లైంగిక దాడులు, అత్యాచారం :


జనవరి 2016లో మరో కూంబింగ్‌ ఆపరేషన్‌ ఇదే ప్రాంతంలో జరిగింది. మళ్లీ అదే యువతి మంగ్లి పొట్టం, తన సోదరి, తన స్నేహితురాలతో కలిసి పశువులను మేపుతుండగా ఆమెపైన దాడి జరిగింది. ఆమె బట్టల్ని చింపివేసి చంపుతామని బెదిరించారు. వాళ్లు ఆమె స్నేహితురాలు తులసిని కూడా చంపుతామని బెదిరించారు. మంగ్లి సోదరి సోమ్లి రవికెను చింపి వేసారు. ఆమెను జుట్టు పట్టి నేలకేసి ఈడ్చి కొట్టారు. ఆమె కడుపు మీద తుపాకి మడమతో క్టొట్టారు. వాళ్ళామెను ఈడ్చుకెళ్తుంటే మంగ్లీ పొట్టెం అనే పేరుతోనే ఉన్న వృద్ధ మహిళ అడ్డం వచ్చి ఆమెపై అఘాయిత్యం జరగకుండా అడ్డుకుంది.
అదే ఆపరేషన్‌లో దళాలు కోర్చోలికి చెందిన పిల్ల తల్లి పొయ్యిల కట్టెలు తెచ్చుకొంటుంటే ఆమెపై దాడి చేసాయి. వాళ్లు ఆమెను అడివిలోకి లాక్కెళ్లి నేలమీద పడదోసారు. ఆమె పదే పదే తన పసిపిల్ల పాలకోసం ఏడుస్తుందని, తనని వదిలేయమని ప్రాధేయపడింది. అయినప్పటికీ ఒక జవాను ఆమెను ఈడ్చుకెళ్ళాడు. ఆమెను కింద పడవేసి యూనిఫాంలో ఉన్న ఇద్దరు జవానులు అత్యాచారం చేశారు.

ఈ సంఘటనలు మాత్రమే కాక కోళ్లు, డబ్బు, ఆహారపదార్థాల లూటీలు, దోపిడీలు అసంఖ్యాకంగా జరిగాయి. కొత్త గుడ్డలు చింపి కాల్చివేసారు. ఇతర సంపదను, పాత్రలను పగులగొట్టి ధ్వంసం చేసారు. నిజనిర్ధారణ బృందం భౌతికహింస, అత్యాచారాలకు గురై ప్రాణాలతో బయటపడిన వారిని కలిసి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. సంఘటనలకు సంబంధించి ʹకొర్చోలిʹ చుట్టు ప్రక్కల గ్రామాల వాళ్లు చెప్పిన విషయాలను కూడా మేం నమోదు చేశాం.

2016, మే 7వ తేదిన కోర్చోలి, దోవల్‌నేంద్ర, సోనార్‌ గ్రామాల నుండి వందకు పైగా గ్రామస్థులు తమ వాంగ్మూలాన్ని ఇవ్వడానికి బయల్దేరారు. అయితే కొందరు వెనుతిరగాల్సి రావడంతో దాదాపు 70 మంది గ్రామస్థులు జిల్లా కేంద్రమైన బీజాపూర్‌ వెళ్లారు. వారు మాజీ బి.ఎస్‌.ఎఫ్‌. డైరెక్టర్‌ జనరల్‌ రామ్మోహన్‌, గౌహతి టాటా ఇస్టిట్యూట్ సామాజిక శాస్త్రాల డైరెక్టర్‌ డాక్టర్‌ వర్జీనియా గ్జాజా, మానవ వనరుల అభివృద్ధి జాగృతికి చెందిన సునీలీ కుక్సార్‌ ల బృందం ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఒక పత్రికా సమావేశాన్ని కూడా నిర్వహించారు. దాని తర్వాత గ్రామస్థులు బీజాపూర్‌కు చెందిన కోత్సాలి థానాకు ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) నమోదు చేయించడానికి వెళ్లారు. ముగ్గురు సభ్యుల బృందం వారి వెంట థానాకు వెళ్లి, ప్రాథమిక దర్యాప్తు నివేదక (ఎఫ్‌ఐఆర్‌) నమోదు చేయగలమని అక్కడ హామీ తీసుకున్నారు. కానీ ఈ హామీకి భిన్నంగా ఒక ఫిర్యాదును మాత్రమే నితిన్‌ ఉపాధ్యాయ అనే కోత్వాల్‌ థానా బాధ్యుడు స్వయంగా రాశాడు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి మాత్రం తిరస్కరించాడు. దానిక్కారణం సంఘటనలు నవంబర్‌ 2015 నుంచి జనవరి 2016 వరకు జరిగినందున కొన్ని అనుమానాలున్నట్లు అనిపిస్తున్నాయని, అందువల్ల ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికన్నా ముందు సంఘటనలు జరిగాయని చెప్తున్న వాటిపై పరిశోధన చేయాలని ఆయన అన్నారు. అత్యాచారం, లైంగిక దాడుల వంటి గుర్తించదగిన నేరం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే ఒక పోలీస్‌ అధికారి ఎవరైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం తప్పనిసరి (మాన్‌డేటరి) అని క్రిమినల్‌ ప్రొసెజర్‌ కోడ్‌, సెక్షన్‌ 154 చెప్తుంది. అంతేకాక ఇటువంటి సందర్భంలో ఎటువంటి ప్రాథమిక దర్యాప్తు అవసరం కూడా లేదని చెప్తుంది. అట్లా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి తిరస్కరించిన ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా స్వయంగా ఐపిసి కింద నేరపూరిత శిక్షార్హుడని చెప్తుంది.

పోలీసులకు చట్టాన్ని (ʹలాʹను) విడమరిచి చెప్పినప్పికీ ఎఫ్‌ఐఆర్‌ అనేది నమోదు కాలేదు. మొత్తంమీద ఉన్నతాధికారులు తనను ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయవద్దని ఆదేశించినందున తాను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టబడ్డానని ఎట్టకేలకు ఉపాధ్యాయ ఒప్పుకున్నాడు. చివరికి ఒక ఫిర్యాదు లేఖను తీసుకోవడానికి అంగీకరించాడు. కాని ఎఫ్‌ఐఆర్‌ మాత్రం నమోదు కాలేదు.

పోలీసులు, భద్రతా దళాల చేత ఈ మాదిరి లూటీలు, లైంగిక హింస కూంబింగ్‌ ఆపరేషన్‌ల పేరిట పదే పదే పునారావృతమవ్వడమే కాక దక్షిణ చత్తీస్‌ఘడ్‌లో పోలీసులు చట్టాన్ని బాహాటంగా పదే పదే ఉల్లంఘిస్తూ ప్రాథమిక దర్యాప్తు నివేదికలను సైతం నమోదు చేయడం లేదు. కోర్చోలి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పోలీసులతో బలంగా వాదిస్తూ న్యాయం కోసం నిశ్చయంతో పోరాడుతున్నారు. మే 8వ తేదిన (2016) రాయపూర్‌లో జరిగిన పత్రికా సమావేశంలో రామ్మోహన్‌ చెప్పినట్లు నిరంతర పౌరుల హక్కుల ఉల్లంఘనలను బాహాటంగా ఆలక్ష్యం చేయటం ద్వారా రాజ్యం వాటిలో భాగస్వామి అయ్యింది. శిక్షార్హమైన ఈ నిర్లక్ష్యం అంతం కావాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం. రాజ్యం తన స్వంత ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కోరుతున్నాం. వాటితో పాటు ఈ క్రింది వాటినీ డిమాండ్‌ చేస్తున్నాం.

1. పోలీసులు, భద్రతా దళాలు చేసిన దాడులు, లూటీల్లో నష్టపోయిన కోర్చోలి, ఐతావార్‌, దోవల్‌నేంద్రాల చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలకు తగినంతంగా నష్ట పరిహారం ఇవ్వాలి.
2. సుక్కు కుంజం బూటకపు ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలి.
3. కోర్చోలి వద్ద జరిగిన యువతి అత్యాచార ఘటనపై వేగవంతమైన స్వంతంత్ర దర్యాప్తు చేసి దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.
4. కోర్చోలిలో ముగ్గురు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
5. పెదగెల్లూరు దాని చుట్టుప్రక్కల గ్రామాలు, బెల్లాల, నేంద్రాలలో సహా ఇటువంటి నివేదికలు అందిన అన్నీ కేసుల్లో నేరాలకు పాల్పడిన పోలీసులు, భద్రతా బలగాలపై వెంటనే వేగవంతమైన చర్యలు తీసుకోవాలి.
6. దక్షిణ చత్తీస్‌ఘడ్‌ నుండి భద్రతా బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టాన్ని (సిఎస్‌పిఎస్‌ఎ) ఎత్తివేయాలి.

09-05-2016

No. of visitors : 1568
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఇండియ‌న్ ఆర్మీ గో బ్యాక్‌

ఆదివాసీ బ‌చావో స‌మితి, దండ‌కార‌ణ్య‌ | 21.05.2016 01:09:44pm

ఆప‌రేష‌న్ గ్రీన్ హంట్ పేరుతో భార‌త ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌జ‌ల‌పై యుద్ధాన్ని వ్య‌తిరేకిస్తూ.. రూపొందించిన డాక్యుమెంటరీ ʹభార‌త్ సేన వాప‌స్ జావోʹ...
...ఇంకా చదవండి

ప్రకృతి సంపదను కాపాడుతున్న అదివాసులకు అండగా నిలబడుదాం

| 15.05.2016 11:37:50am

ఆదివాసీల‌ను మ‌ట్టుపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేప‌ట్టిన 3వ ద‌శ గ్రీన్‌హంట్‌ని వెంట‌నే నిలిపివేయాల‌ని డిమాండ్ చేస్తూ టీడీఎఫ్‌ బ‌హిరంగ‌స‌భ‌...
...ఇంకా చదవండి

భారత ఉపగ్రహ కన్నుల్తో ప్రజలపై యుద్ధం

లలిత్‌ శుక్లా (అనువాదం: బాసిత్‌) | 01.06.2016 09:41:36am

ఈ సమాజాన్ని మెరుగుపరిచే పరిశోధన, శాస్త్ర విజ్ఞాన సామర్థ్యం గురించి ఆలోచిస్తూ మేం గ్రామాల నుంచి వచ్చాం. కాని వాస్తవం మరోలా ఉంది. ఇది ఘోరం. ఇక్కడ అణ్వస్త్రాల ...
...ఇంకా చదవండి

ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శించ‌డం నేర‌మా?

ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌జాసంఘాలు | 05.06.2016 11:00:27am

మే 24న వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో ఆప‌రేష‌న్ గ్రీన్ హంట్ 3వ ద‌శ‌కు వ్య‌తిరేకంగా తెలంగాణ ప్ర‌జాస్వామిక వేదిక నిర్వ‌హించ త‌ల‌పెట్టిన బ‌హిరంగ‌స‌భ‌కు అనుమ‌తి నిచ్చిన పో...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •