పెట్టుబడిదారీ దేశాలమధ్య యుద్ధాల అనివార్యత

| సాహిత్యం | వ్యాసాలు

పెట్టుబడిదారీ దేశాలమధ్య యుద్ధాల అనివార్యత

- స్టాలిన్ | 05.03.2018 12:09:45pm

(కామ్రేడ్ స్టాలిన్ యీ క్రింది విషయాల్ని 1952 ఫిబ్రవరిలో రాశారు. అప్పటి సోవియట్ యూనియన్ ప్రభుత్వం రాజకీయ అర్థశాస్త్రాన్ని రాయడంకొరకు కొంత మంది శాస్త్రవేత్తలను నియమించింది. వారు ఒక చిత్తుప్రతిని తయారుచేశారు. అది సోవియట్ అకాడమీలో చర్చించబడింది. ఆ చిత్తుప్రతినీ, దానిపై జరిగిన చర్చల సందర్భంలో వెల్లడయిన భిన్నాభిప్రాయాలను దృష్టిలో వుంచుకొని కామ్రేడ్ స్టాలిన్ రాజకీయ అర్థశాస్త్రానికి పరిపుష్టి చేకూర్చే లక్ష్యంతో సమగ్ర విమర్శ రాశారు. అందులో సామ్రాజ్యవాదులమధ్య వైరుధ్యం తప్పక యుద్ధాలకు దారితీస్తుందనే లెనిన్ సూక్తి సామ్రాజ్యవాదుల మధ్యగల వైరుధ్యం కంటే సామాజ్యవాదానికీ సామ్యవాదానికీ మధ్య గల వైరుధ్యమే బలమైనదిగా తయారైన యీనాడు వర్తిస్తుందా ? యుద్దాన్ని నివారించాలనే ప్రపంచ శాంతివుద్యమం ఎంతో బలంగా వున్న నాడు సామ్రాజ్యవాదం బతికి వున్నంతవరకు యుద్ధం అనివార్యమనే లెనిన్ సూక్తికి కాలం చెల్లలేదా ? వగైరా విషయాలపై రాయబడ్డభాగం ఒక అంశం. ఆ భాగాన్ని మాత్రమే యిచ్చట అనువదించి ప్రకటిస్తున్నాం.)

రెండవ ప్రపంచయుద్ధం తరువాత నూతన అంతర్జాతీయ పరిస్థితులు తలెత్తడం వలన పెట్టుబడిదారీ దేశాల మధ్య యుద్దాలు యింకెంత మాత్రమూ అనివార్యంకాదని కొందరు కామ్రేడ్స్ భావిస్తున్నారు. పెట్టుబడిదారీ దేశాల మధ్యనున్న వైరుధ్యాల కంటే సోషలిస్టు శిబిరానికి పెట్టుబడిదారీ ప్రపంచానికీ మధ్యనున్న వైరుధ్యాలే తీవ్రతరమైనవి. తక్కిన పెట్టుబడిదారీ దేశాలను తగినంత మేరకు అమెరికా తన ప్రాబల్యంలోనికి తెచ్చుకొన్నది. అందుచేత అవి తమలో తాము యుద్ధానికి దిగి పరస్పరం బలహీనపరుచుకోవడం అనేది నివారింపబడింది. అగ్రశ్రేణి కాపిటలిష్టు మేధావులు రెండు ప్రపంచయుద్దాల నుండి అవి యావత్తు పెట్టుబడిదారీ ప్రపంచానికి తెచ్చి పెట్టిన వినాశనం నుండి గుణపాఠాలు నేర్చుకున్నారు. అందుచేత పెట్టుబడిదారీ దేశాలను తమలోతాము యుద్ధానికి దింపడానికీ వారు సాహసించరు. ఈ కారణాలన్నింటివలన పెట్టుబడిదారీ దేశాల మధ్య యుద్దాలు యింకెంత మాత్రమూ అనివార్యంకాదని వారు అనుకుంటున్నారు.

ఈ కామ్రేడ్స్ పొరపాటు పడుతున్నారు. వారు పై పై విషయాలను మాత్రమే చూస్తున్నారు. బలీయమైన అసలు శక్తులను వారు గమనించడం లేదు. ఇప్పటివరకు సూక్ష్మరూపంలో పనిచేస్తున్నప్పటికీ సంఘటనల పరిణామాన్ని నిర్ణయించేది అవి మాత్రమే.

పై పై చూపులకు అంతా సజావుగానే సాగిపోతున్నట్లుగా కనిపిస్తుంది. పశ్చిమ యూరప్, జపాన్, తదితర పెట్టుబడిదారీ దేశాలపై అమెరికా కొన్ని పరిమితులను విధించింది. పశ్చిమజర్మనీ, ఫ్రాన్సు, ఇటలీ, జపాను, అమెరికా చేతుల్లోచిక్కి దాని ఆజ్ఞలకు శిరసావహిస్తున్నాయి. అయినా ఎల్లకాలం ఇలాగే సాగిపోతుందని అనుకోవడంగానీ, యీ దేశాలు అమెరికా పెత్తనాన్నీ , పీడనను ఎల్లకాలం సహిస్తాయనీగానీ, అమెరికా బంధాలను తెంపుకొని, స్వేచ్చాభివృదిపంథాను చేపట్టవనిగానీ అనుకోవడం పొరపాటు.

ఉదాహరణకు మొదట బ్రిటను, ఫ్రాన్సులను తీసుకుందాం. నిస్సంశయంగా అవి సామ్రాజ్యవాద దేశాలు. చౌకధరలకు ముడిసరుకులు, నమ్మకమైన మార్కెట్లు వాటికీ నిస్సంశయంగా ముఖ్యాతి ముఖ్యమయిన విషయాలు. ఇప్పుడేం జరుగుతున్నది ? ʹమార్షల్ ప్లాను సహాయం" ముసుగులో బ్రిటన్, ఫ్రాన్సుల ఆర్థికవ్యవస్థలలోకి అమెరికావారు చొచ్చుకొని వస్తున్నారు వాటిని అమెరికావ్యవస్థకు అనుబంధంగా తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. బ్రిటిష్, ఫ్రెంచివలసలలో అమెరికా పెట్టుబడి ముడి సరుకులను, మార్కెట్లను వశపరచుకొంటున్నది. తద్వారా బ్రిటిష్, ఫ్రెంచి కాపిటలిస్టుల అధిక లాభాలకు ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ పరిస్థితిని వారు ఎల్లకాలం సహిస్తారని ఊహించగలమా ? పెట్టుబడిదారీ బ్రిటను, తదుపరి పెట్టుబడిదారీ ఫ్రాన్సు అమెరికా విషకౌగిలినుండి విడిపడి ఒక స్వతంత్ర ప్రతిపత్తిని సాధించుకోవడానికి, అంటే అధిక లాభాలకొరకు, దానితో సంఘర్షణలోనికి దిగుతాయని అనుకోవడం వాస్తవానికి దగ్గరగా లేదా ?

ఇక ముఖ్యమైన ఓడిపోయిన దేశాలు జర్మనీ, జపానుల విషయం చూద్దాం. ఈనాడు అవి అమెరికా సామ్రాజ్యవాదపు యినుపపాదాలకింద నలిగిపోతున్నాయి. ఆ దేశాలలోని పరిశ్రమలు, వ్యవసాయం, వ్యాపారం, అంతర్గత విదేశాంగ విధానాలు, ఆ మాటకువస్తే వాటి జీవితంయావత్తూ అమెరికా ఆక్రమణ "పభుత్వʹపు కోరికలకు అనుగుణంగా మలచబడుతున్నాయి. కాని కొద్దికాలం క్రితం ఇవి యూరపు, ఆసియా లలో బ్రిటన్, అమెరికా, ఫ్రాన్సుల ఆధిపత్యాన్ని సవాలుచేసిన బ్రహ్మాండమైనసామ్రా జ్యవాద దేశాలు. ఈ దేశాలు మళ్ళీ తలఎత్తి నిలబడవనీ, అమెరికా ʹప్రభుతʹను ధ్వంసం చేయడానికి యత్నించవనీ, స్వేచ్ఛాభివృద్ధిమార్గాన్ని చేపట్టవనీ అనుకోవడం అద్భుతాలను విశ్వసించడమే అవుతుంది.

పెట్టుబడిదారీ దేశాల మధ్యనున్న వైరుధ్యాల కంటే పెట్టుబడిదారీ విధానానికీ, సోషలిజానికీ మధ్యనున్న వైరుధ్యమే బలవత్తరమైనదని అంటున్నాం. సిద్ధాంత రీత్యా బహుశ అది నిజమేకావచ్చును. అది నాడేకాదు రెండవ ప్రపంచయుద్ధానికి పూర్వం కూడా సత్యమే. పెట్టుబడిదారీ దేశాల నాయకులు ఏదో కొంత మేరకు దానిని ఆచరణలో సాధించారుకూడా. అయినప్పటికీ, రెండవ ప్రపంచయుద్ధం రష్యాతో యుద్దంగా మొదలు కాలేదు. పెట్టుబడిదారీ దేశాలమధ్య యుద్ధంగానే ప్రారంభమైంది. ఎందుచేత ? ఒకటి కాపిటలిస్టువ్యవస్థకు, సోషలిస్టు దేశమైన రష్యాతో యుద్ధం, పెట్టుబడిదారీ దేశాల మధ్య యుద్ధంకంటే ప్రమాదకరమైనది. ఎందుచేతనంటే పెట్టుబడిదారీ దేశాలమధ్య యుద్దంలో యితర దేశాలపై కొన్ని పెట్టుబడిదారీ దేశాల ఆధిక్యత సమస్య అవుతుంది. రష్యాతో యుద్ధం అంటే పెట్టుబడిదారీవ్యవస్థ యొక్క ఉనికియే సమస్య అవుతుంది. రెండు పెట్టుబడిదారులు తమ ప్రచారం నిమిత్తం సోవియట్ యూనియన్ దురాక్రమణపూరిత స్వభావాన్ని గురించి అల్లరిచేస్తున్నప్పటికీ అది దురాక్రమణిపూరితమైనదని వారే భావించడం లేదు. సోవియట్ యూనియన్ శాంతియుత విధానం వారి గమనంలోవుంది. అది తనంతటతాను పెట్టుబడిదారీ దేశాలపై దాడిచేయదని వారెరుగుదురు.

ఈనాడు కొందరు కామ్రేడ్సు జపాను, జర్మనీలపని అయిపోయిందని భావిస్తున్నట్లుగానే మొదటి ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత జర్మనీపని అయిపోయిందని అనుకోవడం జరిగింది. అమెరికా యూరపును చెప్పుచేతుల్లో వుంచుకుంటున్నదని, జర్మనీ మళ్ళీ తలయెత్తుకొని నిలబడజాలదనీ, పెట్టుబడిదారీ దేశాలమధ్య యుద్ధం ఇక జరగదనీ పత్రికల్లో గొడవగొడవగారాశారు. అయినప్పటికీ జర్మనీ తన బంధాలను తెంచుకొని, స్వేచ్ఛాభివృద్ధిమార్గాన్ని చేపట్టి, ఓటమి తర్వాత పదిహేను సంవత్సరాల కాలంలోనే ఒక బలీయమైనశక్తిగా తయారయ్యింది. ఇక్కడొక ముఖ్యమైన విషయమేమంటే జర్మనీ ఆర్థికంగా కోలుకోవడానికీ యుద్దానికి సంబంధించిన ఆర్థిక వనరులను యితోధికం చేసుకోవడానికి సహకరించింది బ్రిటన్, అమెరికాలే. బ్రిటను, అమెరికాలు జర్మనీ ఆర్ధిక పునరుజ్జీవనానికి సహాయం చేసింది యీవిధంగా కోలుకొని బలపడిన జర్మనీని సోవియట్ యూనియన్ పైకి ఉసిగొల్పడానికి, అంటే సోషలిస్టు మాతృభూమికి వ్యతిరేకంగా ఉపయోగించే ఉద్దేశ్యంతో మాత్రమే. అయితే జర్మనీ ప్రప్రధమంగా తన బలగాలను ఇంగ్లండు- ఫ్రాన్సు- అమెరికా సంఘటనపై కేంద్రీకరించింది. హిట్లరు జర్మనీ సోవియట్ యూనియన్ పై యుద్ధం ప్రకటించినపుడు యీ ఇంగ్లండు- ఫ్రాన్సు- అమెరికా సంఘటన హిట్లరు జర్మనీతో చేరడం అటుంచి, దానికి వ్యతిరేకంగా రష్యాతో ఐక్య సంఘటనలో చేరవలసి వచ్చింది.

తత్ఫలితంగా కాపిటలిస్టు ప్రపంచానికీ, సోషలిస్టు శిబిరానికీ మధ్యనున్న వైరుధ్యం కంటే మార్కెట్ల కొరకు పెట్టుబడిదారీ దేశాల పోరాటం తమ ప్రత్యర్థులను నాశనం చేయాలనే కాంక్ష బలవత్తరమైనదని ఆచరణలో తేలిపోయింది.

ఐనప్పుడు జర్మనీ, జపాను దేశాలు మళ్ళీ లేచి నిలబడవనీ అమెరికా బంధాలను బద్దలుచేసుకొని స్వతంత్ర జీవనం సాగించడానికి ప్రయత్నించవనీ గ్యారంటీఏమున్నది? అటువంటి గ్యారంటీ యేమీలేదనే అనుకుంటాను.

అందువలన పెట్టుబడిదారీ దేశాలమధ్య యుద్దాలు అనివార్యంఅనే వాదం నిలబడుతుంది.

శాంతిని పరిరక్షించడానికీ, మరో ప్రపంచయుద్ధానికి వ్యతిరేకంగానూ యీనాడు బలీయమైన శక్తులు ముందుకు వచ్చాయి కాబట్టి సామ్రాజ్యవాదం అనివార్యంగా యుద్దాలకు దారితీస్తుందనే లెనిన్ సిద్ధాంతానికి కాలం చెల్లిందని అంటున్నారు. అది వాస్తవం కాదు.

ఈనాటి శాంతి ఉద్యమం లక్ష్యం శాంతిని కాపాడడానికి, మరో ప్రపంచయుద్ధాన్ని నివారించడానికీగాను విస్తృత ప్రజానీకాన్నీ పోరాటానికి సంసిద్ధం చేయడం. అందుచేత యీ ఉద్యమం లక్ష్యం పెట్టుబడిదారీ వ్యవస్థను కూలద్రోసి సోషలిజాన్ని స్థాపించడంకాదు. శాంతిని కాపాడాలనే ప్రజాస్వామిక లక్ష్యానికి అపరిమితమవుతుంది. ఈ విషయానికి సంబంధించి యీనాటి శాంతి ఉద్యమానికి మొదటి ప్రపంచ యుద్దంనాటి ఉద్యమానికీ తేడావుంది. ఆనాడు సామ్రాజ్యవాదయుద్దాన్ని అంతర్యుద్ధంగా మార్చడం మన లక్ష్యం. అది సోషలిస్టు లక్ష్యాన్ని నెరవేర్చడానికి కృషి చేసింది.

కొన్ని పరిస్థితులలో యీ శాంతిపోరాటం అక్కడక్కడ సోషలిజం కొరకు పోరాటంగా పరిణమించవచ్చును. ఐతే అప్పుడు అది యీనాటి శాంతి ఉద్యమంగా ఉండదు. అది పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసే ఉద్యమమవుతుంది.

బహుశ జరగబోయేదేమంటే శాంతిని కాపాడే ఉద్యమంగా నేటి శాంతి ఉద్యమం జయప్రదమయినట్లయితే ఒక ప్రత్యేకమైనయుద్ధం నివారింపబడుతుంది. లేకపోతే అది తాత్కాలికంగా వాయిదాపడవచ్చును. ఏదైనా ఒక నిర్దిష్టమైన ప్రాంతంలోనో, దేశాల మధ్యనో శాంతిని కాపాడగలగవచ్చును. ఎక్కడైనా అధికారంలోని యుద్ధోన్మాద ప్రభుత్వం రాజీనామా చేసి దానిస్థానంలో తాత్కాలికంగా శాంతిని కాపాడడానికి సిద్ధపడిన ప్రభుత్వం అధికారంలోనికి రావచ్చును. ఆది జరిగితే మంచిదే. చాల మంచిదికూడా. అయినప్పటికీ పరిస్థితిలో మార్పురాదు. పెట్టుబడిదారీ దేశాలమధ్య యుద్ధాలు అనివార్యంగావచ్చే అవకాశాన్ని అది రూపుమాపజాలదు. ఎందుచేతనంటే ఓ శాంతి ఉద్యమం ఎన్ని విజయాలు సాధించినప్పటికీ సామ్రాజ్యవాదం జీవించే ఉంటుంది. అందువలన యుద్దాల అనివార్యతకూడా వాస్తవంగానే ఉంటుంది.యుద్దాల అనివార్యతను తొలగించాలంటే, సామ్రాజ్యవాదాన్ని రూపుమాపడం యెంతైనా అవసరం.

ఫిబ్రవరి 1_1952

సృజన సంచిక నుంచి

No. of visitors : 710
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


SOME ASPECTS OF PROLETARIAN INTERNATIONALISM OF STALINIST SOVIET UNION

K. RAMKOTESH | 05.03.2018 07:24:00pm

In the course of the conversation Stalin informed Mao that USSR was ready to render assistance in the industrialisation of the economy and the training ......
...ఇంకా చదవండి

స్టాలినో నీ ఎర్రసైన్యం...

పి.వరలక్ష్మి | 04.03.2018 10:53:05pm

ప్రపంచ శ్రామికవర్గ ఉద్యమ నాయకుడు స్టాలిన్. స్టాలిన్ ఎర్ర సైన్యం ఎంతగా సామ్రాజ్యవాదులకు భీతి గోలిపిస్తుందో ప్రపంచ పీడిత ప్రజలకు అంత విశ్వాసాన్నిస్తుంది......
...ఇంకా చదవండి

స్టాలిన్ కవితలు

రమేష్ చంద్ర | 05.03.2018 06:54:07pm

విద్యార్థిగా ఉన్నపుడే రష్యన్ సాహిత్యానంతా స్టాలిన్ ఔపోశన పట్టేశాడు. గొగోల్ ఏమిటి, చేహవ్ ఏమిటి, విక్టర్ యగో థాకరే- యిలా దేశ దేశాంతర మహారచయతల రచనలు స్టాలిన్.....
...ఇంకా చదవండి

జీవించు జీవించు హే సూర్య బింబమా...

తోలేటి జగన్మోహనరావు, స్టాలిన్ సొసైటి, ఇండియా | 04.03.2018 11:32:57pm

దశాబ్దాలుగా సాగుతున్న స్టాలిన్ వ్యతిరేక ప్రచార వర్గ స్వభావాన్ని కార్మికవర్గం అర్థం చేసుకుని, ʹస్టాలిన్ మా నాయకుడుʹ అని సగర్వంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది......
...ఇంకా చదవండి

ఒక జాతిలో వర్గాలుంటాయి గాని, వర్గభాషలుండవు

వి. చెంచయ్య | 05.03.2018 12:05:27am

స్టాలిన్‌ భాషను పునాదితోనూ, కట్టడం (ఉపరితలం)తోనూ గాకుండా ఉత్పత్తి సాధనాలతో పోల్చాడు. భాషలాగానే ఉత్పత్తి సాధనాలు (యంత్రాలు వగైరా) కూడా వర్గ విచక్షణ లేకుండా.....
...ఇంకా చదవండి

స్టాలిన్‌ వ్యతిరేకత?

పాణి | 06.03.2018 11:57:50am

ఒక వ్యక్తి గురించి ఇన్ని అబద్ధాలు, ఇన్ని వక్రీకరణలు.. ఇన్ని వేల రెట్ల మోతాదులో మరెవరి విషయంలో జరిగి ఉండకపోవచ్చు. అందువల్ల స్టాలిన్‌ మార్గంపట్ల రాజకీయ ఏ......
...ఇంకా చదవండి

ట్రాట్స్కీ అసత్యాలు - ఆ అసత్యాల అంతరార్థాలు

గ్రోవర్ ఫర్ | 06.03.2018 10:23:19am

1930లలో ట్రాట్స్కీస్టాలిన్ పై చేసిన నిందారోపణలనేతదనంతర కాలంలో కృశ్చేవ్ చేశాడు. కృశ్చేవ్ అసత్యాలు తప్ప మరేమీ చెప్పలేదనే విషయం, ట్రాట్స్కీ కూడా అబద్ధాలే......
...ఇంకా చదవండి

ఈ ʹదుర్మార్గపుʹ స్టాలిన్

| 05.03.2018 12:14:44am

స్టాలిన్ ప్రైవేట్ పరిశ్రమలకు అనుమతినీయలేదు. ఎంత ఘోరమైన నష్టాన్ని అతను కలుగజేశాడు ! అయినా, మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు దాని స్వంత చట్టాలుంటాయి గదా! పెట్టుబడి.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •