ఆపరేషన్ సమాధాన్లో భాగ‌మే కాంకేర్ ʹఎన్‌కౌంట‌ర్‌ʹ

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

ఆపరేషన్ సమాధాన్లో భాగ‌మే కాంకేర్ ʹఎన్‌కౌంట‌ర్‌ʹ

- జగన్ | 05.03.2018 12:26:56pm

తెలంగాణ - చత్తీస్ గడ్ బార్డర్ పూజారి కాంకేర్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని , ఏకపక్ష దాడి అని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఓ ఆడియో ప్రకటనలో స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ సహా బడే చొక్కారావు, కంకణాల రాజిరెడ్డి చనిపోయినట్టు వస్తున్న వార్తలను జగన్ ఖండించారు. పార్టీ నాయకులు ప్రజలతో మాట్లాడుతూ సేదదీరుతున్న సమయంలో ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం సహాయంతో హఠాత్తుగా దాడి చేశారని ఆయన అన్నారు. ఏకపక్షంగా కాల్పులు జరిపి 10 మంది మావోయిస్టుల ప్రాణాలను తీశారని ఆ ప్రకటనలో పేర్కన్నారు. ఈ ఎన్‌కౌంటర్లో జిల్లా కమిటీ సభ్యుడు కాజీపేట‌ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, రత్నతో పాటు సుక్మా, దంతెవాడ జిల్లాలకు చెందిన మావోయిస్టులు ఉన్నారని ఆయన తెలిపారు. కార్పొరేట్ శక్తులకు నీళ్లు, భూమి దారాదత్తం చేయడానికే కేసీఆర్ ఈ బూటకపు ఎన్‌కౌంటర్ చేయించాడని ఆయన ఆరోపించారు. చత్తిస్‌గడ్ సీఎం రమణ్‌సింగ్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు కలిసికట్టుగా ఆదివాసీలపై, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు చేసి వారిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత చనిపోయింది ఎవరనేది తెలిసినప్పటికీ పోలీసులు ప్రజల్లో అయోమయం సృష్టించడం కోసం అబద్దాలు ప్రచారం చేశారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యనాయకులు చనిపోయారని ప్రచారం చేసి ప్రజల మనో ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని.. కార్పోరేట్లకు వనరులు దోచిపెట్టడం కోసం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని ఆయన తెలిపారు.

బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతూ .. మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామని మావోయిస్టు జగన్ హెచ్చరించారు. నీళ్లు, భూములు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికే మావోయిస్టు పార్టీపై దుర్మార్గమైన దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఇకపై టీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తామని, ప్రజల సహకారంతో పోలీసుల వ్యూహాలను సమర్థవంతంగా తిప్పికొడతామని ఆయన చెప్పారు. నియంత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యమై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో మిలాఖతై ప్రజలపై ముఖ్యంగా ఆదివాసీలపై దాడులకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు.





No. of visitors : 547
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


బోల్షివిక్ విప్లవ కాంతులు

జగన్ | 05.12.2017 11:22:33pm

బోల్షివిక్ విప్లవం సోవియట్లకే అన్ని అధికారాలు ఇచ్చింది.చైనా నూతన ప్రజాస్వామిక విప్లవం కమ్యూన్లకే అన్ని అధికారాలు ఇచ్చింది.ప్రజలకే రాజ్యాధికారం ఇచ్చే జనతన.. ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
  • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...

    ఈ మానవ హననాన్ని ఆపండి
    అరుణతార మే - 2018
    మైనింగ్ మాఫియా కోస‌మే బోరియా - కసనూర్ నరమేధం
    గెలుచుకోవాల్సిన ప్రపంచం దిశగా కారల్‌ మార్క్స్‌
    మార్క్స్ ప్రాసంగిక‌త ఎప్ప‌టికీ ఉంటుంది : అరుణాంక్‌
    Long live the 1st of May
    విరసం క‌థా వ‌ర్క్‌షాప్‌
    marx selected poetry
    మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం
    ఎట్టి మనుషుల మట్టి కథలు
    మొద్దుబారుతున్న సమాజం

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •