రాజకీయ వాదిగానే లోకానికి తెలిసిన వాళ్ళు ఒకప్పుడు కవిత్వం రాశారని చెబితే వోపట్టాన నమ్మం. స్టాలిన్ వొట్టి ఉక్కు మనిషి కదా, అతగాడికి కవిత్వానికీ ఏమిటీ యిలాకా అని యెదురు ప్రశ్న వేయవచ్చు కూడాను. సి.పి.స్నో రాసిన పుస్తకం ఒకటి ఉంది. ʹవైరైటీ ఆఫ్ మెన్ʹ దాని పేరు. అందులో స్టాలిన్ విషయం కూడా ఉంది. ముందు దాన్నుంచి ఉదాహరిస్తా-
తన సమకాలపు రాజనీతి వేత్తలెందరైనా గొప్పోళ్లున్నారు. లాయిడ్ జార్జి ఒకరు, చర్చిల్ ఇంకొకరు, రూజ్వెల్ట్ మరొకరు, ఇలా. సాహిత్య పాండిత్యం విషయంలో వీరెవరూ స్టాలిన్ తో పోటీ పడలేకపోయారు. విద్యార్థిగా ఉన్నపుడే రష్యన్ సాహిత్యానంతా స్టాలిన్ ఔపోశన పట్టేశాడు. గొగోల్ ఏమిటి, చేహవ్ ఏమిటి, విక్టర్ యగో థాకరే- యిలా దేశ దేశాంతర మహారచయతల రచనలు స్టాలిన్ కు కొట్టిన పిండైపోయాయి.
చదవటమే కాదు, రాయడం, అందుట్లోకి కవిత్వం రాయటం, చిన్నతనంలోనే, అంటే నవయువకుడిగానే స్టేలిన్ కు బాగా పట్టుబడిందని స్నో రాశాడు. అయితే అప్పట్లో స్టాలిన్ కు స్టాలిననే పేరు లేదు. జుగాశ్ విలీ అప్పటి పేరు. సోషలిస్టు భావాలతో బాటుగా, తన మాతృ రాష్ట్రమైన జార్జియా అభిమానం బాగా ఉండేది. గ్రేట్ రష్యా అంటే మంట. తమది అల్ప సంఖ్యాక జాతి గనుక దాని విశిష్టతనీ రాజకీయ స్వతంత్రతనీ నిలుపుకోవాలనే కోరిక జుగాష్ విలీకి బలంగా ఉండేది. జాతుల సమస్య విషయంలో లెనిన్ కు కుడిభుజంగా నిలవగలిగాడంటే, అల్పసంఖ్యాక జాతుల విషయంలో స్టాలిన్ కు ఎంత శ్రద్ద ఉండేదో చెప్పాలా?
రాబర్ట్ పేయ్న్ రచించిన పుస్తకం ʹస్టాలిన్ʹలో జుగాశ్ విలీ కవితలు మూడు, నాలుగు ఉన్నాయి. టిఫ్లిస్ నగరంలో క్రైస్తవ మత ప్రచారకుల విద్యాలయంలో జుగాశ్ విలీ చేరిన తొలి ఏడాదే (1894) కవిత్వం గురుంచి ఆసక్తి చూపెట్టేవాడని పేయ్న్ రాశాడు. కాలేజీలో వుండి చదివినంత కాలము కవితలు రాస్తూ ఉండేవాడట జుగాశ్ విలీ. నాలుగైదు అచ్చుపడ్డాయి కూడా. ఇవన్నీ గీతి కావ్యాలు(లిరిక్స్). అన్నిటా ప్రత్యేక జాతీయ భావావేశమే తీవ్రాతితీవ్రంగా కనిపిస్తుంది. అప్పట్లో జార్జియా జాతీయత మారాకు వేస్తుండేవి. ప్రిన్స్ ఇల్యా చావ్ చావాడ్జే నడుపుతుండిన ʹఐవీరియాʹ అనే పత్రికలో జుగాశ్ విలీ తొలి కవిత 1895 లో అచ్చుపడింది. అప్పటికి అతని వయసు పదిహేనేళ్ళు . ఈ కవితా శీర్షిక ʹపొద్దుటి పూటʹ (మార్నింగ్)
The rose opens her petals
And embraces the violet-
The Lily too has awakened
They bend their heads to the Zephyrs,
The lark climbs high in the sky
And sings his ringing song:
The nightingale with subtle voice
Sings softly on:
"Flourish, O adorable Country,
Rejoice, O land of Iveria,
And you also, O learned men of georgia,
May you bring Joy and happiness to the country.
(రేకులు విప్పార్చుకుని గులాబీ లేస్తుంది. వయలెట్ పువ్వుని కావిలించుకుంటుంది. నేలదామర కూడా మేలుకుంటుంది. అన్నీ మందమారుతాలకు తలలు వంచేస్తాయ్. భరతపక్షి ఆకాస విల్లా ఎక్కేస్తుంది. ఎలుగెత్తి పాడుతుంది, గింగుర్లెత్తేలా. సూక్ష్మ స్వరాన లలిత లలితంగా పాడుతుంది కోయిలమ్మ. ʹపూజనీయ దేశమా వర్ధిల్లమ్మా! ఐవీరియా భూమీ సంతసించుమీ! జార్జియా విద్వాంసులరా మీరున్నూ, దేశానికీ సుఖ సంతోషాలను సమకూరుద్దురు గాక!)
జార్జియా విద్వాంసులను సంభోదించడంలో ఈ బాలకవి ఉద్దేశం, విద్యావ్యాప్తి ద్వారా దేశానికీ విముక్తి లభించగలదన్న అభిప్రాయమేనని వివరిస్తాడు పేయ్న్.
ఆ పత్రికలోనే అదే యేడాది మరోకవిత అచ్చుపడింది. ʹచంద్రునికిʹ అని దీని శీర్షిక. ఇందులో మరింత కాల్పనిక ధోరణి కనిపిస్తుంది. 1939 లో జార్జియన్ కవితలను రష్యన్ తర్జుమాలో ముద్రించినప్పుడు ఈ కవితలో నాలుగే నాలుగు బంతులు తీసి, వేసుకుందుకు స్టాలిన్ వొప్పుకున్నాడు కూడా.
ఆ కవిత ఇదీ-
Move on, O tireless one-
Never bowing your head,
Disperse the misty clouds,
Great is the Providence of the Almighty.
Smile tenderly upon the world
Which lies Outspread beneath you:
Sung a lullaby to Mkhinvari,
Which hangs upon the sky.
Know well that those who once
Fell to the oppressors
Shall rise again and soar,
Winged with hope, above the holy
mountain.
And as in former days,
O beauty, you shone among the clouds,
So now let your rays play in splendour
In the blue sky.
I shall rip open my shirt
And bare my breast to the moon,
And with outstreched hands
Worship her who showers her light on the world,
(అలుపు సొలుపు లేనిదానా, సాగిపో, ఎన్నటికీ తల దించకుండా. మసక మంచు మబ్బుల్ని చెదరగొట్టు. సర్వేశ్వరుని చర్యలు అమోఘమైనవి. నీ దిగువన పరచుకుని వున్న ప్రపంచంమీద కోమల మందహాసాలు ప్రసరించు. గగనం నుంచి వేలాడుతూన్న మ్కిన్వారీ శిఖరానికి జోలపాటపాడు. ఒకసారి అణచివేతకు నేలరాలిన వారు మళ్ళీ యెగసి లేచి గొప్ప విశ్వాసంతో దివ్యపర్వతాన్ని మీరి ఆకసానికెగిరిపోతారని తెలుసుకో. ఓ అందాల రాశీ, మబ్బులమధ్య వెలుగొందావు నువ్వు. ఇప్పుడు కూడా నీలాకాశాన శోభాయమానంగా నీ కిరణాల కేళి సాగించు. నా చొక్కా విప్పి ఛాతీని వెన్నెల కప్పగిస్తాను. సర్వప్రపంచం మీద తన వెన్నెల జల్లులు కురిపించే దేవతను చాచిన చేతుల్తో పూజిస్తాను. ]
యోసిప్ - జోసెఫ్ అసలు పేరు. దానీ సంక్షేపం సోసో. దానికీ సంక్షిప్తరూపమైన సోసెలో పేరుతో ఈ కవిత అచ్చుపడిందని పేయ్న్ రాశాడు. కాల్పనిక ప్రవృత్తి దీని లక్షణం. ఇందులో భాగమే పీడితుల పట్ల అభిమానం కూడా. జార్జియన్ కవిత్వ సాంప్రదాయానికి ఇది విహితమైనదేగాని పరాయిదేమీ కాదు.
మరి మూడో కవిత జార్జియన్ కవి ప్రిన్స్ రాపియల్ ఎరిస్టవీ స్మారక వుత్సవం కోసం రాసింది. 1917 లో జార్జియన్లు లేపదీసిన తిరుగుబాటు లో పాల్గొని ఎంతో భంగపాటు పొందిన ఒకానొక రైతు దీనావస్థ గురుంచి ఎరిస్టవీ న్యాయమూర్తిని వుద్దేశించి ఒక ప్రఖ్యాత గీతం రచించడం జరిగింది. కన్నీళ్ళకే ప్రాణం తీసే శక్తి వుంటే, జారిస్టు నిరంకుశ ప్రభుత్వాధికారవర్గాన్ని మొత్తంగానే ఆశ్రువుల ఖడ్గాలతో పిక్కటిల్లిన తన కవితలతో ఎరిస్టవీ రూపు మాపి వుండేవాడు. యువకుడుగా స్టాలిన్ ఆ కవిని ప్రజాపక్షపాతిగా గుండెల్లో నిలుపుకున్నాడు. ఈ కవిత శీర్ధిక ʹఆర్. ఎరోస్టవీకి ʹ
When you heard the lamentations of the Peasants
You come with tears in your eyes
To offer up your grief to the heavens,
For you sacrificed yourself for the nation.
When you heard the people were living Well,
You were agreably enchanted,
And played sweetly on your harn
A music that seemed to fall from the heavens,
When you sang to the motherland,
You expressed a passionate desire,
And you played for her on your harp
The ravishing music of your heart
So now, o poet, the Georgion people
Have prepared for you a heavenly monument,
And all the toil and sorrows of the past
Are crowned in the present age.
(రైతుల శోకం విన్నప్పుడల్లా కళ్ళనిండా నీళ్ళు నింపుకొని వస్తావు నువ్వు. దేవలోకానికి నీ విషాదం వినిపిస్తావు. జాతికోసం నిన్ను నువ్వు అర్పించుకున్నావు. జనక్షేమం విని నువ్వు పరవశించి దేవలోకం నుంచి జారిపడిందా అని భ్రమగొలిపేలా నీ తంత్రీ వాయిద్యం మీద సంగీతం ఆలపించావు. మాతృభూమి కోసం నువ్వు పాడినప్పుడు, గాడాభిలాషను ప్రకటించావు. నీ హృదయం నుంచి మనోహరమైన సంగీతం హార్ప్ మీద ఆలపించావు. ఓ కవీ, జార్జియా ప్రజలు నీకిప్పుడు దివ్యమైన స్మృతిచిహ్నం ఒకటి తయారుచేసారు. గతకాలపు కష్టాలూ, అనుభవించిన బాధలు అన్నీ నేడు పట్టాభిషేకం పొందాయి.)
ఎరిస్టవీని ప్రస్తుతించే నెపాన కవి తన్ను తాను అభినందించుకున్నట్టుగా ఉందని పేయ్న్ వ్యాఖ్యానం. ఈ కవితలు అత్యంత ప్రతిభావంతమైనవి కావుకాని ప్రతిభాశూన్యమైనవి కావు. యువకోద్రేక దశను మీరి ఈ కవిత్వశక్తి ఇంకా ముందుకు పోగలిగేనా అని సందేహం. ప్రాణత్యాగులైన వీరులు ఆశాపక్షాలను పూన్చుకుని పర్వత శిఖరాలను దాటుకుంటూ పిండి ఆరబోసినట్టున్న వెన్నెల్లోకి ఎగిసిపోవడమనేది పరిణతమైన ప్రజ్ఞ కవిలో సూచనప్రాయంగానైనా కనిపిస్తుందని పేయ్న్ అన్నాడు. అయితే అది క్షణికమే అయ్యింది. మళ్ళీ అంతటి వూహ బలం గల రచనలు స్టాలిన్ కలం నుండి వెలువడలేదు కూడాను. సామజిక స్పృహ వీటిలో దర్శనం ఇవ్వదు. యువకోద్రేక పారవశ్యమే వీటి ప్రాణం. అదే వీటి సుగుణమైన అవగుణమైన.
Type in English and Press Space to Convert in Telugu |
SOME ASPECTS OF PROLETARIAN INTERNATIONALISM OF STALINIST SOVIET UNIONIn the course of the conversation Stalin informed Mao that USSR was ready to render assistance in the industrialisation of the economy and the training ...... |
స్టాలినో నీ ఎర్రసైన్యం...ప్రపంచ శ్రామికవర్గ ఉద్యమ నాయకుడు స్టాలిన్. స్టాలిన్ ఎర్ర సైన్యం ఎంతగా సామ్రాజ్యవాదులకు భీతి గోలిపిస్తుందో ప్రపంచ పీడిత ప్రజలకు అంత విశ్వాసాన్నిస్తుంది...... |
జీవించు జీవించు హే సూర్య బింబమా...దశాబ్దాలుగా సాగుతున్న స్టాలిన్ వ్యతిరేక ప్రచార వర్గ స్వభావాన్ని కార్మికవర్గం అర్థం చేసుకుని, ʹస్టాలిన్ మా నాయకుడుʹ అని సగర్వంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది...... |
ఒక జాతిలో వర్గాలుంటాయి గాని, వర్గభాషలుండవుస్టాలిన్ భాషను పునాదితోనూ, కట్టడం (ఉపరితలం)తోనూ గాకుండా ఉత్పత్తి సాధనాలతో పోల్చాడు. భాషలాగానే ఉత్పత్తి సాధనాలు (యంత్రాలు వగైరా) కూడా వర్గ విచక్షణ లేకుండా..... |
స్టాలిన్ వ్యతిరేకత? ఒక వ్యక్తి గురించి ఇన్ని అబద్ధాలు, ఇన్ని వక్రీకరణలు.. ఇన్ని వేల రెట్ల మోతాదులో మరెవరి విషయంలో జరిగి ఉండకపోవచ్చు. అందువల్ల స్టాలిన్ మార్గంపట్ల రాజకీయ ఏ...... |
ట్రాట్స్కీ అసత్యాలు - ఆ అసత్యాల అంతరార్థాలు1930లలో ట్రాట్స్కీస్టాలిన్ పై చేసిన నిందారోపణలనేతదనంతర కాలంలో కృశ్చేవ్ చేశాడు. కృశ్చేవ్ అసత్యాలు తప్ప మరేమీ చెప్పలేదనే విషయం, ట్రాట్స్కీ కూడా అబద్ధాలే...... |
పెట్టుబడిదారీ దేశాలమధ్య యుద్ధాల అనివార్యత శాంతి ఉద్యమం ఎన్ని విజయాలు సాధించినప్పటికీ సామ్రాజ్యవాదం జీవించే ఉంటుంది. అందువలన యుద్దాల అనివార్యతకూడా వాస్తవంగానే ఉంటుంది.యుద్దాల అనివార్యతను తొలగించా...... |
ఈ ʹదుర్మార్గపుʹ స్టాలిన్స్టాలిన్ ప్రైవేట్ పరిశ్రమలకు అనుమతినీయలేదు. ఎంత ఘోరమైన నష్టాన్ని అతను కలుగజేశాడు ! అయినా, మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు దాని స్వంత చట్టాలుంటాయి గదా! పెట్టుబడి..... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |