ప్ర‌జ‌ల‌పై యుద్ధం; జ‌న‌త‌న స‌ర్కార్ పాఠ‌శాల‌ల ధ్వంసం

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

ప్ర‌జ‌ల‌పై యుద్ధం; జ‌న‌త‌న స‌ర్కార్ పాఠ‌శాల‌ల ధ్వంసం

- పూనెం కమ్లూ | 06.03.2018 10:50:00am

దండకారణ్యంలో ప్రజలపై కొనసాగిస్తున్న ప్రభుత్వపు ఫాసిస్టు దమనకాండకు వ్యతిరేకంగా ఉద్యమించండి!!

విద్యవేత్తలారా! మేధావుల్లారా!

దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ నాయకత్వంలో కొనసాగుతున్న విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు లక్షలాది అర్ధ సైనిక-పోలీసు బలగాలను మోహరించి ప్రజలపై ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నాయి. బస్తర్‌ ఐ.జీ. వివేకనంద్‌ మాటల్లో చెప్పాలంటే బస్తర్‌ సంబాగ్‌లోని 7 జిల్లాల్లో 2017లో 1235 మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్స్‌ నిర్వహించినట్లు ప్రకటించాడు. అంటే సగటున ప్రతిరోజు ప్రజలపై దాడులు, అరెస్టులు, మహిళలపై అత్యాచారాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. వాటిలో ప్రజల ఆస్థులను లూటీ చేయడం, ప్రజల సహకారంతో జనతన సర్కార్ల ఆద్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, ఆశ్రమాలలను లక్ష్యం చేసుకొని దాడులు చేస్తున్నారు. 2017లో పశ్చిమ బస్తర్‌ బీజాపూర్‌ జిల్లాలోని గంగలూర్‌, చెర్‌పాల్‌, మిర్థూర్‌ ఠాన పరిధి గ్రామాలపై నిరంతరం దాడులు చేస్తున్నారు.

జనవరి 5నుండి 9 వరకు పిడియా, తుమ్‌నార్‌, హండ్రీ, ఇర్మగుండ, డల్లి, పరల్‌నార్‌, కావడి, మద్దువెండి, గంపూర్‌, కర్క, ఈరిల్‌, పుంబాడ్‌, బుర్గిల్‌ గ్రామాలపై దాడులు చేశారు. జనతన సర్కార్‌ ద్వారా నిర్వహిస్తున్న పాఠశాలలను, ఆశ్రమాన్ని కాల్చి బూడిదచేశారు. విద్యార్థుల చలిబట్టలు, బ్లాక్‌బోర్డు, పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్‌లు పూర్తిగా మంటల్లో వేసారు. పోలీసుల భయంతో ప్రజలతో పాటు అడవిలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్న చిన్న పిల్లలను కూడ వదలకుండా అడవిలో వేటాడి కాల్పులు జరిపారు. జనవరి 6న తమ పశువులను వెతకడానికి వెళ్తున్న పిల్లలపై కర్కత్‌ గ్రామంలో పోలీసులు కాల్పులు జరపడంతో 13సం||ల మడ్కం సోంబారు అనే బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. 12 సం||రాల బాలుడు మడ్కం బోటి తీవ్రమైన గాయాలయి గ్రామం వరకు పరిగెత్తి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఘటనను ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మరణించాడని మీడియాలో ప్రచారం చేశారు.

నేడు మోడీ-రమన్‌సింగ్‌ ప్రభుత్వాలు మావోయిస్టు ఉద్యమాన్ని ʹసమాధాన్‌ʹ వ్యూహంతో 2022 వరకు నిర్మూలించే లక్ష్యంతో ప్రజలపై ఫాసిస్టు నిర్బంధాన్ని, పౌరహక్కులను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. ఆదివాసుల ఉన్నతికోసం పాటు పడుతున్నామని ప్రతిరోజు ప్రభుత్వ యంత్రాంగం ప్రచారం చేసుకుంటున్నది. కానీ ప్రజలు తమ రక్తమాంసాలతో కష్టించి నిర్మించుకున్న పాఠశాలలను, ఆశ్రమాలను కాల్చి బూడిదచేసి ఆదివాసి పిల్లలను విద్యనుండి దూరం చేస్తుంది. మావోయిస్టులు పాఠశాలలను, ధ్వంసం చేస్తున్నారని ప్రధాన మీడియాలో గగ్గోలు పెడుతూ బూటకపు ప్రచారం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం విప్లవోద్యమాన్ని అణచడానికి ప్రజలు నిర్వహిస్తున్న పాఠశాలలను, ఆశ్రమాలను ధ్వంసం చేస్తుంది. కార్పోరేట్‌ సంస్థలకు విద్య, వైద్య సంస్థలను అప్పజెప్పి సాధారణ పేద ప్రజానీకానికి ముఖ్యంగా ఆదివాసీ, దళిత, కార్మికవర్గ ప్రజల పిల్లలను విద్య నుండి దూరం చేస్తున్నది. బీజాపూర్‌ జిల్లాలో రేషనలైజేషన్‌ పేరుతో 75 పాఠశాలలను మూసివేసి మావోయిస్టుల ప్రభావం పేరుతో అనేక గ్రామాలలో పాఠశాలలు, ఆశ్రమాలను మూసివేసి క్యాంపు, పోలీసు స్టేషన్‌ల వద్ద పోటాకాబిన్‌లను ఏర్పరిచింది. ఈ పోటాక్యాబిన్‌లలో ఒక్కొక్కదాంట్లో 500 మంది విద్యార్థులను కోళ్ళు, మేకల మంద లాగా వేశారు. ఇక్కడ కనీస వసతులు మరుగుదొడ్లు లేవు. ఆలు, పప్పు లాంటి నీళ్ల కూర పిల్లలకు వడ్డిస్తారు. 500 మంది విద్యార్థులకు కేవలం నల్గురు టీచర్స్‌ ఉన్నారు. వీరంతా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కారు. కొందరు అనుద్దేశక్‌ గురుజీలు (స్కూల్‌ విడిచిన పిల్లలను మళ్లీ స్కూలుకు తీసుకొచ్చేందుకు నియమించబడిన గురూజీలు) వీరికి వేతనం నెలకు 2,500 రూ||ల వరకు వుంటుంది. వీరికి ఎలాంటి టీచర్‌ ట్రైనింగ్‌ కూడ లేదు. వీరు ఈ పోటాక్యాబిన్‌ల విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. చాల నామమాత్రమైన చాల తక్కువ క్వాలిటి గల విద్యను ఆదివాసీ పిల్లలకు ఫాసిస్టు రమన్‌సింగ్‌ ప్రభుత్వం అందిస్తుంది. మరోవైపు రమన్‌సింగ్‌ ప్రభుత్వపు కావలి కుక్కలైన పోలీసు అధికారులు బస్తర్‌ జిల్లాలో నక్సలైట్ల భయంతో గ్రామం విడిచిన పిల్లలకు విద్యను అందిస్తున్నామని- బస్తర్‌ జిల్లా ఆరీఫ్‌షేక్‌ అమెరికాలోని ఫిలడెల్సియాలో అంతర్జాతీయ పురస్కారం అందుకున్నాడు.

మావోయిస్టుల హింసలో వేలది మంది పిల్లలు స్కూల్‌ విడిచారని బూటకపు ప్రచారం చేస్తూ, మావోయిస్టు ప్రభావిత పిల్లల భవిష్యత్తు బంగారు బాటలాగా చక్కదిద్దుతామని నిష్టా, ఆస్థా, ʹప్రయాస్‌ʹ పేరుతో మూడు రకాల స్లూళ్లను రమన్‌సింగ్‌ ప్రభుత్వం నడుపుతున్నది. వాటిలో సంఘ్‌ భావజాలాన్ని చిన్నారుల మెదళ్లలో చొప్పిస్తున్నారు. వీరిలో కొందరికి ప్రొఫెషనల్‌ కోర్సుల అవకాశం కల్పించి వారిని అందరికి రోల్‌మోడల్‌గా ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది.

సామాన్య పేద ప్రజల, ఆదివాసీ పిల్లలను విద్య నుండి దూరం చేసే బీజేపీ ప్రభుత్వపు చర్యలను వ్యతిరేకించండి. విద్యా వ్యవస్థను కార్పోరేట్‌ సంస్థలకు, మత సంస్థలకు అప్పజెప్పి, నామమాత్రమైన విద్యను కూడ పేద ప్రజలకు అందకుండా మావోయిస్టు ఉద్యమాన్ని అణిచే పేరుతో, ప్రజలు ప్రత్యామ్నాయంగా నిర్వహిస్తున్న జనతన సర్కార్‌ పాఠశాలలను, ఆశ్రమాన్ని కాల్చడం, ధ్వంసం చేసే ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ఆదివాసుల శ్రేయోభిలాషులు ఖండించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జనతన సర్కార్‌ ద్వార పేద ప్రజలకు అందిస్తున్న ప్రత్యామ్నాయ విద్యా వ్యవస్థకు సహాయ, సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము.

విప్లవాభివందనాలతో

పూనెం కమ్లూ


అధ్యక్షులు, డివిజన్‌ క్రాంతికారి జనతన సర్కార్‌ కమిటీ
పశ్చిమ బస్తర్‌ డివిజన్‌- బీజాపూర్‌ జిల్లా (ఛత్తీస్‌గఢ్‌)

ఫిబ్రవరి 1, 2018

No. of visitors : 969
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ప‌థ‌కం ప్ర‌కార‌మే దాడి : ఏఓబీ స్పెష‌ల్ జోన‌ల్ క‌మిటీ అధికార ప్ర‌తినిధి జ‌గ‌బంధు

జ‌గ‌బంధు | 04.11.2016 11:21:33am

ఎన్ కౌంటర్ తర్వాత రెండు రోజుల్లోనూ మా వాళ్లను చంపేశారు. మొత్తం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మిది మంది ఎలాంటి ఆయుధాలు లేని గిరిజన యువత ఉన్నారు. ...
...ఇంకా చదవండి

న‌క్స‌ల్బ‌రీ వెలుగులో.. భార‌త‌దేశ న‌క్స‌లైట్ ఉద్య‌మ చ‌రిత్ర‌

సుమంతా బెన‌ర్జీ | 24.04.2016 11:17:10pm

ఒక రకంగా 1972 నాటికే నక్సల్బరీ వెలుగులో వెల్లువెత్తిన పోరాటాలు ఎదురు దెబ్బలు తినడం మొదలై 1974 నాటికి దాదాపుగా ఆగిపోయాయి. అప్పుడే పునర్నిర్మాణ ప్రయత్నాలు మొ...
...ఇంకా చదవండి

Condemning the arrest of Damodar Turi, Central Convenor Committee member of VVJVA

VVJVA | 21.02.2018 09:22:28am

From the last 20 years, Damodar has been participating in various mass struggles in Ranchi, Bokaro, Girdih, Gumla, Santhal Pargana. In particular, his immen...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

Open letter to Krishna Bandyopadhyay

As a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol..

 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
 • తొలి విప్లవ మహిళలకు జేజేలు..!!
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వరవరరావు, ప్రొ. సాయిబాబా తదితరుల విడుదల కోరుతూ ధర్నా
  మంద క్రిష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని ఖండించండి
  అరుణతార ఏప్రిల్ - 2019
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  వరవర రావును విడుదల చేయమని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ
  ఏభై ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు
  తెగిపడిన చిటికెనవేలు చెప్పిన ఏడుగురు అక్కచెల్లెళ్ళ కథ
  మేఘం
  అర్హత
  మోడీ ʹమేకిన్ ఇండియాʹలో తయారైనవి
  భూమాట
  చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •