ప్రజల పోరాట జ్ఞాపకాలను రద్దు చేసే రాజ్య దుర్మార్గాన్ని, విధ్వంసకర అభివృద్ధిని ఎదుర్కొందాం.
కామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు. ప్రజల ఇండ్లను, వాడలను, జీవన వ్యాపారాలను కూల్చుతూ విశాలమైన రహదారులు వేస్తున్నారు. ఇప్పుడు హైవే 365 రోడ్డు వెడల్పు కోసమని ప్రజల పోరాట జ్ఞాపకం మారోజు వీరన్న స్థూపాన్ని తొలగించాలని చూస్తున్నారు. ఆయన స్వగ్రామం సూర్యాపేట జిల్లా కొత్తగూడలో దాదాపు 70 అడుగుల స్థూపం ఇది. ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద స్థూపంగా దీనికి గుర్తింపు ఉంది. ఆయన జీవితమూ, పోరాటమూ, అమరత్వమూ అందించిన స్ఫూర్తితో ప్రజలు కష్టపడి దీన్ని నిర్మించుకున్నారు. నిజానికి రోడ్డు వెడల్పు చేయదల్చుకున్నా ఈ స్థూపం అడ్డం కాదు. అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నది. దాన్లోంచి విశాలమైన రోడ్డు వేసుకోవచ్చు. స్థూపాన్ని తొలగించాల్సిన పని లేదు.
కానీ ప్రభుత్వం స్థూపాన్ని పెకలించాలనే అనుకుంటోంది. ఇది దుర్మార్గమైన ఆలోచన. అభివృద్ధి కోసం ప్రజలను విధ్వంసం చేస్తున్న పాలకులు చివరికి వాళ్ల జ్ఞాపకాలను కూడా కూలగొట్టాలనుకోడాన్ని అంగీకరించడానికి లేదు. కామ్రేడ్ మారోజు వీరన్న ప్రభావశీలమైన విద్యార్థి నాయకుడు. ఈ దేశ విప్లవం కోసం కలగన్నాడు. ముఖ్యంగా వర్గపోరాటంలో దళిత బహుజన పీడిత సమూహాల విముక్తి కోసం అనేక ఆలోచనలు చేశాడు. ఆ మార్గం గురించి ఎంతైనా చర్చ చేయవచ్చు. అది పూర్తిగా వేరే విషయం. ఆయన పీడిత సమూహాల విముక్తికి, కార్మిక వర్గ విప్లవానికి జీవితా న్ని వెచ్చించి అమరుడయ్యాడు. ఆయన స్థూపం మనందరికీ విలువైనది. దాన్ని తొలగించాలనే ప్రభుత్వ ఆలోచనను నిలువరించడానికి ఇప్పటికే ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు ముందుకు వచ్చారు. విప్లవ రచయితల సంఘం ఈ ప్రయత్నంలో భాగమవుతోంది. వీరన్న స్థూపాన్ని ఎట్టి పరిస్థితిలోనూ తొలగించడానికి వీల్లేదని ఉద్యమిద్దాం. విశాల ప్రజాభిప్రాయం కూడగడదాం. ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం.
విరసం కార్యదర్శి
Type in English and Press Space to Convert in Telugu |
దండకారణ్యంలో... నక్సల్బరీ 50 వసంతాల వేడుకలునక్సల్బరీ వారసులైన దండకారణ్య మావోయిస్టు విప్లవ కారులు జనతన సర్కార్ నేపథ్యంలో తమకు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్రజలకూ, ప్రపంచ..... |
విరసం సాహిత్య పాఠశాలరాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య... |
నోట్ల రద్దు ప్రగతి వ్యతిరేకమైనది : ప్రసాద్విరసం సాహిత్య పాఠశాల (11, 12 ఫిబ్రవరి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల రద్దుపై ఐఎఫ్టీయూ ప్రసాద్ ప్రసంగం... |
సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాంమానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్ విప్లవం. ఈ నవంబర్ 7 నుంచి రష్యన్ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ... |
సాయిబాబా అనారోగ్యం - బెయిల్ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూకేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్ పిటీషన్ వేయడంలో చాల రిస్క్ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల... |
నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమంనక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా....... |
ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండిఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ... |
లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్పాతనగరం పేద ముస్లింలకు బడేబాయి, సహచరులకు ఖాన్‌సాబ్.పౌరహక్కుల నేతగా, విప్లవ రచయితగా, అధ్యాపకుడిగా, పాత్రికేయుడిగా తెలుగు సమాజంలో తనదైన...... |
కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాంభౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స
... |
బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిపడదాం
చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్ విప్లవం..... |
Open letter to Krishna BandyopadhyayAs a woman comrade, I can confidently say that women in the party and army have made rapid and genuine advances, winning their rightful place in the revol.. |