స‌మ‌ర‌శీల పోరాటాలే ప‌రిష్కారం

| సంపాద‌కీయం

స‌మ‌ర‌శీల పోరాటాలే ప‌రిష్కారం

- క్రాంతి | 21.03.2018 09:13:02am

మ‌హారాష్ట్ర రైతుల పోరాటం మ‌రోమారు దేశం దృష్టిని ఆక‌ర్షించింది. దేశానికి అన్నం పెట్టే రైతులను రోడ్డుకు ఈడ్చిన పాల‌క విధానాల‌ను ఎత్తిచూపింది. ఒక్క‌రిద్ద‌రు కాదు.. ఏకంగా యాభై వేల మంది రైతులు ముంబై న‌గ‌రాన్ని చుట్టుముట్టారు. నిజంగానే ఇది ఓ చారిత్ర‌క పోరాటం.

రైతులు పండించిన పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర చెల్లించాల‌ని, ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 34వేల కోట్ల రుణ‌మాఫీని అమ‌లు చేయాల‌ని, రుణమాఫీతో పాటు పంట నష్టం వాటిల్లిన రైతులకు సరైన పరిహారం అందించాలని, స్వామినాథ‌న్ క‌మిటీ సిఫార‌సుల‌ను అమ‌లు చేయాల‌ని, ఆదివాసీలకు భూమిపై యాజ‌మాన్య హ‌క్కు క‌ల్పించాల‌నే డిమాండ్ల‌తో మ‌హారాష్ట్ర రైతులు చేప‌ట్టిన లాంగ్‌మార్చ్ పాల‌క విధానాల ప‌ట్ల ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి నిద‌ర్శ‌నం.

మార్చి 6వ తేదీన నాసిక్ నుంచి కాలి న‌డ‌క‌న బ‌య‌లుదేరిన వేలాది మంది రైతులు, ఆదివాసీలు 6 రోజుల పాటు ఎర్ర‌టి ఎండ‌ను సైతం లెక్క చేయ‌కుండా, బొబ్బ‌లు తేలిన కాళ్ల‌తో నెత్తురోడుతూ 180 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేశారు. 11వ తేదీకి ముంబైకి చేరుకొని ఆజాద్ మైదానంలో త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. రైతుల పోరాటానికి దిగివ‌చ్చిన ఫ‌డ్న‌విస్ ప్ర‌భుత్వం రైతుల డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి అంగీక‌రించింది.
రైతు ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించిన ప్ర‌భుత్వం అటవీ భూమి బదలాయింపు హక్కుల అంశాన్ని ఆరు నెలల్లో పరిష్కరిస్తామని పేర్కొంది. రైతులు, ఆదివాసీలకు రుణ మాఫీ సమస్యలను పరిశీలించటానికి, గిరిజనులు పండించుకుంటున్న అటవీ భూములను వారికే అప్పగించేందుకు ఒక కమిటీని నియమిస్తామని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. నదుల అనుసంధానం విష‌యంలో గిరిజన గ్రామాలను దృష్టిలో ఉంచుకుంటామ‌ని, ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు మద్దతు ధరగా చెల్లించాలన్న స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయటానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని మాటిచ్చింది. కానీ, ఈ హామీల‌న్ని ఆచ‌ర‌ణ‌లోకి వ‌స్తే కానీ రైతుల పోరాటం విజ‌యం సాధించిన‌ట్లు కాదు.

గ‌త మూడు ద‌శాబ్ధాలుగా వ్య‌వ‌సాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫ‌లితంగా దేశ వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. ఒక్క మ‌హారాష్ట్రలోనే గ‌త ప‌దేల్ల‌లో కాలంలో 26, 339 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి. గ‌త ఏడాది కాలంలోనే 1,753 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

ఆత్మ‌హ‌త్య‌ల‌ను స‌మాజం అత్యంత స‌హ‌జంగా భావించే స్థితికి చేరుకుంది. ఇంత‌కు మించిన విషాద‌మేముంటుంది. అందుకే... రైతులు త‌మ ఆగ్ర‌హాన్ని తీవ్ర‌రూపంలో వ్య‌క్తం చేశారు. గ‌త సంవ‌త్స‌రం జూన్ నెల‌లో మ‌హారాష్ట్ర రైతులు చేసిన పోరాటం దేశ ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌భుత్వ రైతాంగ వ్య‌తిరేక విధానాల‌కు నిర‌స‌న‌గా తాము పండించిన పంట‌ను నగరాలకు, పట్టణాలకు సరఫరా కాకుండా బందు చేశారు. పాలు, పండ్లు కూర‌గాయ‌లు మార్కెట్‌కు చేర్చ‌కుండా రోడ్ల మీద పారబోసి రైతులు నిరసన తెలిపారు. రహదారులు స్తంభింపజేశారు. పల్లెకు పట్టణానికి రోడ్డు వారధిని అడ్డగించారు. ఇట్లా నిరసన తెలుపుతున్న రైతులపై అలవాటుగా పోలీసు కాల్పు ఆ పోరాటం మ‌హారాష్ట్ర నుంచి మ‌ధ్య ప్ర‌దేశ్‌కి పాకింది. కనీస మద్దతు ధర ఇవ్వాలని, రుణాలు మాఫీ చేయాలని రైతులు రోడ్ల మీదికి వ‌చ్చారు. రైతుల పోరాటాన్ని అణ‌చివేసేందుకు మ‌ధ్య ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తూటాలు కురిపించింది. ఆరుగురు రైతుల‌ను బ‌లితీసుకుంది.

స‌రిగ్గా అదే స‌మ‌యంలో.. త‌మిళ‌నాడు రైతుల పోరాటం దేశంలో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గిట్టుబాటు ధ‌ర కోసం, రుణ‌మాఫీకోసం దేశ రాజ‌ధానిలో 41 రోజుల పాటు వినూత్న రీతిలో ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. రోడ్ల‌పై భోజ‌నం చేశారు. ఆత్మ‌హత్య‌లు చేసుకుని చ‌నిపోయిన రైతుల పుర్రెల‌ను మెడ‌లో వేసుకు తిరిగారు. అయినా రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌ట్ల ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించ‌క‌పోవ‌డం విషాదం.

ప్ర‌భుత్వాల‌కు మార్కెట్‌పై నియంత్రణ లేక‌పోవ‌డంతో అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ధ‌ర ప‌డిపోతే ఆ ప్ర‌భావం రైతులపై క‌నిపిస్తోంది. కేంద్రం రైతులు పండించిన పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డంలోనూ విఫ‌ల‌మ‌వుతోంది. ప్ర‌భుత్వాల‌కు కార్పోరేట్‌ల మీద ఉన్న మ‌మ‌కారం ప్ర‌జ‌ల మీద లేక‌పోవ‌డ‌మే కార‌ణం. ఏటా కార్పొరేట్‌ సంస్థల కోసం ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల రాయితీలు ఇస్తున్న ప్ర‌భుత్వాలు రైత‌ల విష‌యంలో మాత్రం వెన‌కాడుతున్నాయి. దేశానికి వెన్నెముఖ లాంటి రైతును ఆదుకోవ‌డంలో పాల‌క వ‌ర్గాలు ప్ర‌ద‌ర్శిస్తున్న నిర్లిప్త‌తే ఈ సంక్షోభానికి కార‌ణం.

అంతేకాదు...ద‌శాబ్ధాలుగా గిరిజ‌నులు సాగు చేసుకుంటున్న భూములపై వారికి యాజ‌మాన్య‌పు హ‌క్కు లేక‌పోవ‌డం విషాదం. తెలంగాణ‌లోనూ ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తుంది. దాదాపు 20 ఏళ్లుగా గిరిజ‌నులు సాగుచేసుకుంటున్న పోడు భూములను తాజా హ‌రిత హారం పేరుతో ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకునేందుకు సిద్ధ‌మైంది. దీంతో గిరిజ‌నులు పోడుభూముల ప‌ట్టాల కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వ‌చ్చింది.

ఇప్ప‌డు మ‌హారాష్ట్ర రైతులు చేసిన పోరాటం తాత్కాలిక హామీల‌తో ఆగిన ఈ పోరాటాన్ని మ‌రింత తీవ్ర‌స్థాయికి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను ఆచ‌ర‌ణ‌లో అమ‌ల‌యితే కానీ పోరాటానికి ఫ‌లితం ద‌క్కిన‌ట్లు కాదు. ఒక్క మ‌హారాష్ట్ర రైతాంగ‌మే కాదు... దేశ వ్యాప్తంగా వ్య‌వ‌సాయ రంగం సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ప్ర‌జ‌లు ఇప్ప‌డు స‌మ‌ర‌శీల పోరాటాల‌కు సిద్ధం కావాలి.

No. of visitors : 423
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •